హోమ్ / వార్తలు / నీటి నిర్వహణ రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు హంగరీ ల మధ్య ఎమ్ ఒ యు కు మంత్రివర్గం ఆమోదం
పంచుకోండి

నీటి నిర్వహణ రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు హంగరీ ల మధ్య ఎమ్ ఒ యు కు మంత్రివర్గం ఆమోదం

నీటి నిర్వహణ రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు హంగరీ ల మధ్య ఎమ్ ఒ యు కు మంత్రివర్గం ఆమోదం

జల నిర్వహణ రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు హంగరీ ల మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ ఒ యు పై భారత ప్రభుత్వ జల వనరులు, నదుల వికాసం మరియు గంగా పునరుద్ధరణ మంత్రిత్వ శాఖకు, హంగరీ ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు మధ్య సంతకాలు జరుగనున్నాయి. ఇది నీటి నిర్వహణ రంగంలో సమానత్వం మరియు పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందిస్తుంది. ఇరు దేశాలలోనూ జల వనరులకు సంబంధించి ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అభివృద్ధి చెందడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

జల వనరుల వికాసం మరియు నిర్వహణ రంగంలో నిపుణులు, శాస్త్రీయ ప్రతినిధివర్గాలు ఇటు నుండి అటు, అటు నుండి ఇటు రాకపోకలు జరపడంతో పాటు సంయుక్త కార్యకలాపాలను చేపట్టడం వల్ల ఉభయ దేశాలు లాభపడుతాయి. ఈ సహకారం, మరీ ముఖ్యంగా నది హరివాణ నిర్వహణ/ సమీకృత జల వనరుల నిర్వహణ, నీటి సరఫరాలో సామర్థ్యం మరియు సాగునీటికి సంబంధ సాంకేతిక విజ్ఞ‌ానంలో నవకల్పన (టెక్నాలజీ ఇన్నొవేషన్), ఇంకా.. వరదలు-దుర్భిక్ష పరిస్థితుల నిర్వహణలలో అందించుకొనే సహకారం రెండు దేశాలలో సాంఘిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి దోహదం చేయనుంది.

జల వనరులు, నదుల వికాసం మరియు గంగా పునరుద్ధరణ మంత్రిత్వ శాఖ మొట్టమొదటి సారిగా జల రంగంలో విస్తృత‌ శ్రేణి విభాగాలకు సంబంధించి ఒక ఎమ్ ఒ యు ను హంగరీతో కుదుర్చుకోబోతున్నది.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు