హోమ్ / వార్తలు / నెల్లూరు లో రీజియనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఇ) కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, శ్రీ ప్రకాశ్ జావడేకర్
పంచుకోండి

నెల్లూరు లో రీజియనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఇ) కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, శ్రీ ప్రకాశ్ జావడేకర్

నెల్లూరు లో రీజియనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఇ) కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, శ్రీ ప్రకాశ్ జావడేకర్

కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ‌ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ కలిసి ఎస్ఆర్ఎస్ పి నెల్లూరు జిల్లా లోని వెంకటాచలం మండలం చవటపాలెంలో రీజియనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఇ) కోసం మంగళవారం నాడు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా శ్రీ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఇది దేశంలోని 6వ ప్రాంతీయ విద్యా సంస్థ అని, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళ నాడు, పాండిచ్చేరి లతో పాటు అండమాన్, నికోబార్ దీవుల అవసరాలను ఇది తీర్చగలదని తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాముఖ్యాన్ని గురించి ఆయన నొక్కిచెబుతూ, ప్రభుత్వం నాణ్యమైన విద్యా బోధనను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. “సంపద విద్యను తీసుకొనిరాకపోవచ్చు గాని విద్య ఖచ్చితంగా సంపదను అందించగలుగుతుంది” అని మంత్రి చెప్పారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు