హోమ్ / వార్తలు / పట్టణ పేదలకు అందుబాటు ధరలోగృహాల ఆన్ లైన్లో అప్లికేషన్లు స్వీకరణ.
పంచుకోండి

పట్టణ పేదలకు అందుబాటు ధరలోగృహాల ఆన్ లైన్లో అప్లికేషన్లు స్వీకరణ.

పట్టణ పేదలకు అందుబాటు ధరలోగృహాల ఆన్ లైన్లో అప్లికేషన్లు స్వీకరణ. గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ, కామన్ సర్వీసెస్ సెంటర్ ల మధ్య అవగాహన ఒప్పందం

ప్రధానమంత్రి అవాస్ యోజన (పట్టణ) పథకం ద్వారా పట్టణ పేదలకు అందుబాటు ధరలోగృహాల అప్లికేషన్లను రేపటి నుంచి కేంద్ర గృహ నిర్మాణ,పట్టణ పేదరికనిర్మూలన మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన అవగాహనఒప్పందంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరికనిర్మూలన మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫరమెషన్టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కామన్ సర్వీసెస్ సెంటర్ ఇ- గవర్నెన్స్ సర్వీసెస్ఇండియా లిమిటెడ్ ల మధ్య కేంద్రమంత్రులు శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, రకవిశంకర్ప్రసాద్ ల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

దేశవ్యాప్తంగా మొత్తం 2 లక్షల కామన్ సర్వీసెస్ సెంటర్లు ఉండగా, పట్టణప్రాంతాల్లో ఉన్న సుమారు 60 వేల సెంటర్లు నవంబర్ 3, 2016 నుండి కేవలం 25 రూపాయల అప్లికేషన్రుసుముతో ప్రజల నుండి ఆన్ లైన్ అప్లికేషన్లు స్వీకరిస్తాయి. ఒప్పందం ప్రకారం కామన్సర్వీసెస్ సెంటర్లు లబ్దిదారులకు ఫోటోతో కూడిన రసీదు ను అందిస్తాయి. దీని ద్వారాలబ్దిదారులు వారి అప్లికేషన్ స్థితిని తెలుసుకొవచ్చు. లబ్దిదారులకు ఒకవేళగుర్తింపు కార్డు లేనట్లయితే -ఈకెవైసీ ద్వారా కామన్ సర్వీసెస్ సెంటర్లలోఅప్లికేషన్లను స్వీకరిస్తారు.

ఈ సందర్భంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... - డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కామన్సర్వీసెస్ సెంటర్ల ద్వారా మరింత మంది పట్టణ పేదలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణం) పథకంలోకి తీసుకురావడానికి వీలవుతుందని తెలిపారు.   2005 - 14ల మధ్య మొత్తం 13.70 లక్షల గృహాలను అందుబాటు ధరల్లో పట్టణ పేదలకుమంజూరు చేయగా, గత సంవత్సర కాలంలో 11 లక్షల గృహాలను పట్టణపేదల కోసం మంజూరు చేశామని శ్రీ వెంకయ్యనాయుడు వివరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్ మెషన్టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. కామన్ సర్వీసెస్ సెంటర్లుడిజిటల్ ఇండియా కార్యక్రమంలో ముందుండి సైనికుల్లా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈకార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ సంయుక్తకార్యదర్శి శ్రీ అమృత్ అభిజత్, కామన్ సర్వీసెస్ సెంటర్ ఇ-గవర్నెన్స్సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ముఖ్య కార్య నిర్వాహణ అధికారి శ్రీ దినేశ్ త్యాగి లుఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు