హోమ్ / వార్తలు / పది రోజులలో భీమ్ యాప్ యొక్క 10 మిలియన్ డౌన్ లోడ్ ల పట్ల ప్రధాన మంత్రి హర్షం
పంచుకోండి

పది రోజులలో భీమ్ యాప్ యొక్క 10 మిలియన్ డౌన్ లోడ్ ల పట్ల ప్రధాన మంత్రి హర్షం

పది రోజులలో భీమ్ యాప్ యొక్క 10 మిలియన్ డౌన్ లోడ్ ల పట్ల ప్రధాన మంత్రి హర్షం

10 రోజుల వ్యవధిలో భీమ్ యాప్ యొక్క 10 మిలియన్ కు పైగా డౌన్ లోడ్ లు చోటు చేసుకోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
“పది రోజులలోనే భీమ్ యాప్ యొక్క 10 మిలియన్ కు పైగా డౌన్ లోడ్ లు జరిగాయని తెలిసి సంతోషంగా ఉంది.
లావాదేవీలను భీమ్ యాప్ వేగవంతం మరియు సులభతరం చేసింది. దీంతో ఇది యువతీయువకుల ఆదరణకు నోచుకొంది. వ్యాపారులకు కూడా ఈ యాప్ ప్రయోజనకరమే.
మేక్ ఇన్ ఇండియా కు, ఇంకా అవినీతిని మరియు నల్లధనాన్ని అంతమొందించడానికి సాంకేతిక విజ్ఞానాన్ని సమర్థంగా ఎలా వినియోగిస్తున్నారనడానికి భీమ్ యాప్ ఒక చక్కని ఉదాహరణ” అని ప్రధాన మంత్రి అన్నారు.
ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు