హోమ్ / వార్తలు / పెరిగిన కిరోసిన్‌ ధర
పంచుకోండి

పెరిగిన కిరోసిన్‌ ధర

పెరిగిన కిరోసిన్‌ ధర

పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరాచేసే కిరోసిన్‌ ధరను కేంద్రం లీటర్‌కు రెండు రూపాయల చొప్పున పెంచింది. ప్రస్తుతం లీటర్‌ కిరోసిన్‌ను రూ.15ల చొప్పున రేషన్‌షాపుల ద్వారా విక్రయిస్తుండగా ఇకమీదట లీటర్‌కు రూ.17లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 1248 కిలో లీటర్ల కిరోసిన్‌ విక్రయాలు ప్రతి నెలా రేషన్‌ షాపుల ద్వారా జరుగుతున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని కార్డుదారులకు లీటర్‌ చొప్పున, మండల కేంద్రంలోని వారికి రెండు లీటర్లు, జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల్లో ఉన్న వారికి నాలుగులీటర్ల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ధర పెంపు వల్ల జిల్లాలో ప్రజానీకంపై సుమారు నెలకు రూ. 25 లక్షల భారం పడనుంది. 

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు