హోమ్ / వార్తలు / పేద ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం
పంచుకోండి

పేద ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం

పేద ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం

హైదరాబాద్‌లో నివసిస్తున్న పేద ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విధ్యనభ్యసించడానికి ప్రభు త్వం ‘‘అంబేద్కర్‌ ఓవర్సిస్‌ విద్యా నిధి’’ పథకం కింద రూ.10 లక్షల స్కాలర్‌షిప్‌ మంజూరు చేస్తుందని ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపసంచాల కులు డి. హన్మంతునాయక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. అమెరికా, ఆలండన్‌, ఆస్ర్టేలియా, కెనడా, సింగపూర్‌లోని యూనివర్సిటీల్లో చదువుకోవాలను కునేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. వీసా ఫీజుతో పాటు ఒక వైపు విమాన ప్రయాణ చార్జీలు కూడా ఇస్తుందని చెప్పారు. అయితే ఈ అవకాశం వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు డిగ్రీలో 60 శాతం మార్కులతో పాటు ఐఈఎల్టీసీలో అర్హత సాధించాలన్నారు.

మరిన్ని వివరాలకు: http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించండి.

పైకి వెళ్ళుటకు