హోమ్ / వార్తలు / ప్రజానీకం అందరూ రూ. 10 నాణెములను చట్టబద్దమైనవి గా స్వీకరించవచ్చును - రిజర్వు బ్యాంక్
పంచుకోండి

ప్రజానీకం అందరూ రూ. 10 నాణెములను చట్టబద్దమైనవి గా స్వీకరించవచ్చును - రిజర్వు బ్యాంక్

ప్రజానీకం అందరూ రూ. 10 నాణెములను చట్టబద్దమైనవి గా స్వీకరించవచ్చును - రిజర్వు బ్యాంక్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని కొందరు,  సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు, కొన్ని చోట్ల రూ.10 నాణెముల యొక్క చట్ట బద్ధత గురించి, వర్తకులు, దుకాణదారులు మరియు సామాన్య ప్రజానీకములలో సందేహములు లేపుతున్నట్లు తెలిసింది.

భారతీయ రిజర్వు బ్యాంకు ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికీ తెలియచేయునది ఏమనగా ఇటువంటి పుకార్లను నమ్మకుండా,  ఈ నాణెములను చట్టబద్దమైనవిగా తమ లావాదేవీలలో స్వీకరించవచ్చును.

భారత ప్రభుత్వ టంకశాలల్లో తయారైన నాణెములను రిజర్వు బ్యాంకు చలామణి లోకి తెస్తుంది.  ఈ నాణెములు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి.  ప్రజల లావాదేవీల అవసరాలను తీర్చడంకోసం, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విషయాలను ప్రతిబింబించె కొత్త డిజైన్ మరియు కొత్త డినామినేషనలలో నాణెములను తరచుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది.   నాణెములు చాలా కాలం చలామణిలో ఉంటాయి కనుక ఒకే సమయములో వివిధ డిజైన్లు  మరియు వివిధ ఆకృతులు కలిగిన నాణెములు చలామణిలో ఉండవచ్చును.   జూలై 2011 లో రూపాయి చిహ్నంను ప్రవేశపెట్టడం ఇలాంటి ఒక మార్పు.  కనుక కొత్త రూ.  10  నాణెం రూపాయి గుర్తు కలిగి ఉంటాయి కానీ అవే పాత రూ. 10 నాణెములు రూపాయి గుర్తు కలిగి ఉండవు.  కానీ ఈ రెండు రకముల నాణెములు  కూడా చట్టబద్దమైనవి మరియు లావాదేవీలకు అర్హమైనవని తెలియచేయడమైనది.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు