অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ పుస్తకాలు

ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ పుస్తకాలు

ఇంజినీరింగ్‌తోపాటు ఇతర సాంకేతిక విద్య కోర్సులకు సంబంధించిన పుస్తకాలను ప్రాంతీయ భాషలో తీసుకురావాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) నిర్ణయించింది. తెలుగు, కన్నడ, మరాఠి, తమిళం తదితర మొత్తం 22 ప్రాంతీయ భాషల్లోకి వాటిని అనువదించనుంది. అందుకు ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది. యూరప్‌ దేశాల్లో వృత్తివిద్యా కోర్సులను సైతం వారి మాతృభాషల్లోనే బోధిస్తారు. మాతృభాషల్లో బోధన, చదవడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమవుతుందన్నది నిపుణుల మాట. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లాంటి రాష్ట్రాల్లో కొన్నేళ్ల క్రితం మాతృభాషలో బోధించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలూ జరిగాయి. గతేడాది జనవరి 8న ప్రధాని మోదీ సైతం మాతృభాషలోనే సాంకేతిక విద్య ఉండాలన్న దానిపై ట్విట్టర్‌లో మద్దతు తెలిపారు. ఈక్రమంలోనే ఏఐసీటీఈ సైతం అదే బాటలో పయనిస్తోంది. ఏటా 50 ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక విద్యాకోర్సుల సంబంధించిన పుస్తకాలను మాతృభాషల్లోకి అనువదించాలని నిర్ణయించింది. అందుకు ఇప్పటికే రచయితల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అనువదించినందుకు రూ.50వేలు చెల్లించనుంది. ఒక విద్యాసంస్థ నుంచి ఒకరిని మాత్రమే ఎంపిక చేస్తుంది. కనీసం అయిదేళ్ల అనువభం ఉన్న వారిని ఎంపిక చేయనుంది.

ఆధారం: ఈనాడు



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate