హోమ్ / వార్తలు / బీమా లేని వాహనాలు రోడ్డెక్కొద్దు
పంచుకోండి

బీమా లేని వాహనాలు రోడ్డెక్కొద్దు

బీమా లేని వాహనాలు రోడ్డెక్కొద్దు

 

ఇన్సూరెన్సు లేని వాహనాలు రోడ్డుపైకి రాకుండా పకడ్బందీగా అడ్డుకునే ఓ వ్యవస్థను రూపొందించాలని మోటార్‌ యాక్సిడెంట్‌ క్లయిమ్స్‌ ట్రైబ్యునల్‌(ఎంఏసీటీ) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇన్సూరెన్సు లేని వాహనాలు ప్రమాదాలకు గురయినప్పుడు బాధితులకు నష్టపరిహారం అందించడం కష్టమవుతోందని, ఈ విధానం వల్ల బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం అందించేందుకు వీలవుతుందని చెప్పింది. సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆటోరిక్షా ఢీకొట్టిన కేసు విచారణ సందర్భంగా సోమవారం ట్రైబ్యునల్‌ ప్రిసైడింగ్‌ అధికారి అనూప్‌ కుమార్‌ ఈ సూచనలు చేశారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

 

పైకి వెళ్ళుటకు