హోమ్ / వార్తలు / బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడం ఖాయం...
పంచుకోండి

బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడం ఖాయం...

ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గించడంతో ఇక బ్యాంకులు కూడా డిపాజిట్‌ రేట్లను, రుణాల రేట్లను తగ్గించడం

ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గించడంతో ఇక బ్యాంకులు కూడా డిపాజిట్‌ రేట్లను, రుణాల రేట్లను తగ్గించడం ఖాయమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. పారిశ్రామిక, వాణిజ్య రంగాలు చిరకాలంగా వడ్డీ రేట్ల తగ్గింపుకోసం ఎదురుచూస్తున్నాయి.

ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఆ సదుపాయాన్ని వినియోగదారులకు బ్యాంకులు అందించలేదు. డిపాజిట్ల రేట్లు తగ్గకపోవడం వల్లనే రుణాల రేట్లను తగ్గించలేకపోతున్నామన్నది బ్యాంకుల వాదన. చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లు ఆకర్షణీయంగా ఉండటంతో మదుపరులు అటువైపే మొగ్గుచూపిస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. అందు వల్లనే తామూ డిపాజిట్‌ రేట్లను ఎగువస్థాయిలో ఉంచాల్సి వస్తోందని వారు అంటున్నారు. చిన్నమొత్తాల పొదుపు రేట్ల ను తగ్గిస్తే బ్యాంకు డిపాజిట్‌ రేట్లను కూడా తగ్గిస్తామని వారు చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు పిపిఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, పోస్టాఫీస్‌ డిపాజిట్‌ స్కీమ్‌లపై వడ్డీరేట్లను తగ్గించడంతో బ్యాంకులు సంతోషంగా ఉన్నాయి.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

పైకి వెళ్ళుటకు