హోమ్ / వార్తలు / భారతదేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవ తరహా వాతావరణం
పంచుకోండి

భారతదేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవ తరహా వాతావరణం

భారతదేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవ తరహా వాతావరణం

 

దేశంలో డిజిటలైజేషన్ మరియు తయారీ రంగంతో డిజిటల్ సాంకేతిక విజ్ఞాన సమన్వయం ద్వారా నాలుగో పారిశ్రామిక విప్లవ తరహా వాతావరణం నెలకొంటోందని శాస్త్ర- సాంకేతిక విజ్ఞానం మరియు భూ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి శ్రీ వై.ఎస్. చౌదరి అన్నారు. ఆయన ఈ రోజు విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం 2017 లో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టిఫిషల్ ఇన్ టలిజన్స్, రోబొటిక్స్, బిగ్ డేటా ఎనలిటిక్స్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ లతో పాటు సిమ్యులేషన్స్ ల తాలూకు ఆలోచనలు మన మనసులలో మెదులుతున్నాయని శ్రీ చౌదరి వివరించారు.
ఉత్పాదకతను పెంచుకొంటూ మరింతగా పోటీపడగలిగేటట్లు మనం ప్రస్తుతం ఉన్న వ్యవస్థల దక్షతను మెరుగుపరచవలసి ఉందని కేంద్ర మంత్రి శ్రీ వై.ఎస్. చౌదరి సూచించారు. అవే వనరులను ఉపయోగించి అంటే.. భౌతిక సామగ్రి, మానవ శక్తి వనరులు, ఇంకా ద్రవ్యపరమైన వనరులను ఉపయోగించి స్థూల ఉత్పత్తిని అధికంగా సాధించవలసివుందని మంత్రి వివరించారు. ఇలా చేయడం ద్వారా, మనం మారుతున్న కాలానికి తగ్గ అనుసరణీయతను పెంపొందించుకోవాలని శ్రీ చౌదరి చెప్పారు. లుడైట్ మూవ్ మెంట్ (LUDDITE movement) అనేది ఒకటో పారిశ్రామిక విప్లవ కాలానికి సంబంధించినది అని ఆయన గుర్తు చేశారు. కార్యకుశలతను, పోటీ పడే స్వభావాన్ని, ఉత్పత్తిని, ఉత్పాదకతను, మరింత అనుసరణీయతను సాధించడం ఇప్పటి తక్షణావసరాలు అని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్ లో మనగలగాలంటే ఇవి అలవరచుకోవడం అవశ్యం అని ఆయన స్పష్టంచేశారు. అయితే ఈ నాలుగో పారిశ్రామిక విప్లవ తరుణంలో కార్మిక శక్తిని తొలగించకూడదని, ఎవ్వరూ నిరుద్యోగిగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

 

పైకి వెళ్ళుటకు