హోమ్ / వార్తలు / మైనార్టీ విద్యార్థులకు పాలీసెట్‌లో ఉచిత శిక్షణ
పంచుకోండి

మైనార్టీ విద్యార్థులకు పాలీసెట్‌లో ఉచిత శిక్షణ

మైనార్టీ విద్యార్థులకు పాలీసెట్‌లో ఉచిత శిక్షణ

మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు పాలీసెట్‌ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎండీ మస్తానవలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలీసెట్‌కు హాజరయ్యే ముస్లింలు, క్రిస్టియన్లు, పారశీకులు, సిక్కులు, బుద్ధులు, జైన విద్యార్థి నీ విద్యార్థులకు ఈ శిక్షణ ఇస్తామని తెలిపారు. ఏప్రిల్‌ ఆరు నుంచి 23వ తేదీ వరకు పొన్నూరు రోడ్డులోని ఆంధ్రాముస్లిం కళాశాలలో శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ కోసం ఆసక్తి ఉన్న వారు తెల్లకాగితంపై బయోడేటా, అడ్రసు రాసి పాలీసెట్‌కు అప్‌లోడు చేసిన జిరాక్స్‌, పాసుపోర్టు సైజ్‌ ఫోటో కూడా పంపాలని సూచించారు. ఇతర వివరాల కోసం 0863-6452226లో సంప్రదించాలని సూచించారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు