హోమ్ / వార్తలు / మాజీ సైనికుల సంక్షేమానికి సర్కారు పథకాలు
పంచుకోండి

మాజీ సైనికుల సంక్షేమానికి సర్కారు పథకాలు

మాజీ సైనికుల సంక్షేమానికి సర్కారు పథకాలు

రాష్ట్ర ప్రభు త్వం తరుపు మాజీ సైనికులు.. వితంతువు లకు లభించే ప్రయోజనాలు, రాయితీలపై వి స్తృత ప్రచారం కల్పిస్తున్నామని జిల్లా సైనిక సంక్షేమశాఖాధికారి డాక్టర్‌ ఎం.బాలాజీ తెలి పారు. గ్రూపు 3బి, గ్రూపు-4 రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో మాజీ సైనికులకు రెండు శాతం రిజర్వేషన కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండో ప్రపంచ యుద్దంలో పనిచేసి పింఛన పొందని మాజీ సైనికులు, వితంతువులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ. 3 వేల ఆర్థిక సాయం అందజేస్తుందని వెల్లడించారు. అర్హులైన వారు జిల్లా సైనిక సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

మాజీ సైనికులు, వితంతువుల పిల్లలకు ఎంబీబీఎస్‌, బీటెక్‌, ఎంబీఏ బీడీఎస్‌, బీఎస్సీ (ఏజీ), బీవీఎస్సీ, బీఫార్మసీ, బీఈడీ, ఎంఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, టీసీసీ ఒకటి నుంచి నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.
యుద్ధ వితంతువులకు రూ. 5లక్షల పారితోషికం, గాయపడిన సైని కులకు అంగవైకల్యాన్ని బట్టి రూ. లక్షల నుం చి రూ. 3 లక్షలు అందిస్తున్నామని వెల్లడిం చారు. 300 చదరపు గజాలు ప్రభుత్వం స్థలంతోపాటు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది.
మాజీ సైనికుల హౌసింగ్‌ కా లనీ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సో సైటీగా ఏర్పడి మాజీ సైనికులు, వితంతువులకు 176 చదరపు గజా ల్లో ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తా రు. దీనికి సంబంధించి జీవో నంబర్‌ 1241 ప్రభుత్వం 2008లో విడుదల చేసింది.
హౌసింగ్‌ బోర్డు కట్టిన ఇళ్లలో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. హెచ్ఐజీలో 5 శాతం, ఎంఐజీలో 5శాతం, ఎల్‌ఐజీ గ్రూపుల్లో 2శా తం, ఈడబ్ల్యుఎస్‌లో 4శాతం కేటాయిస్తారు. సీఎస్‌డీ క్యాంటిన ద్వారా అమ్మే 750 వస్తువు లపై వ్యాట్‌ మినహాయించి వస్తువులను మాజీ సైనికులకు విక్రయిస్తారు.
సైనికులు మిలటరీలో పొందిన విద్యా ర్హతలు, సాధారణ విద్యార్హతలతో సమాన హోదాను కల్పించారు. ఇందుకు సంబంధించి జీవో నంబర్‌ 16న ప్రభుత్వం విడుదల చేసిం ది. లేబర్‌ ఎంప్లాయిస్‌, ట్రైనింగ్‌ డిపార్టుమెంట్‌ ప్రత్యేకంగా 1999లో జీవో విడుదల చేసింది.
మాజీ సైనికులు, వితంతు వులకు పావలావడ్డీ రుణం అవకాశం కల్పిస్తు న్నారు. ఇలా అనేక ప్రయోజనాలు రాష్ట,కేంద్ర ప్రభు త్వం ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులు వివరాల కోసం గుంటూరులోని హిం దూ కళాశాల ఎదురుగా ఉన్న జిల్లా సైనిక సంక్షేమశాఖ (0863- 2225853)లో సంప్రదించాలని సూచించారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు