హోమ్ / వార్తలు / "మేక్ ఇన్ ఇండియా" కార్య‌క్ర‌మంలో భాగంగా కొత్త రికార్డులు సృష్టించిన మిధాని
పంచుకోండి

"మేక్ ఇన్ ఇండియా" కార్య‌క్ర‌మంలో భాగంగా కొత్త రికార్డులు సృష్టించిన మిధాని

"మేక్ ఇన్ ఇండియా" కార్య‌క్ర‌మంలో భాగంగా కొత్త రికార్డులు సృష్టించిన మిధాని

 

హైద‌రాబాద్ కేంద్రంగా ప‌ని చేస్తున్నర‌క్ష‌ణ విష‌యాల ప్ర‌భుత్వం రంగ సంస్థ‌, మిని ర‌త్న హోదా ఉన్న మిశ్రధాతు నిగ‌మ్ లిమిటెడ్ (మిధాని) 2014 సంవ‌త్స‌రంలో 1.01 ఎంఓయూ స్కోర్ (నియ‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌) సాధించి, ర‌క్ష‌ణ విష‌యాల ప్ర‌భుత్వం రంగ సంస్థ‌ల‌న్నిటిలో అగ్ర స్థానాన్ని సంపాదించింది. 2015-16 సంవ‌త్స‌రంలో ఈ సంస్థ రూ. 1100 కోట్ల విలువైన ఆర్డ‌ర్ల‌ను చేజిక్కించుకుంది.  అంతే కాకుండా, సేల్స్ ట‌ర్నోవ‌ర్ రూ. 760 కోట్లు, ప‌న్ను చెల్లింపున‌కు ముందు లాభం రూ. 150 కోట్లుగా ఉన్నాయి.  అంత క్రితం సంవ‌త్స‌రం ఈ సంస్థ  సేల్స్ ట‌ర్నోవ‌ర్ రూ.680 కోట్లు మాత్ర‌మే అని సంస్థ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ దినేష్ కుమార్ లిఖి శుక్ర‌వారం తాత్కాలిక ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా వివ‌రించారు.

ఈ సంవ‌త్స‌ర కాలంలో కంపెనీ 15 శాతం వృద్ధిని న‌మోదు చేసింది.  2016-17 లో టంగ్‌స్ట‌న్‌, ఆర్మ‌రింగ్‌, స్పెష‌ల్ కాస్టింగ్స్‌,అల్యూమినియమ్ అలాయిస్ వ‌గైరా స‌రికొత్త వ్యాపార విభాగాల‌లోకి ప్ర‌వేశించ‌డం ద్వారా 30 శాతం వృద్ధిని సాధించాల‌ని చూస్తోంది.  మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మంలో భాగంగా కంపెనీ విలువైన విదేశీ మార‌క ద్ర‌వ్యాన్ని ఆదా చేయ‌డానికి నూత‌న ఉత్ప‌త్తుల పై దృష్టిని కేంద్రీక‌రిస్తుంద‌ని, అంతేకాకుండా రానున్న కాలంలో త‌న వ్యాపార కార్యక‌లాపాల‌ను మ‌రిన్ని దేశాల‌కు విస్త‌రించ‌నుంద‌ని డాక్ట‌ర్ లిఖి తెలిపారు.

ఈ సంవ‌త్స‌రంలో మొత్తం మీద క‌న‌బ‌రిచిన ప‌నితీరు కంపెనీ 12వ సంవ‌త్స‌రంలోను " ఎక్స్‌లెంట్ " ఎంఒయూ రేటింగును సాధించేందుకు తోడ్ప‌డ‌గ‌ల‌ద‌ని, ఇంకా ప్ర‌భుత్వానికి వ‌రుస‌గా 13వ సంవ‌త్స‌రం డివిడెండ్లు చెల్లించే స్థితిని క‌ల్పిస్తుంద‌ని డాక్ట‌ర్ లిఖి అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆధారము:  పత్రికా సమాచార కార్యాలయం , హైదరాబాద్.

 

పైకి వెళ్ళుటకు