హోమ్ / వార్తలు / రూ.500, రూ.2000 కొత్త నోట్లు
పంచుకోండి

రూ.500, రూ.2000 కొత్త నోట్లు

రూ.500, రూ.2000 కొత్త నోట్లు

ప్రధాని నరేంద్రమోదీ పలు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ప్రస్తుతం అములులో ఉన్న రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటి స్థానంలో రూ.500, రూ.2వేల కొత్తనోట్లు జారీ చేస్తామని ప్రధాని తెలిపారు. దీపావళి మరునాడు వీధుల్లో చెత్త వూడ్చినట్లు దేశంలో అవినీతిని వూడ్చేద్దామని పిలుపునిచ్చారు. నల్లధనం, దొంగనోట్లతో ఆటలాడేవారి ఆట కట్టిద్దాం అని పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల రూ.500, 1000 నోట్లు డిసెంబరు 30 లోపు డిపాజిట్‌ చేయనివారు.. గుర్తింపు కార్డులు సమర్పించి మార్చి 31లోపు డిపాజిట్‌ చేయవచ్చని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం చక్కబెట్టేందుకు ఆర్‌బీఐ, బ్యాంకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంద‌న్నారు. నగదు తప్ప మిగతా లావాదేవీలు యథాతథమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మీరెంత సహకరిస్తే .. అంత ప్రయోజనం. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు, మీ సోమ్ము మీదే అని ప్రధాని వెల్లడించారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు