హోమ్ / వార్తలు / రోగుల కోసం హెల్త్‌ యాప్‌.. బిట్స్‌ సృష్టి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రోగుల కోసం హెల్త్‌ యాప్‌.. బిట్స్‌ సృష్టి

వైద్యం అందని మారుమూల ప్రాంతాలవారికి కూడా స్మార్ట్‌ఫోన్‌ సాయంతో చికిత్స అందించే లక్ష్యంతో నలుగురు బిట్స్‌పిలాని విద్యార్థులు ‘‘విజిట్‌’’ అనే ఓ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు

వైద్యం అందని మారుమూల ప్రాంతాలవారికి కూడా స్మార్ట్‌ఫోన్‌ సాయంతో చికిత్స అందించే లక్ష్యంతో నలుగురు బిట్స్‌పిలాని విద్యార్థులు ‘‘విజిట్‌’’ అనే ఓ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. తమ క్యాంపస్‌ గ్రామీణ ప్రాంతంలో ఉండటంతో వైద్య సేవల పరంగా అక్కడి ప్రజల ఇబ్బందులు చూసి ఈ టెలిమెడిసిన్‌ యాప్‌ను రూపొందించినట్లు విద్యార్థులు అరుణ్‌ ప్రసాద్‌, వైభవ్‌ సింగ్‌, చేతన్‌ ఆనంద్‌, శాశ్వత త్రిపాఠి తెలిపారు. దేశంలో 4కోట్ల మంది ఒత్తిడి, వ్యాకులత, ఆత్మన్యూనత తదితర మానసిక సమస్యలతో బాధపడుతున్నా, సైకాలజిస్టులను కలిసేందుకు ఇష్టపడటం లేదని ఓ సర్వే చెబుతోందని అరుణ్‌ ప్రసాద్‌ అన్నారు. వీరితోపాటు వైద్యం అందని అభాగ్యులను దృష్టిలో పెట్టుకొనే ఈయా్‌పకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. రోగులు ఉచిత మెసేజ్‌ల ద్వారా తమ సమస్యలను పంపి రోగ లక్షణాలను తెలుసుకోవచ్చన్నారు. ఒకవేళ స్పెషలిస్టులను సంప్రదించాలనుకుంటే విజిట్‌లోని ప్రత్యేక బటన్‌ ద్వారా రిక్వెస్ట్‌ పంపవచ్చని, వీడియో ద్వారా అందుబాటులోకి వచ్చే వైద్యులు రోగనిర్ధారణ చేసి సూచనలు ఇస్తారన్నారు. తొలి దశలో 100మంది వైద్యులు యాప్‌ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా ఈ సంఖ్య త్వరలో 200కు పెరగనున్నట్లు తెలిపారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు