హోమ్ / వార్తలు / రోడ్డు భద్రతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
పంచుకోండి

రోడ్డు భద్రతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ

రోడ్డు భద్రతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ

రహదారులు రక్తమోడుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రోడ్డు భద్రత కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించిన నేపథ్యంలో.. రోడ్డు భద్రత నిధిని ఏర్పాటు చేసిన రాష్ట్రప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. జాతీయ రహదారులపై క్షతగాత్రులకు వేగంగా వైద్యసాయం అందేలా 108 తరహాలో ప్రత్యేక అత్యవసర వైద్య సేవల అంబులెన్సులను ప్రారంభించాలని యోచిస్తోంది.
ఆధారం : సాక్షి

పైకి వెళ్ళుటకు