హోమ్ / వార్తలు / వలస కుటుంబాలకు ఆస్ట్రేలియా ఐదేళ్ల వీసా ప్రోగ్రాం
పంచుకోండి

వలస కుటుంబాలకు ఆస్ట్రేలియా ఐదేళ్ల వీసా ప్రోగ్రాం

వలస కుటుంబాలకు ఆస్ట్రేలియా ఐదేళ్ల వీసా ప్రోగ్రాం

ఆస్ట్ర్రేలియాకు వలస వచ్చిన వారిని ఇక వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు మార్గం సుగమైనట్టే. పెర్మనెంట్ వీసా కోసం ఏళ్లూ పూళ్లూ వేచిచూడాల్సిన అవసరం లేకుండా వలస కుటుబాలకు ఐదేళ్ల వీసా ప్రోగ్రాంను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ప్రస్తుత వీసా ప్రోగ్రాంపై అసంతృప్తులు వ్యక్తవుతున్న నేపథ్యంలో కొత్త వీసా ప్రోగ్రాంను అమలు చేయాలని నిర్ణయించినట్టు ఇమిగ్రేషన్ అసిస్టెంట్ మినిస్టర్ అలెక్స్ హాకె తెలిపారు. ఆస్ట్రేలియాకు వచ్చిన వారిని వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు వీలుగా, ఆస్ట్రేలియా హెల్త్‌కేర్ సిస్టమ్‌కు ఇబ్బంది లేకుండా ఈ వీసా ప్రోగ్రాం తీసుకువచ్చామని చెప్పారు. శాశ్వత రెసిడెన్సీ వీసా విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతుండటంతో తాజా విధానం ఉపకరిస్తుందన్నారు. కొత్త వీసా ప్లాన్ ప్రకారం, ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఉంటున్న వలసదారులు కానీ, వీసా కోరే వారి కుటుంబసభ్యులు కానీ వీసాకు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మైగ్రెంట్ పేరెంట్స్ కు వెల్ఫేర్, హెల్త్‌కేర్ తదితర సామాజిక ప్రయోజనాలను వర్తింపజేసేందుకు 2.5 మిలియన్ డాలర్లు అవుతుందని ప్రొడక్టివిటీ కమిషన్ గతవారంలో ఒక నివేదికలో పేర్కొంది. ఆస్ట్రేలియా హెల్త్‌కేర్ సిస్టమ్‌కు అదనపు భారం పడకుండా ఉండేలా తాజా వీజా విధానం ఉంటుందని హాకే తెలిపారు. కాగా, ఐదేళ్ల తాత్కాలిక వీసా ప్రోగ్రామ్‌కు ఎంత ఖర్చవుతుందనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. 2017 జూలై 1 నుంచి ఈ కొత్త వీసా విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు