హోమ్ / వార్తలు / శాశ్వత ఆరోగ్యకార్డుదారులకు ఉపశమనం
పంచుకోండి

శాశ్వత ఆరోగ్యకార్డుదారులకు ఉపశమనం

శాశ్వత ఆరోగ్యకార్డుదారులకు ఉపశమనం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య పథకంలో సర్కారు మౌలిక మార్పులు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వాటాను స్థాయిల వారీగా సవరించింది. ఈ పథకం కింద ఇప్పటికే శాశ్వత ఆరోగ్యకార్డును పొంది ఉంటే.. ఇక అదనంగా ఏమీ చెల్లించనక్కర్లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఏడో వేతన కమిషన్‌ సిఫార్సులను అమలుచేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో చేపట్టిన కీలక మార్పులను ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచే సవరించిన మార్పులు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు