హోమ్ / వార్తలు / సులభతర వాణిజ్యంలో తెలుగు రాష్ట్రాలు ఫస్ట్
పంచుకోండి

సులభతర వాణిజ్యంలో తెలుగు రాష్ట్రాలు ఫస్ట్

సులభతర వాణిజ్యంలో తెలుగు రాష్ట్రాలు ఫస్ట్

సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి ర్యాంకు సాధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం ప్రకటించింది. ప్రతిపాదిత సంస్కరణల అమలుకు సంబంధించి గతేడాది జూలై 1 నుంచి ఈ ఏడాది జూన్ 30 మధ్య కాలానికి సంబంధించిన నివేదికలను రాష్ట్రాలు కేంద్ర పరిశ్రమల విభాగానికి అందించాయి. వీటిని కేంద్ర పరిశ్రమల విభాగం, ప్రపంచ బ్యాంకు విభాగం అధ్యయనం చేసి ర్యాంకులు ప్రకటించాయి. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. నాలుగో స్థానంలో ఛత్తీస్‌గఢ్, ఐదో స్థానంలో మధ్యప్రదేశ్, హరియాణ 6, జార్ఖండ్ 7వ స్థానాల్లో నిలిచాయి.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు