హైదరాబాద్ సెంట్రల్యూనివర్సిటీ టెక్నాల జీ బిజినెస్ ఇంక్యూబేటర్ (టీబీఐ) ఆధ్వర్యంలో ద ఎంటర్ ఫ్రూనర్జోన్ (టీఈఈజెడ్) సహకారంతో ఎంటర్ఫ్రూనర్ షిప్ డవలప్మెంట్కు సంబంధించి శిక్షణపొందేందుకు అర్హులైన స్టార్టప్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6 నెలలపాటు పార్టైమ్గా ఆరు మాడ్యుల్స్పై వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. మూడో బ్యాచ్కుశిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీబీఐ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 77995681641ను సంప్రదించాలని సూచించారు.
ఆధారం: ఆంధ్ర జ్యోతి