హోమ్ / వార్తలు / స్థిరాస్తి బిల్లుకు పార్లమెంటు ఆమోదం
పంచుకోండి

స్థిరాస్తి బిల్లుకు పార్లమెంటు ఆమోదం

నిర్మాణరంగంలో పారదర్శకతకు దోహదపడుతుందన్న ప్రభుత్వం

గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించే ‘స్థిరాస్తి(నియంత్రణ, అభివృద్ధి) బిల్లు-2013’కు పార్లమెంటు ఆమోదం లభించింది. నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకొచ్చే దిశగా ఈ బిల్లు ఈ నెల 10న రాజ్యసభ ఆమోదం పొందగా... తాజాగా లోక్‌సభ మంగళవారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రపతిఆమోదం అనంతరం బిల్లు చట్టరూపం దాల్చనుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షించడం, డెవలపర్లలో జవాబుదారీతనాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

ఆధారము: ఈనాడు

పైకి వెళ్ళుటకు