పంచుకోండి

ఈ అన్ లైన్ కొనుగోలుదారుల-అమ్మకందారుల వేదిక మీ ఉత్పత్తులకు మరియు సేవలకు మంచి మార్కెట్ ను సంపాదించుకునే అవకాశాన్ని కలుగజేస్తుంది. మీరు వ్యవసాయం, పశుసంపద, హస్తకళాకృతులు, యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలగు ఏ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్నైనా సరే ప్రదర్శించండి. అంతేకాకుండా, అద్దె మరియు సంప్రదింపు (కన్సల్టెన్సీ) సేవలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు పొందవచ్చు.

ఎంచుకొనబడిన విషయాలపై ఈ ఆన్ లైన్ వేదిక నిపుణులిచ్చే పరిష్కారాలను చూపిస్తుంది. వారి స్వంత భాషలోనే వాడకందారులు వారి సందేహాలను నివేదించుకోవచ్చు (పోస్ట్ చేయవచ్చు). అలాగే, ఇ-మెయిల్ ద్వారా వారి సందేహాలకు నిపుణులిచ్చే పరిష్కారాలను పొందవచ్చు.

ఈ క్విజ్ (ఆన్ లైన్ ప్రశ్నలు-జవాబుల పోటీ) పాఠశాలలో చదివే పిల్లలు వారి సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించుకునేలా ప్రోత్సహించడానికి, అలాగే వారి సమర్ధతను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికీ ఉద్దేశింపబడింది. ఈ క్విజ్ కార్యక్రమంలో 3 నుండి 10వ తరగతి వరకూ చదువుకునే పిల్లలు పాల్గొనవచ్చు.

ఎస్.ఎమ్.ఎస్. లేక ఇ-మెయిల్ ద్వారా ఈ వెబ్ ఆధారిత సేవ నమోదుచేసుకున్న వాడకందారులకు ప్రధానమైన ఆర్దిక కార్యకలాపాలను గుర్తు చేస్తూ, ప్రజలు తమ ఆర్ధిక కార్యకలాపాలను మరింత సమర్ధవంతమైన విధంగా నిర్వహించుకునేందుకు తోడ్పడుతుంది.

దేశవ్యాప్తంగా ఉండే ఉమ్మడి సేవా కేంద్రాల(కామన్ సర్వీస్ సెంటర్స్)ను నిర్వహించే గ్రామ స్ధాయి ప4రిశ్రామివేత్తలకు ఉపయోగకరమైన సాధన సామగ్రిని ఈ వేదిక సమకూరుస్తుంది. అలాగే, గ్రా.స్ధా.పా. లకు వారి అనుభవాలను పంచుకోవడానికి కూడా అవకాశాన్ని కలుగజేస్తుంది.

మహిళలు, పిల్లలు, యువత మరియు, గ్రామీణ పట్టణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఇతర అన్ నిమ్న మరియు అసహాయ స్ధితిలో ఉన్నవారు కోసం విజ్ఞానం మరియు నైపుణ్యాల నిర్మించడానికి, సి-డాక్ భారతీయ భాషల్లో ఇ లెర్నింగ్ వేదిక అనుకూలీకరించిన ఉంది.

గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు , ఒకటిన్నర సంవత్సరం లోపు పిల్లలకు ఆరోగ్య జాగ్రత్తలు సలహాలు అందిస్తుంది.నమోదు చేసుకున్నలబ్దిదారులకు వారి మొబైల్ ఫోన్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా పాటించ వలిసిన సలహాలను తెలియచేయడం జరుగుతుంది

అన్ లైన్ సేవలు

  
కొనుగోలుదారుల-అమ్మకందారుల అన్ లైన్ వేదిక
అన్ లైన్ పద్దతిలో నిపుణులిచ్చే పరిష్కారం
 
 
సి.ఎస్.సి. లను నిర్వహించే వారికి సాధన సామగ్రిని సమకూర్చే వేదిక
 
 
మధర్
మొబైల్ ఆధారిత మాతృత్వ ఆరోగ్య అవగాహన
 

ఈ ఉత్పత్తులు మరింత సమాచారం కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి

పైకి వెళ్ళుటకు