অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జీవ శక్తి

జీవ శక్తి

బయోగ్యాస్ లో క్రొత్త వినూత్న ఆవిష్కరణలు – బయోగ్యాస్ కేంద్రాన్ని విజయవంతం చేసిన విధర్భ రైతులు

సింధూతాయి తాయడె చిక్కని ఆవు పేడ ఎరువు ద్రవాన్ని తన బయోగ్యాస్ ట్యాంకులోకి వేస్తున్నాడు. విజయ్ ఇంగ్లే కలిపిన పేడ ద్రవాన్ని బయోగ్యాస్ ట్యాంకులో కలుపుతున్నారు. ఎప్పుడయితే అకోలా జిల్లాలోని చిట్టల్వాడి గ్రామానికి చెందిన విజయ్ ఇంగ్లే గత సంవత్సరం తన డెయిరీ లోబయోగ్యాస్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడో అప్పుడు ప్రతి ఒక్కరు అపనమ్మకంతో చూశారు. అది విదర్భ ప్రాంతంలో అనుకున్నంత స్థాయికి విస్తరించలేకపోయింది. ప్రభుత్వం బయోగ్యాస్ ను ప్రోత్సహి స్తునే ఉన్నది. శుభ్రమైన మరియు తక్కువ ధర కలిగినది గత మూడు దశాబ్దాలుగా చెబుతూ బయోగ్యాస్ కేంద్రం ఏర్పాటు చేసే వారికి పలు రకాల ప్రోత్సహకాలను అందిస్తూ వస్తోంది. ఇదిలావుండగా బయోగ్యాస్ కేంద్రం ఇంటికి కనీసం 400 మీటర్ల దూరం ఉండాలనే విషయం ఎవరూ విని ఉండలేదు. సాధారణంగా వంటగదికి వెనుక చాలా దగ్గరగా దీనిని నిర్మించేస్తూ ఉంటారు.

సమీపంలోని బుల్ధానా జిల్లా, తండుల్వాడి గ్రామానికి చెందిన రైతు శ్యామ్ రావు దేశ్ ముఖ్ ఇదే రకమైన విమర్శలను గత నాలుగు సంవత్సరాలకు మునుపు ఎదుర్కొన్నాడు. అతని ఉమ్మడి కుటుంబపు సభ్యుల సంఖ్య మరింతగా రెట్టింపయింది. దాంతో వారు అవుల కొట్టాంను అర కిలోమీటరు దూరంలోని గ్రామ పొలిమేరలకు తరలించారు. దేశ్ ముఖ్ వంట గ్యాస్ కోసం పెరుగుతున్న ఖర్చును తగ్గించుకోవాలని తన ఆవుల కొట్టాంలో బయోగ్యాస్ కేంద్రం ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ ప్రాజెక్టు తమకూ కావాలని తన చుట్టూ జనం గుమిగూడారు.

ఏదైతేనేం , చివరికి ఇద్దరు రైతులు మాత్రమే తమ నిర్ణయానికి కట్టుబడి బయోగ్యాస్ పనిని చేపట్టారు. వీరు సాధించిన విజయంతో విమర్శించిన వారే నమ్మడం మొదలు పెట్టారు. నేటికి చిట్టల్వాడిలో 15 బయోగ్యాస్ కేంద్రాలు పనిచేస్తున్నవి ఉన్నాయి. తండుల్వాడి లో 4 ఉన్నాయి. ఇంకా చాలామంది బయోగ్యాస్ కేంద్రం ఏర్పాటు చేసుకొని రాయితీలు పొందాలని దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఇదిలావుండగా విదర్భ ప్రాంతంలో బయోగ్యాస్ కు వినియోగించే ఆవు ఎరువు కొరత ఏర్పడింది. దానికి కారణమేమిటంటే ప్రభుత్వం ఇచ్చే రాయితీ ( సబ్సిడీ)లకు ఆశ పడి ఈ గ్రామాలలో తమకు స్వంతంగా ఎక్కువ సంఖ్యలో పశువులు లేక పోయినా బయోగ్యాస్ ను ఎక్కువ మంది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అధికారులకు వారు చెప్పిన విషయాలు నిజాలు కావని తేలింది. బయోగ్యాస్ ను పొందాలని సమస్యను ఎదుర్కొనేందుకు ఓ వినూత్న పరిష్కారాలను కనుగొన్నారు.

వినూత్న తరహాలో లూపు బయోగ్యాస్ కేంద్రం దూరంలో ఉండడం వల్ల ఏర్పడే సమస్యలతో సతమతమవుతున్న దేశ్ ముఖ్ తన అసలైన ప్రణాళికను అమలు చేసి ప్రయత్నించాలనుకున్నాడు. అతను ఇది వరకే 2 క్యూబిక్ మీటర్ల వైశాల్యం కలిగిన ట్యాంకును రూ.9,000 లు వెచ్చించి నిర్మించడం జరిగింది. దానితో పాటు జల్లులతో నీటి వెదజెల్లేందుకు వినియోగించే రబ్బరు పైపులను పి.వి.సి పైపుల స్థానంలో ఏర్పాటు చేశాడు. భూగర్భంలో పైపులు వేసేటట్టు కాకుండా తన ఇంటికి పైపులు సురక్షితంగా ఉండేందుకు గాను చెట్ల కొమ్మలపై నుండి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి రూ 1000 లు ఖర్చు అయింది. తేమను తీసివేయడానికి పైపును ఇతను పైపును వంపు తిరిగినట్టు ఉండేటట్టు (లూపు) గా మొదలు దగ్గర ఉంచాడు మరియు దానిని ఆ విధంగా ఉండేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. గ్యాస్ కన్నా తేమ ఎక్కువ అయితే అది లూపులో ఉంటే అది మళ్ళీ వెనక్కు కలుపు ట్యాంకులోకి వెళ్ళి పోతుంది. “తేమ గురించి విశ్వ విద్యాలయ అధికారులు నాకు అదొక సమస్య అవుతుందని నాలుగు సంవత్సరాలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు కాని అది నాకు సమస్యే కలేదు.” అని దేశ్ ముఖ్ అంటున్నాడు. ఈ బయోగ్యాస్ కేంద్రం ఆరుగురు ఉన్న అతని కుటుంబానికి సంవత్సరం పొడువునా అవసరమైన వంట గ్యాస్ ను అందిస్తూనే ఉన్నది.

విజయ రహస్యం విడదీయడంలోనే ఉంది దేశ్ ముఖ్ లా ఇంగ్లే నీటి వెదజెల్లేందుకు వినియోగించే రబ్బరు పైపులను వాడడం మరియు పైపులను భూమిలోపల కాకుండా పై భాగంలోనే వేయడం చేశాడు. అయితే అతను గ్యాస్ మొదలయ్యే దగ్గర T అనే ఆకారంతో ఉన్న పైపుతో విడదీశాడు. ఇందులోని ఒక భాగం ఇంటికి గ్యాస్ తీసుకెళ్ళేందుకు అయితే , మరొకటి నిలువుగా క్రిందికి నాజల్ దగ్గరకు వెళుతుంది. “నేను వారానికొకసారి దానిని తెరచి తేమ ఆరేటట్టు చేస్తాను” అని అన్నారు.

వంటకు కావలసినంత గ్యాస్ ను అందించడమే కాకుండా 22 మందికి స్నానానికి అవసరమయ్యే నీటిని వేడి చేయడానికి కూడా సరిపోతోంది. ఇంగ్లే కు చెందిన బయోగ్యాస్ కేంద్రం సంవత్సరానికి పండుగల సమయంలో మూడు లేదా నాలుగు సార్లు 100 మందికి పైగా వంట చేసేందుకు కూడా అవసరమైన గ్యాస్ ను అందించగలుగుతోంది. అంతేగాక ప్రతిరోజూ 100 లీటర్ల పాల ఉత్పత్తులను తయారీకి మరియు పశువుల కొట్టానికి కావలసిన బల్బులు వెలుగడానికి కావలసిన గ్యాస్ అందిస్తుండడం విశేషం.

హర్ష ఇంగ్లే విషయానికి వస్తే వారు మూడు ఆవుల నుండి తీసిన పేడతో రెండు కుటుంబాలకు సరిపోయే గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. “మాకు ఇంకా గ్యాస్ మిగులుతోంది. దీనిని ఇంటికి విద్యుత్ సరఫరాకు వినియోగించాలని ఆలోచిస్తున్నాము” అని అంటున్నారు. ఇతని ఉమ్మడి కుటుంబం సాలీనా రూ 80,000 లు యల్.పి.జి సిలిండర్లకు అయ్యే వ్యయాన్ని ఆదా చేయగలుగుతున్నారు. చిట్టల్వాడ్ లోని 15 మంది రైతులలో ఎక్కువ మంది ఇంగ్లే ను అనుసరించి మూడు లేదా నాలుగు కన్నా పశువుల కన్నా ఎక్కువ పెంచడం లేదు.

చిట్టల్వాడ్ కే చెందిన మరో రైతు మిలింద్ ఇంగ్లే అయితే తన మూడు పశువుల నుండి వస్తున్న పేడతోనే ముగ్గురు ఉన్న కుటుంబానికి సరిపడా బయోగ్యాస్ ను అందించేది చూసి ఆశ్చర్యపోతున్నాడు. “మా ఇంటి వంట అవసరాలకు మరియు స్నాన అవసరాలు తీరిన తరువాత కూడా మాకు మరింత బయోగ్యాస్ మిగులుతోంది అని మిలింద్ తల్లియైన హర్ష ఇంగ్లే అంటున్నది.” ఆమె ఇప్పుడు తన బయోగ్యాస్ కేంద్రం నుండి పొలానికి కూడా కావలసిన గ్యాస్ తీసుకోవాలని ఆలోచిస్తున్నది. ఈ రకమై కొత్త ప్రయోగాలు చాలా వేగంగా సమీపంలోని ఇతర గ్రామాలకూ విస్తరిస్తున్నాయి. అక్కడ ప్రజలు బయోగ్యాస్ ను తిరిగి కొత్తగా ఆవిష్కరిస్తున్నారు.

అయితే డెయిరీతో పోల్చితే దాని కన్నా , బయోగ్యాస్ కేంద్రం ఏర్పాటుకు మరియి దానికి సంబంధించిన కొత్త ప్రయోగాలకు కావలసిన సహాయ సహకారాల అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు. దూర ప్రాంతాల నుండి బయోగ్యాస్ పంపిణీ విషయంలో మెరుగు పడవలసినది ఉంది. అంతేగాకుండా, చాలా గ్రామాలలో కుటుంబాలు రెట్టింపు అవుతున్నాయి. పశువుల పాకలు పొలాల నుండి దూరంగా ఉంటున్నాయి.

ఈ గ్యాస్ వెళ్ళే వేగాన్ని దూరం, భౌగోళిక పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయి. పైపులైనులోని వంకరలు మరియు అడ్డంకులు కూడా ఓ విధంగా ప్రభావితం చేస్తాయి అని ఇంగ్లే అంటున్నారు. ఒకరికి ఉపయోగపడింది ఇతరులకు ఉపయోగపడాలనేది లేదు. ఒకే రకమైన గ్యాస్ పంపిణీ వేగం ఉండాలంటే ఎప్పుడెప్పుడు, ఎంత కాల వ్యవధిలో నేను ఆవు పేడను వేయాలనేది తెలుసుకోవాలంటే నాకు రెండు నెలల సమయం పట్టింది. అంతేగాక ఎలాంటి పంపులు వాడాలనేది నాకు ఎలాంటి సూచనలు అందించే వారు లేదు. ఇనుప మరియు పి.వి.సి. పంపులు చాలా ఖరీదయినవి మరియు అని భూమిలో పాతి వాడుకోవలసివి. నేను నీటి జల్లుల పంపు వాడుతూవున్నా.. నాకు ఇంకా సమస్య ఉన్నది. ప్రభుత్వం తాను అందించే రాయితీల స్థాయిని కూడా పెంచవలసిన అవసరం ఉందని అన్నారు ఇంగ్లే. ప్రస్తుతం అందిస్తున్న 2 క్విబిక్ మీటర్ల ట్యాంకు కు రూ,.8,000 లు కేవలం ఇంటిలో వంట చేసుకునేందుకు మాత్రమే సరిపోతుంది. అయిదు లేదా ఏడుమంది ఉన్న కుటుంబంలో ఇతర కుటుంబ ఇంధన అవసరాలు తీరాలంటే కనీసం 6 క్విబిక్ మీటర్ల వైశాల్యం కలిగిన ట్యాంకు ఉండాలి.

వంట చెరుకు దొరకడం కష్టమైపోవడం మరియు యల్.పి.జి. గ్యాస్ సిలిండర్ లు ధర ఎక్కువగా ఉండడంతో చాలామంది విదర్భ ప్రాంతానికి చెందిన రైతులు బయోగ్యాస్ వైపుకు ఆకర్షితులవుతున్నారు. వారికి సరైన సమయంలో సరైన విధంగా శాశ్వతమైన మరియు తక్కువ ఖర్ఛుతో కూడిన శక్తి కి మూలం ఇది.

బయో గ్యాస్ ను సమృద్ధి పరచడం మరియు సిలిండర్ లలో నింపే సాంకేతిక పరిజ్ఞానం – ఒక మార్గదర్శక అధ్యయన ప్రదర్శనశాల

ఘజియాబాద్ లోని కరేరా గ్రామములో శ్రీ కృష్ణ గోశాల వుంది. ఇది ఢిల్లీ ఐ ఐ టి (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి) యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో భారత ప్రభుత్వ నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వశాఖ ఏర్పరిచిన ఒక మార్గదర్శక అధ్యయనాని ఒక వేదిక వంటిద్.

ఈ గోశాలలో దాదాపు 1000 ఆవుల మంద వుంది. ఈ ఆవులకోసం 2 పశువుల కొట్టాలు వున్నాయి. అంతేకాక ఒక కొట్టం దూడలకు, ప్రత్యేకంగా ఒకటి ఎద్దులకు మరియు వానపాముల ఎరువు (సేంద్రియ ఎరువు) తయారికోసం గుంతలున్న కొట్టం వున్నాయి. ఇవేకాక గోమూత్రం సేకరణ కేంద్రం, 3 బయో గ్యాస్ ప్లాంటులు (రోజుకు 85 + 85 + 60 ఘనపు మీటర్ల రోజువారి తయారి సామర్ధ్యంగల) ఉత్పత్తి యంత్రాగారాలు వున్నాయి. గ్యాస్ వెలువడగా మిగిలిన జిగట పదార్ధం స్లర్రి ) ను సేకరించే తొట్టె మరియు బయోగ్యాస్ ను శుద్దిచేసి బాట్లింగు విభాగం వున్నాయి.

  • బయో గ్యాస్ యంత్రాగారాలలో రోజువారి ఉత్పత్తి (సామర్ధ్యం) కోసం 5 టన్నుల ఆవు పేడను ఉపయోగిస్తారు.
  • బయో గ్యాస్ శుద్ది చేయబడి మరియు సిలిండర్ లలో (గంటకు 20 ఘనపు మీటర్లు నీటితో శుద్దిచేయబడే సామర్ద్యం తో) నింపబడుతుంది. ఇది వాహనాలకు ఇంధనముగా ఉపయోగపడుతుంది
  • తయారుచేసిన బయో గ్యాస్ ను జనరేటర్ సెట్ సహయంతో విద్యుత్ శక్తి తయారీకి కూడా ఉపయోగిస్తారు.
  • బయో గ్యాస్ ఉత్పత్తి యంత్రాగారం లో గ్యాస్ తయారీకి ఉపయోగించిన జిగట పదార్దాన్ని ( స్పెంట్ స్లర్రి ) ( తాజా ఆవు పేడ కన్నా దీనిలో పోషక పదార్దాలు విరివిగా లభించడం వల్ల ) ఈ గోశాలలో మొక్కల పెంపకానికి మరియు చుట్టుపక్కల వాడతారు. ఈ జిగట పదార్దాన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసి విక్రయిస్తారు.

ప్రకృతి బాటలో – జీవనోపాధి మెరుగుదలలో పునరుత్పదాక ఇంధన ఉపయోగం

పానో హన్సదా తన బయోగ్యాస్ స్టవ్ మీద టీ తయారుచేయడానికి లెగుస్తూ. “మేము వంటకు బయోగ్యాస్ ఉపయోగిస్తున్నాము. రాత్రివేళల్లో సౌర విద్యుత్ వాడుతున్నాము. ఇప్పడు సాయంత్రంవేళల్లో కూడా ఏదైనా పని చేసుకోడానికి వీలుగా’’ ఇది బాగుంది ”అని సగర్వంగా చెప్పుకుంది. కొన్ని నెలల క్రితమే పానో తన ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్ పెట్టుకుంది. ఈ ప్లాంట్ సేంద్రియ పదార్ధాలైన ఆవుపేడను, ఎండు ఆకులను...వంటకు పనికొచ్చే బయోగ్యాస్ కింద మారుస్తుంది. బయోగ్యాస్, సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగం పానో దైనందిన జీవితాన్ని గణనీయంగా మార్చేసింది....జార్ఖండ్ రాష్రం లోని మారు మూలనున్న కోరా గ్రామ ప్రజల జీవితాలను మార్చేసినట్లుగానే. యూఎన్ డీపీవారి ‘గ్రామీణ జీవనోపాధికోసం పునరుత్పాదక ఇంధనం’ ప్రాజెక్ట్ అమలవుతున్న 34గ్రామాలలో ఈ కోరా గ్రామం కూడా ఒకటి. జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, సిక్కిమ్ రాష్ట్రాలలోని మారుమూల గ్రామాలలో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. కోరా గ్రామంలో సౌరవిద్యుత్ కోసం పూరిళ్ళమీద పెట్టిన సోలార్ పలకలు ఒక ఆసక్తికరమైన దృశ్యంగా కనిపిస్తోంది. గ్రామంలోని ఇళ్ళలో విద్యుత్ అవసరాలను చాలావరకు ఈ పలకలే తీరుస్తున్నాయి. గ్రామంలోని వీధి దీపాలను కూడా ఈ సోలార్ పలకలే వెలిగిస్తున్నాయి. వీటిని అమర్చక ముందు గ్రామంలో విద్యుత్ లేదు...గ్రామస్తులు కిరోసిన్ లాంతర్ల మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు చీకటి పడగానే కోరా గ్రామంలోని పిల్లలు చదువుకోవడానికి వీధి దీపాలవద్దకు చేరుతున్నారు.

పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించే జీవనోపాధి కార్యకలాపాలలో విమల తన స్వయం సహాయక బృందాల సభ్యులకు నాయకత్వం వహిస్తోంది. ‘‘”గ్యాసిఫయర్ నుంచి వచ్చే విద్యుత్ ద్వారా మేం బియ్యాన్ని పిండిచేస్తాం. దీనితో మాకు డబ్బు సంపాదించడానికి వీలవుతోంది”.’’ అని విమల వెల్లడించింది. గ్యాసిఫయర్ అనే యంత్రం సేంద్రియ వ్యర్ధ పదార్ధాన్ని స్వచ్ఛమైన వాయురూపంలో ఉండే ఇంధనంగా మార్చి విద్యుత్ సృష్టిస్తుంది. ‘‘”గతంలో స్వయం సహాయక బృందాల మహిళలు బియ్యాన్ని పిండి చేయడం వంటి కార్యకలాపాలలో పాలుపంచుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు వారు స్వయం సహాయక బృందాలలో చురుకుగా పాల్గొంటున్నారు’’” అని విమల చెప్పింది. విమల బృందంలోని మహిళలు బియ్యాన్ని పిండి చేయడం ద్వారా వచ్చిన డబ్బును తమ కూతుళ్ళను చదివించుకోవడానికి దాచుకుంటున్నారు. రాజేష్ అనే రైతు గ్యాసిఫయర్ ను మరొక పనికోసం వాడుతున్నాడు. “మేము దీనిద్వారా వచ్చే విద్యుత్ ను వ్యర్ధకలపతో బొగ్గు ఇటుకలు తయారుచేయడానికి వాడుతున్నాము...వాటిని పక్కనున్న కర్మాగారానికి అమ్ముతాము. ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది...నేను పనికోసం ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేకుండా సరిపోతోంది. నేను గ్రామంలోనే ఉండి కుటుంబాన్ని, పొలాన్ని చూసుకోగలుగుతున్నాను”. ఈ బొగ్గు ఇటుకలను కర్మాగారంలోని ఫర్నెస్ లో ఉపయోగిస్తారు.

ఇంకా కొద్ది దూరం వెళితే జార్ఖండ్ రాష్ట్రంలోని సరైకెళ్ళ-ఖర్సవాన్ జిల్లాలో 110 సేంద్రియ ఇంధన ప్లాంట్ లు ఏర్పాటుచేశారు. వీటివలన అంతకుముందు వంటకు వాడే 2,40,900 కిలోగ్రాముల కలప ఆదాచేయడానికి వీలయింది. తద్వారా ఏడాదికి 3,85,440 కిలోగ్రాముల కర్బన ఉద్గారం వెలువడకుండా ఆపగలిగినట్లయింది. ఈ ఉద్గారం ఒక ఏడాదికి 200భారతీయ కార్లు విడుదల చేసేదానికి సమానం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత మొత్తం 39,286రోజుల వార్షిక ఉపాధి సృష్టించినట్లయింది.

చిన్న వ్యాపారంలా ఇంధన శక్తిని జనింపచేసే తోటలు

ఆంధ్రప్రదేశ్, అదిలాబాద్ జిల్లాలో ఉన్న పవర్ గూడ గ్రామం, మీద అధ్యయనం

స్వదేశంలో ఉత్పత్తి అయ్యే లామిగ (పొంగమియా)నూనె / తైలం  వలన ఎన్నో మిలియన్ల విలువగల విదేశీ ద్రవ్యం ఆదా అవుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉత్పన్నమవుతాయి. భూమిలేని పురుషులు, స్త్రీలు, గిరిజనులు మరియు చిన్న రైతులకి ఈ తోటల ద్వారా ఉద్యోగావకాశాలు ఉత్పన్నమవుతాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకంగా స్వయం సేవా గ్రూపు స్త్రీలు, నూనె / తైలం  తీసే యంత్రాలనుపయోగించి తీసిన లామిగ (పొంగమియా) విత్తనముల తైలాన్ని, లామిగ తెలగపిండి (నూనె / తైలం  తీసివేయగా మిగిలినది) ని అమ్మి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

పవర్ గూడ అనేక సామాజిక,ఆర్ధిక మరియు సహజ వనరుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన గ్రామం. వ్యవసాయ భూములు తక్కువ దిగుబడిని ఇస్తాయి. అందువలన, ప్రజలు పని కొరకు చుట్టు ప్రక్కల పట్టణాలకు తరలి వెళ్తున్నారు.

గ్రామంలో నీటి షెడ్డుల యాజమాన్యం పనుల చొరవతో పాటు ఆదాయాన్నిచ్చే పొంగమియా నర్సరీ లని పెంచుతున్నారు. ప్రజలకు ఆదాయం  కల్గించే పనులకు ఊతాన్నిచ్చే, మూడు లక్షల ఢెభ్భై వేల రూపాయలు ఖరీదు చేసే నూనె / తైలం  తీసే యంత్రాంన్ని కూడా స్థాపించారు. పొంగమియా,వేప విత్తనాలు మరియు ఇతర విత్తనములను  ఈ యంత్రంలో నలగ గొట్టి ఆ తైలాన్ని/ నూనెను తీసి మార్కెట్టు లో అమ్ముతారు.

గ్రామంలో ఈ నూనె తీసే యంత్రం, ఒక ముఖ్యమైన ఆదాయాన్ని కల్గించే ఉత్పత్తి సాధనం అయ్యింది. పొంగమియా విత్తనాల్ని ఈ యంత్రంతో నలగగొట్టి కిలోకి రెండు రూపాయలు చొప్పున స్త్రీలు ఆదాయాన్ని పొందుతున్నారు. గంటకి యాభై – 50 కిలోల చొప్పున ఈ కర్మాగారం విత్తనాల్ని నలగ గొట్ట గలదు. పొంగమియా మొక్కల్ని పెంచడంతో పవర్ గూడ పర్యావరణ మార్గదర్శి అయ్యింది. నూట నలభై ఏడు టన్నుల సరితుల్యమైన కార్బన్డయాక్సైడు సరిచూచిన ప్రసరణ కుదింపులను ప్రపంచ బ్యాంకుకు అమ్మింది.

19 నుండి 21 అక్టోబర్ 2003 వరకు వాషింగ్టన్లో జరిగిన అంతర్జాతీయ సమా వేశములో హాజరైనవారి వైమానిక, స్థానిక ప్రయాణాలలో వెలువడిన ప్రసరణల్ని తటస్థీకరించడానికి ప్రపంచ బ్యాంకు 645 యు.ఎస్. డాలర్లు (సుమారు 30,000 రూపాయలు) పవర్ గూడ స్వయం సేవా గ్రూపు స్త్రీలకి ఇచ్చింది. ఇది ప్రపంచ బ్యాంకు మొట్టమొదటి సారిగా భారతీయ గ్రామానికి పర్యావరణ సేవలు ఎగుమతి చేసినందుకు నేరుగా చెల్లించింది.

ఇది గ్రామంలో ప్రజలకి ఒక విధమైన గర్వాన్నిచ్చి, పవర్ గూడ కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది . పర్యావరణ సేవల నిమిత్తం ప్రపంచ బ్యాంకు ఇచ్చిన 30,000 రూపాయల్ని పొంగమియా నర్సరీలో పెట్టుబడిగా పెడదామని ప్రజలు నిర్ణయించారు. నర్సరీలో 20000 మొక్కల్ని పెంచారు. అందులో 10000 మొక్కల్ని ప్రజల భూములలో నాటారు. మిగతావి చుట్టు ప్రక్కల గ్రామాలకు మరియు అటవీ శాఖకి అమ్మివేశారు. ఈ విధంగా మొక్కల్ని అమ్మగా వచ్చిన ఆదాయాన్ని తిరిగి నర్సరీలో పెట్టుబడి గా పెట్టారు.

గ్రామంలో వన సంరక్షణ సమితి రావడంతో, అటవీ శాఖ ఈ మొక్కల్ని కొనుక్కునే అవకాశం ఉంది. పొంగమియా ఆయిల్ని తీసే పద్ధతిలో వచ్చే ఇతర ఉత్పాదనలు (తెలగపిండి) సేంద్రియ మూలమైన మొక్కల పోషక విలువలు కలిగి ఉన్నట్లుగా పరీక్ష చేయబడ్డాయి. దీనిలో నాలుగు శాతము నత్రజని, ఒక శాతము పొటాషియం, ఒక శాతము భాస్వరం ఉన్నాయి. అందుకే గ్రామంలోని రైతులు వారికి అవసరమైన  నూనెను ,  యంత్రాలను నడిపే స్వయం సేవా గ్రూపు స్త్రీల నుండి కిలో ఐదు రూపాయలు చొప్పున కొంటారు.

వ్యవసాయాభివృద్ధి కొరకు అంతర్జాతీయ నిధి(ఐ ఎఫ్ ఎ డి) ఆర్ధిక సహాయంతో అక్టోబర్ 2003 లో ఈ ప్రణాళిక ప్రారంభమై, అదిలాబాద్ లో ఉన్న ఇన్టిగ్రేటెడ్ ట్రైబల్ డెవలెప్మెంట్ ఏజెన్సీ (ఐ టి డి ఎ) ద్వారా అమలు చేసారు. ఇది అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) అండతో ఆంధ్రప్రదేశ్ గిరిజనా భివృద్ధి ప్రణాళికచే పెట్టుబడి పెట్టబడింది.

రాలేగావ్ సిద్ది - ఒక ఆదర్శ గ్రామం

రాలేగావ్‌ సిద్ధి - ఒక ఆదర్శ భారతీయ గ్రామం 
రాలేగావ్‌ సిద్ధి,  విజయగాథ

1975లో సైన్యంలో పని చేసి రిటైరైన అన్నా హజారె అనే ఓ వ్యక్తి, వుహారాష్ట్రలోని అహమద్‌ నగర్‌ జిల్లాలోని తన కుగ్రామానికి వెళ్లాడు. తన గ్రామం ఎంతటి కరువు కాటకాలతో, పేదరికంతో, నిరుఎద్యోగంతో సతమతమవ్వడం చూశాడు.  గ్రావుస్థులందరినీ ఉత్తేజపరచాలని నిర్ణయించుకొన్నాడు. గ్రామస్థులందరి సాయంతో మార్పులు తేవడానికి నడుంకట్టాడు. ఈ రోజు రాలేగావ్‌ సిద్ధి ఒక్క మహారాష్ట్రలోని ఇతర గ్రామాలకే కాదు. ఇతర రాష్ట్రాలలోని గ్రామాలన్నిటికీ కూడా ఆదర్శవైుంది . సామూహికంగా చెట్లను నాటడం, కొండచరిలు విరిగిపడటం, పెద్ద  కాలువలకిరుపక్కలా సన్నని కాలువలు తవ్వి, వాటిద్వారా వాన నీటిని నిలువచేయుడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాని ఫలితంగా ఆ ప్రాంతాల్లో భూగర్భ నీటివనరులు వెురుగు పడ్డాయి. అంతేకాదు. గతంలో  ఏడాదికి కేవలం ఒక పంట పండించేవారు కాస్తా ఏకంగా ఏడాది కి మూడ పంటలు పండించనారంభించారు. అసంప్రదాయిక శక్తి (నాన్‌కన్వన్షనల్‌ ఎనర్జీ) రంగంలో ఈ గ్రామం సాధించిన విజయం  అసమానవైునది . గ్రామం లోని అన్ని వీధుల్లోనూ, ఒక్కో సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటుచేసి పూర్తి స్థాయిలో సౌరశక్తిని  వినియొగించి విద్యుత్ దీపాలను  ఏర్పాటు చేయడం జరిగింది . గ్రామంలో 4 సామూహిక బయొ గ్యాస్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది . వాటిని సామూహికంగా అందరూ వాడే మురుగుదొడ్లకు కలపడం జరిగింది. నీటిని తోడి  చేరవే యటానికి ఒక పెద్ద గాలి మరను ఏర్పాటు చేయడంజరిగింది . నేడు ప్రతి ఒక్క ఇంటిలో  ఒక బ¸గ్యాస్‌ ప్లాంట్‌ ఉంది . ఈ గ్రామం స్వయంసంవ్రద్ధి  చెందింది.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

కరెంట్ బిల్లు కట్ - పల్లె సీమల్లో కొత్త విప్లవం

కరెంటు ఉత్పత్తికి ఎక్కువ ఖర్చు అవుతున్న ఈ రోజుల్లో వ్యవసాయ నీటి పంపుసెట్లను వాడుకోవడానికి సాంప్రదాయేతర వనరులను ఉపయోగించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పంపుసెట్లకు కరెంటు లేదా డీజిల్ వినియోగిస్తే అయ్యే ఖర్చులో 20 శాతం మాత్రమే వినియోగిస్తూ, వీటిని ఉపయోగించుకోవడానికి రాష్ట్ర సాంప్రదాయేతర వనరుల వినియోగ సంస్థ నెడ్ క్యాప్ చూపిన దారిలో పయనించి, నీటిని పొందడానికి వ్యవసాయ నీటి పంపుసెట్టుకు పెట్టే నెలవారీ ఖర్చును దాదాపు 80 శాతానికి పైగా తగ్గించుకుని, లాభాల బాటలో పయనిస్తున్న యువ రైతు గాథ ఇది. గుంటూరు జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన రైతు అల్లం సురేష్ రెడ్డి. ఈయన గ్రామంలో నర్సరీని నెలకొల్పి దానిలో షేడెడ్ సెట్లను ఏర్పాటు చేసుకుని, రక్షిత వ్యవసాయ పద్ధతిలో మిరపనారు, టమాటో, వంకాయ వంటి కూరగాయల మొక్కలు పెంచి అమ్మే చిరురైతు. మొదటగా షేడెడ్ నెట్‌కు ఈయన పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినా, దాదాపు ఏడు సంవత్సరాల పాటు దానికి మళ్లీ డబ్బు కేటాయించవలసిన అవసరం లేదు. అయితే నీటి విషయంలో మాత్రం ప్రతిరోజూ దాదాపు 5 గంటలపాటు మొక్కలకు చిన్నపిల్లలకు అందించినట్లు, చిరు జల్లులతో స్ప్రింకర్ల ద్వారా నీటిని అందించడం మాత్రం మాత్రం అతనికి తలకు మించిన భారమైంది. వచ్చే లాభాలకన్నా కూడా కరెంటు లభ్యత తక్కువగా ఉన్న ఈ రోజుల్లో నీటిపంపు సెట్టుకు డీజిల్ ఖర్చు మాత్రం నెలకు తడిపి మోపెడపుతోంది. అటువంటి పరిస్థితుల్లో నెడ్ క్యాప్ వారు అందజేసిన సహాయం అతనిని తిరిగి లాభాల వైపుకు మళ్లించింది.

తనకున్న కొద్దిపాటి పశువుల నుంచి వచ్చే వ్యర్థాలతో 20 వేల ఖర్చుతో అతను రెండు బయోగ్యాస్ ప్లాంట్లను నెలకొల్పాడు. నర్సరీ దగ్గరలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లకు అతను కేవలం 8 వేలు మాత్రమే ఖర్చు పెట్టగా మిగిలిన మొత్తాన్ని నెడ్ క్యాప్ తన సబ్సిడీగా అందించింది. ఈ ప్లాంట్ల సహాయంతో వచ్చే బయోగ్యాస్‌ను అతను రోజువారీ వాడే వ్యవసాయ నీటి పంపు సెట్టుకు అనుసంధానం చేశాడు. దీనితో రోజుకు 5 గంటలపాటు నడపాల్సిన ఆ మోటారు, ఇంతకు ముందు 5 లీటర్ల డీజిల్‌ను వాడుకుంటుండగా, ఈ బయోగ్యాస్ అనుసంధానించిన తర్వాత కేవలం 1 లీటరు మాత్రమే వాడుకోవడం మొదలు పెట్టింది. అంటే రోజుకు నాలుగు లీటర్ల డీజిల్ ఖర్చు 240 రూపాయల చొ్ప్పున నెలకు దాదాపు 7 వేల రూపాయలను ఆ రైతుకు ఆదా చేస్తోంది. ఈ బయోగ్యాస్ ప్లాంటును కేవలం నీటి పంపుసెట్టుకే కాక, రాత్రిళ్లు కరెంటు ఉత్పత్తికి కూడా ఒక ప్రత్యామ్నాయాన్ని జత చేయడం ద్వారా సురేష్ రెడ్డి ఉపయోగించుకుంటున్నాడు.

ఈ సందర్భంగా నెడ్‌క్యాప్ గుంటూరు జిల్లా నెడ్ క్యాప్ జనరల్ మేనేజర్ హరనాథబాబు మాట్లాడుతూ, సంవత్సరానికి 300 మందిని ఈ విధంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల వైపు మళ్ళించ గలుగుతున్నామని, వీరిలో అధిక శాతం వ్యాపారానికి ఉపయోగించుకుని స్వయం సమృద్ధి సాధిస్తున్నావారేనని తెలిపారు. మామూలు వ్యవసాయ పంపుసెట్టును కేవలం 120 రూపాయల వ్యయంతో చిన్న వాల్వును అమర్చుకోవటం ద్వారా బయోగ్యాస్‌కు అనుకూలంగా మార్చుకోవచ్చని, గుంటూరు జిల్లాలో ఈ విధంగా బయోగ్యాస్ ద్వారా వ్యవసాయ నీటిపంపు సెట్టు నడుచుకుంటున్న ప్రాజెక్టులు మూడు ఉన్నాయని, వీటిని మిగిలిన రైతులు కూడా అనుకరించి లాభాలను ఆర్జించాలని ఆయన కోరారు. కేవలం వ్యవసాయానికి, ఇతర వ్యాపార అవసరాలకే కాక, గృహ వినియోగానికి కూడా ఇటువంటి బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి నెడ్ క్యాప్ సబ్సిడీని అందిస్తోంది. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి కేవలం 20 వేల రూపాయల పెట్టుబడితో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోగలిగితే, దానిలో నెడ్‌క్యాప్ యాభై శాతాన్ని సబ్సిడీగా అందజేస్తుంది. అంటే 10 వేల రూపాయల పెట్టుబడి పెడితే, సంవత్సరం లోపు బయోగ్యాస్ రూపంలో మన పెట్టుబడి తిరిగి రావటమే కాక, ఎంతోకాలం పాటు ఆ ప్లాంటు సేవలందిస్తుంది.

కరెంటు కొరత ఎక్కువగా ఉండి, సౌరవిద్యుత్‌ను ఫలకాల సాయంతో పొందటం కొంత ఖర్చుతో కూడినదిగా ఉన్న ఈ రోజుల్లో ఈ విధంగా బయోగ్యాస్ ద్వారా మోటర్లను తిప్పుకోవటం అనేది ఎంతో ఆహ్వానించదగ్గదే కాక, అవసరం కూడా అని చెప్పవచ్చు.

--రవిశంకర్, గుంటూరు

ఆధారము: ఆంధ్రప్రభ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate