অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఫ్రిజ్‌ వాడకంలో మెలకువలు

ఫ్రిజ్‌ వాడకంలో మెలకువలు
  • సూర్యరశ్మి పడేచోట ఫ్రిజ్‌ని ఉంచకూడదు. ఉంచితే ఫ్రిజ్‌ పనిచేయడానికి అవసరం అయ్యే కరెంట్‌ ఖర్చు అధికం అవుతుంది.
  • వేడిని వెదజల్లే బాయిలర్స్‌, స్టవ్‌, కుంపటి లాంటి వాటి దగ్గరగా రిఫ్రిజిరేటర్‌ని ఉంచితే ఆ వేడి ప్రభావం రిఫ్రిజిరేటర్‌ మీద పడి కరెంట్‌ ఖర్చు పెరుగుతుంది.
  • ఫ్రిజ్‌ ముందు రబ్బర్‌ మేట్‌ వేసి దానిమీద నించుంటే కరెంట్‌ షాక్‌ కొట్టే ప్రమాదం ఉండదు.
  • ఓల్టేజ్‌ ఫ్లక్చువేషన్స్‌ వల్ల ఫ్రిజ్‌లోని కంప్రెసర్‌ పాడయిపోయే అవకాశం ఎక్కువ కాబట్టి తప్పనిసరిగా ఫ్రిజ్‌కి స్టెబిలైజర్‌ని వాడాలి.
  • ఫ్రిజ్‌ని గోడకి కనీసం అరంగుళాల దూరంలోనయినా ఉంచాలి. లేకపోతే ఫ్రిజ్‌ వెనక భాగంలో కంప్రెసర్‌ నించి వచ్చే వేడిగాలి ఆడక చల్లబడక ఫ్రిజ్‌ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
  • రిఫ్రిజిరేటర్‌ సమతలంగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి కింద లెవెల్‌ సరిగ్గా లేకపోతే ఫ్రిజ్‌ కొనేప్పుడు ఇచ్చే గ్లైడర్‌ స్క్రూలని ఉపయోగించి సమతలంగా ఉండేలా చేయాలి. లేకపోతే ఫ్రిజ్‌ శబ్దం చేస్తూ పనిచేస్తుంది.
  • ఫ్రిజ్‌ లెవల్‌లో ఉందో లేదో తెలుసుకొనడానికి ఇదో చిట్కా. ఫ్రిజ్‌ తలుపుని 30డిగ్రీల ఏంగిల్‌లో తెరిచి ఉంచండి. జెర్క్‌ లేకుండా అది మూసుకుంటే ఫ్రిజ్‌ కింది భాగం సమతలంగా ఉన్నట్లు లెక్క.
  • సాధ్యమైనంతవరకు ఫ్రిజ్‌ తలుపుని అరనిమిషం మించి తెరచి ఉంచకపోవడం మంచిది. అంతకు మించితే బయట వేడి లోపలికి, లోపలి చల్లదనం బయటికి వచ్చి కరెంట్‌ ఖర్చు పెరుగుతుంది.
  • ఫ్రిజ్‌లో ఓ పళ్లెంలో బొగ్గులని ఉంచితే, ఫ్రిజ్‌లోని వాసనలన్నిటినీ అది గ్రహించి ఫ్రిజ్‌ తాజాగా ఉంటుంది.
  • ఐస్‌క్యూబ్స్‌ ట్రేని డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచబోయే ముందు అడుగున కాస్త నూనె రాసి తర్వాత నీళ్లుపోస్తే నీళ్లు గడ్డకట్టాక ఐస్‌ క్యూబ్స్‌ తేలికగా వస్తాయి.
  • అల్యూమినియం కాగితంలో చపాతి పిండి చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే అది మెత్తగా జిగురుగా ఉంటుంది.
  • ఐబ్రో పెన్సిల్‌ని రాత్రి ఫ్రిజ్‌లో ఉంచి ఉదయం దాని చెక్కు తేలికగా చెక్కచ్చు.
  • తురిమిన కొబ్బరి, జీడిపప్పు ఫ్రిజ్‌లో ఉంచితే పురుగుపట్టదు.
  • అరటితొక్కలో కొత్తిమీరని ఉంచి దాన్ని ఫ్రిజ్‌లో ఉంచితే కొత్తిమీర తాజాగా ఉంటుంది.
  • ఫ్రిజ్‌లోని ఓ పళ్లెంలో పుదీనాని ఉంచితే ఫ్రిజ్‌లోని వాసలన్నిటిని అది గ్రహించి ఫ్రిజ్‌ తాజాగా ఉంటుంది.
  • ఫ్రిజ్‌ బయటి భాగాన్ని వెనిగర్‌లో ముంచిన బట్టతో తుడిస్తే శుభ్రంగా ఉండటమే గాక నిగనిగలాడుతుంది.
  • ప్లాస్టిక్‌ పెట్టె మూతకి చిల్లులువేసి అందులో కొత్తిమీర ఉంచి ఆ పెట్టెని ఫ్రిజ్‌లో ఉంచితే కొత్తిమీర తాజాగా ఉంటుంది.
  • గుడ్డులోని తెల్లసొనని కొన్ని వారాల పాటు దాచచ్చు. ఫ్రిజ్‌లోని ఫ్రీజర్‌లో కప్పు ఆకారంలో మడిచిన అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచితే అది గడ్డకడుతుంది. పై భాగం కూడా మడిస్తే చాలాకాలం పాడవదు.
  • బ్రెడ్‌ పాడవకుండా ఉండాలంటే దాన్ని చుట్టిన కాగితం విప్పకుండా ఫ్రిజ్‌లోని అడుగు అరలోకానీ, బ్రెడ్‌ బాక్స్‌లోకానీ ఉంచాలి.
  • ఫ్రిజ్‌లోని చల్లటి నీరుగల గిన్నెలో పచ్చిమిరపకాయలు ఉంచితే వాటిలో కారాన్ని ఆ నీరు లాగేస్తుంది. వాటిలో అన్నంలో ముక్కలు చేసి నంజుకోవచ్చు.
  • క్యారెట్‌ను ఫ్రిజ్‌లో ఉంచబోయే ముందు విధిగా మొదలును కోసేయాలి. లేకపోతే మొదళ్లు తడిని పీల్చుకుని క్యారెట్‌ని పొడిగా చేస్తాయి.
  • కొవ్వొత్తుని ఫ్రిజ్‌లో ఉంచండి. అవసరం వచ్చినప్పుడు వెలిగిస్తే మైనం తక్కువగా కారుతుంది. ఎక్కువసేపు కాలుతుంది. కాచి వడబోసి నీరు తాగేవారికి ఆ నీరు రుచి బావుండకపోతే, ఆ నీటిని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక తాగితే రుచిగా ఉంటుంది. ఫ్రిజ్‌లోంచి తీసిన నిమ్మకాయను గది ఉష్ణోగ్రతకి వచ్చేదాకా ఆగి కోసి పిండాలి. లేకపోతే రసం తక్కువగా వస్తుంది. ఐస్‌ముక్కలు గాజుగ్లాసుల్లోకాని, జగ్స్‌లోకాని ఉంచకూడదు. ఆ పాత్రలు చిట్లే ప్రమాదం ఉంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate