హోమ్ / శక్తి వనరులు / ఉత్తమ ఆచరణ పద్ధతులు / ప్లాస్టిక్,పనికిరాని బట్టలను మళ్ళీ మళ్ళీ వాడుకుందాం.
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్లాస్టిక్,పనికిరాని బట్టలను మళ్ళీ మళ్ళీ వాడుకుందాం.

ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎన్నటికీ కుళ్ళిపోని ఘనరూప పదార్థాలు. ప్లాస్టిక్ ను సులువుగా ఉత్పత్తిచేయగలగడం, ఉపయోగించడం వలన విపరీతంగా వాడుతూ వాతావరణ కాలుష్యానికి కారకులవుతున్నాం.

లక్ష్యం

 1. ప్లాస్టిక్,పనికిరాని బట్టలను మళ్ళీ మళ్ళీ వాడుకునే పద్దతుల గురించి తెలుసుకుందాం.
 2. ప్లాస్టిక్,పనికిరాని బట్టలను తెలివిగా మళ్ళీమళ్ళీ వినియోగించుకోడం గురించి తెలుసుకుందాం.

నేపథ్యం

ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎన్నటికీ కుళ్ళిపోని ఘనరూప పదార్థాలు. ప్లాస్టిక్ ను సులువుగా ఉత్పత్తిచేయగలగడం, ఉపయోగించడం వలన విపరీతంగా వాడుతూ వాతావరణ కాలుష్యానికి కారకులవుతున్నాం. కనుక కొంతలో కొంత పనికిరాని ప్లాస్టిక్ ను , పనికిరాని బట్టలను ఉపయోగరమైన వస్తువులుగా తయారుచేసి మళ్ళీ మళ్ళీ వివిధ రకాలుగా ఉయోగించుకోడం ఉత్తమాభిరుచి కి అనిపించుకొంటుంది. పనికిరాని ప్లాస్టిక్ ఉపయోగపడని బట్టలతో డోర్మాట్లు, వాల్ హ్యాంగింగ్స్ చేతి సంచులు, చాపలు, కర్టెను మొదలైనవి సృజనాత్మకంగా తయారుచేస్తూ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

పద్ధతి

 1. ప్లాస్టిక్ సంచులను, పనికిరాని బట్టల్ని సేకరించండి.
 2. ప్లాస్టిక్ సంచుల్ని బట్టలను ముక్కలుగా, పీలికలుగా చేసి,వాటిని పేని తాళ్ళగా తయారుచేయండి.
 3. ఈ పేనిన తాళ్ళతో ఉపయోగపడే వసువుల తయారీలో మీ సృజనాత్మకతను చూపించండి.
 4. ప్లాస్టిక్, పనికిరాని బట్టలతో తయారుచేసిన వస్తువులను వివిధ తరగతులలో ప్రదర్శించండి. ఆయా తరగతులలో గల విద్యార్ధులు కూడా ఈ వస్తువులను తయారుచేసే విధంగా పర్యావరణ క్లబ్బుల ద్వారా ప్రోత్సహించండి.

ముగింపు

చెత్తను ఎలా సరైన పద్ధతుల్లో వినియోగించాలో అని ఆలోచించడం కన్నా చెత్త ఉత్పత్తి కాకుండా చూసుకోడం మంచిది కదా! ఎపుడూ మన వెంట ఒక గుడ్డసంచి ఉంచుకుంటే మనం వాడి పారేసే ప్లాస్టిక్ కవర్ల సంఖ్య సగానికి తగ్గించగలుగుతాం. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల బదులుగా స్టీలువి వాడడం మంచిది. ఒక వస్తువును చాలాకాలం వాడుతున్నాం అంటే దానికి అవసరమయిన వనరులను జాగ్రత్తగా వాడుతున్నట్లే కదా! రీఫిల్ మార్చుకునే పెన్ వాడడం మంచిదా? రాసి పారేసే పెన్ మంచిదా? ఆలోచించండి. దీనిని పాటించడం వల్ల వనరులు కాపాడుకోగలుగుతాం. కాలుష్యం తగ్గించగలుగుతాం.

విచక్షణారహితమైన ప్లాస్టిక్ వినియోగం - నష్టాలు దాని పునర్వినియోగ ప్రక్రియలపై ఒక నివేదికను తయారుచేసి ప్రదర్శించండి.

తదుపరి చర్యలు

 1. మళ్ళీ మళ్ళీ వస్తువులను ఎందుకు అపయోగించాలి? లాభనష్టాలను గురించి మీ పాఠశాలలో చర్చించండి.
 2. పేలికలతో చేతిసంచులు తయారుచేసి, అద్దాలు కుట్టి ప్లాస్టిక్ సంచులకు బదులుగా వీటిని ఉపయోగించేలా ప్రోత్సహించండి.
 3. ప్లాస్టిక్, సెలైన్ బాటిల్ లతో వివిధ వస్తువులను తయారుచేసి ప్రదర్శించండి.
 4. కలపకు బదులుగా పనికిరాని పేపర్లతో వివిధ వస్తువులను తయారుచేసి ప్రదర్శించండి.
 5. పనికిరాని కాగితాలతో హేంద్మేడ్ పేపరును తయారుచేసే సంస్థను సందర్శించండి. దీనితో అందమైన గ్రీటింగ్ కారును తయారుచేసి ఎలా ఆదాయాన్ని పొందవచ్చో తెలుసుకోండి.

ఆధారము: http://apscert.gov.in

3.00632911392
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు