অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వాననీటి నిల్వ

వాననీటి నిల్వ

పర్యావరణ సంరక్షణ పనుల ద్వారా ఆర్థిక ప్రయోజనములు

నీటి సంరక్షణ కార్యక్రమాల ప్రభావ ఫలితాలు కేవలం పర్యావరణ పునరుద్దరణ అంశంలోనే కాకుండా ఆ పనులు చేస్తున్న ప్రజలకు ఆర్థిక ఫలాలు అందుస్తున్నాయి. 2006 లో నీటి సంరక్షణ సంస్థ భోపాల్ జిల్లాకు చెందిన బగ్రోడా అనే గ్రామంలో తన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రూ. 65.03 లక్షల ప్రాజెక్టు వ్యయంతో 1,275 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ప్రాంతంలో కార్యక్రమాలు చేవట్టారు. నాలుగు సంవత్సరాల ప్రాజెక్టు కాలంలో మొత్తం 43 లక్షల రూపాయలు వెచ్చించి 6 ఇంకు గుంతలను 5 నీటి గుంటలను, 10 రాతి కట్టడాలతో చెక్ డ్యామ్ లను, 6000 వరుసల కందకాల తవ్వకం, 57000 చిన్నమొక్కలు నాటడం మరియు 10 హెక్టారుల్లో పశువుల మేతను అభివృద్ది చేశారు.

నీటి సంరక్షణా కార్యక్రమాల ప్రభావంవల్ల నీటి నిల్వల స్థాయి పెరిగింది. 2005 లో 65 m ఉండగా 2010 లో అది 43 m కి పెరిగింది. నీటి సంరక్షణా సంఘం లో 12 సభ్యులు ఉంటారు. (అందులో 3 తప్పనిసరిగా మహిళలు ఉండాలి). ఈ సంఘం పంచాయితీతో కలసి పనిచేస్తుంది. నీటికి సంబంధించిన ఏర్పడిన మౌళిక ఆస్తుల నిర్వహణ , పనులను ఒక నిర్ణీత కాలవ్యవధిలో సమీక్షలు చేయడం మరియు భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించడం చేస్తుంది. బగ్ రోడా గ్రామంలో 13 చేతి పంపులు ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతం సంవత్సరం పొడవునా నీటిని అందిస్తున్నాయి. ఇంతకు ముందు దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం ఉండేది. మార్చి తరువాత 4-5 చేతి పంపులు ఎప్పుడు ఎండిపోతుండేవి. గ్రామమహిళలు సంతోషంగా చెపుతున్నదేమిటంటే, “మా ప్రాంతంలో అమలు చేస్తున్న నీటి సంరక్షణా కార్యక్రమాల వల్ల బావులలో నుండి నీటిని తోడే బాధలు తగ్గాయి. ఇంతకు ముందు మార్చి, జూన్ నెలల మధ్య రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళ వలసి వచ్చేది” అని అంటున్నారు.

నీటి సంరక్షణా సంస్థ సహకారంతో ఈ గ్రామస్తులు సాంప్రదాయ బద్దమైన చెరువులను పునరుద్దరించే నీటి సంరక్షణా పనులను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూడా చేపడుతున్నారు. సెమ్రికుడ్ అనే గ్రామం బగ్ రోడియా పొరుగున ఉంది. ఈ గ్రామంలో సాంప్రదాయమైన చెపువు ఉంది. దీనిని గ్రామానికి చెందిన ముంగియాబాయ్ రూపొందించారు. వీరంటే అమితమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఈ చెరువు బురదతో నిండి పోయి వినియోగానికి పనికి రాకుండా పోయింది. గ్రామంలోని పశువులకు నీటి ఆధారంగా ఉన్న మరియు భూగర్ఙజలాల పెంపునకు దోహదపడే ఈ చెరువును పంచాయితీ వారు పునరుద్దరించాలని ఈ సంవత్సరం మొదట్లోనే తీర్మానించుకున్నారు. ఈ చెరువుకు పూర్వ వైభవం తేవడానికి గాను జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రజలు పనిచేయడం ద్వారా తమ వంతు అందించారు. దానితో పాటు పంచాయితీ తన నిధులు వినియోగించి చెరువుకు చుట్టూ నీరు కొట్టుకుపోకుండా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టింది.

నీటి సంరక్షణా సంఘం కార్యదర్శి మరియు రైతయిన బ్రిజేష్ పటేల్ ప్రస్తుత్తం తన పొలంలో వరి పండించగలుగుతున్నాడు. అతను చెబుతున్నది ఏమిటంటే “ నేను ఖరీప్ సమయంలో నా పొలంలో సోయాబీన్ పండిస్తాను. నీరు తక్కువగా లభ్యమవుతుండడం వల్ల రబీలో తృణ ధాన్యాలు పండిస్తాను.

ఏదిఏమైనా గ్రామంలోను మరియు చుట్టుప్రక్కల ఇంకుడు గుంతల నిర్మాణం, పారు నీటిని నిలుపు డ్యాంల నిర్మాణాలు జరిగిన తరువాత, నా బోరు బావిలో నీటి స్థాయిలు పెరిగింది. దాంతో అది సంవత్సరం పొడవునా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందిస్తోంది. నేను ప్రస్తుతం రబీ సమయంలో గోధుమ పండిస్తున్నాను. ప్రసుత్తం 0.5 ఎకరా పొలంలో వరి పండిస్తున్నాను” అన్నాడు. బ్రిజేష్ తను పండించిన 0.5 ఎకరాల భూమిలో 15 క్వింటాళ్ళ ఉషా బాస్మతి బియ్యం ఫలితం వచ్చింది. ఇది ప్రస్తుత విపణిలో . ప్రతి క్వింటాలు రూ. 2000 ల చొప్పు న అమ్మడం ద్వారా రూ. 30,000 ఆదాయం వస్తుంది. అతను మరింతగా ఆదాయం పెంచుకునేందుకు ఇసారి వరి పంటను వేయాలని అనుకుంటున్నాడు.

ఇంటికప్పుపై బడే వర్షపు నీటిని సేకరించిన పద్ధతిలో సత్పలితాలు పొందిన ఐశ్వర్య గ్రామం

ఐశ్వర్య అనే గ్రామం ఆమ్రేలి కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతం. 1957 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 80.7 శాతం అక్ష్యరాస్యత ఉంది. భూగర్భజలాలు 80 అడుగుల నుండి 90 అడుగుల లోతున ఉంటుంది. ఈ భూగర్భజలాలు నాణ్యత కూడా రాను రానూ తగ్గిపోతోంది. ఈ గ్రామంలో త్రాగునీటికి సంబంధించి ఆధారపడదగిన ఎలాంటి వనరులు లేవు. నీటి సంరక్షణ ప్రాజెక్టు రాక మునుపు ప్రభుత్వం టాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేది. ఈ టాంకర్లలో నుంచి త్రాగు నీటిని తీసుకొనేటప్పుడు ప్రజల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగేవి. ఇవన్నీ నీటి సంరక్షణా పథకాలు అమలు చేయక మునుపటి స్థితి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణ అభివృద్ధిలో త్రాగునీటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. శాశ్వతంగా త్రాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు గాను ఇంటి కప్పు పై పడే వర్షపు నీటిని సంరక్షించే పద్దతికి అవసరమయ్యేట్టు కట్టడాలను నిర్మించుకోవాలని నీటి సంరక్షణా అభివృద్ధి సంఘాలు (The Watershed Development Committees), పథకం అమలు చేయు సంస్థలు ( PIA) మరియు గ్రామ సభ లో కలసి కట్టుగా నిర్ణయించుకున్నారు. మొదట్లో ఈ పథకం క్రింద రూ. 7.91 లక్షల వ్యయంతో 125 ఇంటి పై కప్పు నీటిని సంరక్షించే కట్టడాలను నిర్మించుకున్నారు. ఈ కట్టడాలను ఇంటి ఆవరణలోనే నిర్మించడం తో పాటు ఆ ఇంటిలో నివాసమున్న వారు తమ వంతుగా కొంత మొత్తం వెచ్చించుకోవడం జరిగింది. ఆ తరువాత చాలామంది గ్రామస్తులు ఈ వర్షపు నీటి సంరక్షణా పద్దతి తమకు యుక్తమైనదిగా భావించడం జరిగింది.

నీటికి సూర్యరశ్మి తగులకుండా ఉంటే అది చాలా సంవత్సరాలు త్రాగేందుకు వినియోగించవచ్చు. అందుకోసం ఇంటిలోనే సూర్యరశ్మి పడకుండా భూమి లోపలి నీటి ట్యాంకు నిర్మించడం జరిగింది. ఈ నీటి ట్యాంకు కనీసం అంటే 10 వేల లీటర్లు సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ట్యాంకు కనీస పరిమాణం 7 అడుగుల పొడవు , 7 అడుగుల వెడల్పు మరియు 8 అడుగుల లోతు ఉంటుంది. ఏదిఏమైనా గ్రామస్తులు వారి వారి అవసరాల మేరకు ఈ భూగర్భ నీటి ట్యాంకులను నిర్మించుకోవడం జరిగింది. రాను రాను ఈ నీటి సంరక్షణా పద్ధతి ఈ గ్రామంలో ఓ సాంప్రదాయంగా తయారై ప్రతి కొత్త ఇల్లు కడుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ ట్యాంకు నిర్మాణం ఉండేటట్లు నేటికి అవలంబిస్తున్నారు.

వర్షపు నీటిని సంరక్షించడం వల్ల కలిగిన ప్రయోజనముల

  • గ్రామంలో వర్షపు నీటిని సంవత్సరం పొడవునా ట్యాంకులలో భద్రపరుచుట ప్రారంభించటం వల్ల స్వయంగా వారికి వారే తగినంతగా త్రాగునీటిని సాధించుకోవడం జరిగింది.

  • సురక్షితమైన త్రాగునీటిని పొందుతుండడం వల్ల నీటి వల్ల వచ్చు జబ్బుల బారిన పడే ప్రమాదం బాగా తగ్గిపోయింది

  • ఈ భూగర్భ ట్యాంకుల నుండి నీటిని తోడేందుకు చిన్న చేతి బోరులను వాడడం వల్ల విద్యుత్ ఆదా అవ్వడం జరిగింది.

  • గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి అందరి మధ్య సంపద, ఐక్యమత్యం పెరిగింది. అంతేగాక ప్రజల జీవన విధానంలో కూడా చెప్పుకోదగ్గ మార్పులను గమనించడం జరిగింది.

  • గ్రామస్తులు నీటి పంపుల ద్వారా వ్యవసాయానికి కూడా ఈ నీటిని వాడుకోవడం జరిగింది.

సుస్థిరత కోసం ప్రణాళిక : ఏ విధంగా అన్నది నిరూపించిన నారాయణపూర్ మహిళలు

మనం ఇప్పుడు నారాయణ పూర్ కు చెందిన జోహద్ (వర్షపు నీరు సంరక్షించే ట్యాంకు) ఒడ్డున నిలబడి ఉన్నాం, ట్యాంకు నిండా ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది . అది ఎండలు మండి పోతున్న ఏప్రిల్ నెలలోని ఒకరోజు, ఋతుపవనాలు వచ్చి వెళ్ళి పోయిన చాలా కాలం తరువాత చూస్తుంటే చిన్ననీటి నిల్వ కట్టడాలన్నీ నీరు లేక ఖాళీగా కనబడుతున్నాయి. అయితే జోహద్ మాత్రం నారాయణ పూర్ గ్రామస్తులకు సంవత్సరం పొడవునా మంచి తాగు నీరును అందించగలుగుతోంది. నారాయణపూర్ గ్రామం హర్యానా రాష్ట్రం లోని రెవారి జిల్లాలో ఉంది. అక్కడ సాధారణంగా భూగర్భజలాలు ఉప్పగా ఉండి తాగేందుకు పనికిరావు. అక్కడి నీటి నాణ్యతను వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ పరీక్షించింది. రెవారి జిల్లా లో 24 శాతం బోరులలో మాత్రమే తాగేందుకు పనికి వస్తాయని, మిగిలినవి వివిధ రకాల శాతం ఉప్పుతో మరియు సోడియం తో నిండి ఉండడంతో నాణ్యత లేనట్టు ఆ పరీక్షల్లో తేల్చింది.

నారాయణ పూర్ మహిళలు చేతిల్లో నినాదాలు ధరించి ప్రదర్శించారు. నీటికుంటలు ఉంటేనే గ్రామం ఉంటుంది అనే అర్థంతో జోహద్ హై గావ్ హై అంటూ నినదిస్తూ వారు తమంతట తామే నారాయణ పూర్ లోని రిపేరు అయిన బోరు పంపులను మరింత పాడవకుండా బాగు చేసుకొనేందుకు నడుం బిగించారు. “సాధారణంగా ఒక చుక్క నీటి కోసం గంటలకొద్దీ వేచి ఉండే పరిస్థితి ఉండేది, వేసవిలో అయితే ఒక బిందె తియ్యని తాగు నీటికోసం రోజుల కొద్దీ వేచి ఉండే పరిస్థతి, దీనికోసం సుదీర్ఘంగా వేచి ఉండలేక తప్పని సరిగా బోరులోని లేదా బావిలోని ఉప్పనీటినే వాడుకునే వారం.” అన్నది లలిత తమ పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ....

తగినంతగా గ్రామంలో త్రాగునీరు లేక పోవడంతో ఈ గ్రామం పూర్తిగా బయటి నుండి వచ్చే నీటిపై ఆధారపడింది. మహిళలు నీటికోసం పడిగాపులు పడేవారు. కిరణ్ అనే అతను మరియు ఇంకో మహిళ ఈ గ్రామానికి వచ్చి నీటి సంరక్షణ అంశంపై పనిచేయాలనుకున్నప్పుడు వారి వెంట ఎవరూ లేరు. అందరూ నిరుత్సాహపరిచినా వారు కూలీలలాగానే పనిచేసి జోహద్ నీటి కుంట తవ్వకం మరియు మరమ్మత్తు పనులలో పనిచేశారు. ఆఖరికి ఆ గ్రామంలోని ఒక మహిళ కూడా వారితో జత కలిసింది. వారికి ఈ జోహద్ నీటిగుంట బాగుచేసే పని పూర్తి కావడానికి నిండా 5 నెలల సమయం పట్టింది.

హర్యానా రాష్ట్రంలోని రెవారి జిల్లాలోని నారాయణ పూర్ గ్రామంలో మొత్తం 225 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ రాను రాను వర్షపాతం మరియు భూగర్భజలాలు రెండూ బాగా తగ్గిపోతున్నాయి. రెవారి జిల్లాలో ఎక్కువ మంది కేంద్ర భూగర్భజలాల అథారిటీ ద్వారా మరింత మోసానికి గురయ్యారని రూఢీగా చెప్పవచ్చు.

పెయుజాల్ అపూర్తి విభాగ్, హర్యానా అనే సంస్థ నారాయణ పూర్ గ్రామానికి ఇతర దగ్గరగా ఉన్న గ్రామమైన పునిష్క నుండి త్రాగునీరు సరఫరా చేసేవారు. అయితే 2007 లో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల వల్ల పునిష్క గ్రామ ప్రజలు ఈ విధంగా తమ నీటిని నారాయణ పూర్ తో కలసి పంచుకోవడానికి వ్యతిరేకించారు. దీంతో కొన్ని సంవత్సరాలు నీటి సరఫరా విభాగం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసింది. ఏదిఏమైనా నీటి సరఫరా క్రమంగా మరియు సరిపోయినంత ఎప్పుడూ వచ్చేది కాదు. కొన్ని కుటుంబాలు త్రాగు నీరు ను కొనడం మొదలు పెట్టారు. ఇలాంటి సందర్భంలో గ్రామంలోని కొంతమంది మహిళలు తమ గ్రామంలోని పాత నీటి కుంటలను పునరుద్దరించుకోవాలని తలంచారు. వీటిని వారు త్రాగు నీటికి ఓ ఆధారంగా 1990 కు ముందు పైపు ద్వారా నీటి సరఫరా లేక ముందు వాడేవారు. ఈ నీటి కుంట లేదా జోహద్ అప్పటినుండి వాడుకలో లేదు.

గ్రామ మహిళలు గ్రామీణ ప్రతిపాదనలు మరియు వాటి విస్తృతి అనే సామాజిక కేంద్రం (the Social Centre for Rural Initiative & Advancement SCRIA) వారిని కలిసి ఈ పథకానికి కావలసిన సలహాలు, సూచనలు మరియు ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనికి యస్.సి.ఆర్.ఐ.ఏ సంస్థ వారు అంగీకరించి మహిళలు తమ వంతుగా కొంత గ్రామం నుండి నిధులు వసూలు చేయాలని తెలిపారు. ఆ విధంగా గ్రామస్తులు రూ.31,950 లు వసూలు కాగా. సంస్థ వారు అంగీక రించినట్టు వారు మిగిలిన మొత్తం వెచ్చించి జోహద్ ను పునరుద్దరించారు. మహిళలు తమంతట తాముగా ఇనుప వస్తువులు అమ్ముతున్న అంగళ్ళకు వెళ్ళి తమ పథక అవసరాన్ని, ఉద్దేశాన్ని వివరించి ధరను బాగా తక్కువగా బేరమాడి వస్తువులను కొనుగోలు చేయడం జరిగింది. అంతేగాక వ్యయం లో కొంత శ్రమదానం రూపంగా చెల్లించడం జరిగింది. ఈ నీటి కుంట పునరుద్దరణ పథకానికి మొత్తం రూ.73,950 లు వ్యయం అయితే గ్రామ ప్రజల నుండి వసూలు చేసింది పోగా మిగిలినది యస్.సి.ఆర్.ఐ.ఏ సంస్థ రూ.42,000 లు తమ వంతుగా అందించింది. ఈ కార్యక్రమం 2009 మార్చిలో పూర్తి చేశారు.

పాడయిపోయిన పాత నీటి కుంట స్థాయి నుండి మంచి తియ్యని త్రాగునీరు అందించే నీటి కుంటగా మారిన జోహద్ ప్రయాణం నల్లేరు పై నడకలా కాలేదు. తొలిరోజుల్లో గ్రామంలో ని కొంతమంది మహిళలు ప్రతిరోజూ తెల్లవారి జాముననే లేచి చందా వసూలుకు వెళ్ళేవారు. చందా వసూలుతో పాటు గ్రామ వ్యాపారుల తక్కువ ధరకే వస్తువుల ఇచ్చేలా బేరమాడేవారు. వీరిని చూసిన ఆ గ్రామంలోని మగవారు ఎగతాలి చేసి నవ్వుకునేవారు. మహిళలు నీటి కుంట పునరుద్దరణ కార్యక్రమంలో పూర్తి రోజు కూలీలుగా పనిచేయడం కూడా జరిగింది. వారి ధృఢ నిశ్చయం చూసిన తరువాత గ్రామంలోని మిగిలిన మహిళలు కూడా వారితో జత కలిశారు.

జోహద్ నీటి కుంట నుండి నీటిని రెండు గొట్టపు బావుల ద్వారా అందుతుంది. ఒక దానిలో నీరు ఉప్ప గా ఉంటుంది. ఈ నీటిని ఇళ్ళలోకే ప్రసుత్తం ఉన్న పైపులైన్ల ద్వారా సమీకృతం చేసుకొని పంపిణీ చేయడం జరిగింది. మంచి తియ్యని నీరు అందించే మరో గొట్టపు బావి నీటిని మాత్రం పైపులైన్ల ద్వారా పంపిణీ చేయడం లేదు. ప్రజలే గొట్టపు బావి వద్దకు వచ్చి తీసుకుపోయే పద్దతి పెట్టారు. ఒక కుటుంబం తమ త్రాగు నీరు మరియు వంట కోసం రెండు నుంచి మూడు బిందెల నీటిని మాత్రం తీసుకునే వీలు కల్పించారు.

ఈ గ్రామ సర్పంచ్ అనిత వివరిస్తూ.. . త్రాగేనీటి ఆధారం, నిర్వహణ మరియు సుస్థిరంగా అందించడం కోసం ఈ పద్దతిని ఉద్దేశ పూర్వకంగానే అమలు చేసినట్టు తెలిపింది. గ్రామంలో ని అందరు మహిళలు నీటి బావి దగ్గర ఒక నిర్ణీత సమయంలో సమావేశం అవుతారు. ఎవరు ఎక్కువ నీటిని తీసుకు వెళ్ళరు . అంతేకాకుండా తలపై నీటిని మోసుకుంటూ 800 మీటర్ల దూరంలో ఉన్న నీటి కుంట నుండి నీరు తీసుకు వెళ్లవలసి ఉంటుంది. రెండు లేదా మూడు బిందెలకు మించి నీరు తీసుకెళ్ళడమనేది అంత సులభమైనది కాదు. ఈ నిర్ణయం గ్రామానికి చెందిన మహిళలే తీసుకొన్నారు. రెండేళ్ళు పైబడిన తరువాత ఇంకా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండడం విశేషం. గ్రామంలోని ఓ వృద్ధ మహిళ మాట్లాడుతూ “ తీయని త్రాగు నీరు తమ గ్రామంలో లభించడం భగవంతుడి కృప. దీనిని దేవాలయంలో దీనిని మేము గౌరవిస్తాము” అన్నది.

ఈ నీటి కుంట సంవత్సరం పొడవునా గ్రామస్తులకు కావలసిన అన్ని అవసరాలకు నీటిని అందిస్తున్నది. గ్రామస్తులు ఈ నీటికుంటకు సమీపంలోని పాఠశాల ఆవరణలో మరో వర్షపు నీటిని సంరక్షించే మరో నీటికుంట నిర్మాణానికి ఉపక్రమించారు. పాఠశాల పైకప్పునుండి పడే నీరు ఈ కుంటలోకి సేకరించడం వల్ల భూగర్బంలోకి నీరు స్వచ్చతగా వడగట్టి వెళ్లుతుంది. నీటి మట్టం మరింత పెరుగుతుంది. ఈ వర్షపు నీరు సేకరించే కుంట జోహద్ కు దగ్గరగా ఉండడంతో నీటి నిల్వస్థాయి తగ్గకుండా ఉంటుంది. ఈ గ్రామంలో నీటిని ఎక్కువగా వినియోగించే పంటలు ఉదా.. వరి లాంటి పంటలు వేయకూడదని తీర్మానించుకున్నారు.

ఈ గ్రామం పరిసర గ్రామాలకు ఆదర్శగ్రామంగా మారింది. నిదానంగానైనా చుట్టుప్రక్కల గ్రామాలలోనూ ఈ విధంగా మార్పువస్తున్నట్టు మనం గుర్తించవచ్చు.

వాననీటి సంరక్షణ మరియు భూగర్భజలాల రీఛార్జిద్వారా తాగునీటి భద్రత

మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలోని దాతియా పంచాయతీ సమితిలోని హమీర్ పూర్ అనే గ్రామంలో జనాభా సంఖ్య 641. వీరిలో ఎక్కువమంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఉండే ఈ గ్రామం అస్తవ్యస్త వర్షపాతం కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని, కరవు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఏడాదికి 100రోజులు(సగటున 740 మి.మి.) కనీసం వర్షాలు పడుతుండగా, ఇప్పుడు సంవత్సరానికి కేవలం 40రోజులు(340మి.మి.) మాత్రమే వర్షాలు పడుతున్నాయి.

స్థానికుల ప్రయత్నాలు

స్వజలధార కార్యక్రమం కింద గ్రామంలో తాగునీటి సరఫరా పథకం చేపట్టడానికి గ్రామము నీరు మరియు పారిశుధ్యసంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. దీనినే పేజల్ సమితి అనికూడా పిలుచుకుంటారు. ఈ పథకానికి గ్రామస్తులు తమ వంతుగా రు.40,000 సేకరించారు. అయితే పథకానికి అవసరమైన అనుమతులు సాధించలేకపోయారు. రోజులో ఎక్కువకాలం దూరప్రాంతాలనుంచి తాగునీటిని తెచ్చుకోవడానికే సరిపోతుండటంతో...ఒక వ్యవస్థీకృత తాగునీటి సరఫరా పథకం లేకుండా గ్రామంలో ఆర్ధికాభివృద్ధి వీలుకాదని గ్రామస్తులకు అర్ధమయింది.

కొత్త ఆలోచన

కొన్ని అంతర్గత సమావేశాల తర్వాత గ్రామస్తులు...ఇక తామే పూనుకుని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో భూగర్భజలాల స్థాయిని మెరుగుపరచడానికి, సమీప భవిష్యత్తులో నీటి సరఫరా పథకాన్ని విజయవంతంగా అమలుచేయడానికి ‘సమగ్ర నీటివనరుల నిర్వహణ’ను చేపట్టారు. వాననీటి సంరక్షణకు, రీఛార్జికి అన్ని ఇళ్ళలో వాననీటిసంరక్షణ గుంటలు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. పాడుబడిన ఊరబావుల్లో పూడికతీయడం, రీఛార్జిచేయడం, చెక్ డ్యాములు నిర్మించడం మొదలైనవి ఆ ప్రణాళికలో భాగం.

పాడుబడిన చేతిపంపు మరియు ఊరబావులను రీఛార్జి చేయుట

ఇళ్ళ నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి కావలసిన మట్టికోసం గ్రామం బయట గొయ్యి తవ్వడానికి ఒక స్థలాన్ని గుర్తించారు. చేతిపంపులు, భూగర్భజలాల రీఛార్జికోసం ఆ గొయ్యిని వాడాలని నిర్ణయించారు. ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖవారు గ్రామంలో ఒక చిన్న కందకంలాంటి ఆనకట్టను, ఇతర గ్రామాలలోని కాలువలపైన చెక్ డ్యాములను నిర్మించారు. దీనితో చెక్ డ్యాముకు పైనున్న చేతిపంపులన్నీ రీఛార్జి అయినాయి. వాననీటి సంరక్షణకోసం ఊరిలోని ఇళ్ళకప్పులమీద కొన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 75 ఇళ్ళలోనూ, పాఠశాలలోనూ, అంగన్ వాడీలోనూ ఇంటి కప్పులమీద పడే వాననీరు, కింద ఇసుక, కంకరరాళ్ళతో కూడిన గుంటల్లో పడేటట్లుగా పైపులు అమర్చారు. పర్హిత్ అనే ఒక స్వచ్చంద సేవాసంస్థ ఇంటికి రు.500చొప్పున ఇచ్చింది...మిగిలిన మొత్తం...రు.1000నుంచి రు.1200 లను లబ్దిదారులు సమకూర్చారు.

ఇళ్ళన్నిటికీ కనీస సురక్షిత తాగునీరు అందాలన్న హమీర్ పూర్ గ్రామస్తుల ప్రయత్నంతో...సమృద్ధిగా తాగునీరు అందుబాటులోకి వచ్చింది. సమగ్ర నీటి వనరుల నిర్వహణ పథకాన్ని చేపట్టడం, వాననీటి సంరక్షణకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం వలన ఇది సాధ్యమయింది. ఈ వినూత్న ప్రయోగం అద్భుతమైన ఫలితాలనిచ్చింది.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate