హోమ్ / శక్తి వనరులు / ఇంధన సముదాయము / ఎల్పిజి కనెక్షన్లలో పేరు మార్పు & క్రమబద్ధీకరణ విధానము
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఎల్పిజి కనెక్షన్లలో పేరు మార్పు & క్రమబద్ధీకరణ విధానము

ఎల్పిజి కనెక్షను క్రమబద్ధీకరణ

సిలిండర్ / లు, ప్రెషరు రెగ్యులేటరు మరియు CV స్వాధీనంలో ఉన్న అధీకృత కస్టమర్ ఆచూకీ అందుబాటులో ఉంది/లేదు.

 • పరికరాలు & ఎస్వీ కలిగిన వ్యక్తి పేరిట కనెక్షన్ బదిలీ చెయడానికి అసలు వినియోగదారు నుండి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. పంపిణీదారు దగ్గర అందుబాటులో ఉన్న సమ్మతి లేఖ ఫార్మాటులో అనుమతి లేఖను LPG పంపిణీదారుకు సమర్పంచాలి.
 • వాస్తవంగా కనెక్షన్ కలిగిన వ్యక్తి ఆయిల్ కంపెనీ కి ఆ బదిలీపై ఎలాంటి క్లెయిము చెయనని వాగ్దానాన్ని సమర్పిచాలి. దీనికి సంబంధించిన ఫార్మాటు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటుంది.
 • పంపిణీదారు రికార్డుల్లోని వివరాలను ధృవీకరిస్తాడు. అన్ని సక్రమంగా ఉంటే, అసలు ఎస్వీ హోల్డర్ పేరును తో TVని సిద్ధం చేస్తాడు. ఆయిల్ కంపెనీ గుర్తించిన వ్యక్తికి సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
 • పరికరాలు కలిగిన వ్యక్తినుంచి ఆసమయంలో ఉన్న రేటు ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ను సేకరిస్తారు  మరియు తాజా ఎస్వీ అతని / ఆమె పేరు పై జారీ చేస్తారు.
 • ఎస్వీ గాని పోతే ఎస్వీ పోయిందని ఒక స్వీయ ప్రకటన సమర్పంచాలి.

సరియైన పత్రాలు లేకుండా సిలిండర్లు మరియు ప్రెషరు రెగ్యులేటరు కలిగిన వ్యక్తి

 • సరియైన పత్రం (SV / DGCC) లేకుండా ఎల్పీజీ పరికరాలు కలిగిన వ్యక్తి స్వీయ ప్రకటన సమర్పించి అతకుముందు రేటుతో భద్రతా డిపాజిట్ను చెల్లించాలి.

ఎస్వీ హోల్డర్ మరణం కారణంగా కనెక్షన్ బదిలీ

 • దగ్గరి బంధువు ఎస్వీతో పాటు (i) మరణ సర్టిఫికెట్ (ii) చట్టపరమైన వారసులుల సర్టిఫికేట్లను అవసరమైన నమూనాలో సమర్పించాలి.
 • తాజా ఎస్వీ అసలు ఎస్వీ డిపాజిట్ల ఆధారంగా లబ్దిదారుని పేరుతో జారీ చేస్తారు

కస్టమర్ జీవించి ఉన్నప్పుడు వేరే కుటుంబ సభ్యుల పేరుపై మార్చటం

 • కుటుంబంలో ఎల్పిజి కనెక్షన్ బదిలీ (అనగా తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, సోదరి) చేసుకోవచ్చు.
 • నమోదిత వినియోగదారు కుటుంబ సభ్యుల పేరుపై మార్చడానికి లిఖిత పూర్వకంగా అప్లికేషను ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఫార్మాటు అందుబాటులో ఉంటుంది.
 • బదిలీ చేసుకొనే కుటుంబ సభ్యుడు ఆయిల్ కంపెనీ కి ఆ బదిలీపై ఎలాంటి క్లెయిము చెయనని వాగ్దానాన్ని సమర్పిచాలి. ఫార్మాటు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటుంది.
 • అసలు కనెక్షన్ను TV ద్వారా తొలగిస్తారు. తాజా ఎస్వీని లబ్దిదారుని పేరుపై జారీ చేస్తారు. పూర్వపు ఎస్వీ డిపాజిట్లపైనే దీనిని ఇస్తారు

గమనిక: పైన పేర్కొన్న క్రమబద్ధీకరణ/పేరు మార్పు సందర్భాల్లో గుర్తింపు & చిరునామా, కెవైసి రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్వీని డి-డుప్లికేషను పరిశీలన తర్వాత తయారు చేస్తారు.

మూలం : My LPG.in

3.05970149254
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు