హోమ్ / శక్తి వనరులు / ఇంధన సముదాయము / ఎల్పిజి (గ్యాస్) కనెక్షన్ల పోర్టబిలిటీ.
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎల్పిజి (గ్యాస్) కనెక్షన్ల పోర్టబిలిటీ.

పోర్టబిలిటీ అంటే ఏమిటి?

పోర్టబిలిటీ అంటే ఒక కస్టమర్ తన పంపిణీదారు సేవలతో అసంతృప్తి చెందితే ఇండియన్ ఆయిల్, HPC మరియు LPC పంపిణీదారు క్లస్టర్ లోని అతనికి/ఆమెకు ఇష్టమైన వేరే పంపిణీదారును ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల వినియోగదారులను వేరే దగ్గకు వెళ్ళకుండా ఉంచేందుకు పంపిణీదారులు మెరుగైన సేవలు అందిచడానికి ప్రయత్నిస్తారు. పోర్టల్ ద్వారా వినియోగదారు అతని/ఆమె అప్లికేషన్ పంపవలసి ఉంటుంది. తర్వాత ప్రస్తుత డిస్ట్రిబ్యూటర్ అనుమతి లేకుండా బదిలీ ప్రక్రియ స్వయంచాలకంగా జరుగుతుంది. తరువాత వినియోగదారు నిర్దేశించింది కాలంలో నూతన పంపిణీదారు వద్ద డాక్యుమెంటేషన్ను పూర్తిచేయవచ్చు. ఈ విధానం వలన వినియోగదారు బదిలీ అభ్యర్థనతో స్వయంగా పంపిణీదారు దగ్గరకు వెళ్ళ వలసిన అవసరం ఉండదు.

పద్ధతి

పోర్టబిలిటీ నమోదు కోసం, వినియోగదారులు ఈ క్రింది పద్ధతిని అనుసరించాలి:

  1. My LPG.in వెబ్ సైటుకు వెళ్ళి మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోండి.
  2. సైటులో నమోదు కాకపోతే నమోదు అవ్వండి.
  3. క్లస్టర్ లో అందుబాటులో ఉన్న పంపిణీదారుల రిఫిల్ డెలివరీ పరంగా వారి స్టార్ రేటింగ్ ను చూడండి. (5 స్టార్- చాలాబాగుంది, 4 స్టార్- బాగుంది, 3 స్టార్- సగటు, 2 స్టార్ సగటు కంటే తక్కువ మరియు 1 స్టార్ - బాగాలేదు).
  4. క్లస్టర్ నుండి మీ ఛాయిస్ పంపిణీదారును ఎంచుకోండి.
  5. అప్పుడు మీరు నమోదును నిర్ధారిస్తూ మరియు ప్రక్రియ యొక్క వివరాలు కనగిన ఒక ఇమెయిల్ అందుకుంటారు.
  6. ఇంట్రా-కంపెనీ (అదే కంపెనీ) పోర్టబిలిటీ అభ్యర్థన అయితే మీరు కేవలం ఇమెయిల్ కాపీతో కొత్త పంపిణీదారును సందర్శించి నమోదు కావచ్చు.
  7. ఇంటర్ కంపెనీ బదిలీ అయితే,  మీ దగ్గర ఉన్న పరికరాలు వేరే కంపెనీలతో సరిపోకపోవచ్చు. అందువల్ల మీరు ప్రస్తుత పంపిణీదారుకు సిలిండర్ మరియు ప్రెషరు రెగ్యులేటరును అప్పగించి బదిలీ మరియ రీఫండు  పత్రాలను పొందండి.  తరువాత అదే డిపాజిట్ చెల్లించి తిరిగి కనెక్షన్ను పొందడానికి ఎంపిక చేసుకున్న పంపిణీదారును కలవండి.
  8. పోర్టబిలిటీ పథకం కింద కనెక్షన్ బదిలీకి అదనపు సెక్యూరిటీ  డిపాజిట్ మరియు బదిలీ రుసుమును  వసూలు చేయరు.

ప్రోఆక్టివ్ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పద్ధతి వలన పోర్టబిలిటీ అభ్యర్థన వినియోగదారులకు ఎలాంచి అసౌకర్యం కలగకుండా ఎంపికచేసుకున్న పంపిణీదారుకు చేరే అవకాశం ఉంది.

మూలం: My LPG.in

2.99315068493
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు