హోమ్ / శక్తి వనరులు / ఇంధన సముదాయము / కొత్త ఎల్పిజి కనెక్షన్ ఎలా పొందాలి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కొత్త ఎల్పిజి కనెక్షన్ ఎలా పొందాలి

కొత్త ఎల్పిజి కనెక్షన్ గురించి వివరించడం జరిగింధి.

కొత్త ఎల్పిజి కనెక్షన్లు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆన్ డిమాండ్ లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కొత్త కనెక్షన్ కావాలంటే నమోదు చెసుకోవలసి ఉంటుంది

కొత్త ఎల్పిజి కనెక్షన్ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్.

చమురు మార్కెటింగ్ కంపెనీలు కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతిని అందిస్తున్నాయి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం క్రింది లింకులను ఉపయోగించండి.

  1. ఇడేన్ గ్యాస్ - http://indane.co.in/new_connection.php
  2. HP గ్యాస్ - http://dcms.hpcl.co.in/consumerportal/logging/securelogin.aspx
  3. భారత్ గ్యాస్-http://www.ebharatgas.com/pages/Customer_Console/New_Domestic_Connection.html

కావలసిన పత్రాలు

అవసరమైన పత్రాలు: గుర్తింపు పత్రము, నివాస చిరునామా రుజువు, నో యువర్ కస్టమర్ '(కెవైసి) ఫాము, మరియు మీ ఇంట్లో ఏ ఎల్పిజి/పైపు-సహజ వాయువు (PNG) కనెక్షన్ లేదు అని అఫిడవిట్ పత్రము.

కిందివాటిలో ఏదైనా గుర్తింపు మరియు నివాస రుజువులుగా ఆమోదించబడుతుంది.

గుర్తింపు పత్రము* నివాస పత్రము*
• ఆధార్ సంఖ్య (యుఐడి / ఈఐడి)
• పాస్ పోర్టు
• పాన్ కార్డ్
• ఓటరు ID కార్డ్
• కేంద్ర / రాష్ట్ర జారీ ID కార్డు
• డ్రైవింగ్ లైసెన్సు
• ఆధార్ (యుఐడి)
• డ్రైవింగ్ లైసెన్సు
• లీజు ఒప్పందం
• ఓటరు ID
• టెలిఫోన్ / విద్యుత్తు / నీటి బిల్లు
• పాస్పోర్ట్
• గెజిటెడ్ అధికారి ద్వారా ధృవీకరించిన స్వీయ ప్రకటన
• రేషన్ కార్డ్
• ఫ్లాట్ అలాట్మెంట్ / పొసెషన్ లేఖ
• గృహ నమోదు పత్రం
• ఎల్ఐసి పాలసీ
• బ్యాంకు / క్రెడిట్ కార్డు స్టేట్మెంట్

కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం, ఇసి చట్టం క్రింద వేరే ఏ ఇతర పత్రం లేదా ప్రక్రియ అడగవచ్చు. ఉదాహరణకు, కొన్ని రాష్ట్రాల్లో, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను పొందు పరచవలసిందిగా కోరవచ్చు. పైన తెలిపిన జాబిత కూలంకషం కాదు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, ఒక నమోదు / సూచన సంఖ్య వస్తుంది. వినియోగదారులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ / సూచన సంఖ్య ఉపయోగించి వారి రిజిస్ట్రేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. వినియోగదారులు అప్లికేషన్ను ప్రింటు తీసుకొని సంతకం చేసి సూచించిన పత్రాలు జతచేసి ఎల్పిజి డిస్ర్టిబ్యూటరు దగ్గరకు వెళ్ళవచ్చు.

కొత్త కనెక్షన్ కోసం సెక్యూరిటీ డిపాజిటు వివరాలు

సిలిండర్ మరియు దేశీయ ప్రెజర్ రెగ్యులేటర్ (డిపిఆర్) ల సెక్యూరిటీ డిపాజిట్లు ఈ క్రింద విధంగా ఉన్నాయి

సామగ్రి రకం రూపాయలలో డిపాజిట్ సొమ్ము
14.2 కేజీల సిలిండర్ (అన్ని రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలలో తప్ప) 1450/-
దేశీయ ప్రెజర్ రెగ్యులేటర్ (అన్ని రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలలో తప్ప) 150/-
14.2 కేజీల సిలిండర్ (ఈశాన్య రాష్ట్రాల కోసం) 1150/-
దేశీయ ప్రెజర్ రెగ్యులేటర్ (ఈశాన్య రాష్ట్రాల కోసం) 100/-
5 కేజీల. వంటగ్యాస్ సిలిండర్ (మొత్తం దేశం కోసం) 350/-

కొత్త కనెక్షన్ పొందేటప్పుడు పంపిణీదారు నుండి హాట్ ప్లేట్లు కొనటం తప్పనిసరా?

  • వినియోగదారులు హాట్ ప్లేట్లు (గ్యాస్ స్టవ్) లేదా ఇతర వస్తువులను పంపిణీదారు నుండి కొనడం తప్పనిసరి కాదు. ఐఎస్ఐ మార్క్ ను కలిగిన ఏ కంపనీ స్టవ్ అయినా వినియోగదారులు కొనవచ్చు.

కొత్త LPG కనెక్షన్ పొందిన తర్వాత పొందే పత్రాలు

  • అవసరమైన డిపాజిట్ చెల్లించిన తర్వాత, వినియోగదారులు సభ్యత్వ ఓచర్ [ఎస్వీ] పొందుతారు. దీనిని జాగ్రత్తగా ఉంచకోవాలి. పంపిణీదారు వినియోగదారునికి 'దేశీయ వినియోగదారుల గ్యాస్ కార్డ్' అని పిలిచే ఒక బుక్లెట్ ను ఇస్తారు. దీనీని బ్లూ బుక్ లేదా పాస్బుక్ అని కూడా పిలుస్తారు. దీనిలో LPG కనెక్షన్ వివరాలు, సరఫరా మరియు ఇతర సేవల వివరాలను పంపిణీదారు పోందు పరుస్తారు.
  • ఎస్వీ ఎక్కడైనా పోతే కస్టమరు తగిన వెళ కలిగిన కోర్టు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ దాఖలు చేసి కొత్తది పొందే అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర దీనికి సంబంధించిల ఫార్మాట్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు పైపు సహజ వాయువు (PNG) కస్టమర్ అయితె దయచేసి PNG వినియోగదారుల ఫార్మాటును ఉపయోగించండి

మూలం: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సైట్లు

3.03496503497
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు