অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇంధనం... ప్రగతికి మూలధనం

మనం శ్రమించాలంటే శక్తి అవసరం. ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి తగిన ఇంధనం కావాలి. పెట్రోల్‌ లేకపోతే బండి, బస్సూ ఏదీ కదలదు. విద్యుత్తు లేకపోతే టీవి, మిక్సీ, రిఫ్రిజిరేటర్‌, ఏవీ పనిచేయవు. ప్యూయల్‌ నిల్లరుుతే విమానం నేలమీద కూడా నడవదు. సిలిండర్‌లో గ్యాస్‌లేకపోతే గుెక్కడు కాఫీ కూడా వెచ్చబడదు. పత్రహరితం కరవైతే మెుక్కలు వాడిపోతారుు. వాటికదే ఇంథనం లాంటిది. ఇంధనం లేకపోతే ‘జగమే మాయ, బ్రతుేక లోయ’ అని పాడుకోవాల్సి వస్తుంది. దేశ ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి ఇంధన వనరులు ప్రధాన పాత్ర పోషిస్తారుు. ఇంధనం లేకపోతే బతుకు బండి ముందుకు సాగదు.

ప్రపంచ జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. జనాభా పెరుగుదలతో పాటు ఇంధన అవసరాలు పెరుగుతున్నారుు. విద్యుత్‌, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌లాంటి ఇంధన వనరులు మనకు రోజువారీ అవసరం. మన ఇళ్లలో వాడే దాదాపు అన్ని వస్తువులకు విద్యుత్‌ అవసరం. భూమి నుండి త్రవ్వితీస్తున్న శక్తి వనరులపైనే మనం పూర్తిగా ఆధారపడి ఉన్నాం. భూమిలో కొద్ది పరిమాణంలో ఉన్న ఈ నిల్వలన్నీ కొంతకాలం తర్వాత తరిగిపోతారుు. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి?... ఆర్థికపరమైన పెరుగుదల, పునర్నిర్మాణం రంగం ముఖ్యంగా ఇంధన రంగం పైనే ఆధారపడి ఉంది. ఆర్థిక రంగంలో సరళీకృత విధానాల ద్వారా ఇంధనం డిమాండ్‌ అధికమైంది. డిమాండ్‌, సప్లైల మధ్య సమన్వయం కోసం తీసుకున్న వివిధ రకాల వ్యూహాలతో ఇంధనాన్ని పరిరక్షించడమే తక్షణ కర్తవ్యంగా మారింది. నేడు ‘జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం’ కనుక ఇంథనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం గురించి తెలుసుకోవాల్సిందే.

ఇంథనం అంటే నేడు అత్యవసరం. అసలు వ్యర్థమైన ఖర్చులను ఎవరూ, ఎప్పుడూ ప్రోత్సహించరు. అందుకే ‘అడవి కాచిన వెన్నెల’, ‘బూడిదలో పోసిన పన్నీరు’ లాంటి సామె తలు పుట్టుకొచ్చాయేమో...? ఈ సామెతలు వృథా అయిపోవ డాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. ఇంథనాలను దుబారా చేస్తే డబ్బు దండగే కాకుండా అవి ఇంకెందరికో దొరక్కుండా పోయే అవకాశం ఉంది. ఇవి అమూల్యమైనవి. ఇంధన వనరులు తక్కు వ కనుక ఆచితూచి, ఆలోచించి ఉపయోగించడం మంచిది. ఇక ఇంధనాన్ని పొదుపు చేయమని చాటి చెప్పడానికే డిసెంబరు 14వ తేదీని జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంగా గుర్తించి, ఇంధన పొదుపు ఆవశ్యకతను చెబుతున్నాయి.

బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ

దేశంలో ఇంధన దుబారా తగ్గించి ఇంథన పొదుపును సాధించేం దుకు, ఇంధన సామర్థ్యాలను పెంచేందుకు విద్యుత్‌ మంత్రిత్వ శాఖ 2002లో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీని ఎనర్జీ కన్సర్‌ వేషన్‌ యాక్ట్‌(ఇసి) 2001 కింద స్థాపించారు. దేశం మొత్తం మీద ఇంధన సామర్థ్యం పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇంధన సామర్థ్యం అంటే విద్యుత్‌ ఉపయోగించి పనిచేయే పరిక రాలు. అంటే తక్కువ శక్తి ఎక్కువ పని సామర్థ్యాన్ని చూపే వస్తు వులను వాడాలి. ఏ విద్యుత్‌ ఉపకరణాలు కొన్నా 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్నదాన్నే కొనడం సౌర ధర్మం.

ఇంథనం పొదుపు అంటే?

వీలైనంత తక్కువ ఇంథనాన్ని ఉపయోగిస్తూ యథావిధిగా పని కొనసాగేలా చూడటమే. ఎక్కడా ఇంధనం వృథా కాకుండా జాగ్ర త్తపడాలి. సమర్థతను బట్టి తక్కువ ఇంధనంతో పని పూర్తి చేయొచ్చని ఎందరో రుజువు చేసి చూపుతున్నారు. ఇంధనాలు అమూల్యమైనవి. ఆ వనరులను కాపాడుకోవడం మన బాధ్యత. వృధాచేసినందువల్ల అటు డబ్బు దండగ. ఇదే వాతావరణ కాలుష్యం.ఇంధనాలను అతిగా ఖర్చుపెట్టడం వల్ల మొక్కలు, జంతులువులు, ఇతర సహజ వనరులన్నీ దెబ్బతింటాయి.

పునరుత్పత్తి కాని వనరులు

బొగ్గు, నూనె, సహజ వాయువు... వీటన్నిటినీ ఒక్కసారే వాడ గలం. ఇవి వేల ఏళ్ల క్రితం జీవించి అంతరించి పోయిన చెట్లు మొదలైన వాటి నుంటి భూగర్భంలో ఏర్పడిన శిలాజ ఇంధ నాలు. ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్న ఇంధన వనరులివే. ప్రపంచ బొగ్గు నిల్వలో 7 శాతం ఇండియాలో ఉంది. దేశంలో ఇంధనావసరాల్లో 50 శాతంపైగా బొగ్గువల్లే తీరుతుంది. అలాగే మన దేశంలో ప్రతి సంవత్సరం 114 మిలియన్‌ టన్నుల పెట్రో లియం ఉత్పత్తులు అవసర మవుతు న్నాయి. వీటిలో 75శాతం దిగుమతి చేసుకుంటున్నాం.

ఇంధనాల భవిష్యత్తు

ప్రపంచంలోని దేశాలన్నీ ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధన వన రులపైనే దృష్టి కేంద్రీకరించాయి. మనదేశంలో వీటి భవిష్యత్తుకి 3 ప్రధాన అడ్డంకులున్నాయి. ఇంధన కొరత, నీటి కొరత, విద్యుత్‌ కొరత. సంప్రదాయ ఇంధన వనరులు అంతిరించిపో తున్నాయి. పెట్రోలు ధర రోజురోజుకీ పెరిగిపోతుంది తప్ప తగ్గ దు. మనం వాడుతున్న రేటులో పెట్రోలు వాడుకుం టూ పోతే మరో 100 సంవత్సరాల్లో అంతా హరించుకుపోతుంది. ఇవి ఎక్కువగా లభించే మధ్య ఆసియామొత్తంపై అమె రికా కన్నేసి ఉంచగా... చైనా, సూడాన్‌, వెనిజులా దేశాలను మచ్చిక చేసు కోంటోంది. మన దేశం వీటిపై పెద్దగా ఆలోచిం చట్లేదు.

ఇక న్యూక్లియర్‌ విద్యుత్తును ప్రస్తుతం ఫిషన్‌ (విచ్ఛేదన) ప్రకారం తెచ్చుకుంటున్నాం. పరిశోధన జరిగితే భవిష్యత్తులో ప్యూజన్‌ (సమ్మేళనం) పద్ధతిలో కూడా తెచ్చుకోవచ్చు. ఇది పర్యావర ణానికి మరింత అణువైనది. ఇంధన వనరులు (హైడ్రోజన్‌ అణు వులు) ఎప్పటికీ తరగవు. ఇది పరిశోధనలోనే ఉంది. కానీ విజ యవంతమైతే ఇదొక అనంతమైన శక్తిగా మారనుంది. భారత్‌ లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా 1,83,000 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. సూర్యరశ్మిని సద్వినియోగం చేసు కుంటే ఇంధన వినియోగాన్ని 10శాతం మేర తగ్గించవచ్చు.

లాభం, నష్టం

  • పట్టణాల్లో సిగ్నల్స్‌ వద్ద వాహనాలు ఆపకపోవటం వల్ల ప్రతి సంవత్సరం 1994 కోట్ల రూపాయల ఇంధనం ఖర్చు అవుతుంది.
  • బొగ్గు ద్వారాఉత్పత్తి అయ్యే 70శాతం విద్యుత్‌ వల్ల వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ ఎక్కువగా విడుదల అవుతుంది.
  • 2011 నాటికి భూగోళ ఉష్ణోగ్రత 6.80 సెంటిగ్రేడ్‌ పెరిగింది.
  • 2020 నాటికి ఒక మిలియన్‌ వాహనాలకు హైడ్రోజన్‌ ఇంధనాన్ని సరఫరా చేసి 1000 మెగావాట్ల హైడ్రోజన్‌ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఎనర్జీ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది.

ఇంధనాలు

సూర్యుడు మనకు శక్తినిచ్చే ప్రాథమికశక్తి వనరు. ఇది మనకు ఏడాది పొడవునా ఉచితంగా లభించే సహజ వనరు. పుష్కలంగా దొరుకుతుంది. కాలుష్య రహితం. వాయు శక్తి... వీచేగాలి గాలిమరలోని బ్లేడులు తిరగడం వల్ల వాటికి కలిపి ఉన్న షాఫ్ట్‌ కదలిక వల్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. వీచేగాలి వల్ల ఇండియాలో 45 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగల అవకాశం ఉంది. ఇలా ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియాది 5వ స్థానం. ప్రస్తుతం మన దేశంలో వీటి వల్ల 1870 మెగావాట్లు ఉత్పత్తి చేస్తోంది. బయోమాస్‌... ఇది ఒక శక్తి వనరు. దేశ ఇంధన వినియోగంలో దీవి వాటా 30 శాతం. ఇది గ్రామీణ గృహావసరాల్లో దాదాపు 90 శాతం ఉంది.

బయోఇంధనాలు... వ్యవసాయ,ఆహార పదార్థాల ఉత్పత్తులు తయారయ్యే టైంలో వచ్చే వ్యర్థాల నుంచి ఉప ఉత్పత్తులుగా పెట్రోలియం తయారరవుతాయి. వీటిలో పెట్రోలియం లేకపోయినా... వాటిని ఏ మోతాదులోనైనా కలిపి ఒక బయో ఇంథన మిశ్రమం తయారు చేస్తారు. వీటిని డీజిల్‌ ఇంజన్‌ వంటి వాటిల్లో వాడుకోవచ్చు. జల... భూ ఉష్ణ శక్తి వనరులు... పారే నీరు, సముద్రపు అలలు శక్తి వనరులు. ఇటీవల నీటి శక్తిని వాడి విద్యుదీకరణ కాని గ్రామాలకు చిన్న నీటి శక్తి ప్రాజెక్టుల ద్వారా విద్యుత్‌ అందిస్తున్నారు. భూ ఉష్ణ శక్తి.... భూమి నుంచి పుట్టిన ఉష్ణ శక్తి భూమి నుంచి పుట్టిన ఉష్ణ శక్తి ప్రకృతిలోఉండే వేడి జలలు భూ ఉష్ణ శక్తి వనరుల ఉనికిని సూచిస్తాయి. ఇవి మన దేశంలో 300పైగానే ఉన్నాయి. వీటి నుంచి వచ్చే శక్తిని వాడుకలోకి ఇంకా తేవాల్సి ఉంది. అణుశక్తి... అణు విద్యుత్‌ ఉత్పత్తి ప్రక్రియలో కేవలం ఒకవిద్యుత్‌ కేంద్రంలో చాలా ఎక్కువ పరిమాణంలో విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమవుతుంది.

ఆధారము: సూర్య© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate