অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇంధనాన్ని రాష్ట్ర శక్తిగా మార్చడం

గుజరాత్ ప్రజలు కోరుకున్న పారదర్శకత, సామర్థ్యం వాస్తవ రూపం ధరించి వేగంగా, పారదర్శకంగా, భాగస్వామ్య స్ఫూర్తితో అందుతున్నాయి. ఇంధన శక్తి - విద్యుత్తు సహోత్తేజంగా మారి, శ్రీ నరేంద్ర మోడీ రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ వెలుగులతో నింపారు.

2000 నుంచి 2011 వరకు విద్యుత్తు అంతరాయాలు లేకుండా అందింది. 2012లో విద్యుత్ సామర్థ్యాన్ని 21000 మెగా వాట్స్‌గా అంచనా వేశారు. గుజరాత్ రాష్ట్రం దేశం మొత్తానికి ఎనర్జీ హబ్‌గా రూపుదిద్దుకుంది. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా సాధించ తలపెట్టిన ఉత్పత్తిలో మూడో వంతు లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్పత్తి చేయనుంది.

గుజరాత్‌లో మైలురాళ్లు దాటిన నాలుగు వనరులు

 • పవన విద్యుత్తు
 • సౌర విద్యుత్తు
 • విద్యుదుత్పత్తి
 • బయో ఎనర్జీ

గ్రామీణ ప్రాంతాలను సంపూర్ణంగా విద్యుదీకరించడానికి గుజరాత్ నాలుగు రకాల వ్యూహాన్ని అనుసరిస్తోంది. సుజలాం సుఫలాం, డ్రిప్ ఇర్రిగేషన్ పథకం, విద్యుత్తు ఆదాకు సామూహిక చైతన్య కార్యక్రమం, జ్యోతిగ్రామ్ యోజన (గ్రామీణ విద్యుదీకరణ పథకం).

దేశం విద్యుత్తు కొరతతో తల్లడిల్లుతుంటే గుజరాత్ విద్యుదుత్పత్తిలో మిగులును (600 మెగావాట్లు) సాధించింది. అందులో 220 మెగా‌వాట్లు తమిళనాడు రాష్ట్రానికి, 200 మెగా వాట్లు కర్ణాటక రాష్ట్రానికి పంపిణి చేస్తున్నారు. గ్రామీణ విద్యుదీకరణ విషయంలో గుజరాత్ ఇతర దేశాలకు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు పాఠాలు నేర్పుతుంది. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా గుజరాత్‌లో లోడ్ షెడ్డింగ్, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు గతకాలం మాటలు. కరెంట్ కోత లేకుండా గుజరాత్ నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తోంది.

ఇది శ్రీ నరేంద్ర మోడీ పురుడు పోసిన జ్యోతిగ్రామ్ పథకం ఫలితం. అది బహుముఖ ప్రయోజనాలను సాధించింది. జ్యోతిగ్రామ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటినీ ప్రభుత్వం వెలుగులతో నింపింది. జ్యోతిగ్రామ్ ప్రాజెక్టు ద్వారా గుజరాత్‌లోని 18,742 గ్రామాలకు, 9680 గ్రామ శివార్లకు 24×7 నిరంతరాయంగా మూడు ఫేజ్‌ల కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ ఒక్క ప్రభుత్వ పథకమే గ్రామీణ గుజరాత్ ఆర్థిక స్థితిలో, ప్రజల జీవన విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు గణనీయంగా తగ్గిపోయాయి. కొత్త రుర్బన్ (రూరల్ × అర్బన్) రూపుదిద్దుకుంటోంది. నగరాలు, గ్రామాల్లో ఇళ్లను, వాణిజ్య సంస్థలను, విద్యాసంస్థలను వంద శాతం విద్యుదీరకరించిన రాష్ట్రాల్లో గుజరాత్ మొదటిది. జ్యోతిగ్రామ్ సామాజిక - ఆర్థిక, విద్య రంగాల్లో విప్లవం తేవడానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది.

రాష్ట్రంలో ఉన్న 21 నదులు, 2.25 లక్షల నీటి కేంద్రాలు, ఆనకట్టలు, నీటి సరస్సులు, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నీటిని, విద్యుత్తును అందిస్తున్నాయి. విద్యుదుత్పత్తిలో గుజరాత్‌ను ప్రపంచపు పవర్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రధాన ఉత్పత్తికి సౌర విద్యుత్తు, బయోగ్యాస్, పవన విద్యుత్తు, సహజ వాయు ఆధారిత విద్యుత్తు వంటి పునరుత్పత్తి ఇంధనవనరులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కంకణబద్దులై ఉన్నారు.

గుజరాత్‌ను భారత ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్ది, తద్వారా విద్యుత్తు రంగంలో కాషాయ విప్లవానికి పునాదులు వేసేందుకు రూ. 1900 కోట్ల కేటాయించినందుకు ప్రభుత్వం భారత త్రివర్ణ పతాకకు సలాం చేస్తుంది. పాల ఉత్పత్తిలో సాధించిన శ్వేత విప్లవానికి, వ్యవసాయ రంగంలో సాధించిన హరితవిప్లవానికి ఇది తోడవుతుంది. విద్యుత్తు, పెట్రోకెమికల్స్ రంగానికి బడ్జెట్ చేర్పులు...

 • 18000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తిలో చరిత్ర సృష్టించింది. తద్వారా గుజరాత్‌లో ప్రస్తుత స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కన్నా 36 శాతం అంటే, 4742 మెగావాట్లు ఎక్కువ సాధించింది.
 • విద్యుత్ పంపిణీలో నాణ్యతను పెంచడానికి కొత్తగా 105 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రణాళిక
 • కిసాన్ హిట్ ఊర్జా శక్తి యోజన (ఖుషీ) ద్వారా రైతులకు సరిపడా వోల్టేజీతో విద్యుత్తును సరఫరా చేయడానికి రూ.248 కోట్ల కేటాయింపు.
 • 1382.91 కోట్ల రూపాయలతో 4822 సర్క్యూట్ కిలోమీటర్ల పొడవు ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ను ఏర్పాటు చేయడం

పరిశ్రమకు విద్యుత్తు కీలకమైంది. వాణిజ్య అవసరాలకు నిలకడైన రీతిలో ఉత్తమంగా విద్యుత్తును అందించడానికి ఉత్పత్తి, సరఫరా, పంపణీల్లో సరిపడే సామర్ధ్యం గల చర్యలకు పూనుకోవడం. అందుకు ఈ కింది చర్యలు తీసుకోవడం జరిగింది.

 • విద్యుచ్ఛక్తి చార్జీల నిర్ణయంలో హేతుబద్ధత
 • సంప్రదాయేతర ఇంధనవనరులను ప్రోత్సహించడం
 • విద్యుత్తు ఆదాపై దృష్టి కేంద్రీకరించడం
 • వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం

1000 వెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యాన్ని 34 జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టు డెవలపర్స్‌కు కేటాయించడం ద్వారా పునరుత్పత్తి ఇంధన రంగాన్ని, వాతావరణ మార్పుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

ఆధారం: నరెంద్రేమోది.ఇన్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate