హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / సంప్రదాయేతర ఇంధన వనరులు అవసరం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సంప్రదాయేతర ఇంధన వనరులు అవసరం

ప్రకృతి మానవులకి ఎంతో తోడ్పడుతున్నది. ప్రకృతి నుంచి మనకి బొగ్గు, గ్యాస్‌ చమురు మొదలైన ఇంధనాలు లభిస్తున్నాయి. వివిధ పద్ధతులద్వారా, శాస్త్రపరికరాల ద్వారా ఇంధనాలను వెలికితీసి విని యోగించుకొంటున్నాం.

ప్రకృతి మానవులకి ఎంతో తోడ్పడుతున్నది. ప్రకృతి నుంచి మనకి బొగ్గు, గ్యాస్‌ చమురు మొదలైన ఇంధనాలు లభిస్తున్నాయి. వివిధ పద్ధతులద్వారా, శాస్త్రపరికరాల ద్వారా ఇంధనాలను వెలికితీసి విని యోగించుకొంటున్నాం. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకి అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ ఇంధనాలు రాబోవు కాలానికి సరిపోలేవు.బొగ్గు, గ్యాస్‌, చమురుల ఉత్పత్తి తగ్గిపోతే అవి లభ్యం కాకపోతే తీవ్రైమన ప్రమాదం తప్పదు. మానవాళి మనుగడ కోసం ప్రత్యామ్నాయాలు అన్వేషించాలి. సంప్రదాయ ఇంధనాలుఅవసరాల్ని తీర్చలేకపోవచ్చు. ఎప్పుడో ఒకప్పుడుతీవ్రైమన సంక్షోభం ఏర్పడవచ్చు. పర్యావరణ కాలుష్యాన్ని సంప్రదాయేతల ఇంధనాలు కొంతవరకు తగ్గిస్తాయి. వీటిని సామాన్యజనం  ఉత్పత్తి చేసుకోవచ్చు.ఆర్థికంగా పెద్దభార మేమీకాదు. అవసరమైన పనికిరాని పదార్థాలతో ఇంధనవనరుల్ని తయారు చేసుకోవచ్చు. ఇంధన వనరులు శాశ్వ తాలు కావు. నిత్యం మనకు వంటకు అవసరమైన కలప, నేల బొగ్గు, విద్యుచ్ఛక్తికి వసరమైన నీటివనరులు, సహజవాయువు, పెట్రోలియం పదార్థాలు మొదలగునవి అన్నీ అపరిమితాలు. వీటికి ఇప్పటికీ కొరత ఏర్పడింది. మున్ముందు వీటికొరత మరింత పెరగగలదు. జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు కట్టినా నీరు లభ్యంకావడం లేదు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన నేలబొగ్గు సహజవాయువులు తరిగిపోతున్నాయి.ఈ పరిస్థితులలో అంతు లేని తరగని శక్తిగల సూర్యుని ఆశ్రయించక తప్పదు. సౌరశక్తిని మన అవసరాలకు వినియోగించే విధానాన్ని మనం నేడు అను భవిస్తున్నాం. సౌరశక్తి ప్రకృతి ప్రసాదించిన తరగనిశక్తి.ఈ శక్తిని నిల్వచేసి ఉపయోగించగలిగితే మానవాళి భవిష్యత్తు సుఖ ప్రదంగా ఉంటుంది. సౌరశక్తిని ఇంధనంగా మార్చుకోవటం వల్ల సోలార్‌ హీటర్‌, సోలార్‌ కుక్కర్‌ అనే గృహోపకరణాలు ప్రాచు ర్యంలోకి వచ్చాయి. సౌరశక్తిని ఉపయోగించి 22 మెగావాట్ల ఉత్పత్తి చేసే విద్యుత్‌ ఉత్పత్తికేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. సౌర శక్తి చౌకగా లభిస్తుంది. అందువల్ల సౌరశక్తితో వస్తూత్పత్తి చేస్తే ధరలు తగ్గే అవకాశముంది. సౌరశక్తిని ఉపయోగించి మారు మూల గ్రామాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే తీగెల ఖర్చులేకుండా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు. విద్యుత్‌ను చౌకగా ఉత్పత్తి చేస్తే విద్యుత్‌ లోటు తీరుతుంది.

బొగ్గు నీరు, సముద్ర తరంగాలు,గాలి, జలాశయాలు, అణు శక్తి నుండి కూడా విద్యుచ్ఛక్తినిఉత్పత్తి చేసి వినియోగించుకుంటు న్నారు. ఈనాడు భూమిని పట్టి పీడిస్తున్న వాతావరణ కాలుష్య సమస్య తీవ్రతరమవుతున్నది. ఈనాడు ప్రపంచదేశాలన్ని సౌర శక్తినిఉత్పత్తి చేసుకోవడానికి ముందుకొస్తున్నాయి. మనదేశంలో ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో సౌరవిద్యుత్‌తో దీపాలు వెలుగుతున్నాయి. చిన్న పరిశ్రమలు, చిన్నవాహనాలు నడుపు తున్నారు. వాయువుశక్తి గాలి నుండి ఏర్పడే శక్తి. గాలి ప్రవా హంవల్ల శక్తిని సమీకరించవచ్చు. వాయువుశక్తిని టర్బయిన్ల ద్వారా ఉపయోగిస్తూ విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. విదేశాలలో గాలిమరల ద్వారా విద్యుత్‌ను భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. గాలి మరల ద్వారా వాయుశక్తిని ఇంధనంగా వాడుకోవచ్చు. గుజరాత్‌ రాష్ట్రంలో గాలిటర్బయిన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తు న్నారు.సముద్ర తరంగాల నుంచి జలశక్తిని తయారు చేయ వచ్చు. ప్రస్తుతం నీటినుంచి ప్రాజెక్టులు కట్టి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. బయోగ్యాస్‌, గోబర్‌గ్యాస్‌ వంటివాటిని జీవ ఇంధ నాలు జీవరసాయన చర్యల వల్ల ఏర్పడే వాయువులు శక్తిని సమకూర్చుకొని ఇంధనాలుగా ఉపయోగపడతాయి.బయోగ్యాస్‌, గోబర్‌ గ్యాస్‌లు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. నిరుపయోగమైన వ్యర్థపదార్థాలలో ఈ ఇంధనాలను తయారు చేస్తారు. నేడు ప్రత్యామ్నాయ ఇంధనవనరులపై ప్రపంచదేశాలు ఉత్సుకత చూపిస్తున్నాయి. సౌరశక్తి వాయుశక్తి జల ప్రవాహశక్తి, భూగర్భ ఉష్ణశక్తి, జీవ ఇంధనాలు మొదలగు సంప్రదాయేతర ఇంధనాల అవసరం నేడు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. మొదట్లో కొన్ని అసౌకర్యాలు, ఆటంకాలు ఏర్పడిన వాటిని కాలక్రమేణా అధిగమించవచ్చు.

నేడు వాహనాలన్నింటికి ఇంధనాలుగాపెట్రోలు,డీజిల్‌ మొద లైనవి వాడుతున్నారు. దీనివల్ల ఇంధనాలన్నీ పొగరూపంలోకి మారి వాతావరణ కాలుష్యమేర్పడి అనేక రోగాలు జీవకోటిని పట్టిపీడిస్తున్నాయి. ఇరవై సంవత్సరాల తర్వాత భూగర్భంలో పెట్రోలు మొన్నగుఇంధనాలు ఉనికి ఉండదని ఇంధన సమస్య ఏర్పడుతుందని, శాస్త్రజ్ఞులు సౌరశక్తి వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. జపాన్‌ వంటి దేశాలలో సౌరశక్తి ఆధారంగా నడిచే వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఈ వాహనాలలో సౌరశక్తిని గ్రహించి నిలువ చేసుకొనే శక్తి గల బ్యాటరీలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో సౌరశక్తిని నిల్వ చేసుకొని కావాల్సినప్పుడు వినియోగించుకోవచ్చు. సౌరశక్తితో పనిచేయు కాలిక్యులేటర్లు నేడుపనిచేస్తున్నాయి. సూర్యుడు సహజంగా అందించే అధిక ఉష్ణంఎంతో శక్తివంతమైనది. ఈ సౌరశక్తితో అత్యంత ఆశ్చర్యకర పరిణామాలు సిద్ధించగలవనుటలో సందే హం లేదు. ప్రపంచంలోని ఇంధనాలు తరిగిపోయేకొద్దీ సౌర శక్తిని గూర్చిన ఆలోచనలు పెరిగాయి.ఇంధనయుగానికి అంత్య కాలం సమీపించింది. పెట్రోలు, డీజిల్‌ కిరోసిన్‌ బొగ్గు నిల్వలు క్రమేపి తగ్గిపోతున్నది. సూర్యశక్తితో అతిచౌకతో విద్యుచ్ఛక్తి తయారయితే యంత్రయుగానికి అంతం ఉండదు.

వంటగదికి సౌరశక్తిని సరఫరా చేసే పథకం విజయవంత మైనది. సౌరశక్తితో నడిచేకుంపటి తయారయింది.సోలార్‌ కుక్కర్‌తో వంటవేగవంతమైంది. వ్వయసాయరంగంలో పాల ప్రాజెక్టులలో శీతలీకరణ యంత్రములలో సౌరశక్తి వినియోగం అద్భుత ఫలితాలను సాధించింది.సౌరశక్తివలన ఇంధన కాలుష్య ప్రమాదం లేదు. ఇంధనం వనరులు పరి మితంగా ఉన్నాయి. కనుక సౌరశక్తిమనకు చౌక అయిన ఇంధనం కాగలదు. సౌర శక్తితో నడిచే విద్యుత్‌ కేంద్రాల స్థాపన పెరిగే సూచనలున్నాయి. ప్రకృతి చలనా నికి సౌరశక్తి అతి ప్రముఖమైన సాధనం. సౌరశక్తి వినియోగం వల్ల వాతావరణంలో కాలుష్యం ఏర్పడదు.అతితక్కువ ఖర్చుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసికోవచ్చు. ప్రమాదా లను నివారించవచ్చు. ఇంధన పొదుపు జరుగుతుంది. దేశప్ర గతి పుంజుకొం టుంది. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా గోబర్‌ గ్యాస్‌ను ఉత్పత్తి చేసారు. రైల్వేలకు ఇంధనం తగ్గించి ఎలక్ట్రిక్‌ రైళ్లను ఏర్పాటు చేసారు. ఇంధనాన్ని పొదుపుగా వాడే అలవా టును ప్రతిఒక్కరు అలవరుచుకోవాలి. ఇప్పటికీ మితిమిరిన ఈ ఇంధన వినియోగంవల్ల భూమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్‌పొరకు చిల్లులుపడి ప్రపంచానికి రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది. ఇంధన వినియోగానికి అడ్డు, అదుపులేకపోతే ఈ ప్రపంచ భవిష్యత్తు అంధకార బంధరమే. సౌరశక్తి విని యోగం ద్వారా జీవన ప్రమాణాన్ని పెంచవచ్చు. నిరుద్యోగ బాధ నుండి విముక్తి కలిగి పనిపాట్లు చేసుకొనే వీలుంటుంది. పారిశ్రామికంగా ప్రపంచ పురోగమిస్తుంది. మన దేశంలాంటి పేద దేశాలకు సౌరశక్తి వినియోగం ఒక వరంలాంటింది.

ప్రపంచంలో జనాభా కూడా అత్యధికంగా పెరుగుతుండటం వలన అవసరాలకు తగినంత సాంప్రదాయక ఇంధనాల ఉత్పత్తి జరగడం లేదు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంధనాల నిల్వలు భూమిలో పూర్తిగా అంతరించిపోయే ప్రమా దం పొంచివున్నది. సాంప్రదాయేతర ఇంధన వనరులను ఏర్ప రుచుకొనలేక పునరుదరించుకొనే చర్యలపై రాష్ట్రప్రభుత్వాలు తమ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరంఉంది. సౌరశక్తి చౌకగా లభిస్తుంది. దీనికి వ్యయం తక్కువ, లాభం ఎక్కువ. సౌరశక్తితో వస్తుత్పత్తి జరిగిన యెడల ధరలు తగ్గే అవకాశంఉంది. త్వరలో నూతన పరిశోధన వలన పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా మొదలగు వానికి కూడా సౌరశక్తి అందగలదని ఆశిద్దాం. వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనాసంస్థల్లో సౌరశక్తిని గూర్చి చురుకుగా పరిశోధనలు జరగాలి. సంప్రదాయేతర ఇంధనాలు మానవాళికి మహోపకరిగా తోడ్పడగలవు.

ఆధారము: వార్త

3.08771929825
D.Sampath Kumar May 16, 2015 04:27 PM

దాదాపు, 1981 సం. నుండి ఇప్పటి వరకు గ్రామాలలో సరిపోవు పశువులు ఉన్న రైతులకు, కుటుంబ తరహ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణము జరుగుతున్నది. దాదాపు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో 4 లక్షల కుటుంబ తరహ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణము జరిగినట్లు ఒక అంచనా . ఈ పధకము సజావుగా సాగుతున్నప్పటికి, చాల రకాలైన సామాజిక. సాంకేతిక అడ్డంకులు ఎదురుకోవడం జరిగింది. ఈ అమలు కాలములో కూదా పెద్ద తరహ అంటే సంస్థ గత ప్లాంట్ల నిర్మాణం భారి ఎత్తున జరిగిన ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. ప్రధానమైన కారణం, ప్లాంట్ నడవడానికి అవసరమైన పెండ భారి స్థాయిలో లభ్యత లేకపోవడం. కుటుంబ తరహ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణము చాలావరకు ఎల్ పి జి గ్యాస్ వినియోగం పైన ఒత్తిడి తగ్గించగలిగినా, కుటుంబ పరంగా వినియోగ నియమితికి పరిమితి అయ్యాయి. తదుపరి కాలములో, బయో గ్యాస్ ఉత్పత్తికి అనేక రకాల వ్యర్ధ జీవ పదార్ధాల వాడకం ప్రారంభం అయింది.
ఈ నేపధ్యములో, కేంద్ర ప్రభుత్వం ఇటివల కాలములో ప్రవేశ పెట్టిన బయో సి ఎన్ జి పధకం చాల ఉపయుక్తముగా ఉన్నది. దీని ద్వారా రోజుకు అంటే ఉదాహరణకు, 140 మీటర్ క్యూబ్ ప్లాంట్ ద్వారా 35 నుండి 40 బయో గ్యాస్ సిలిండర్లు తయారుచేసే అవకాశం ఉన్నది. గ్రామీణ స్థాయిలో దీని నిర్మించటం వలన వంటకు లేదా ఇతర ఇంధన అవసరాలకు 35 నుండి 40 బయో గ్యాస్ సిలిండర్లు ప్లాంట్ నుండి పొందవచ్చును. దీనికి కో ఫోమ అనే గడ్డిని కొన్ని ప్రక్రియల ద్వారా ప్లాంట్ నందు వాడవచ్చును. దీనికి దాదాపు రెండు కోట్లు ఖర్చు మరియు 40 నుంచి 60 లక్షలవరకు సబ్సిడీ సౌకర్యం ఉంది. ఇట్టి ప్లాంట్లు కూడా ప్రభుత్వ ఆర్ధిక సహకారంతో మండల స్థాయిలో ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది.

D.Sampath Kumar May 16, 2015 04:10 PM

ప్రస్తుతం అందరు, సోలార్ వ్యవసాయ పంప్ సెట్ గురించి ఆసక్తి చూపిస్తున్నారు, ప్రభుత్వము కూడా సోలార్ ఎనర్జీ అమలు చేయడం పట్ల చొరవ తీసుకుంటున్నది. కాని సోలార్ వ్యవసాయ పంప్ సెట్ ధరలు ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చినా కూడా రైతు తాహతుకు మించి ఉన్నాయి. సోలార్ వ్యవసాయ పంప్ సెట్ కొనుగోలు రైతుకు ఇంకా ఆర్ధిక భారాన్ని కలుగచేస్తుందని అనుకుంటున్నాం. ఈ విధముగా కాకుండా ప్రభుత్వము చొరవ తీసుకొని ప్రైవేటు రంగం కలుపుకొని, గ్రామాలలో ప్రస్తుతం విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గరలోనే , ఆ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల విద్యుత్ డిమాండ్ పరిగణనలోకి తీసుకొని, విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గరలోనే 1, లేదా 2,లేదా 3 మేఘ వాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎందుకు నిర్మాణము చేయకూడదు?. స్థాపించిన ఈ పవర్ ప్రాజెక్ట్ నుండి ఉత్పత్తి అయిన విద్యుత్ నేరుగా సబ్ స్టేషన్ కు చేర్చడం ద్వారా విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల విద్యుత్ డిమాండ్ తేలికగా తీర్చగలుగుతుంది. ఈ విధముగా చేసే అవకాశాలు ఉంటె, మీరు నిపుణులతో చర్చించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అమలు చేయగలితే, రైతులకు చాల ఉపకారం జరుగుతుంది. అందరు రైతులకు సోలార్ విద్యుత్ సరఫరా చేయగలుగుతాం. దీనిని మీ దృష్టికి తీసుకోనివస్తున్నాము.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు