హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / సహజ వనరులను రక్షించుకుందాం.
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సహజ వనరులను రక్షించుకుందాం.

సహజ వనరులను సంరక్షించుకునే రకరకాల పద్దతుల గురించి తెలుసుకుందాం.

లక్ష్యం

సహజ వనరులను సంరక్షించుకునే రకరకాల పద్దతుల గురించి తెలుసుకుందాం.

నేపథ్యం

మన సహజ వనరులు వేగంగా తరిగిపోతున్నాయి. కొన్ని అంశాల్లో నియంత్రణ కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది.

అందువల్ల వాటిని సంరక్షించడానికి కొన్ని

నిర్మాణాత్మక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

పద్ధతి

 1. మీ గ్రామం లేదా పట్టణం చుటుపక్కల ఉన్న రకరకాల వనరులను గుర్తించండి. వివిధ రకాల ఖనిజ వనరులు (ఇసుక, రాళ్ళు లోహాలు మొదలైనవి) ఆవాసాలు, అడవులు, ఆకురాలే అడవులు మొదలైనవి.
 2. మీరు గుర్తించిన వనరులను నమోదు చేసి తరగిపోయే మరియు ఎప్పటికి తరిగి పోని వనరులను గుర్తించండి.
 3. ప్రజలు ఏవిధంగా ఈ వనరులను వినియోగిస్తున్నారో తెలుసుకోండి.
 4. వనరులను ఎక్కువగా వెలికితీయడం వల్ల వృక్ష జంతుజాలంపై ఎటువంటి ప్రభావం ఉంటుందో పరిశీలించండి.
 5. ఆ ప్రాంత ప్రజలు వనరులను సంరక్షించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా తెలుసుకోండి? ఒకవేళ తీసుకుంటే అవి ఏమిటో కనుక్కోండి.
 6. అతిగా, విచక్షణారహితంగా వనరులను వినియోగించడానికి గల కారణాలు తెలుసుకోండి.

ముగింపు

పెట్రోలు, విద్యుత్ వినియోగంలో మనం ఎంతో జాగ్రత్తగా ముందుచూపుతో ఉండాలని భావిస్తుంటాం. వీటితోపాటు కొండలు, గుట్టలు, రాళ్ళు రప్పలు, వాగులు వంకలు, గనులు, అడవులు, ఇసుక తిన్నెలు ఇవన్నీ కూడా సహజవనరులే. వాటన్నింటిని రక్షించుకోడం మన బాధ్యత. బొగ్గు వంటి ఖనిజాలను తవ్వితియ్యడానికి అడవులను నరికివేస్తారు. నదులలోనుండి ఇసుకను తరలిస్తారు. రహదారులు, భవనాలు నిర్మాణం కోసం ఎన్నో చెట్లను కోల్పోతున్నాం. చెరువులు, కాలువలు ఆక్రమించి చదునుచేసి భవనాలు నిర్మిస్తున్నాం. కొండలను పిండిచేసి కంకర కుప్పలుగా మారుస్తున్నాం. నదీతీరాలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. అందువల్ల నదీ ప్రవాహాలు దారి మార్చుకుని ముంపుకు, వరదలకు కారణమవుతున్నాయి. వీటన్నింటిని మీరు ప్రశ్నించాలి. కారణాలను, పరిష్కారాలను ఆలోచించాలి.

మీ అధ్యయనం ఆధారంగా నివేదిక రూపొందించి పాఠశాల ప్రార్థనా సమావేశంలో, తరగతిగదిలో ప్రదర్శించండి.

తదుపరి చర్యలు

 1. సహజవనరుల సంరక్షణలపై చార్ట్ రూపొందించి ప్రదర్శించండి.
 2. సహజవనరుల సంరక్షణలపై సమాజాన్ని చైతన్యపరిచే రెండు పద్ధతులను సూచించండి.
 3. అడవులు, కొండప్రాంతాల్లో ఉన్న ఖనిజాలను తవ్వి తియ్యడం కోసం అడవుల్ని కొండల్నీ ధ్వసం చేయడం వల్ల పర్యావరణంపై కలిగే దుప్రభావాలు ఏమిటి?
 4. మీ ఊరిలో ఉన్న సహజవనరులు ఏమిటి?

అవి దుర్వినియోగం అవుతున్నట్లుగా మీరు గుర్తించారా ? వాటిని కాపాడుకోవడానికి మీరిచ్చే సూచనలేమిటివి ?

ఆధారము: http://apscert.gov.in/

3.04761904762
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు