హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / సోలార్ రూఫ్ టాప్ ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ఉపకరణములు (గ్రిడ్ అనుసంధానము)
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సోలార్ రూఫ్ టాప్ ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ఉపకరణములు (గ్రిడ్ అనుసంధానము)

సోలార్ రూఫ్ టాప్ ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ఉపకరణములు (గ్రిడ్ అనుసంధానము).

భవనాల కప్పలు, భవనాలు చుట్టూ నిరుపయెగంగా ఉన్న ఖాళీ స్ధలాలలో సోలార్ రూఫ్ టాప్ ఫోటో వోల్టాయిక్ విద్యుత్ ఉపకరణములు ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ను ఉత్పత్తిచేయడానికి అవకాశం ఉంది. ఈ రకమైన ఉపకరణాలు స్ధాపన చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ ను అవే భవనాలకు, గృహాలకు వినియెగం చేసుకొనవచ్చును. ఒకవేళ మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉన్నచో దానిని గ్రిడ్ కు పంపవచ్చును. విద్యుత్ పంపిణి సంస్ధలు వినియేగదారులకు గ్రిడ్ కు అనుసంధానించడానికి మరియు నెట్ మీటరింగ్ సౌకర్యానికి అనుమతినిస్తున్నాయి.

గ్రిడ్ ఇంటరాక్టిన్ పై కప్పు లేదా చిన్న SPV పవర్  ప్లంట్ లో, SPV ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయిన DC శక్తి, పవర్ కండిషనింగ్ యానిటీ ద్వారా AC శక్తి గా మార్చబడి, గ్రిడ్ కు అనుసంధానింపబడుతుంది. పగటి వేళలలో ఉత్పత్తి అయిన విద్యుత్ ని పూర్తి ఉపయెగించుకుంటూ, అధికముగా ఉన్న విద్యుత్ ను గ్రిడ్ లభ్యతను బట్టి గ్రిడ్ కు అనుసంధానించవచ్చును. ఆకాశము మేషవృతమైనపుడు / రాత్రి సమయాలలో సౌరశక్తి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ వినియేగమునకు సరిపోనియెడం, గ్రిడ్ విద్యుత్ ను వాడుకొనవచ్చును. గ్రిడ్ రూప్ టాప్ సోలార్ సిస్టమ్ నెట్ మీటరింగ్ విధానంలో పనిచేస్తుంది. తద్వారా లబ్ధిదారుడు నెట్ మీటరింగ్ ఆధారంగా వాడిన విద్యుత్ కు మాత్రమే బిల్లును చెల్లిస్తారు.

ప్రయెజనాలు

 • విద్యుత్ ఉత్పత్తి కోసం ఖాళీగా ఉన్న పై కప్పు వినియెగించుకోవచ్చును.
 • స్వీయ వినియెగం కొరకు విద్యుత్ ఉత్పత్త చేసుకుంటూ, అధికముగా ఉన్న విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానించవచ్చు.
 • నెలవారీ ప్రాతిపదికన గ్రిడ్ అనుసంధాన మిగులు శక్తి యెక్క సెటిల్ మెంటకు అవకాశం.
 • APERC ద్వారా నిర్ణయంచుబడిన ధర ప్రకారము, అదనపు విద్యుత్ కోసం డిస్కమ్ ల ద్వారా పైకం చెల్లించేందుకు పరిగణలోకి తీసుకోబడుతుంది.
 • పర్యావరణ మిత్ర గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన.
 • బ్యాక్ అప్ వినియెగిస్తున్న చోట డీజిల్ వినియెగంలో తగ్గుదల.
 • భారత, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాల నుండి క్యాపిటల్ సబ్సిడీలు .

అవసరాలు

 • 1 KW లు సిస్టమ్ స్ధాపించుటకొరకు కనీసం 10 చ. మీ. లేదా 100 చ. అడుగుల ఖాళీ పై కప్పు అవసరం.
 • నిబంధనల సమసరించి తప్పనిసరియైన ముందు జాగ్రత్త పరికరాలు బిగించుకోవాలి.
 • ఎగుమతి / దిగుమతి కొరకు ద్విదిశాత్మక మీటర్లు బిగించాలి.
 • MNRE / CEA / DISCOM నిబంధనల మేరకు ప్రామాణిక పరికరాలు మాత్రమే బిగించవలసి వుంటుంది.
 • టర్న్ కి విధానము అమలు చేయుచున్న విక్రేత MNRE యెక్క ఛానల్ పార్టనర్ / NREDCAP వారి చే ఆముదము పొందిన తయారీదారు / సరఫరాదారు / సిస్టం ఇంటిగ్రేటర్ అయివుండాలి.

ప్రోత్సాహకాలు

 • కిలోవాట్ పవర్ కు గాను నిర్దేశించిన అర్హత ప్రాధాన్యాలను అనుసరించి, సిస్టమ్ యెక్క మొత్తము వ్యయమునందు 30% రూ 22,500/- గరిష్టముగా మించకుండా, కేంద్ర ఆర్ధిక సహాయము ఎమ్ ఎన్ ఆర్ ఇ, న్యూఢిల్లీ వారు ఏర్పాటు చేయుచున్నారు. ఆ ఆర్ధిక సహాయము నివాస గృహములకు మరియు సంస్ధల (ఆసుపత్రులు, విద్య సంస్ధలు, మొదలగునవి) పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, విద్య సంస్ధలు, కమ్యూనిటీ భవనాలు, సంశిమ సంస్ధలు / గృహాలు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు, చేతి వృత్తుల / బొమ్మల తయారీ దారుల వర్క్ షావూలు, సాధారణ సేవా సంస్ధలు, కమ్యూనిటీ సౌకర్యాలు ఏర్పాటు చేయువారు / ధార్మిక సంస్ధలు / ట్రస్టులు / ప్రభుత్వేతర సంస్ధలు / స్వచ్ఛంద సేవా సంస్ధలు / శిక్షణ సంస్ధలు ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ సంస్ధలు, ప్రజోపయేగ సంస్ధలు  (పి.ఎస్.యులు) ప్రయివేట్, వాణిజ్య / వ్యాపార సంస్ధలు తప్ప. ఇతర సాధారణ ప్రజల ప్రయేజనములకు పాటుబడు సంస్ధలు (లభేతర సంస్ధలు) ఎమ్.ఎన్.ఆర్.ఇ. సబ్బిడీని పొందుటకు అర్హత కలిగి ఉన్నారు.
 • గృహ సంబంధ రంగమునందు 1 కిలోవాట్ సామర్ధ్యము వరకు స్ధావన చేయబడు రూప్  టాప్ సిస్టమ్స్ కు కిల్ వార్ పవర్ కు గాను రాష్ట్ర ప్రభుత్వము 20% సబ్సిడీ రూపాయలు 15,000/- గరిష్టముగా మించకుండా ఏర్పాటుచేయచున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీకి  అదనంగా ఇవ్వబడుచున్నది, నెడ్ క్యాప్ సంస్ధ ప్రభుత్వ బావనములనందు స్ధాపన చేయబడు రూప్ టాప్ సిస్టమ్స్ కు కిలోవర్ పవర్ కు గాను 20% సబ్సిడీని రూ. 15,000/- గరిష్టముగా మించకుండా ఏర్పాటుచేయచున్నది.
 • వినియేగదారులు / లబ్బిదారులు ఏ పి డిస్కమ్ వారికీ విద్యుత్ ఉత్పత్తిని అమ్ముకొనుటకుగాను నెట్ లేదా గ్రాస్ విధానమును ఎంపిక చేసుకొనుటకు స్వేచ్ఛ కలిగి ఉన్నారు మరియు ఈ విధముగా అమ్ముకొను ఉత్పత్తికిగాను వర్తింపచేయబడు ధరలను (టారిఫ్), ప్రతి సంవత్సరము ఏ పి ఇ ఆర్ సి వారు నిర్ణయంచిన ప్రకారము చెల్లించబడుతుంది.
 • 1000 కిలోవాట్ పవర్ సామర్యదము కలిగిన సిస్టమ్స్ వరకు అనుమతించబడును.
 • వ్యక్తల సమూహము / సంఘుముల చేత స్ధాపన చేయబడు సోలార్ పవర్ పోజెక్ట్స్ అనుమథించబడును మరియు ఇట్టి సిస్టమ్స్ ఉత్పత్తిని సంఘుములో గల నివాసముల / మరియు వ్యక్తుల నివాసముల సాముఖ్యక ఉత్పత్తిగా గణనలోనికి తీసుకొనబడును.

స్ధాపనకు విధి విధానాలు

 • ఆసక్తి కలిగిన వినియెగదారులు / లబ్ధిదారులు పూర్తి సమాచారము కొరకు మరియు దరఖాస్తు ఫారము పొందుటకుగాను, నెడ్ క్యాప్ జిల్లా కార్యాలయములను లేదా డిఇ / ఏడిఇ / ఏపి డిస్కమ్ / డిస్కమ్ యెక్క ఆన్ లైన్ సేవా కేంద్రములను లేదా నెడ్ క్యాప్ సంస్ధ సిస్టమ్స్ ను స్ధాపన చేయుటకు ఆమెదించి నందుడు చేసుకొన్నా వ్యక్తులను సంప్రదించచ్చును .
 • వినియెగదారులు / లబ్ధిదారులు నిర్దేశిత దరఖాస్తు పారములను తగు సమాచారము / పత్రములను జతచేయుచు, వారు కోరుచున్న వోల్టేజి మరియు సామర్ధ్యము కలిగివున్న గ్రిడ్ అనుసంధానము కలిగిన రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేయుటకు సమర్చించవచ్చును. వినియెగాదరాలు / లబ్ధిదారులు నెట్ లేదా గ్రాస్ విధానమును ఎంపిక చేసుకోమటకు స్వేచ్ఛ కలిగి ఉన్నారు. దరఖాస్తులను రూ. 25/- చెల్లించి సమర్పించాలి. అర్హత కలిగిన దేవాలవర్లు / సంఘుములు / వ్యక్తుల సమహముల ఆన్ లైన్ ద్వారా లేదా నగదు చెల్లింపు చేయుట ద్వారా దరఖాస్తులను చేయవచ్చును. సింగల్ ఫేజ్ సేవల విధానము ద్వారా గరిష్టముగా స్ధాపన చేయుటకు అనుమతించబడిన సామర్ధ్యము 3 కిలోవాట్ పవర్ మరియు ఎల్ టి క్యాటగిరినందు క్రైందా అనుమథించబడిన సోలార్ ఫోటో వోల్టాయిక్ ఫ్లాంటి స్ధాపన గరిష్ట సామర్ధ్యము 56 కిల్ వాట్ పవర్ గా ఉన్నవి.
 • దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి 7 రోజులలోపు, డిస్కమ్ స్ధలమును తనిఖీ లేదా పర్యవేక్షణ చేయుట ద్వారా సోలార్ ఫ్లంట్ స్ధాపన చేయుటకు సానుకూల స్ధతిని అనుసరించి ఆమెదింతురు. ఇట్టి ఆముదము స్ధలమునందు స్ధాపనచేయుబడుటకుగల సానుకూలతలు లోబడి ఉండును డిస్కమ్ వారి పద్దనుండి 7 రోజుల్లోపు ఎట్టి సమాచారము పొండనిచో, మీ దరఖాస్తు ఆమెదింపబడినట్టు భావించవలెను.
 • నిర్దేశించిన నమునందు, వినియెగదారుడు డిస్కమ్ తో ఒప్పందమును చేసుకొనవలెను.
 • డిస్కమ్ వారిచేత ఇవ్వబడుచున్న ఈ ఆముదము గరిష్ట సోలార్ ఫోటో వోల్టాయిక్ ఫ్లంట్ స్దపన చేయుటకు వర్తించును మరియు ఈ ఆమెదము ఇవ్వబడిన తేదినుండి 3 నెలల వరకు చలామణిలో ఉండును.
 • వినియెగదారులు నెడ్ క్యాప్ సంస్ధ సిస్టమ్స్ ను స్ధాపన చేయుటకు ఆమెదించి నమ్మడు చేసుకున్న సంస్ధల ద్వారా చేపట్టవచ్చును. ఈ విధముగా స్ధాపన చేయబడిన సిస్టమ్స్ ను తనిఖీచేయవలసినదిగా డిస్కమ్ వారిని మూడు నెలలోగా కొరవలసివుండును.
 • సోలార్ ఫోటో వోల్టాయిక్ ఫ్మట్ల స్ధాపన ఉపకరణాలు తనిఖీ చేసిన తదుపరి 7 రోజులలోగా గ్రిడ్ కు అనుసంధానము చేయబడును.
 • గ్రిడ్ కు అనుసంధానము చేయబడిన తదుపరి, డిస్కమ్ సిబ్బంది వారు తనిఖీ నిర్వహించి ద్విదిశాత్మక మీటర్లను ఏర్పాటు చేస్తారు.
 • నెడ్ క్యాప్ సంస్ధ, అర్హత ప్రాధాన్యతలను బట్టి, ఎమ్ ఎన్ ఆర్ ఇ మరియు రాష్ట్ర ప్రభుత్వము యెక్క సబ్సిడీలను విడుదలచేయుటకు అధికారమివ్వబడిన సంస్ధ, కనుక వినియెగదారులు దరఖాస్తు ఫారములను అవసరమయిన సమాచారంతో నెడ్ క్యాప్ కార్యాలయమానందు నమర్పించవలసివండాను.

బిల్లింగ్ చేయుట మరియు చెల్లింపులు

ఎనర్జీ బిల్లిల చెల్లింపు నెలవారీ ప్రాతిపదికన చేయబడును. సోలార్ రూప్ టాప్ ప్రాజెక్ట్ స్ధావన చేసుకోను వ్యక్తుల సమహములు / సంఘుముల యెక్క ఉత్పత్తిని సామూహికంగా భావించి వ్యక్తుల సమహముల / సంఘముల యెక్క గృహములకు సరఫరా చేయబడునదిగా పరిగణనలోనికి తీసుకొనబడును. బహుళ అంతస్ధుల గృహాలు / గృహసముదాయములు ఉండు సందర్భములో నెట్ మీటరింగ్ కు గాను కామన్ మీటరు నీవియెగించవచ్చును. దరఖాస్తును సమర్పించనపుడు డెవలపర్ / వినియెగదారుడు నెట్ మీటరింగ్ లేదు గ్రాస్ మీటరింగ్ ను ఎంపిక చేసుకొనుటను గమనించవలెను.

నెట్ మీటరింగ్

ప్రతి నెల డెవలపర్ / వినియెగదారుడు డిస్కమ్ నుండి వినియెగాము చేయు విద్యుత్ యూనిట్లను స్ధాపన చేయబడిన సోలార్ రూప్ టాప్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యత్ కు సర్దుబాటు చేసుకొనవలెను. వ్యక్తుల సమహము / సంఘుముల విషయములో స్ధాపన చేయబడిన ఉత్పత్తిని సోలార్ రూప్ టాప్ ప్రాజెక్ట్ సామర్ధ్యము ప్రకారము ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు సోలార్ రూప్ టాప్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ యూనిట్లతో సర్దుబాటు చేయవలెను.

 • నర్థుబాటు చేయబడిన తదుపరి మిగులు ఉత్పత్తిని గ్రిడ్ నెట్ వర్క కు అనుసంధానము చేయబడును. ఇట్టి ప్రకిరాయ బిల్లింగ్ ప్రతినెల చేయబడునపుడు తీసుకొనబడి ప్రతినెలయందు ఈ విధముగా ఉండు మిగులు ఉత్పత్తిని ప్రతి త్రైమాసిక ముగింపునందు సరాసరి వ్యయము ప్రాతిపదికన ఏపీ ఇ ఆర్ సి ఎప్పటికప్పడు నిర్ణయంచిన ధర ప్రకారము లెక్కించి పరిష్కరించబడును.
 • నర్థుబాటు చేయబడిన తదుపరి కనుకొనబడిన హెచ్చు వినియెగాము నెట్ ఎనర్జీ యెక్క దేవలావర్ / సమూహము / సంగుము వర్తింపు చేయబడు టారిఫ్ ప్రకారము చెల్లింపు చేయవలెను.

గ్రాస్ మీటరింగ్

గ్రాస్ మీటరింగ్ కు సంబంధించి డెవలపర్ / వినియెగదారుడు ప్రతినెల వినియెగాము చేసిన విద్యుత్ యానిటీలకు గాను బిల్లు ప్రకారం చెల్లింపు చేయవలెను మరియు ఏపీ డిస్కమ్ వారికి సోలార్ ఫోటో వోల్టాయిక్ రూప్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ సరఫరా చేసినందుకు గాను ఎ.పి.ఇ.ఆర్.సి. నిర్ధారించిన ధర ప్రకారం చెల్లింపు పొందుదురు.

నెడ్ క్యాప్ సంస్ధ గుర్తించిన / నమెదు చేసుకున్న సరఫరాచారుల పని - పరిధి

 • సరఫరాదారుల పనినందు సోలార్ ఫోటో వాల్టాయిక్ రూప్ టాప్ ప్రాజెక్టు యెక్క డిజైన్, సరఫరా మరియు ప్రాజెక్ట్ యెక్క నిర్మాణము మరియు పని చేయించుట మొదలగునవి కలిసి ఉండును ఇవన్నియు ఇవ్వబడిన సాంకేతిక ప్రమాణాలతో చేయవలయాను.
 • దీని ధర లేదా ఖరీదు అన్నిరకముల పన్నులను, సుంకములను, ప్యాకింగ్ మరియు రవాణా చార్జీలను కలుపుకొనివుండును.
 • వినియేగదారు ఏపీ డిస్కమ్ కు చెల్లింపు చేయవలసిన ప్రక్రియ రుసుము మరియు బై డైరెక్షనల్ మీటర్ ఖర్చును భరించవలయును, అవసరమయిన విధముగా CEIG తనిఖీరుసుము మరియు స్ధలము వద్ద ఇతర అదనముగా ఖర్చు కబడునవి వినియెగదారుడు భరించవలెను.
 • సోలార్ ఫోటో వోల్టాయిక్ రూప్ టాప్ ప్రాజెక్టు యెక్క వైరింగ్ బోర్డు వరకు సరఫరాదారుడు చేయను, గరిష్టముగా 25 మీటర్లు వరకు వైరింగ్ చేయుట ఇవ్వబడిన పనినందు కలిసివుండును. దీనికి అదనముగా ఏర్పాటు చేయబడు వైరింగ్ కొనుకోలు దారుడు భరించలేను.
 • RCC రూప్ విషయములో మాయంటింగ్ స్ట్రక్చర్ సరఫరాదారుడు చేయవలెను. రూప్ ప్లేట్ కానపుడు మరియు అదనముగా మంటింగ్ స్ట్రక్చర్ కావలిసినవుడు, వినియెగదారుడు ఇట్టి అదనపు ఖర్చును భరించవలెను.
 • పూర్తి సిస్టమ్ యెక్క పనితీరును పరిశించవలెను.
 • వారంటీ కాలమునందు ఇచ్చుటకు అంగీకరించిన విడిభాగములను సరఫరాదారుడు ప్రాజెక్ట్ నిర్వహించుకొనుటకుగాను ఇవ్వవలెను.
 • ప్రతి కొనుగోలు దారునికి / వినియేగదారునికి సేవా కేంద్రముల వికారములు తెలుపు కారపత్రము ఇవ్వవలెను.
 • సమీకృత నిర్వహణ చార్జీలు 5 సంవత్సరముల తర్వాత చెల్లించవలసిన విషయము ఐచ్చికము.
 • ఒక వేళా ప్రాజెక్టు వారింటి కాలమందు నిర్వహణ మరియు ఉపయెగ సందర్భంలో అసంతృప్తికరమైన పనితీరు ఉన్నయెడల అవసరమయిన మరమ్మత్తులు లేదా అవసరమయిన విడి భాగములను మార్పు చేయట సరఫరా దారుడు చేయవలెను.
 • వినియెగదారుని ప్రమాణ పత్ర ఆధారముగా మరియు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గ దర్శకాలననుసరించి సబ్సిడీని సరఫరాదారునికి లేదా వినియేగదారునికి విడుదల చేయబడును.

ఆధారం : ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్ధ లిమిటెడ్ (NREDCAP)

3.14285714286
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు