హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / సౌర శక్తిని వినియోగిద్దాం- విద్యుత్తును కాపాడదాం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సౌర శక్తిని వినియోగిద్దాం- విద్యుత్తును కాపాడదాం

సౌరశక్తి సహజమైన ఉత్తమమైన తరిగిపోని శక్తి వనరు. ఎంత వాడినా తరగిపోనిది, అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండేది. సౌరశక్తిని సాంప్రదాయ ఇంధన వనరులకు ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లక్ష్యం

 1. సౌరశక్తిని వినియోగించడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
 2. సౌరశక్తితో పనిచేసే ఉత్పత్తులను గురించిన సమాచారాన్ని సేకరిద్దాం.

నేపథ్యం

సౌరశక్తి సహజమైన ఉత్తమమైన తరిగిపోని శక్తి వనరు. ఎంత వాడినా తరగిపోనిది, అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండేది. సౌరశక్తిని సాంప్రదాయ ఇంధన వనరులకు ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో వ్యవసాయం, గృహోపకరణాలు, కార్యాలయాలు, పరిశ్రమలు, వాహనాలు మొదలగు రంగాలలో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. మన దేశంలో గుజరాత్ సౌరశక్తి వినియోగంలో ముందంజలో ఉండగా కర్ణాటక, తమిళనాడు తరువాత స్థానంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో సౌరశక్తి వినియోగం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నది. కనుక సౌరశక్తిని ఎన్ని రకాలుగా, ఏవిధంగా ఉపయోగించవచ్చు. సౌరశక్తితో పనిచేస్తున్న ఉత్పత్తులేమిటి మున్నగు అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పద్ధతి

 1. సౌరశక్తి వినియోగం మరియు సౌరశక్తితో పనిచేసే ఉత్పత్తులను గురించిన సమాచారాన్ని గ్రంథాలయ పుస్తకాలు, పత్రికలు, సైన్స్ మ్యాగజైన్స్, ఇంటర్నెట్ లేదా సౌరశక్తి వినియోగిస్తున్న వారిని కలిసి సేకరించండి. బొమ్మలు, ఫొటోలు తీసుకోండి.
 2. సౌర శక్తితో పనిచేసే ఉత్పత్తులకు, విద్యుత్తు ఉపకరణాలకు గల వ్యత్యాసాన్ని పరిశీలించండి.

ముగింపు

ఈ క్రింది పనులను ఇంటిలో చేయగలం

 • ఇంట్లోని గోడలకు లేతరంగులనే ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ముదురు రంగులు ఎక్కువ కాంతిని శోషిస్తాయి. కాబట్టి వెలుతురు కోసం ఎక్కువ విద్యుత్ బల్బులను ఉపయోగించవలసి ఉంటుంది.
 • ఆహారపదార్థాలను వేడిగా కాకుండా, చల్లారిన తరువాత మాత్రమే ప్రిజ్ లో  పెట్టాలి.
 • మామూలు విద్యుత్ బల్బుల స్థానంలో కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లాంపులను వాడాలి. ఎందుకంటే ఇవి శక్తిని తక్కువ వినియోగించటమే కాకుండా తక్కువ వేడిని వెలువరుస్తాయి.
 • ప్రతిభావంతంగా శక్తిని ఆదా చేయుటకోసం విద్యుత్‌కు పొదుపు చేసే శక్తిగల స్టార్లున్న గృహెూపకరణాలవే కొనాలి.
 • అవసరాన్ని మించి ఫ్రిజ్ డోర్‌ను తెరవకూడదు.
 • నీటిని వేడిచేసే హీటర్‌ను తక్కువ ఉపయోగించాలి.
 • ఇంటి చుట్టూ కిటికీల వద్ద నీడనిచ్చే చెట్లను, మొక్కలను పెంచడం వలన ఇంటిని చల్లగా ఉంచుకొని తద్వారా విద్యుత్ పొదుపు చేయవచ్చు.
 • ఒక గదినుండి వెళ్ళే ప్రతిసారి లైట్, ఫ్యాన్ మొదలైన విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం అలవాటు చేసుకోవాలి.
 • సోలార్ వాటర్ హీటర్‌ను ఉపయోగించడం ద్వారా గ్యాసు, విద్యుత్‌ను పొదుపుచేయడమే కాకుండా వాతావరణంలోనికి విడుదలయ్యే కాలుష్య కారకాలను తగ్గించినవారమవుతాం.

అవసరం మేరకే ఫ్యాన్‌ను ఉపయోగించేలా రెగ్యులేటర్లను అమర్చుకోవాలి.

 • 100 నాట్ల కాంగిసెంట్ లైట్ బల్బు స్థానంలో 23 వాట్ల ఫ్లోరోసెంట్ బల్బు వాడటం ద్వారా అదేమొత్తంలో కాంతిని వెలువరచడమే కాకుండా 10 రెట్ల ఎక్కువ మన్నికతో మనగలుగుతాయి.
 • ఎండాకాలంలో వాషింగ్ మెషిన్లోని డైయర్లో కాకుండా బయట బట్టలు ఆరవేయడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చు.
 • శక్తిని ప్రభావవంతంగా వినియోగించుట ధర్మాస్తాట్లను ఉపయోగించి డబ్బులను పొదుపు చేయవచ్చు.
 • సాధారణ మోడల్ వాషింగ్ మెషిన్ కన్నా ఫ్రంట్‌లోడ్ మెషిన్ 25% శక్తిని తక్కువగా వినియోగిస్తాయి.

సేకరించిన సమాచారం, సౌరశక్తితో వినియోగించే ఉపకరణాలు, నీ పరిశీలనల ఆధారంగా సౌరశక్తి వినియోగం గురించి ఒక నివేదికను రూపొందించి తరగతి గదిలో ప్రదర్శించండి.

తదుపరి చర్యలు:

సౌరశక్తి వినియోగం, ఉపయోగాలను గురించిన నివేదిక ప్రతిని గోడపత్రికలో ప్రదర్శించండి. సౌరశక్తిని ఉపయోగించమంటూ ఒక స్లోగన్ రాయండి, పోస్టర్ తయారుచేయండి. ఒక కొత్తపరికరం సౌరశక్తితో పనిచేసేలా తయారుచేయడానికి ఆలోచించండి. మీ ఊహలను, చిత్రాలను మీ ఉపాధ్యాయునికి చూపించి చర్చించండి.

ఆధారము: http://apscert.gov.in/

2.98717948718
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు