హోమ్ / శక్తి వనరులు / సాంకేతిక పరిజ్ఞానం / నికర సున్నా శక్తి భవనాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నికర సున్నా శక్తి భవనాలు

నికర లేదా దాదాపు సున్నా శక్తి భవనాలు పునరుత్పాదక శక్తి వనరులను ఉపయెగించి, చాలా తక్కువ శక్తి డిమాండు కలిగిన అత్యంత సమర్థవంతమైన భవనాలు

NZEBలు అంటే ఏమిటి?

నికర లేదా దాదాపు సున్నా శక్తి భవనాలు (NZEB) పునరుత్పాదక శక్తి వనరులను ఉపయెగించి, చాలా తక్కువ శక్తి డిమాండు కలిగిన అత్యంత సమర్థవంతమైన భవనాలు. అలాంటి భవనాలు సంవత్సరానికి ఎంత శక్తిని ఉపయోగించుకుంటాయో అంత శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

నికర సున్నా శక్తి లక్ష్యాలను సాధించడానికి, NZEBల శక్తిని సమర్థవంతంగా ఉపయోగించే సాంకేతికతలను మరియు పునరుత్పాదక ఇంధన మూలాల (RES)ను ఉపయోగించే సాంకేతికతలను ఉపయోగించి, శక్తి డిమాండును తగ్గించేందుకు ప్రయత్నించాలి. అలాంటి భవనాలలో, శక్తి సమతుల్యత పునరుత్పాదక శక్తి సాంకేతికతలు అందించటం ద్వారా జరుగుతుంది. ఇది NZEB లక్ష్యం చేరుకోవడానికి చాలా తార్కిక పద్ధతి.

NZEB నిర్వచనాలు సున్నా శక్తి లక్ష్యాలను పొందడానికి కీలకం, మరియు ఆర్కిటెక్టులు మరియు భవన యజమానుల నమూనాల ఎంపికపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ నిర్వచనాలు ప్రాజెక్టు లక్ష్య డిజైనర్ మరియు భవన యజమాని విలువలపై ఆధారపడతాయి. అందుకని వారు తమకు ఏ నిర్వచనం సరిపోతుందో తెలుసు కోవలసి ఉంటుంది.

నికర జీరో సైట్ శక్తి బిల్డింగ్

"ఒక సైట్ ZEB ఒక సంవత్సరంలో ఎంత శక్తిని ఉపయోగించుకుంటుందో అంత శక్తిని తిరిగి ఉత్పత్తి చేస్తుంది, సైట్ వద్ద లెక్క తీసుకున్నప్పుడు."

శక్తి ప్రవాహాలు ప్రాజెక్టు సైట్ వద్ద లెక్కలోకి తీసుకుంటారు. ఒక భవనం 100 కిలో వాట్ల శక్తిని సంవత్సరానికి వాడుకుంటే అది పునరుత్పాదక ఇంధనాన్ని వాడి 100 కిలో వాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలగాలి. పునరుత్పాదక ఇంధన సరఫరా వ్యవస్థలను భవనం పైకప్పు, ముఖ భాగంలో, పార్కింగ్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో సైట్ లో నిర్మించవచ్చు.

పునరుత్పాదక శక్తి సరఫరా ఎంపిక తక్కవాగా ఉండటం వలన సైట్ NZEBల శక్తి సామర్థ్యాలను పెంచటాన్ని నిర్ణయాత్మకంగా ప్రోత్సహిస్తున్నారు. నెట్ సున్నా సైటు శక్తి ఉత్పత్తి మూలాన్ని పట్టించుకోదు.నెట్ జీరో సైట్ శక్తి భవనాలు, గ్రిడ్ విద్యుచ్ఛక్తి సోర్సు నుంచి ఉత్పత్తి సైటు వరకు సరఫరాకు ఉపయోగించిన శక్తిని డిమాండ్-సరఫరా సమతౌల్యాన్ని లెక్కించే టప్పుడు పరిగణలోకి తీసుకోవు. బయో వ్యర్థాల వంటి పునరుద్ధరణ ఇంధనాల రవాణా ఖర్చును కూడా కూడా పరిగణించదు. దీనివలన సైట్ NZEBలు శక్తి సరఫరా తటస్థ వైఖరికి చేరుకోవడానికి సులభమవుతుంది.

సైట్లో ఉపయోగించగపిగే పునరుత్పత్తి శక్తి వనరులు సౌర PV, గాలి మరియు జీవ ఇంధనాలు. సాధారణంగా ఉపయోగించే టెక్నాలజీలు సౌర PV, సౌర వేడి నీరు, సౌర ఉష్ణం, చిన్న హైడ్రో యూనిట్లు, బయోగ్యాస్ ప్లాంటులు. సైటు ప్రదేశం కండక్టివుగా ఉంటే, అప్పుడు గాలి టర్బైనులు ఉపయోగించవచ్చు. ఉత్పత్తయిన పునరుత్పత్తి శక్తిని భవనం శక్తి పంపిణీ వ్యవస్థకు నేరుగా పంపుతారు. మిగులు శక్తిని స్టోరేజ్ బ్యాటరీలలో నిల్వ ఉంచుకోవచ్చు లేదా నికర మీటరింగ్ మరియు ఫీడ్ ఇన్ రుసుము విధానాలు స్థానికంగా అమలు అవుతూ ఉంటే వారికి సరఫరా చేయవచ్చు.

ఈ నిర్వచనం చిన్న భవనాల నుంచి మాధ్యమిక భవనాలకు మారుతూ ఉంటుంది. ఇది సైట్ ప్రాంతం మరియు ఎండ మరియు గాలి వంటి పునరుత్పత్తి శక్తి వనరులు సమృద్ధిగా దొరకడం పై ఆధారపడి ఉంటుంది.

నికర జీరో మూల శక్తి బిల్డింగ్

" ఒక సైట్ ZEB ఒక సంవత్సరంలో ఎంత శక్తిని ఉపయోగించుకుందో అంత శక్తిని తిరిగి ఉత్పత్తి చేస్తుంది, సైట్ వద్ద లెక్క తీసుకున్నప్పుడు."

ఒక ZEB నికర సున్నా స్థితిని మూల లేదా ప్రాథమిక శక్తి తో కొలుస్తారు. ప్రాథమిక శక్తి ద్వితీయ శక్తిని ఉత్పత్తిచేయడానికి మరియు పంపిణిచేయడానికి ఉపయోగిస్తారు (భారతదేశం విషయంలో ప్రధానంగా విద్యుత్).

NZEB సైటులకు సరఫరా చేసిన శక్తి మరియు దానినుంచి ఎగుమతి చెసిన శక్తిని సైటు-నుంచి-సోర్సుకు మార్పిడి కారకాలతో హెచ్చిస్తారు. ఇది పవరు ప్లాంటులో ఉత్పత్తికి వాడిన శక్తి మరియు పంపిణిని శక్తిని భాగించడాన్ని అనుమతిస్తుంది. భారతదేశం లో విద్యుత్ మార్పిడి ఫాక్టరు, భవన ప్రాంతంతో సంబంధం లేకుండా, ప్రస్తుతం సుమారు మూడు ఉంటుందని ఊహ. గ్రిడ్డుతో జోడించిన ఒక భవనం, ఒకవేళ 300 కి.వాట్ల పునరుత్పాదక శక్తిని అన్ సైట్ లేదా ఆఫ్ సైట్ సరఫరా చేస్తే, 100 కి.వాట్ల అవసరంతో ఉన్నప్పుడు దానిని సోర్సుNZEBగా గర్తించవచ్చు. సోర్సు NZEBలు సహజ వనరుల శక్తి ఖర్చులను తగ్గించడానికి సమగ్ర నమూనాలు. అయితే, అవి వివిధ రకాల ఇంధనాల ఉపయోగం వలన కాలుష్యం మరియు ఎక్కువ మరియ తక్కువ భారం (లోడు) వలన వచ్చే ముఖ్య శక్తిలోని మార్పులను పట్టించుకోవు. ఎక్కున భారం ఉన్న సమయంలో సరఫరా చేసిన విద్యుత్తు, తక్కువ భారం ఉన్న సమయంలో సరఫరా చేసిన విద్యుత్తు కంటే, ఎక్కువ ముఖ్య శక్తిని ఉపయోగించుకుంటుంది.

వివిధ ద్వితీయ శక్తులకు సైటు-నుంచి-సోర్సు కన్వర్షను ఫాక్టరు భిన్నంగా ఉంటుంది. అయితే, భారతదేశంలో ఉపయోగించే ప్రధాన ద్వితీయ శక్తి విద్యుత్తు. అందువలన కన్వర్షను ఫాక్టరు భేదాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. అణు, బొగ్గు, సహజ వాయువు మరియు హైడ్రో వంటి ప్రాధమిక ఇంధనాలను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నప్పుడు భేదాలను ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం, భారత దేశంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సోర్సు-నుంచి-సైట్ ప్రాంతీయ భేదాలు అందుబాటులో లేవు. బొగ్గు, హైడ్రో, మరియు అణు ఇందనాల రకాల భేదాలను కూడా లెక్కించ లేదు. అన్ని ప్రాంతాలకు మరియు అన్ని ఇంధన రకాలకు ఒకే జాతీయ మార్పిడి ఫాక్టరును ఉపయోగించటం మూల శక్తి సంఖ్యల ఖచ్చితత్వాన్ని తగ్గిస్తుంది.

నికర జీరో శక్తి ఖర్చు తయారీ

"భవనం యజమాని గ్రిడ్డుకు ఎగుమతి చేసినందుకు యుటిలిటీ చెల్లించే డబ్బు సంవత్సరానికి భవన యజమాని శక్తి సేవలకు మరియు శక్తి ఉపయోగించిన దానికి చెల్లించిన దానికి కనీసం సమానంగా ఉంటుంది."

సైట్ నుండి పునరుత్పాదక ఇంధన ఎగమతుల ఖర్చు శక్తి వినియోగానికి సైట్ దిగుమతి చేసుకున్న ఖర్చుకు సమానంగా ఉండాలి. ముఖ్యంగా, ఒక భవనం తను ఉత్పత్తి చేసిన విద్యుత్తును అమ్మి తను విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి పెట్టిన ఖర్చును తిరిగి పొందితే అది నికర సున్నా భవనం. NZEBలలో యుటిలిటీ టారిఫ్ నిర్మాణ ధర కీలకం. నిజానికి, తక్కువ శక్తి వినియోగం మరియు తక్కువ డిమాండు రెండింటికి టారిఫ్ ఉపయోగకరంగా ఉండాలి. భారతదేశం లో వాణిజ్య మరియు పారిశ్రామిక భవనాలు కోసం వినియోగ టారిఫ్ రెండు రకాలుగా ఉంటుంది - శక్తి వాడకము మరియు పీక్ డిమాండ్. రెసిడెన్షియల్ వినియోగ టారిఫ్ సాధారణంగా విద్యుత్తు వినియోగంపై మాత్రమే మారుతూ ఉంటుంది.

సున్నా శక్తి వ్యయ భవనాలు తక్కువ పీక్ డిమాండ్ మరియు అధిక శక్తి పొదుపు కలిగి ఉండాలి. దానివలన తక్కువ ధర సుంకాలు కట్టవలసి ఉంటుంది మరియు దాని వలన తక్కువ యుటిలిటీ బిల్లులు పొందుతారు. డిమాండ్ స్పందన నియంత్రణలు శక్తి ఖర్చు తటస్థాన్ని సాధించడానికి కీలకమైనవి. కాస్టు NZEBలు విధానాలు లెకుండా పనిచేస్తే, అంటే ఫీడ్ ఇన్ టారిఫ్ మరియు నెట్ మీటరింగు లేకుండా, ఫిసబులు కావు. విధానాలు వినియోగదారుల ద్వారా తిరిగి విద్యుత్ కొనుగోలును సులభతరం చేస్తాయి. సైట్ లేక మూల NZEBలతో పోలిస్తే, ఈ నిర్వచనానికి పునరుత్పాదక శక్తి వ్యవస్థల యొక్క ఎక్కువ ఇంస్టాల్డ్ సామర్థ్యం, అదే భవనానికి, ఉండాలి. ఇది బై-బ్యాక్ రేట్లు పరిగణనలోకి తీసుకోని జరగాలి. ఈ లోటు ను సరిచేయడానికి పెద్ద పునరుత్పాదక శక్తి వ్యవస్థ నుండి మరింత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది.

విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సాధారణంగా ఉపయోగించే సాంకేతికత సౌర PV. బయోగ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి మాత్రమే మొత్తము విద్యుత్తు దిగుమతికి అయ్యే ఖర్చుకు సమానం కాకపోవచ్చు. వ్యర్ధ వేడిని లేదా జీవ ఇంధనాలు ఉపయోగించి సహ-ఉత్పత్తిని కూడా విద్యుత్ సరఫరాలో ఎంపిక చేయవచ్చు.

తరచుగా మారే యూటిలిటీ ధరల మార్పు పై ఆధారపడి, ఖర్చు NZEB భవనం యొక్క జీవిత చక్ర నిర్వహణ సాధించడం సులభం కావచ్చు. మరియు ఖర్చు NZEBలు మారిన యూటిలిటీ ధరల వలన, శక్తి పొదుపు మారకపోయినా, హోదాను కోల్పోవచ్చు. మరోవైపు, భవనం వాస్తవానికి ఫీడ్-ఇన్ సుంకాలు అనుకూలంగా ఉంటే నికర సున్నా స్థితికి రావచ్చు.

నికర జీరో శక్తి ఎమిషన్ బిల్డింగ్

"నికర సున్నా ఉద్గారాల భవనాలు ఉద్గారాలను ఉత్పత్తిచేసే శక్తి వనరులను ఉపయోగించి ఎక్కువ ఉద్గారాలు లేని పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేస్తాయి"

నికర సున్నా శక్తి ఉద్గారాల భవన ఉద్గారాలను సైటు శక్తితో కాకుండా మూల శక్తి తో కొలుస్తారు. ఒక భవనం నుంచి ఉద్గారాల ఉత్పత్తిని నిర్ణయించటానికి, భవనంలో ఉపయోగించిన శక్తిని ఉద్గార ఫాక్టరుతో కొలుస్తారు. అది రవాణా నుండి మరియు సోర్స్ ఉత్పత్తి ఫలితంగా వచ్చిన ఉద్గారాలను పరిగణలోకి తీరుకుంటుంది. కార్బన్, సల్ఫర్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లను ఉద్గార తటస్థను లెక్కించడానికి పొందుపర్చారు. గ్రిడ్ ద్వారా విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఉపయేగించే ఇంధనం నికర సున్నా ఉద్గారాలు సాధించటాన్ని సులభంగా నిర్ణయిస్తుంది. అణు ప్లాంట్ నుంచి వచ్చే ఉద్గారాలు మరియు హైడ్రో ప్రాంటు నుంచి వచ్చె ఉద్గారాలు వేరుగా ఉంటాయి, ఇది బొగ్గు కాల్చే ప్లాంటులో భిన్నంగా ఉంటుంది.

నికర సున్నా ఉద్గారాల భవనం సైట్లో కాని లేదా ఆఫ్ సైటులోకాని సున్నా ఉద్గారాలతో ఉండవచ్చు - అవి సైటులో సమానమైన పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఆన్ సైట్ ఎమిషన్ ZEB దాని ఫుట్ ప్రింటుతో పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు లేదా సైటు ఉద్గారాల తటస్థతను పొందాలి. పునరుద్ధరణ ఇంధనాలను సైటులో ఉత్పత్తికి కొనుగోలు చేస్తే, రవాణా ఉద్గారాలు మరియు ఇంధన ఉత్పత్తి ఉద్గారాలను ఎమిషను న్యూట్రాలిటీ లెక్కించే సమయంలో తీసివేయాలి.

పునరుత్పాదక శక్తి క్రెడిట్సును అఫ్ సైటు మూలం నుంచి ఆఫ్సెట్ శక్తి వినియోగానికి కొనుగోలు చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, విండు ప్లాంటులు, హైడ్రో ప్లాంటులు, మరియు సౌర ప్లాంటులనుంచి విద్యుత్తును ఉపయోగిస్తే భవనం ఉద్గారాల ZEBగా ఉంటుంది. అయితే, ఈ ప్రత్యామ్నాయం ఆచరణంలో సాధ్యం కాదు ఎందుకంటే విండు ప్లాంటులు మరియు హైడ్రో ప్లాంటులు పరిమిత ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. నేషనల్ గ్రిడ్ కు సరఫరా చేసే విద్యుచ్ఛక్తి చాలా వరకు సంప్రదాయ బొగ్గు మండించే ప్లాంటుల ద్వారా వస్తుంది. అదనంగా, వివిధ వనరుల నుంచి వచ్చిన విద్యుత్తును, సరఫరాకు ముందే, గ్రిడ్డులో కలుపుతారు. కచ్చితంగా గ్రిడ్డులో ఉద్గారాల నిష్పత్తిని, పునరుత్పాదక విద్యుత్తు వర్సెస్ పునరుత్పాదక కాని విద్యుత్తు (ఇంధన మిశ్రమంగా పిలుస్తున్నారు), తెలుసుకోవటం క్లిష్టమైన పని. వివిధ ప్రాంతాలలోని ఉత్పత్తి మిశ్రమం యొక్క సమాచారం నికర ఉద్గార రహిత భవనాల నిర్దుష్టతను తెలుసుకోవడానికి ప్రయత్నించే ముందు అత్యవసరం.

పునరుత్పాదక శక్తి క్రెడిట్సును అఫ్ సైటు మూలం నుంచి ఆఫ్సెట్ శక్తి వినియోగానికి కొనుగోలు చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, విండు ప్లాంటులు, హైడ్రో ప్లాంటులు, మరియు సౌర ప్లాంటులనుంచి విద్యుత్తును ఉపయోగిస్తే భవనం ఉద్గారాల ZEBగా ఉంటుంది. అయితే, ఈ ప్రత్యామ్నాయం ఆచరణంలో సాధ్యం కాదు ఎందుకంటే విండు ప్లాంటులు మరియు హైడ్రో ప్లాంటులు పరిమిత ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. నేషనల్ గ్రిడ్ కు సరఫరా చేసే విద్యుచ్ఛక్తి చాలా వరకు సంప్రదాయ బొగ్గు మండించే ప్లాంటుల ద్వారా వస్తుంది. అదనంగా, వివిధ వనరుల నుంచి వచ్చిన విద్యుత్తును, సరఫరాకు ముందే, గ్రిడ్డులో కలుపుతారు. కచ్చితంగా గ్రిడ్డులో ఉద్గారాల నిష్పత్తిని, పునరుత్పాదక విద్యుత్తు వర్సెస్ పునరుత్పాదక కాని విద్యుత్తు (ఇంధన మిశ్రమంగా పిలుస్తున్నారు), తెలుసుకోవటం క్లిష్టమైన పని. వివిధ ప్రాంతాలలోని ఉత్పత్తి మిశ్రమం యొక్క సమాచారం నికర ఉద్గార రహిత భవనాల నిర్దుష్టతను తెలుసుకోవడానికి ప్రయత్నించే ముందు అత్యవసరం. భవనాలు ఉపయోగించే శక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి మరియు మూల్యాంకనం చేయటానికి ఎమిషన్స్ ZEB అత్యంత సంపూర్ణమైన నమూనా. ఇది వివిధ ప్రాంతాల్లో , వివిధ ఇంధనాలలో కాలుష్యం మరియు ఉద్గారాలను లెక్కిస్తుంది.

 

భవనాలు ఉపయోగించే శక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి మరియు మూల్యాంకనం చేయటానికి ఎమిషన్స్ ZEB అత్యంత సంపూర్ణమైన నమూనా. ఇది వివిధ ప్రాంతాల్లో , వివిధ ఇంధనాలలో కాలుష్యం మరియు ఉద్గారాలను లెక్కిస్తుంది.

Source: NZEB పోర్టల్

3.06293706294
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు