অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

సోలార్ పవర్ ప్లాంట్తో విద్యుత్ ఉత్పత్తి

దేశంలోనే అరుదైన, ప్రసిద్ధి గాంచిన సోలార్ పుటోవల్టెక్ పవర్ప్లాంట్ (సౌరశక్తి విద్యుత్ కేంద్రం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోనే మొట్టమొదటి సారిగా షాద్నగర్ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి జరగుతోంది. అది కూడా ఒక మెగావాట్ విద్యుత్ సామర్థ్యంతో షాద్నగర్ సబ్స్టేషన్ ద్వారా ప్రజలకు సరఫరా అవుతోంది. ఇటీవలే ప్రారంభించిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు రాకతో విద్యుత్ రంగంలో ఇక్కడ కొత్త శకం ఆరంభమైనట్లుగా చెప్పవచ్చు. గతంలో ఇదే ప్రాంతంలో చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేసే సెల్కో విద్యుత్ పరిశ్రమ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సోలార్ పవర్ప్లాంట్ ఏర్పాటుతో మరోసారి విద్యుత్ రంగంలో అందరి దృష్టి ఈ ప్లాంటుపై పడింది. పర్యావరణానికి ముప్పు వాటిల్లని ఈ ప్లాంట్ ప్రజలకు ఉపయోగకరమే. థర్మల్ ప్రాజెక్టుల మాదిరిగా విచ్చలవిడిగా కార్బన్డయాక్సైడ్ను విడుదల చేయడం, కలుషిత నీరు, గాలి వచ్చే అవకాశాలు ఈ ప్లాంట్కు ఉండవు. ఎలాంటి హానీ జరగకుండా కేవలం సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయోజనాత్మకమైన ప్లాంట్గా దీనిని చెప్పవచ్చు. ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ గురించి తెలుసుకోవాల్సిందే.

సోలార్ పవర్ ప్రత్యేకత

ఒక మెగావాట్ సామర్థ్యంతో స్థాపించిన ఈ పవర్ప్లాంట్లో 'సోలార్ మాడ్యూల్' (ప్లేట్స్)ను వాడతారు. ఒక మాడ్యూల్ 230 ఓల్ట్స్ సామర్థ్యం కలిగి ఉంటుంది. మొత్తం పవర్ ప్లాంట్లో 4,400 మాడ్యూల్స్ ఉంటాయి. వీటిని భూమిపై దిమ్మెలను ఏర్పాటు చేసి వాటిపై అమర్చుతారు. వీటి ద్వారా సమకూరే సౌర శక్తి విద్యుత్ను సేకరించేందుకు తీగలను కంట్రోల్ రూమ్కు అమర్చుతారు. కంట్రోల్ రూమ్లో 500 కిలోవాల్ట్స్ చొప్పున రెండు ఇన్వైటర్లకు డి.సి ద్వారా విద్యుత్ను పంపుతారు. ఇక ఇన్వైటర్ల ద్వారా ఎ.సిగా కాంప్యాక్ట్ సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా అవుతుంది. 300 వోల్ట్స్ నుంచి 11 కెవి ద్వారా ఈ సబ్స్టేషన్ నుండే విద్యుత్ను బయటికి పంపిణీ చేయవచ్చు. టాటా బిపి సోలార్ కంపెనీ ద్వారా తయారైన వీటి వస్తువులు బెంగళూరులో తయారు చేస్తారు. వాతావరణం అనుకూలంగా ఉంటే రోజుకు కనీసం 4 వేల యూనిట్లకు పైగా విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. వాతావరణం కొంత అనుకూలంగా లేకపోతే రెండు వేల యూనిట్లకుపైగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. పవర్ప్లాంట్లో వినియోగించే విద్యుత్కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్లాంట్లో ప్రత్యేకమైన సోలార్ మాడ్యూల్స్ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఆటోమెటిక్గా సూర్యాస్తమయానికే ప్లాంట్లో విద్యుత్ దీపాలు వెలుగుతాయి. అదే విధంగా సూర్యోదయం కల్లా విద్యుత్ దీపాలు ఆరిపోయే విధానం ఇందులో అమర్చబడి ఉండటం విశేషం. ఈ ప్లాంట్ రక్షణ కోసం కూడా ఏర్పాట్లు చేశారు. పిడుగులు ప్లాంట్పై పడకుండా 'లైట్నింగ్ అరెస్టర్' ను ఏర్పాటు చేశారు. పిడుగులు పడే సమయంలో వాటిని పొడవైన రాడార్లు ప్లాంట్కు నష్టం కలగకుండా వాటిని స్వీకరించి భూమిలో నిక్షిప్తం చేస్తాయి.

షాద్నగర్ విద్యుత్ సబ్స్టేషన్కు సరఫరా

సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న మెగావాట్ సామర్థ్యం గల విద్యుత్ను కాంప్యాక్ట్ సబ్స్టేషన్ ద్వారా షాద్నగర్ విద్యుత్ సబ్స్టేషన్కు సరఫరా అవుతుంది. సోలార్ పవర్కు సంబంధించి యూనిట్కు రూ.5 చొప్పున ట్రాన్స్కో శాఖ వారు ఖరీదు చేయాల్సి ఉంటుందని ఎపి ట్రాన్స్కో డైరెక్టర్ చెన్నారెడ్డి, జిల్లా ఎస్.ఇ సదాశివరెడ్డి 'ప్రజాశకి'్తకి తెలిపారు. సంవత్సరానికి కనీసం 15 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఈ పవర్ప్లాంట్కు ఉందని చెప్పారు.
ఈ పవర్ప్లాంట్ వ్యవ స్థాపకులు రామకృష్ణ ఇండిస్టీస్ అధినేత కావడం విశేషం. రూ.16 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ను నిర్మించారు. ప్లాంట్లో పనిచేసేందుకు సిబ్బంది అవసరం కూడా పెద్దగా ఉండదని టాటా బిపికి సంబంధించిన ప్రొజెక్ట్ ఇంజనీర్ ఆశీష్వర్మ ప్రజాశక్తికి వివరించారు.

సోలార్ పవర్ సర్వీసెస్
కరెంట్ కోతల నుంచి విముక్తి పొందండి
కరెంట్ ఖర్చుల నుంచి విముక్తి పొందండి

ఈ రెండు సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఒకటే మార్గం. అదే సోలార్ ఇన్వర్టర్

సోలార్ పానెల్ అనేది సూర్య కాంతి ని ఉపయోగించుకుని కరెంట్ ను ఉత్పతి చేయగల పరికరము. దీనిని మీకున్న పాత ఇన్వర్టర్ కు బిగించుకుని ఉపయోగించుకోవచ్చు లేదా మేలైన ఫలితాల కోసం yes energy solutions వారి సోలార్ పవర్ సిస్టం ఏర్పాటు చేసుకోవచ్చు.

సోలార్ పవర్ సిస్టం ఏర్పాటు చేసుకోవడం ద్వారా రోజువారీ 2 నుంచి 5 యూనిట్ ల వరకు కరెంట్ ఆదా చేసుకోవచ్చు. ఆ మేరకు కరెంట్ బిల్ ఆదా చేసుకోవచ్చు. యింకా మా పవర్ సిస్టం లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇండికేటర్ వ్యవస్థలను ఉపయోగించుకుని పగలు లేదా రాత్రి అపరిమితంగా, నిరంతరాయంగా, పూర్తి ఉచితంగా సోలార్ పవర్ ను ఉపయోగించుకోవచ్చు.

సోలార్ పవర్ ను గృహ అవసరాలకు, షాపులకు, ఆఫీసులకు, హోటల్స్ కు, లాబ్స్ కు, సోడా హబ్ లకు పెట్రోల్ బంకులకు, స్టూడియో లకు, హాస్పిటల్స్ కు, బ్యాంకు లకు, స్కూల్ లకు, కాలేజీలకు, మరియు మీ అన్ని రకముల విద్యుత్ అవసరాలకు ఈ సోలార్ పవర్ సిస్టం లను ఉపయోగించుకోవచ్చు.

షాపులకు, హోటల్స్ కు, స్టూడియో లకు మరియు యితర వాణిజ్య అవసరాలకు సోలార్ పవర్ ను ఉపయోగించుకోవడం ద్వారా కరెంటు సమస్య లేని పూర్తీ వ్యాపారాన్ని మీ సొంతం చేసుకోండి. అంతే కాక కాటగిరీ-2 గా వున్న మీ మీటరు యిచ్చే భయంకరమైన బిల్లు లకు స్వస్తి చెప్పండి

సోలార్ ఇన్వెర్టర్ పనితీరు

- సోలార్ ఇన్వెర్టర్ అనేది సూర్య కాంతిని ఉపయోగించుకొని విద్యుత్ ను తయారు చేసే పరికరాలు

దీనిలో ప్రధాన భాగాలు మూడు

 1. సోలార్ పానెల్స్
 2. పవర్ ఇన్వెర్టర్
 3. పవర్ స్టోరేజ్ బ్యాటరీ

సోలార్ పానెల్స్

సోలార్ పానెల్స్ అనేవి పటంలో చూపిన విధంగా వుంటాయి యివి వీటి ఉపరితలంపై పడిన కాంతిని "కాంతి విద్యుత్ ఫలితం " అనే ప్రభావం ద్వారా విద్యుత్ గా మార్పు చేస్తాయి

 • మా సోలార్ పానెల్స్ ప్రత్యెక సెన్సిటివ్ టెక్నాలజీ తో రూపొందించబడ్డాయి అందువలన మబ్బుగా ఉన్న సమయం లోనూ, వర్షాకాలంలోనూ పూర్తి స్థాయిలో కాంతిని విద్యుత్ గా మార్చగల శక్తిని ఇవి కలిగి వుంటాయి
 • ఉదయం ఆరు గంటలకు గల సూర్య కాంతి నుంచి విద్యుత్ ను ఉత్పతి చేయడం ప్రారంబిస్తాయి దీన్ని మీరు మావద్ద ఉన్న డెమో సోలార్ పవర్ సిస్టం ను చూసి నిర్ధారణ చేసుకోవచ్చు
 • ఉదయం ఆరు గంటలకు గల కాంతి నుంచి యివి విద్యుత్ ను ఉత్పతి చేస్తున్నాయంటే మబ్బుగా వున్నా సమయంలోనూ వర్షాకాలంలోనూ వుండే కాంతి నుంచి విద్యుత్ ఉత్పతి అవుతుంది అనడంలో సందేహం లేదు . ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రక్యాత కంపెనీ లకు HBL సంస్థ బ్యాటరీ లను సోలార్ సిస్టం లను రూపొందిస్తున్నది. ఈ వివరాలకోసం www.hbl.in వెబ్ సైట్ ను దర్శించండి

పవర్ ఇన్వెర్టర్

 • పవర్ ఇన్వెర్టర్ సోలార్ పానెల్స్ నుంచి ఉత్పతి అయిన DC విద్యుత్ ప్రవాహాన్ని బ్యాటరీలో నిక్షిప్తం చేస్తుంది కరెంటు పోయినపుడు బ్యాటరీ లో ఉన్న DC విద్యుత్ ను AC గా మార్చి గ్రుహోపకరనాలకు సరఫరా చేస్తుంది
 • మా పవర్ సిస్టం లో యస్ ఎనర్జీ సోలుషన్స్ కంపెనీ రూపొందించిన పవర్ ఇన్వెర్టర్ లభిస్తుంది
 • ఈ పవర్ ఇన్వెర్టర్ లో ఉపయోగించిన అత్యాధునిక సెన్సిటివ్ పవర్ డిజైన్ వలన సూర్య కాంతి వల లభించే అతి చిన్న విద్యుత్ ప్రవాహాన్ని కూడా యిది సేకరించి విద్యుత్ గా మార్చి బ్యాటరీ లో స్టోర్ చేయగలదు
 • దీనిలో ఉపయోగించిన అత్యాధునిక ఇండికేటర్ వ్యవస్థలను ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో సోలార్ పవర్ ను ఉపయోగించుకోవచ్చు
 • దీనిలోని డిజిటల్ డిస్ప్లే బోర్డ్ ద్వారా బ్యాటరీ బాక్ అప్, పవర్ లోడ్, సోలార్ ఛార్జింగ్, గ్రిడ్ ఛార్జింగ్ వంటి అత్యంతముఖ్యమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు
 • ఎన్ని గంటలపాటు నిరంతరాయంగా ఉపయోగించినా హీట్ రూపంలో విద్యుత్ వృధా కాని విధంగా ఈ ఇన్తెర్టర్ రూపొందించబడినది

వివరాలకు
సోలార్ పవర్ సర్వీసెస్
చైతన్య కుమార్ సత్యవాడ
రామకృష్ణా నగర్, చింతలపూడి, పశ్చిమ గోదావరి
email: menavachaitanyam.blogspot.com

ఆధారము: http://solarctp.blogspot.in/

భవిష్యత్ రారాజు. సోలార్ ఎనెర్జీ

( విద్దుత్పత్తి_ యితర ప్రత్యామ్నాయ విధానాలు )

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు

ప్రపంచ వ్యాప్తంగా యీ రోజున యింధన సమస్య, విద్యుత్ సమస్య. మానవుడు తాను కనిపెట్టి తన సౌకర్యానికై వినియోగించుకోవాలనుకున్న పరికరాలకుకావలిసిన విద్యుత్శ్చక్తి లభించడం లేదు.అధునాతన సౌకర్యాలకై అధునాతన పరికరాలు వినియోగించుకొనే దిశగా అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. యీ భూ ప్రపంచంలోని ప్రతి దేశం తన నిత్యావసర ఇంధనావసరాలకై జాతీయ స్థూలాదాయంలోనుండి ఎంతో ఎక్కువశాతం ఇంధన దిగుమతులపై ఖర్చు పెడుతోంది.లేదా భూగర్భ ఇంధన వెతుకులాటకై పరిశొధనలలోనో, లేదా వెలికితీతలోనో వెచ్చిస్తోంది. అది బొగ్గు కావచ్చు, ఆయిలు కావచ్చు,గ్యాసు కావచ్చు. అణు యింధనం కావచ్చు.
వీటిని వినియోగించి నీటిని,వేడి చేసి ఆవిర్భవించిన శక్తిని వినియోగించి టర్బైన్ లను నడిపి విద్యుత్ జెనరేటర్లు నడపి విద్యుదుత్పాదన సాధించడమే అంతిమ లక్ష్యం. వీటన్నింటికీ యింధన లబ్ధి ముఖ్యం.అందుకొరకు భూమి లోలోతు పొరలపై ఆధారపడాలిసిందే.ఆ తరువాత భూ వుపరితలాన వాటిని వినియోగకరంగా మార్చే దిశలో ఎంతో పర్యావరణ కాలుష్యం. అదీ కాక యీ పైన పేర్కొన్న యింధనాల వెలికితీత కార్యక్రమం అభివ్రుద్ధి చెందుతున్న, చెందని దేశాలకు కఠిన పరీక్ష.ఎన్నో లక్షల మంది నిర్వాశితులౌతున్నారు. ఆపై వాటివల్ల వుత్పన్నమయ్యే పర్యావరణ సమస్యలు మరో పెద్ద సమస్య. భూగర్భం లోనుండి ప్రతి దేశం తమ ఇంధన అవసరాలకనో ,యితర కారణాలకో, భూగర్భ పదార్ధాలను వెలికి తీస్తూ పోతే, భూ గర్భంలో ఏర్పడే ఖాళీ వల్ల భూమికి వుత్పన్నమయ్యే తీవ్ర దుష్పరిణామాలు భూమి పై జీవుల వునికికే తీవ్ర విఘాతం కలిగించే దారుణ స్థితి యెర్పడే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇప్పటికే ప్రాధమికంగా విద్యుత్పాదనకు సాంప్రదాయ వనరుగా ప్రసిధ్ధి చెందిన నీరు ఏయేటికాయేడు లబ్ధి లేకుండా పోతోంది. వర్షాలు లేక నీటి వనరులు అడుగంటి పోతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా భష్యత్తులో,.జల విద్యుత్ ప్రోజెక్టులు తీవ్ర సమస్యలలోకూరుకు పోయే ప్రమాదం వుంది. నీరు లబ్ధి లేకూంటే యితర సాంప్రదాయ వనరులైన ధర్మల్,ఆటమిక్ పవర్ వంటి వుత్పత్తులకూ తీవ్ర ఆటంకం ఏర్పడే పరిస్థితులు వుత్పన్నమౌతున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న యీ దారుణ పరిస్థితులను అధిగమించి ,యింధనంకొరకు యుద్ధాలు ఆపి ప్రత్యామ్న్యాయ విధానాలకొరకు పరిశోధనలు జరిపి సాంప్రదాయేతర విధానాలతో శక్తిని వుత్పత్తి చేసి వినియోగించ గలిగితే తాను కనిపెట్టిన అధునాతన పరికరాలు మానవుడు తన సౌకర్యార్ధం వినియోగించుకోగలుగుతాడు. లేకుంటే ఎన్ని పరికరాలు కనిపెట్టినా యేకొద్దిమందికో తప్ప వినియోగపడవు.
నిరంతర మైన, నిరాటంకమైన,పర్యావరణానికి ,భూమి వునికికి విఘాతంలేని ప్రత్యమ్నాయ వనరులలో 1) గాలి నుండి, wind energy, 2)సముద్ర అలలనుండి (Tidal energy). సూర్య రశ్మి నుండి , Solar energy ముఖ్యంగా చెప్పవచ్చు.యిప్పుడు వాటి గురుంచి నాకున్న పరిమిత పరిగ్నానంలో వివరిస్తాను.

 1. విండ్ ఎనెర్జీ (wind energy): గాలి విరివిగా వీచే ప్రదేశాలు కనిపెట్టి ఆయా ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో గాలి మరలు యేర్పరచి,వాటిని విద్యుత్ జెనెరేటర్లకు అనుసంధానం చేసి తద్వారా ప్రతి మరనుండి వుత్పత్తి అయ్యే విద్యుత్తును సమాంతరంగా అనుసంధించి ప్రస్తుత కేంద్రీక్రుత గ్రిడ్ విధానంలో వినియోగదారులకు, ప్రస్తుత రీతిలోనే ఆయా వనరులు వినియోగించుకొని సరఫరా చేసుకోవచ్చు. దీని స్థాపనకై అయ్యే ఖర్చు యెక్కువేఅయినా నిర్వహణ ఖర్చులు ,అణు విద్యుత్ ప్రోజెక్టులకో, జల విద్యుత్ ప్రోజెక్టులకో ,ధర్మల్ విద్యుత్ ప్రోజెక్టులకో అయ్యే ఖర్చులో సగానికి సగం తగ్గించ వచ్చు. ఇంధనంపై ఖర్చు చేయవలసిన అవసరాలుండవు.అణు యింధనానికై విదేశాలపై ఆధారపడి దేశ సార్వభౌమాధికారాలకు ముప్పు సాంప్రదాయ విద్యుత్ద్ తెచ్చుకోనవసరం లేదు.ఆ కారణంగా అంతర్యుధ్ధాలు కొని తెచ్చు కోనవసరం లేదు. ప్రస్తుత వనరులపై భవిష్యత్తులో పెట్టదలుచుకున్న ఆర్ధిక వనరులతో యీ ప్రోజెక్టులు చేపట్టి దేశ భవిష్యత్తును వుజ్వలం చేసుకోవచ్చు. యిబ్బందులు: గాలి అన్ని వేళలా ఆయా ప్రాంతాలలో అదే ఫోర్సు తో ప్రసరిస్తుందన్న నమ్మకం లేదు. కాబట్టి వుద్యుత్ నిలువ సామర్ధ్యం(storage capabilitiees) పెంచుకొనేందుకు ద్రుష్టి పెట్ట వలసిన అవసరం వుంది., ఆ ప్రత్యేక సాంకేతిక సామర్ధ్యం సమకూర్చుకోవలసిన అవసరం యేర్పడుతుంది
 2. సముద్ర అలల నుండి(Tidal energy): భూమి పై మూడొంతులు సముద్రమే.భూమినిరంతరం తనచుట్టూ తాను పరిభ్రమించడం వల్ల యేర్పడే పరిస్టితి నుండి సముద్రాలలో నిరంతరం అతి శక్తి వంతమైన అలలు వుత్పన్నమౌతుంటాయి. ఆ శక్తిని వినియోగించుకొని అనేక ప్రాంతాలలో విద్యుదుత్పాదన చేయగలిగే సాంకేతిక, ఆర్ధిక సామర్ధ్యం వుంటే విద్యుత్ వుత్పత్తి చేసి ప్రస్తుత రీతిలోనే సరఫరా చేసుకోవచ్చు. దీని స్థాపనకై అయ్యే ఖర్చు యెక్కువేఅయినా నిర్వహణ ఖర్చులు ,అణు విద్యుత్ ప్రోజెక్టులకో, జల విద్యుత్ ప్రోజెక్టులకో ,ధర్మల్ విద్యుత్ ప్రోజెక్టులకో అయ్యే ఖర్చులో నాలుగో వంతుకు తగ్గించ వచ్చు. వినియోగదారునికి విద్యుత్ అందాలంటే ప్రస్తుత గ్రిడ్ విధానాలతో కేంద్రీక్రుత సరఫరా వ్యవస్త లను వినియోగించుకోవచ్చు ఇంధనంపై ఖర్చు చేయవలసిన అవసరాలుండవు.అణు యింధనానికై విదేశాలపై ఆధారపడి దేశ సార్వభౌమాధికారాలకు ముప్పు తెచ్చుకోనవసరం లేదు.ఆ కారణంగా అంతర్యుధ్ధాలు కొని తెచ్చు కోనవసరం లేదు. యిబ్బందులు: కావలిసిన సాంకేతిక పరిగ్నానం సమకూర్చుకోవలసిన అవసరం దానికి కావలసిన ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడంలో సమస్యలు. కానీ ప్రస్తుత సాంప్రదాయవిద్యుత్ వనరులపై భవిష్యత్తులో పెట్టదలుచుకున్న ఆర్ధిక వనరులతో యీ ప్రోజెక్టులు చేపట్టి దేశ భవిష్యత్తును వుజ్వలం చేసుకోవచ్చు. యిక పోతే …

సొలార్ ఎనర్జీ (Solar Energy): the pure energy and green energy. యీ భూ ప్రపంచంలో వున్న మూడొంతుల భూ భాగంలోధ్రువ ప్రాంతాలు తప్పించి మిగతా 80% భూభాగంలో రోజుకు ఆరు గంటలనుండి పది గంటల వరకు సూర్య కాంతి లభిస్తుంది. ఆ కాంతి వల్ల లభించే శక్తిని మన దైనిక విద్యుత్ అవసరాలకు వినియోగించుకొనే శాస్త్ర పరిగ్నానం,పరిశోధనా స్థాయినుంచి వుత్పాదనా, వినియోగ స్థాయిలకు ఎదిగింది.కాని ,దాని వినియోగం కొన్ని దేశాలకే పరిమితమయింది కాని,అన్ని దేశాలకు, అన్ని స్థాయిల వినియోగదారులకు యింకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం వాడుకలో వున్నట్లుగా,చిన్న చిన్న పరికరాల చార్జింగుకో, నీటిని వేడి చెసుకొటానికో మాత్రమే పరిమితం కాకుండా,విద్యుత్త్ ను నిలువ చేసుకొనే ప్రత్యమ్న్యాయాలు అభివ్రుద్ధి పరచుకొని,పెరుగుతున్న అన్ని గ్రుహోపయోగావసరాలకూ సోలార్ విద్యుద్వినియోగం జరిగినప్పుడు, మన దేశం లాటి అభివ్రుద్ధి దిశలో పయనించే దేశాలకు క్రొత్త భారీ విద్యుత్ ప్రోజెక్టులపై, భారీ మొత్తంలొ వెచ్చించవలసిన అవసరం రాదు. తద్వారా మిగులుతున్న ఆర్ధిక వనరులతో యింటింటికీ ఓ 5k.w సోలార్ ఎనెర్జీ కిట్ గనుక, జాతీయ భాద్యతగా అందించితే..ఆ ధనాన్ని నెల నెలా విద్యుత్ బిల్లులా కొన్నినెలల కిస్తుల రూపంలో వెనక్కు రాబట్టుకోవచ్చు.సరఫరాకొరకు,స్థంభాలు, తీగలూ నియంత్రణ వ్యవస్త అవసరం వుండదు కాబట్టి ప్రభుత్వానికి సరఫరా, నియంత్రణ పై ఖర్చులు వుండవు.భారత దేశంలో ప్రతి పూరి గుడెసెకు,నట్ట నడి అడవిలో వున్నా,ఎడారి మధ్యలోవున్నా కూడావిద్యుత్అందినప్పుడే,దేశం కొంతలో కొంత అభివ్రుధ్ధి చెందినట్లు. .
ప్రతి గ్రుహ వినియోగదారుడూ తమ స్థాయిలోసూర్య శక్తి వినియోగించి ఓ విద్యుత్ వుత్పాదకుడవ్వాలి.. ప్రజలకు సరైన,అవగాహన, ఆర్ధిక సహకారం అంది, ప్రతి గ్రుహస్తుడూ తక్కువలో తక్కువ సగటున 05kw విద్యుత్తును వుత్పత్తి చేసుకోగలిగే లా , వ్యవస్త యెర్పడితే, విద్యుత్ అంతరాలనుండి విరామం దొరుకుతుంది. వినియోగ దారుడు, ఆర్ధిక పరిపుష్టి చెంది, మరిన్ని విద్యుత్పరికరాలు వినియోగించే స్థితికి చేరుతాడు. . తద్వారా ఆయా పరిశ్రమలూ పెరుగుతాయి. పారిశ్రామిక వుద్యోగ అవకాశాలు పెరుగుతాయి, యిలా ప్రతి దేశంలోనూ ఆచరిస్తే ప్రపంచ వ్యాప్తంగా ,నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరించబడుతుంది,కొనుగోలు శక్తి పెరుగుతుంది.
యీ ప్రక్రియ కెనడాలో అమలులో వున్నది. కాకుంటే ప్రభుత్వమే ప్రతి గ్రుహస్తుకూ సోలా ర్ ప్యానెల్ వ్యవస్త ఏర్పరుస్తారు.. అందు నుంచి వుత్పత్తి అయిన విద్యుత్ సరఫరా వ్యవస్తకు కలుపుతారు.ప్రతి యూనిట్ కూ వారి అవసరాలకు ప్రభుత్వం నుంచి అందే ధర కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధర చెల్లిస్తారు.యీ విధానం గ్రీన్ ఎనెర్జి యాక్ట్ ద్వారా అమలు చేస్తున్నారు.
గ్రుహ విద్యుత్ అవసరాలు సూర్యుని శక్తితో తీర్చుకోగలిగినప్పుడు, క్రొత్తగాప్రతిపాదించి,నిర్ర్మించ తల పెట్టిన నూతన విద్యుత్ ప్రోజెక్టులను, విరమించుకొని, తద్వారా మిగిలే ఆర్ధిక వనరులు, యీ విధంగా సోలార్ ఎనెర్జీ వుత్పత్తికై ప్రోత్సాహకాల రూపంలొ అందించవచ్చు. నూనె, బొగ్గు, అణు యింధనం,వగైరాలను, యితర సామాజిక అవసరాలకు, శాంతియుత ప్రయోజనాలకు, అభివ్రుధ్ధికి, మళ్ళించ వచ్చు..
ప్రస్తుతం కెనడాలో వికేంద్రిత సోలార్ విద్యుదుత్పత్తి ఇంటింటా ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతోంది. స్పైన్ దేశంలో11M.W to 50M.W వరకు,అమెరికాలో 64M.W నుండి 354 M.W వరకూ భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ వుత్పత్తి చేస్తున్నారు.
మనం మన దేశం లో భారీ సోలార్ ప్రోజెక్టులు నిర్మించనవసరం లేదు.కెనడా దేశ విధానాన్ని కూడా పాటించనవసరం లేదు.పెద్ద సోలార్ ప్రోజెక్టులకయ్యేద్రవ్యాన్ని ,భవిష్యదవసరాలు ద్రుష్టిలో వుంచుకొని ప్రతి గ్రుహస్తుకు వారి వారి అవసరానికి విద్యుత్ వుత్పాదన చేసుకొని నిలవ చేసుకొనే పరికరాలను వుచితంగానో, సబ్సిడీ ధరలకో యేర్పాటు చేసి యిస్తే , ప్రతి యింటా విద్యుద్పత్తి జరిగి, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుదుత్పత్తినుండి గ్రుహావసరాలకు యివ్వ వలిసిన అవసరం వుండదు. తద్వారా మిగిలిన విద్యుత్ను యితర ప్రయోజనాలకు వినియోగించ వచ్చు. అదే విధంగా అన్ని పరిశ్రమలనూ నిర్బంధ సోలార్ విద్యుదుత్పాదనా సంవిధానంలోకి తెచ్చి,వుత్పత్తి ఖర్చులను నియంత్రించ వచ్చు.
విద్యుత్ లోటును పూడ్చుకొని దేశం పురోగమనం సాధించ వచ్చు. విద్యుదుత్పత్తికై ఆయా దేశాలు ఇంధనవనరులు వినియోగించ వలసిన అవసరంలేదు, ఇంధనం కొరకు యితర దేశాలపై ఆధారపడవలసిన అవసరం లేదు.
ఇంతటి బ్రుహత్తర బహుళ ప్రయోజనాలున్న యింటింటా సోలార్ ఎనెర్జీ వుత్పత్తికీ, వినియోగానికీ ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి, ఆ దిశగా క్రుషి చేసి ఆ ఆశయాన్ని త్వరితగతిన సాధించేందుకు సాంకేతిక నైపుణ్యాన్ని అభివ్రుద్ధి చేసుకొని స్వయం సమ్రుద్ధి సాధించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఇప్పటివరకు ఆ దిశగా క్రుషి జరగకపోయినా పొరపాటు కాక పోవచ్చుకానీ, యికనయినా స్పందించక ఆ దిశగా పయనించకపోతే , దానికై ఆర్ధిక వనరులు సమకూర్చకుంటే అంతకన్న దుర్గతి,ఘోర తప్పిదం మరేమీ వుండదు.
ఈ సూర్యశక్తి వినియోగించి చేసే విద్యుదుత్పాదన వల్ల, యే దేశమైనా ,తమ దేశ యింధన వనరులు వేరెవరో కొల్లగొట్టుకు పోతున్నారనే భావన ఆయా ప్రజల మనోభావాలనుండి తొలగి,వుగ్రవాద భావనలు సమసి పోయి, ప్రస్తుత భయానక ప్రపంచంలోని భయానక వుగ్రవాదం తిరోగమన పధంలో పయనించడానికి సోలార్ ఎనెర్జీ ముఖ్య భూమిక పోషిస్తుందనీ ప్రపంచాన శాంతి పరిఢవిల్లుతుందని నా ఆకాంక్ష.

సోలార్ కుక్కర్ (సౌర వంటపాత్ర)

సోలార్ ఓవన్ లేదా సోలార్ కుక్కర్ (సౌర వంటపాత్ర) అనేది సూర్యరశ్మిని శక్తి సాధనంగా ఉపయోగించే పరికరం. వాటిని ఉపయోగించటానికి ఏ విధమైన ఇంధన అవసరం లేనందున మరియు వాటి ఉపయోగం ఎటువంటి ఖర్చుతో ముడిపడి లేనందు వలన, వంటచెరకును ఉపయోగించడానికి అడవులను నరకటం మరియు సేద్య భూములు ఎడారులవటం తగ్గించటానికి వీటి వాడకాన్ని మానవతావాద సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నాయి. సౌర కుక్కర్లు ఆరుబయట వంటచేసే విధానాన్ని కలిగి ఉంటాయి, మరియు ఇవి తరచుగా అతి తక్కువ ఇంధన వాడకం ముఖ్యంగా ఉన్న సందర్భాలలో లేదా ప్రమాదకర మంటల యెుక్క అపాయం అధికంగా ఉన్నచోట ఉపయోగించబడుతుంది.

రకాలు

సౌర కుక్కర్లలో అనేక రకాలు ఉన్నాయి: దాదాపు 65 ప్రధాన నమూనాల్లో, వందల కొద్దీ వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. అన్ని సౌర కుక్కర్ల యెుక్క ప్రాథమిక సూత్రాలలో:

 • సూర్యరశ్మిని సాంద్రీకరించటం: ఒక సాధనం, సాధారణంగా ఒక అద్దాన్ని లేదా ఒక రకమైన పరావర్తన లోహాన్ని ఉపయోగించి చిన్నగా ఉన్న వంటచేసే ప్రాంతంలో సూర్యరశ్మిని మరియు ఉష్ణాన్ని సాంద్రీకరిస్తారు, దీనివల్ల శక్తి మరింత సాంద్రీకరించబడి తద్వారా శక్తివంతం అవుతుంది.
 • సూర్మరశ్మిని ఉష్ణంగా మార్చటం: సౌర కుక్కర్ యెుక్క లోపలి భాగంలో ఏదైనా నల్ల రంగు, అలానే పాత్రల కొరకు ఉన్న అట్లాంటి పదార్థాలు కాంతిని ఉష్ణంగా మార్చటంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఒక నల్లటి పాత్ర దాదాపు మొత్తం సూర్యరశ్మిని అంతా గ్రహించి దానిని ఉష్ణంగా మారుస్తుంది, ముఖ్యంగా కుక్కర్ సమర్థతను మెరుగుపరుస్తుంది. ఇంకనూ, పాత్ర ఎంత మంచి ఉష్ణ వాహకత కలిగి ఉంటుందో అంత వేగంగా ఓవెన్ పనిచేస్తుంది.
 • ఉష్ణాన్ని పొందడం: కుక్కర్ లోపల గాలిని బయట గాలితో వేర్పాటు చేసిన తరువాత, కుక్కర్ ముఖ్యమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. గట్టిగా ఉన్న ప్లాస్టిక్ బ్యాగు లేదా గాజు మూత వంటిది ఉపయోగించి కాంతిని లోపలికి ప్రవేశింపచేస్తారు, కానీ ఒకసారి కాంతిని గ్రహించి ఉష్ణంగా మార్చినప్పుడు, ఆ ప్లాస్టిక్ బ్యాగు లేదా గాజు మూత ఉష్ణాన్ని లోపలే బంధిస్తాయి. దీనివల్ల చలి మరియు గాలులు వీస్తున్న రోజులలో మరియు వేసవి కాలంలో ఒకే ఉష్ణోగ్రతలను చేరటానికి సాధ్యం చేస్తుంది.
 • ప్లాస్టిక్ షీటు: ఓవెన్లోకి ద్రవాలు కారకుండా చూడడానికి ప్లాస్టిక్ షీటులను ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఓవెన్లో అడుగున ఉన్న షీటుకు మచ్చలు పడకుండా ఆపటానికి వేయబడుతుంది.

ఈ పద్ధతులలో ఏదో ఒకదానితో సౌర శక్తిని ఉపయోగించి ఏదైనా వండటం అనేది ప్రభావవంతంగా ఉండదు, కానీ చాలావరకు సౌర కుక్కర్లు ఈ పద్ధతులలో రెండు లేదా మొత్తం మూడింటిని వండటానికి కావలసినంత ఉష్ణోగ్రతల కొరకు సమ్మేళనంలో ఉపయోగిస్తాయి.
పైన మూతను సాధారణంగా తీసి ఆహారాన్ని కలిగి ఉన్న ముదురు రంగు పాత్రలను అందులో ఉంచుతారు. మెరిసే లోహాలు లేదా ఫాయిల్ వస్తువుల యెుక్క ఒకటి లేదా రెండు పరివర్తనాలను అధిక కాంతి ఓవెన్ లోపలి భాగంలో పడటానికి ఉంచబడతాయి. వంట పాత్రలు మరియు కుక్కర్ యెుక్క అడుగుభాగం ముదురు రంగులో లేదా నల్లగా ఉండాలి. లోపలి గోడలు రేడియోయాక్టివ్ ఉష్ణ నష్టాన్ని తగ్గించటానికి మరియు కాంతిని పాత్రల వైపు మరియు ముదురు రంగు అడుగు భాగం వైపు ప్రసరింపచేయటానకి పరావర్తనంగా ఉంటుంది, ఇది పాత్రతో సంబంధం కలిగి ఉంటుంది.

బాక్స్ కుక్కర్లు

సౌర బాక్స్ కుక్కర్ కొరకు లోపలి అవిద్యుద్వాహకం ఉష్ణోగ్తతలను 150°C (300 °F) వరకూ కరగకుండా లేదా వాయువులను వదలకుండా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. నలిగిన వార్తాపత్రికలు, ఉన్ని, చెత్త, ఎండు గడ్డి, కార్డుబోర్డు షీట్లు, మొదలైనవాటిని కుక్కర్ గోడలను అవిద్యుద్వాహకంగా చేయటానికి ఉపయోగించవచ్చు, కానీ చాలా వరకూ ఉష్ణం గాజు లేదా ప్లాస్టిక్ మూత నుండి పోవడంవలన చాలా తక్కువ అవిద్యుద్వాహకం అవసరం అవుతుంది. పారదర్శకంగా ఉన్న పైమూత గాజుదిగా ఉండాలి, ఇది చాలా కాలం వస్తుంది కానీ పనిచేయటం కష్టం, ఓవెన్ వంట బ్యాగు తేలికగా, చవకగా, మరియు పనిచేయటానికి సులభంగా ఉంటుంది, కానీ తక్కువకాలం పనికి వస్తుంది. ముదురు రంగు పాత్రలు/లేదా అడుగు ట్రేలు కనబడకుండా ఉండాలి, వీటిని ఫ్లాట్-బ్లాక్ స్ప్రే పైంట్ (వేడి చేసినప్పుడు విషపూరితం కానిది), నల్లని టెంపెరా పైంట్ లేదా మంట నుండి వచ్చిన మసి ద్వారా నల్లగా చేయబడతాయి.
సౌర బాక్స్ కుక్కర్ ముఖ్యంగా 150 °C (300 °F)ఉష్ణోగ్రతలకు చేరుతుంది. ఇది మామూలుగా ఉపయోగించే ఓవెన్ అంత వేడిని కలిగి ఉండదు, కానీ కొంత ఎక్కువ సమయంలో ఆహారాన్ని వండటానికి సరిపోయేంత వేడిని కలిగి ఉంటుంది. ఏ సందర్భంలోనైనా అధిక తేమ ఉన్న ఆహారం 100 °C (212 °F) కన్నా అధింకగా వేడవ్వదు, అందుచే ప్రామాణిక వంటపుస్తకాలలో సూచించిన విధంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద ఎల్లప్పుడూ వండాల్సిన అవసరం లేదు. ఆహారం మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలకు చేరే అవకాశం లేనందున, కుక్కర్ను రోజంతా మాడిపోకుండా అలానే వదిలి వేయవచ్చు. అయిననూ మధ్యాహ్నంకు ముందు వంట ఆరంభించటం ఉత్తమం. అక్షాంశం మరియు వాతావరణం మీద ఆధారపడి, ఆహారాన్ని త్వరగా లేదా రోజులో తరువాయి భాగంలో వండబడుతుంది. కుక్కర్ను ఆహారం మరియు పానీయాలను వేడి చేయడానికి ఇంకా నీరు లేదా పాలను పాశ్చరైజ్ చేయడానికి ఉపయోగిస్తారు.
సౌర బాక్స్ కుక్కర్లను స్థానికంగా లభ్యమయ్యే లేదా కర్మాగారంలో అమ్మకానికి తయారయ్యే వస్తువులతో తయారవుతాయి. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఒకపూట ఆహారం తయారుచేసుకులే వీలుగా, చిన్న కార్డుబోర్డు సాధనాల నుండి చెక్క మరియు గాజు బాక్సుల వరకూ ఉండే పరిధిలో ఇంటిలో అధికంగా ఎండ వచ్చే ప్రాంతంలో నిర్మిస్తారు. దీనిని 1767లోనే స్విస్ పర్యావరణ పరిశోధకుడు హోరాస్ డే సస్యూర్ కనుగొన్నప్పటికీ, సౌర బాక్స్ కుక్కర్లు ప్రజాదరణను 1970ల నాటినుండి పొందాయి. ఆశ్చర్యకరంగా ఉండే అతి సులభమైన మరియు ఉపయోగకరమైన సాధనాల పెరుగుతున్న సంఖ్యను ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ చూడవచ్చు. ప్రతి దేశం కొరకు వివరణాత్మక వికీ పేజీల యెుక్క సూచికను ఇక్కడ కనుగొనవచ్చును.

పానెల్ కుక్కర్లు

పానెల్ సౌర కుక్కర్లు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న సౌర కుక్కర్లు, ఇవి మెరిసే పానళ్ళను నేరుగా పారదర్శకంగా ఉన్న ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న వండే పాత్ర మీద సూర్యకాంతి పడేటట్టు చేస్తుంది. దీనిలో సాధారణ మోడల్ కూకిట్. 1994లో సోలార్ కుక్కర్స్ ఇంటర్నేషనల్చే అభివృద్ధి చేయబడింది, అల్యూమినియం ఫాయిల్ వంటి దానిని కత్తిరించి వెనుక వైపు కారుగేటెడ్ కార్డుబోర్డులను సాధారణంగా పెట్టిన ఒక పరావర్తన వస్తువును అతికించి దీనిని తరచుగా స్థానికంగానే తయారుచేయబడుతుంది. ఇది తేలికగా ఉండి నిల్వ కొరకు మడవబడుతుంది. ఇది పూర్తిగా తెరిస్తే, మూడు అడుగుల వెడల్పు నాలుగడుగుల పొడవు ఉంటుంది(1 మీ బై 1.3 మీ). పెద్దమొత్తంలో ఉపయోగించే వస్తువులను కొనటానికి US$5 అవుతుంది. అయిననూ, కూకిట్లు పూర్తిగా సంస్కరించబడిన వస్తువులతో చేయవచ్చు, ఉపయోగించిన కార్డుబోర్డులు మరియు సిగరెట్టు పెట్టెలలోని ఫాయిల్ వంటివి ఇందులో ఉంటాయి.
కూకిట్ను కనిష్ట-నుండి-మధ్యస్థ ఉష్ణోగ్రతల సౌర కుక్కర్గా భావించబడుతుంది, తేలికగా చేరే ఉష్ణోగ్రతలు నీటిని లేదా బియ్యం వంటి ధాన్యాలను వండడానికి బాగా సరిపోతాయి. వేడిగా ఉన్న రోజున, ఒక కూకిట్ ముగ్గురు లేదా నలుగురు ఉన్న కుటుంబానికి సరిపోయే అన్నం, మాంసం లేదా కాయకూరలను వండటానికి కావలసినంత సౌర శక్తిని సేకరిస్తుంది. పెద్ద కుటుంబాలు రెండు లేదా మూడు కుక్కర్లను ఉపయోగిస్తాయి.
పానెల్ కుక్కర్ను ఉపయోగించడానికి, దీనిని ఒక గిన్న ఆకారంలో మడవబడుతుంది. ఆహారాన్ని ముదురు-రంగు ఉన్న పాత్రలో ఉంచి, గట్టిగా మూతతో మూయబడుతుంది. పాత్రను ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి కట్టివేసి క్లిప్పు పెట్టబడుతుంది లేదా మూసివేయబడుతుంది. పానెల్ కుక్కర్ను ఆహారం ఉడికేంతవరకూ నేరుగా సూర్యకాంతి వద్ద ఉంచబడుతుంది, ఒక పూర్తి కుంటంబానికి అవసరమయిన ఆహారంను చేయటానికి అనేక గంటల సమయం అవసరం అవుతుంది. త్వరితంగా వంటచేయటానికి, గిన్నెను కర్రలు లేదా వైర్లతో పైకి ఎత్తబడి ఉండేట్టు చేస్తారు, దీని ద్వారా వేడిగాలి అడుగుభాగం కూడా చేరేట్టు చేస్తుంది.
అధిక-ఉష్ణోగ్రత ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను (ఓవెన్ రోస్టింగ్ బ్యాగులు) నెలకన్నా ఎక్కువ సమయం మరలమరల ఉపయోగించుకోవచ్చు, ప్లాస్టిక్ బ్యాగుకు కావలసిన జాగ్రత్తలు తీసుకొని (కర్రలు లేదా వైర్లు వంటివి) వేడిగా ఉన్న వంట పాత్రను తాకకుండా మరియు కరిగి దానికి అతుక్కోకుండా ఉంటేనే ఏదైనా ప్లాస్టిక్ బ్యాగు పనిచేస్తుంది. పాత్రకు అతుక్కొని వేడి పడిన గాలిని ఉంచడానికి ప్లాస్టిక్ బ్యాగు ఉద్దేశింపబడుతుంది; దీనితో ప్రకాశవంతమైన మరియు గాలిలేని రోజులలో అవసరం ఉండకపోవచ్చు.
హాట్ పోట్ వంట పాత్ర లో ముదురు రంగు కుండ ఇంకా ఆ కుండలో మూత కలిగిన తెల్లటి కుండ అమర్చబడి ఉంటుంది.
US NGO సోలార్ హౌస్హోల్డ్ ఎనర్జీ, ఇంక్. చేత ఇటీవల అభివృద్ధి చేసినది హాట్పాట్. ఈ వంట పాత్రలోని కుక్కర్ ఒక పెద్ద ఖాళీ పాత్ర మరియు మూత ఉండి ఒక ముదురు పాత్రను పెట్టే విధంగా ఉంటుంది. ప్రతి వేడిచేసే ఓవెన్కు ఈ ఆకృతి ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే వంటచేసే సమయంలో సూర్యుడు పాత్ర యెుక్క ప్రక్కల మరియు అడుగు మీద వేడిని ప్రసారం చేయగలుగుతాడు. ఇంకొక ప్రయోజనం ఏమంటే పారదర్శకంగా ఉన్న మూత నుండి ఆహారం ఉడుకుతున్నప్పుడు మూత తీయకుండా ఆహారంను గమనించడానికి అనుమతిస్తుంది. పానెల్ కుక్కర్లో ప్లాస్టిక్ బ్యాగుల వాడకంకు ప్రత్యామ్నాయంగా హాట్పాట్ అందిస్తుంది.

సౌర కెటెల్స్

సౌర కెటెల్స్ అనేవి సౌర ఉష్ణ సాధనాలు, సౌర శక్తి ఒక్కదాని మీద నమ్మకం ద్వారా నీటిని మరిగే స్థితికి తీసుకువెళ్ళవచ్చు. విలక్షణంగా ఇవి వదిలివేయబడిన సౌర గ్లాస్ ట్యూబ్ సాంకేతికతను కెటెల్ను శక్తివంతం చేయడానికి అవసరమయ్యే సౌర శక్తిని పొందటానికి. పెంపొందించటానికి మరియు నిల్వచేయడానికి ఉపయోగించబడుతుంది. సౌర వాక్యూం గ్లాస్ ట్యూబ్ల స్తబ్ద అత్యధిక ఉష్ణోగ్రత 220 °C (425 °F) ఉండటంవలన ద్రవ్యాలను వేడి చేయటంతో పాటు, సౌర కెటెల్స్ శుష్క ఉష్ణాన్ని కూడా విడుదల చేస్తుంది మరియు ఓవెన్లు ఇంకా ఆటోక్లేవ్ల వలే పనిచేస్తుంది. ఇంకనూ, సౌర వాక్యూం గ్లాస్ ట్యూబులు సేకరించబడిన లేక సాంద్రీకరించబడిన థర్మల్ శక్తి మీద పనిచేస్తుంది, సౌర కెటెల్స్కు కేవలం విసరణ అయిన సూర్యకాంతి అవసరం అవుతుంది మరియు సూర్యునిని అనుసరించవలసిన అవసరం లేనే లేదు. ఒకవేళ సౌర కెటెల్స్ సౌర వాక్యూం ట్యూబు సాంకేతికతలను ఉపయోగిస్తాయి, వాక్యూం అవిద్యుద్వాహక లక్షణాలు ఇంతక్రితం వేడైన నీటిని రాత్రీ అంతటా వేడిగా ఉంచుతాయి.

పారాబొలిక్ కుక్కర్లు

సౌర కుక్కర్ల యెుక్క ఈ రకాలు వండగలిగి అలానే కన్వెన్షనల్ ఓవెన్గా ఉన్నప్పటికీ, వీటిని నిర్మించటం కష్టం. పారాబొలిక్ కుక్కర్లు గరిష్ట ఉష్ణోగ్రతలను చేరి తొందరగా వంటను చేస్తాయి, కానీ సురక్షితమైన పని కొరకు తరచు సవరణ మరియు పర్యవేక్షణ అవసరం అవుతుంది. అనేక వందల వేలు ముఖ్యంగా చైనాలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా అతిపెద్ద స్థాయిలోని సంస్థాగతమైన వంటలకు ఉపయోగపడతాయి.
పారాబొలిక్ పరావర్తనాల వస్తువుల యెుక్క కేంద్ర బిందువులు వాటి యెుక్క ముఖ్య బిందువులతో కలసి ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని సూర్యుని కదలికలకు అనుగుణంగా తేలికగా, అక్షాన్ని కేంద్ర బిందువు నుండి వెళ్ళేటట్టు త్రిప్పవచ్చును. అందుచే వంటచేసే పాత్ర స్థిరంగా ఉంటుంది. ఒకవేళ పారాబోలాయిడ్ అక్షసౌష్టవంగా ఉంటే మరియు ఒకే రకమైన మందంగా ఉన్న పదార్థంతో చేసినప్పుడు, పారాబోలోయిడ్ దానియెుక్క పొడవు కన్నా 1.8478 ఉంటే ఈ పరిస్థితి వస్తుంది.
సౌర బౌల్ అనేది భారతదేశం ఆరోవిల్లెలో సౌర వంటగదిలో ఉపయోగిస్తున్న ఒక అసాధారణ సాంద్రీకృత సాంకేతికత. పరావర్తన విధానాలను అనుసరించే దాదాపు అన్ని సాంద్రీకృత సాంకేతికాలలా కాకుండా, సౌర బౌల్ అచల గోళీయ పరావర్తనాన్ని ఉపయోగిస్తుంది. ఈ పరావర్తనం గోళం యెుక్క ఉపరితలంకు లంబంగా ఉన్న గీత వెంట పరావర్తనం కాంతిని కేంద్రీకరించింది మరియు కంప్యూటర్ నియంత్రణా విధానం ఈ గీతను కలవడానికి రిసీవర్ను కదిలిస్తుంది. 150°C ఉష్ణోగ్రతను చేరేవరకూ సౌర బౌల్ యెుక్క రిసీవర్లో ఆవిరి ఉత్పత్తి చేయబడుతుంది మరియు 2,000 భోజనాలు రోజూ తయారయ్యే వంటగదిలో ఉష్ణాన్ని ప్రసరింప చేయటానికి ఉపయోగిస్తారు.

హైబ్రిడ్ కుక్కర్లు

హైబ్రిడ్ సౌర ఓవెన్ అనేది ఒక సౌర బాక్స్ కుక్కర్, ఇందులో మేఘావృతమైన రోజులు లేదా రాత్రిపూట వంటచేయడానికి కన్వెన్షనల్ ఎలెక్ట్రికల్ హీటింగ్ ఎలిమెంట్ను ఉంచబడుతుంది. హైబ్రిడ్ సౌర ఓవెన్లు అందుచే స్వతంత్రంగా ఉంటాయి. అయినప్పటికీ, సౌర కుక్కర్ల యెుక్క ఇతర రకాలలో ఉన్న ధర సౌకర్యాలు ఇందులో లేవు, మరియు అందుచే ఇవి విద్యుత్చక్తి లేదా ఇంధన వనరులు లేని మూడవ ప్రపంచ దేశాలలో ప్రభావితం చేయలేక పోయాయి.
హైబ్రిడ్ సౌర గ్రిల్లో కదలగలిగే గ్రిల్ ఉపరితలంతో ట్రిపాడ్ నుండి వచ్చిన సవరణ చేయగలిగే పారాబొలిక్ పరావర్తనంను కలిగి ఉంటుంది. ఈ సౌర బాక్స్ కుక్కర్లు ఉష్ణోగ్రతల పరిధిలో మరియు ఉడికే సమయాలలో ప్రభావవంతంగా ఉంటాయి. సౌరశక్తి లభ్యంకానప్పుడు, ఈ ఆకృతి ఏదైనా కన్వెన్షన్ ఇంధనాన్ని ఉష్ణ మూలంగా చేసుకుంటుంది, ఇందులో వాయువు, విద్యుత్ఛక్తి, లేదా వంటచెరకు ఉన్నాయి.

సౌర కుక్కర్ వాడకం

సౌర కుక్కర్ల యెుక్క వివిధ రకాలు వాడకంలో వేర్వేరు పద్ధతులను కలిగి ఉన్నాయి, కానీ ఒకేరకమైన ప్రాధమిక సూత్రాలను అనుసరిస్తాయి.

ఆహారాన్ని ఓవెన్ లేదా స్టవ్ మీద వండిన విధంగానే వండుతారు. చిన్న ముక్కలుగా ఉంటే ఆహారం తొందరగా ఉడుకుతుంది కాబట్టి, సౌర కుక్కర్లో ఆహారాన్ని మామూలుగా కన్నా చిన్న ముక్కలుగా చేస్తారు. ఉదాహరణకి, బంగాళదుంపలను మొత్తంగా ఉడికించకుండా కొరకటానికి వీలయిన పరిమాణంలో ముక్కలు చేస్తారు. వెన్న లేదా ఛీజ్ కరగపెట్టడం వంటి అత్యంత సులభమైన వంటకొరకు, మూత అవసరం ఉండకపోవచ్చు మరియు ఆహారాన్ని మూతలేని ట్రే లేదా గిన్నెలో పెడతారు. ఒకవేళ అనేక ఆహారాలను వేరువేరుగా వండవలసి వస్తే, వాటిని వేర్వేరు పాత్రలలో ఉంచడుతుంది.
ఆహార పాత్రను సౌర కుక్కర్ లోపల ఉంచబడుతుంది, అయితే దీనిని ఇటుక, రాళ్ళు, మెటల్ ట్రివెట్, లేదా ఇతర ఉష్ణ రంధ్రంతో ఎత్తపెట్టబడతాయి, మరియు సౌర కుక్కర్ను నేరుగా సూర్యకాంతి వద్ద ఉంచబడుతుంది. సౌర కుక్కర్ పూర్తిగా సూర్యకాంతి వద్ద నేరుగా ఉంటే, సౌర కుక్కర్ యెుక్క నీడ దగ్గరలో ఉన్న ఏదైనా వస్తువు యెుక్క నీడ మీద విస్తరించదు. త్వరితంగా ఉడికే ఆహారాలను సౌర కుక్కర్లో తరువాత జతచేయబడతాయి. మధ్యాహ్న భోజనానికి అన్నంను ఉదయాన్నే ఆరంభించి కాయకూరలు, ఛీజ్ లేదా మాంసంను సౌర కుక్కర్లో కొంత పొద్దు గడచిన తరువాత జతచేస్తారు. సౌర కుక్కర్ యెుక్క పరిమాణం మరియు వండబడిన ఆహారాల సంఖ్య ఇంకా పరిమాణం మీద ఆధారపడి, ఒక కుటుంబం ఒకటి లేదా ఎక్కువ సౌర కుక్కర్లను వాడుతుంది.
సౌర కుక్కర్ను సూర్యుని వైపు త్రిప్పి ఆహారం ఉడికేవరకూ అలానే ఉంచబడుతుంది. ఒక గంటకన్నా ఎక్కువగా నిరంతరం దృష్టిని సారించవలసిన అవసరమున్న స్టవ్ లేదా వంటచెరకు మీద వంట చేసినట్టు కాకుండా, సౌర కుక్కర్లో ఆహారంను త్రిప్పవలసిన లేదా కలపవలసిన అవసరం సాధారణంగా లేదు, ఎందుకంటే అది అవసరం లేదు మరియు సౌర కుక్కర్ను తెరిస్తే లోపల చిక్కుకొని ఉన్న వేడి బయటకు వెళ్ళిపోయి ఉడికే పద్ధతిని నిదానం చేస్తుంది. అవసరమయితే, సౌర కుక్కర్ను ఒకటి లేదా రెండు గంటలకొకసారి పరీక్షించవచ్చు, సూర్యుని వైపుకు మరింత దగ్గరగా తిప్పటం మరియు ప్రక్కన ఉన్న భవంతులు లేదా వృక్షాలు సూర్యకాంతికి అడ్డగాలేవని చూసుకోవడం వంటివి చేసుకోవాలి. ఒకవేళ రోజులో అనేక గంటలపాటు ఆహారాన్ని చూసుకోకపోతే, సౌర కుక్కర్ ప్రస్తుతం సూర్యుడు ఉన్న వైపు కాకుండా నడినెత్తిమీద ఉన్నవైపే తిరిగి ఉంటుంది.
ఉడికేసమయం ప్రధానంగా ఉపయోగించిన ఉపకరణం, ఆ సమయంలో సూర్యకాంతి, మరియు ఉడకవలసిన ఆహారం యెుక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది,. వాయు ఉష్ణోగ్రత, గాలి, మరియు అక్షాంశం కూడా పని చేయటాన్ని ప్రభావితం చేస్తాయి. ఆహారం తెల్లవారు జామున లేదా మధ్యాహ్నం దాటిన సమయానికన్నా సౌర మధ్యహ్నంకు ముందు రెండు గంటలు లేదా తరువాత రెండు గంటలలో వేగంగా ఉడుకుతుంది. ఆహారం యెుక్క పెద్ద పరిమాణాలు మరియు పెద్ద ముక్కలలో ఆహారం ఉడకటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా, వండే సమయం కొరకు సాధారణ సంఖ్యలను ఇవ్వబడతాయి. చిన్న సౌర పానెల్ కుక్కర్ కొరకు, వెన్నను కరిగించటానికి 15 నిమిషాలు, కుక్కీలను బేక్ చేయడానికి 2 గంటలు, మరియు నలుగురు మనుషులకు అన్నం ఉడకపెట్టటానికి 4 గంటలు పడుతుంది. అయినప్పటికీ, స్థానిక పరిస్థుతులు మరియు సౌర కుక్కర్ రకం మీద ఆధారపడి, ఈ ప్రక్రియ సగం లేదా రెండింతల ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి.
సౌర కుక్కర్లో ఆహారం మాడిపోవటం అనేది కష్టం. కావలసినదాని కన్నా ఒక గంట అధికంగా వండిన ఆహారంను తక్కువసేపు వండిన ఆహారం నుండి వేరుచేసి చెప్పలేరు. ఈ నియమానికి మినహాయింపు పచ్చటి కాయకూరలు, ఇది ఖచ్చితంగా ఉన్న మదురు ఆకుపచ్చ నుండి వేగంగా కొంతవరకూ కావలసిన రంగును కలిగి ఉండి ఆలివ్ కాంతివిహీనమైన రంగుకు మారుతుంది.
అన్నం వంటి ఆహారాల కొరకు, అది పూర్తిగా ఉడికిన తరువాత అది దేనిని ఉపయోగించి వండారో చెప్పటం కష్టం. అయినప్పటికీ కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి: బ్రెడ్ మరియు కేకుల అడుగు భాగం బ్రౌన్ అవ్వకుండా పైభాగం అవుతుంది. వంటచెరకు మీద వండటంతో పోలిస్తే, ఆహారం పొగ వాసనను కలిగి ఉండదు.

ప్రయోజనాలు

సౌర ఓవెన్లు కేవలం ప్రత్యామ్నాయ శక్తి ఉత్పత్తి చిత్రంలో కేవలం ఒక భాగం, కానీ అది అధిక సంఖ్యలో ప్రజలకు చేరువులో ఉంది. నమ్మదగిన సౌర ఓవెన్ను రోజువారీ వస్తువులతో కొన్ని గంటలలో నిర్మించకోవచ్చు లేదా తయారుగా ఉన్నదాన్ని కొనుగోలుచేయవచ్చు.
కన్వెన్షన్ ఓవెన్ లేదా స్టవ్లలో తయారుచేసే దేనినైనా బ్రెడ్ను బేక్ చేయడం నుంచి కాయకూరలను ఉడికించడం, మాంసాన్ని కాల్చడం వరకూ అన్నింటినీ చేయడానికి సౌర ఓవెన్లను ఉపయోగిస్తారు. సౌర ఓవెన్లను బయట ఉంచడం వలన, గృహాలలో అనవసర వేడిని కలిగించవు. దాదాపు USలోని మూడొంతుల గృహాలు ఒకసారికి వేడి భోజనంను తయారు చేసుకుంటారు; ఒక వంతువారు రెండు లేదా మూడింటిని చేసుకుంటారు. చాలా వరకూ ఈ భోజనాలను తక్కువ ఇంధన-కేంద్రీకృతమైన సౌర ఓవెన్ ఉపయోగించి తయారు చేస్తారు, అయిననూ అపార్టుమెంటులు లేదా పట్టణగృహాలలో నివసించే ప్రజలు సౌర కుక్కర్ను ఉపయోగించటానికి చాలా తక్కువ ప్రదేశం లేదా బయట స్థలం లేకుండా ఉన్నాయి.
వంటచెరకు ద్వారా వంటచేయడం వలన ఇంటిలోపల ఆరోగ్యం దెబ్బతీసే కలుషితాల యెుక్క సాంద్రీకృతం వలన కార్బన్ మోనాక్సైడ్ను మరియు ఇతర నోక్సియస్ మంటలను అనుమతించదగిన పరిమితుల కన్నా అధికంగా ఏడు మరియు 500 సార్ల మధ్య విడుదల చేస్తుంది.

అప్రయోజనాలు

సౌరశక్తితో వంటచేయడం అనేది ప్రపంచంలోని అనేక భాగాల్లో వంటచేయడానికి ఉన్న నూతన విధానం, ఇందులో అతిపెద్ద సాహసాలు ఏమంటే పూర్తిగా నూతనంగా ఉన్న దీనికి సాంఘిక ఆమోదం పొందడం మరియు మూడు రాళ్ళ మీద వంటచేయడం వంటి సంప్రదాయ వంట పద్ధతులను వదిలివేయడం ఉన్నాయి.
సౌర కుక్కర్లు రోజులో అత్యంత వేడిగా ఉన్న సమయంలో లేక దానికన్నా కొద్ది సమయం తరువాత వేడి ఆహారాన్ని అందిస్తాయి, ఆ సమయంలో ప్రజలు వేడి ఆహారాన్ని తినాలని తక్కువగా భావిస్తారు. అయిననూ, నిదానంగా ఉష్ణాన్ని వాహకం చేసే మందపాటి పాత్ర (కాస్ట్ ఐరన్ వంటివి) ఉష్ణాన్ని మందగతిలో కోల్పోతుంది, ఓవెన్ వియుక్తంతో లేదా బుట్ట వియుక్తంతో కలసి సాయంత్రం దాకా ఆహారాన్ని వేడిగా ఉంచడానికి ఉపయోగించవచ్చు.
సౌర కుక్కర్లు ఓవెన్తో పోలిస్తే ఆహారం వండడానికి అధిక సమయం తీసుకుంటాయి. సౌర ఓవెన్ను ఉపయోగించి వంటచేయాలంటే భోజనానికి చాలా గంటల ముందే ఆహారాన్ని తయారుచేయడం ఆరంభించాలి. అయిననూ, వంటచేయడానికి తక్కువగా కష్టపడవలసి ఉంటుంది, అందుచే దీనిని తరచుగా సరియైన పరిష్కారంగా భావిస్తారు.
సౌర కుక్కర్లు మేఘావృతమైన లేదా వానల వాతావరణంలో తక్కువ ఉపయోగకరంగా ఉంటాయి, అందుచే ఇంధన-ఆధార ఉష్ణ మూలం ఈ సమయాలలో వంట చేయడానికి ఖచ్చితంగా ఇంకనూ లభ్యమవుతుంది.
కొన్ని సౌర కుక్కర్ల ఆకృతులు బలమైన గాలులతో దెబ్బతిన్నాయి, ఇవి ఆహారాన్ని చల్లబరిచి పరావర్తనంను అడ్డగిస్తాయి.

సౌరశక్తితో వంటచేసే ప్రణాళికలు

జర్మనీకు చెందిన మైఖేల్ హోన్స్ సౌరశక్తి ద్వారా వంటచేయడంను లెసోతోలో స్థాపించారు, సౌర ఓవెన్లను ఉపయోగించి చిన్న సమూహాలలో మహిళలు చేరి కమ్యూనిటీ బేకరీలను నిర్మించటానికి మద్ధతును ఇచ్చింది.

డార్ఫుర్ కాందీశీకుల శిబిరాలు

కార్డుబోర్డు, అల్యూమినియం ఫాయిల్, మరియు ప్లాస్టిక్ బ్యాగులను 10,000కు పైగా సౌర కుక్కర్ల కొరకు చడ్లోని ఇరిదిమి కాందీశీకుల శిబిరం మరియు టౌలౌం కాందీశీకుల శిబిరంకు జ్యూయిష్ వరల్డ్ వాచ్, డచ్ ఫౌండేషన్ కోజోన్, మరియు సోలార్ కుక్కర్స్ ఇంటర్నేషనల్ వారి సంయుక్త కృషితో దానం చేయబడినాయి. కాందీశీకులు తమంతట తామే కుక్కర్లను దానంగా ఇవ్వబడిన సరఫరాలు మరియు స్థానికంగా కొనుగోలు చేసిన అరాబిక్ జిగురు ఉపయోగించి నిర్మించుకున్నారు, మరియు వాటిని మధ్యాహ్నం మరియు రాత్రి భోజనాల కొరకు ఉపయోగించేవారు. డార్ఫుర్ మహిళలు వంటచెరకు కొరకు స్థావరాలను వదిలి వెళితే కొట్టబడటం, బలత్కారానికి గురికావడం, కిడ్నాప్ కావడం లేదా హత్యకు గురికావడం వంటి ప్రమాదాలకు అవకాశం ఉండటం వలన, అది తగ్గించే లక్ష్యంగా ఈ ప్రణాళికను ఆరంభించారు. ఇది ఇంకనూ గణనీయంగా మహిళలు బహిరంగంగా నిప్పుల మీద వంటచేయడానికి వెచ్చించే సమయాన్ని తగ్గించింది, మరియు ఫలితంగా వారు ఆరోగ్యవంతులుగా ఉండి సమయం మిగలటం వలన వారు అధిక సమయాన్ని వారి కుటుంబాల కొరకు కూరగాయలను పండించడానికి మరియు చేతికళలను ఎగుమతి చేయడానికి ఉపయోగించారు. 2007 నాటికి, జ్యూయిష్ వరల్డ్ వాచ్ 4,500ల మహిళలకు శిక్షణను ఇచ్చింది మరియు 10,000ల సౌర కుక్కర్లను కాందీశీకులకు అందించింది. ఈ ప్రణాళిక ఆహారాన్వేషణ పర్యటనలను దాదాపుగా 70 శాతం తగ్గించింది, అందుచే దాడుల సంఖ్యను కూడా తగ్గించింది.

భారతీయ సౌర కుక్కర్ గ్రామం

బైసనివారిపల్లె, ఒక సిల్కు-ఉత్పత్తి చేసే గ్రామం, ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల తిరుపతికి 125 కిమీ (80 మీ)దూరంలో ఉంది, ఈరకంగా ఉన్నది ఇది మొదటిది: మొత్తం గ్రామమంతా సౌరశక్తిని ఉపయోగించి వంట చేస్తుంది. ఇంటర్సోల్ అనే ఒక ఆస్ట్రియా ప్రభుత్వేతర సంస్థ, శక్తివంతమైన "Sk-14" పారాబొలిక్ సౌర కుక్కర్ల ఏర్పాటుకు 2004లో చందాలను అందించింది.

గాజా

గాజన్లు వారి వంటలను వండటానికి సౌర కుక్కర్లను వంటల ఇంధనం కొరతవల్ల ఉపయోగించటం ఆరంభించారు. కుక్కర్ను సిమెంటు ఇటుకలు, మట్టితో కలసిన ఎండుచొప్ప మరియు రెండు గ్లాసు షీట్లుతో చేయబడుతుంది. దాదాపు 40 నుండి 45 పాలస్తీనుల గృహాలలో సౌర కుక్కర్లను ఉపయోగించటం ఆరంభించారని తెలపబడింది.

గ్రామీణ భారత దేశం సూర్య శక్తిని ఉపయోగించి కోట్లమందికి వెలుగు చూపిస్తుంది

గ్రామీణాభివృద్ధికి వెలుగు ఒక ముఖ్యమైన అంశం మరియు ముఖ్యమైన వాటిలో ఒకటి మరియు గ్రామీణ ప్రజలు కోరుకునే మౌలిక అవసరం. గ్రామీణ గృహాలలో వెలిగించడానికి చాలామటుకు కిరోసిన్, పిడకలు మరియు కట్టెలు ఉపయోగిస్తారు.

కోట్ల మందికి వెలుగు (ఎల్ ఏ బి ఎల్) ప్రచారం అనేది శుభ్రమైన, నవీన మరియు నమ్మకమైన వెలిగించే వనరులు అందుబాటులో లేని మరియు ప్రస్తుతము వెలిగించడం కోసం కిరోసిన్ ఉపయోగిస్తున్న గ్రామీణ ప్రజలని లక్ష్యంగా తలపెట్టిన, టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్సిటిట్యూట్ (టెరీ) తీసుకున్న చొరవ.

ఎల్ ఏ బి ఎల్ నమూనా అమలు, సేవలకి ఛార్జ్ అనే పద్ధతి మీద ఆధారపడినది. ఇది గృహాలకు, ఎంటర్ ప్రైజ్లకు మామూలు రిఛార్జ్ కి బదులుగా మొబైల్ ఫోన్ రిఛార్జింగ్, బ్యాటరీ రిఛార్జింగ్, నీటిని పరిశుభ్రపరచడం మరియు సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగాలవంటి ఇతర కీలకమైన సేవలు మరియు సోలార్ లాంతర్లు అద్దెకిస్తారు. ప్రణాళికని అమలు చేయడానికి స్థానిక ప్రభుత్వ యూనిట్లు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ రంగంలో అట్టడుగున స్థాయిలో ఉన్న ఎల్ ఏ బి ఎల్ భాగస్వామి సంస్థలతో టెరీ కలసి పని చేస్తుంది. అమ్ముడు అయిన తరువాత సరఫరా మరియు సేవలు ప్రభావితంగా ఉండేలా చూడడానికి సాంకేతిక వనరుల కేంద్రాలు (టి ఆర్ సి) నెట్ వర్క్ ద్వారా ఇది సేవలందుకుంటుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate