పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సౌరజలతాపన విధానము

సౌరజలతాపన విధానము అనేది సౌరశక్తిని ఉపయోగించి గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నీటిని కాచువిధానము.

సౌరజలతాపన విధానము

సౌరజలతాపన విధానము అనేది సౌరశక్తిని ఉపయోగించి గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నీటిని కాచువిధానము. సౌరశక్తితో నీటిని కాచు విధానమనేది ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న విధానం. సౌరజలతాపన విధానము ద్వారా రోజుకు 100 లీటర్ల నీటిని వేడిచేసినట్లైతే,యేడాదికి 1500 యూనిట్ల విద్యుశ్చక్తిని పొదుపు చెయ్యవచ్చు.

సౌరజలతాపన విధానము లోని భాగాలు

 • సౌరజలతాపన విధానము లో సౌరశక్తిని సంగ్రహించేఒక చదరపు పలక,దానివెనుక నీటిని నిలువచేసేందుకు సరిపడా ఎత్తులో ఒక తొట్టి,వీటిని కలిపే గొట్టాలు.
 • ఈ సంగ్రాహక పలకలో రాగిరేకులకు తాపడం చెయ్యబడ్డరాగిగొట్టాలు(రెండిటికీ బాగా తట్టుకునేనల్లటి పూతపూయబడి ఉంటుంది), పైన ఒకదళసరి గాజుపలక,వెనుకవైపు విద్యుత్తుప్రసారాలను నిరోధించే సరంజామా ఉంటాయి.ఇవన్నీ కలిపి ఒక చదరపుపెట్టెలో ఉంటాయి.
 • కొన్ని నిర్దిష్టనమూనాలలో రాగికి బదులుగా లోన గాలిలేకుండా ఖాళీచేయబడిన గాజును వాడతారు.అప్పుడు వేరేదళసరి గాజుపలక,విద్యుత్తుప్రసారాలను నిరోధించే చదరపుపెట్టె అవసరం ఉండదు.

ఈ విధానం ఎలా పనిచేస్తుంది?

 • ఈ విధానాన్ని సాధారణంగా పైకప్పు మీద గాని,లేదా ఆరుబయలులోగాని సౌరశక్తిసంగ్రాహకాన్ని సూర్యునికి అభిముఖంగా,నిరంతరనీటి సరఫరాకు అనుసంధానించి ఏర్పాటు చేస్తారు.
 • గొట్టాలనుంచి నీళ్ళు ప్రవహించి,సౌర ఉష్ణాన్ని పీల్చుకుని వేడెక్కుతాయి
 • వేడేక్కిననీరు తదనంతర్ వినియోగం కోసం తొట్టిలో నిలువ ఉంటాయి
 • తొట్టిలో నిలువ ఉన్న నీళ్ళు తెల్లవార్లూ వేడిగానే ఉంటాయి.వేడిని నిలిపిఉంచే విధంగాతొట్టి ఉండటంవల్ల వేడిని చాలాతక్కువగాకోల్పోతుంది.

సౌరజలతాపన విధానము వల్ల ఉపయోగాలు:

 • వేడినీటిని స్నానానికి,శుభ్రపరచుకోవటానికి,బట్టలను ఉతుక్కోవటానికి ఇంటిలో వేడినీటిని తయారుచేసుకొనవచ్చును.
 • వివిధరకాలైనపారిశ్రామిక పరికరాలకొరకు కూడా ఉపయోగించుకొనవచ్చును.

మేఘావృతమైన/మబ్బులు ఉన్న దినాల్లో సౌరజలతాపన విధానము ఉపయోగము

 • అధికభాగం గృహ సౌరజలతాపన పరికరాలు విద్యుత్తు ప్రత్యామ్నాయాలతో లభిస్తాయి.
 • విద్యుత్తుద్వారా నీటిని వేడిచేసేపరికరాలు నీటినిలువ తొట్టిలో ఉంచుతారు, మేఘావృతమైనదినాల్లో వాటిని వినియోగించుకొనవచ్చును.
 • కొన్ని సందర్భాలలో సౌరజలతాపన పరికరాలు అప్పటికే ఉన్న విద్యుత్తు గీజరుకు కలిపి ఉంటుంది, మేఘావృతమైనదినాల్లోమాత్రం ఆ విద్యుత్తు గీజరును వినియోగించుకొనవచ్చును.

వ్యయం :

రోజుకు వందలీటర్ల సామర్ధ్యమున్నది, సగటున నలుగురైదుగురు ఉన్న కుటుంబానికి ఉపయోగించేది లభించేవాటన్నటిలోఅతిచిన్న సౌరజలతాపన విధానము. ఇది 15, 000/- రూపాయలనుంచి 18 000రూపాయల ధరకు దొరుకుతుంది. ఒక సంవత్శరానికి 1500 యూనిట్ల విద్యుశ్చక్తిని పొదుపుచేస్తుంది.

మరమ్మత్తుల/సర్వీసింగుల లభ్యత:

 • సౌరజలతాపన విధానము ఉత్పత్తిదారులనుంచి,వారి ప్రతినిధులనుండి మరియు 'ఆదిత్య' సౌరదుకాణాల నుండి పొందవచ్చును, ప్రతిస్ధాపితం చేసుకొనవచ్చును.
 • మరమ్మత్తులు/సర్వీసింగు కూడా వారివద్దే లభిస్తాయి.
 • వాటి లభ్యతను గూర్చిన సమాచారాన్ని రాష్ట్రాల నోడల్ ఏజన్సీలవద్ద కూడా సమాచారం లభిస్తుంది.

ఆధారం:అక్షయ్ ఉర్జా న్యూస్ లెటర్ ఆఫ్ యమ్ యన్ ఆర్ ఇ రెండవ సంపుటి,రెండవ సంచిక

తరచుగా అడిగే ప్రశ్నలు

సౌరజలతాపమానాన్ని మనం ఎందుకు ఎంచుకోవాలి?

 • సోలార్ వాటర్ హీటర్లు విద్యుశ్చక్తిని పొదుపుచేస్తాయి,తద్వారా ధనాన్ని కూడా ఎందుకంటే
 • విద్యుశ్చక్తిని చాలా చాలా ఖరీదైనదిగా మారుతోంది,పైగా దాని లభ్యతకూడా నమ్మశక్యం కాదు
 • సోలార్ వాటర్ హీటర్లు కాలుష్యకారకాలు కావు.
 • పైకప్పు మీద ఏర్పాటు చేసినప్పుడు,సోలార్ వాటర్ హీటర్లు విద్యుత్తుతోపనిచేసే గీజర్ల కన్నా సురక్షితమైనవి.

ఈ పద్ధతి మన దేశములో వాడుకలొ ఉన్నదా?
అవును,ప్రతి ఏటా 20,000 పైబడి దేశవ్యాప్తంగా నివాసగృహలలో సోలార్ వాటర్ హీటర్లు నెలకొల్పుతున్నారు.

సోలార్ వాటర్ హీటర్లు ఎలా పనిచేస్తాయి?

 • సోలార్ వాటర్ హీటర్లుపనిచేసేవిధానం తెలుసుకోవటం చాలా సులభం.సోలార్ వాటర్ హీటర్లు రెండుసామాన్య నియమాలను ఉపయోగించుకుని పనిచేస్తాయి.ఎండలో ఉంచినప్పుడు ఒక నల్లని ఉపరితలం అవి సూర్యుని ధార్మికశక్తిని వినియోగించుకొని,వేడెక్కుతుంది.నల్లనిఉపరితలం యొక్కపీల్చుకునే సామర్ధ్యాన్ని వాడుకునిసోలార్ హీటర్లలో సౌరశక్తిని గ్రహించేశక్తినిమెరుగుపరుస్తుంది.
 • ఎక్కువసేపు ఎండలో ఉన్న కారు/బస్సుల లోపలిభాగాలు వేడెక్కుతాయి.ఎందువల్లనగా సూర్యుని ధార్మికశక్తి అద్దాలగుండా లోనికి వెళ్ళగలుగుతుంది,కానీ,వెలుపలకు రాలేదు.అది లోపలచిక్కుకుపోయి బస్సును వేడెక్కిస్తుంది.అలాగే ఎండలో ఉంచిన,వేడిని బయటకు వెళ్ళకుండా అడ్డగించేలా మార్చబడ్డ గొట్టాలద్వారా ప్రవహించేనీరు వేడెక్కుతుంది.సాధారణంగా చదరపు పళ్ళెము వంటి సంగ్రాహకాల్లో ఈరెండిటినీ ఉపయోగిస్తారు.

సోలార్ వాటర్ హీటర్ యొక్క పనితీరు

 • నివాసగృహాలలో వినియోగించే సోలార్ వాటర్ హీటర్లలొ వేడినీటిని నిలువ ఉంచేందుకు ఒక తొట్టి,ఒకటి కానీ అంతకన్నా ఎక్కువకానీ చదరపు పళ్ళెమువంటి సంగ్రాహకాలు ఉంటాయి.
 • ఈ సంగ్రాహకాలు తళతళలాడుతూ సూర్యునికి ఎదురుగా ఉండి సౌర్యధార్మికశక్తిని లోనికి గ్రహిస్తాయి.
 • చదరపు పళ్ళెము వంటిసంగ్రాహకాల లోపలిభాగములో ఉండే నల్లని సంగ్రాహకశక్తి గలిగిన(శోషకం) సౌర్యధార్మికశక్తిని గ్రహించి, తననుంచి ప్రవహిస్తున్న నీటికిఆ శక్తిని బదలాయిస్తుంది.
 • వేడిమికోల్పోని విధంగా మలచిన నీటితొట్టిలోకి వేడినీరు చేరుకుంటుంది
 • నీటితొట్టినుంచి సంగ్రాహకాలకు,మరలా సంగ్రాహకాల నుంచి నీటితొట్టికి నీరు నిరంతరంగా సరఫరా అవుతుంటుంది,దీనికి కారణం చల్లని,వేడినీటిమధ్య ఉండే సాంద్రతలలోని వ్యత్యాసం.(థర్మోసిఫన్ ఎఫెక్ట్)

చదరపు పళ్ళెమువంటి సంగ్రాహకం అంటే ఏమిటి?

 • ఇది సోలార్ వాటర్ హీటర్లవ్యవస్థకు గుండెకాయవంటిది.
 • ఇది ఒకసూర్యునికి ఎదురుగా ఉంచేఉపరితలము పైన పీల్చుకునే(శోషకశక్తి)గల పూతపూయబడిన
 • సంగ్రాహకపళ్ళెము కలిగిఉంటుంది.
 • దీనినే ఎంపికచేసినపూతపూయడం లేదా వరణాత్మకపూత అని కూడా అంటారు.
 • ఈ సంగ్రాహకంలోహపుగొట్టాలు,రేకుల సమూహం ఉంటుంది.
 • నీరు ఈగొట్టాలద్వారా ప్రవహిస్తుంది.
 • రేకు తనపైనపడే ధార్మికశక్తిని సంగ్రహించి నీటికి సరఫరాచేస్తుంది.
 • వాతావరణం నుండి కాపాడేందుకుగాను పైన మూతలేని ఒక తెరచియుంచినపెట్టెలో ఈ సంగ్రాహకపలకను ఉంచుతారు.
 • సంగ్రాహకానికి పెట్టుకు మధ్యన,పక్కన ఉండేఖాళీని వేడిమికోల్పోకుండా ఉంచేలా నిరోధకాలతో నింపుతారు.
 • పెట్టె ముందుభాగము ఉన్నతప్రసారితశక్తి గల గాజుపలకతో మూయబడి ఉంటుంది.
 • నిర్దిష్టంగాఎంచుకునేస్థలాన్నిబట్టి చదరపుపళ్ళెమువంటి సంగ్రాహకాలు ఉంటాయి,మరియు వాటి సామాన్య పరిమాణము 1x2 మీటర్లు.

ఒక విలక్షణమైన సోలార్ వాటర్ వ్యవస్థ

సౌరజలతాపమానవిధానములో ఉపయోగించేసంగ్రాహకాలు ఎన్నిరకాలు?

 • చదరపుపళ్ళెమువంటి సంగ్రాహకాలు,ఇతరరకాలతో పోలిస్తే చౌకగా లభించటం వల్ల భారతదేశములో సాధారణంగా ఉపయోగములో ఉన్ననివాస గృహ సోలార్ వాటర్ హీటర్ వ్యవస్థ,గాలి లేకుండా చేయబడిన (శూన్యీకరణం౦)చెయ్యబడ్డ గొట్టాల సంగ్రాహకాలనూ నివాస గృహ సోలార్ వాటర్ హీటర్ వ్యవస్థకు ప్రతిపాదించారు కానీ అంత సులభముగా లభించవు.కేంద్రీకరించిన సంగ్రాహకాలు విద్యుదుత్పత్తి,మరియు పారిశ్రామిక అవసరాల లాంటి అత్యధిక ఉష్ణోగ్రతా సాధనాలను వాడేచోట్ల అనువుగా ఉంటుంది.

గాలి లేకుండా చేయబడిన(శూన్యీకరణం౦)చెయ్యబడ్డ గొట్టపు సంగ్రాహకాల నివాస గృహ సోలార్ వాటర్ హీటర్

చదరపు పళ్ళెము వంటి సంగ్రాహకం కొనుగోలు చేసేటప్పుడు మనం వేటి కొరకు వెతకాలి?

 • భారతప్రమాణాల సంస్థ సోలార్ వాటర్ హీటర్ లో ఉపయోగించేచదరపు పళ్ళెమువంటి సంగ్రాహకాలకు కొన్ని ప్రమాణాలు నిర్దేశించింది. సరైనముడిసరుకు మీద ఐ యస్ ఐ ముద్ర ఒక హామీ.
 • గమనించదగ్గముఖ్యాంశాలు ఏమనగా,సంగ్రాహకపలక తయారీలో వాడిన పదార్ధాలు,దానిపై పీల్చుకునే పూత ఎలాంటిది,వాడినగాజు పలక నాణ్యత,పెట్టె తయారీకి వాడిన ముడిసరుకు,వేడినిపోనివ్వని నిరోధకపు యొక్క మందము వగైరాలు.

వేడినీటిని నిలువ ఉంచే తొట్టికు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?

 • నివాస గృహాల్లోని సోలార్ వాటర్ హీటర్లలో వేడినీటిని నిలువ ఉంచే తొట్టికి రెండుగోడలుంటాయి.
 • తొట్టికి లొనా,బయటా ఉన్న గోడలమధ్య వేడినికోల్పోకుండా ఉంచేందుకు గాను నిరోధకాలతో నింపుతారు.
 • దీర్ఘకాలికమన్నిక కోసం తొట్టిలోపలి భాగాన్ని రాగితో గాని,స్టెయిన్ లెస్ స్టీలుతో గాని తయారుచేస్తారు.
 • వెలుపలిభాగాన్ని స్టెయిన్ లెస్ స్టీలు,రంగు పూసిన ఉక్కురేకు,లేదా అల్యూమినియం గానీ చెయ్యవచ్చు.
 • సూర్యుడు లేని రొజులలో లేదా నీటి అవసరాలు పెరిగినప్పుడు ఆ కొరతను ఎదుర్కొనేందుకు గాను,థర్మోస్టాట్స్ (తాపస్థాపకాలు)నియంత్రించే వేడిని జనింపచేసే విద్యుత్తుమూలకాలను
 • తొట్టిలో ఉంచడము కూడా ఒక ఐచ్చికంగా వాడుకోవచ్చు.
 • నీటితొట్టి సామర్ధ్యము ఈ పద్ధతిలో వాడిన గ్రహించేస్థలానికి సమానమైన దామాషాలో ఉండాలి.
 • సాధారణమైన నియమమేమిటనగా గ్రహించేస్థలములోని ప్రతి చదరపు మీటరుకు 50 లీటర్ల నిల్వసామర్ధ్యము ఉండాలి.మరీ పెద్దవి లేదా మరీ చిన్నవి నాణ్యతను తగ్గిస్తాయి.

మంచి సోలార్ వాటర్ హీటర్ను ఎలా గుర్తించాలి?

 • పేర్కొన్న సామర్ధ్యానికి తగ్గట్టుగాగ్రహించేస్థలముండాలి అన్నది మొట్టమొదట మంచి సోలార్ వాటర్ హీటరుకుండాల్సిన లక్షణం.
 • ఈవ్యవస్థలో వినియోగించే గ్రహించేస్థలము నీటిని వేడెక్కించే సామర్ధ్యాన్ని నిర్ణయిస్తుంది.ఉదాహరణకు ఉత్తరభారతవాతావరణ పరిస్థితులలో,
 • బాగా ప్రకాశవంతముగా ఉన్న ఒక శీతాకాలపు రోజున ఒక చదరపు మీటరు గ్రహించేస్థలము 30-40° సి.డిగ్రీల శీతోష్ణస్తితి వద్ద సుమారు 50 లీటర్లనీటిని వేడెక్కించగలదని అంచనా.
 • మన దేశములో తయారవుతున్న,విలక్షణమైన చదరపు పళ్ళెమువంటి సంగ్రాహకాలు2 చదరపు మీటర్ల గ్రహించేస్థలాన్ని కలిగి ఉంటాయి,తద్వారా రోజుకు 100లీటర్లనీటిని వేడెక్కించగలవు.
 • ఈ దామాషా ఒక ప్రామాణికంగా పనిచేస్తుంది.
 • ఇంకా,గ్రాహకాలు మంచి ముడిసరుకుతో తయారైఉండాలి,శోషకాలకు మంచినాణ్యత గల పూతపూయబడి ఉండాలి.(భారత ప్రమాణాల సంస్థ ఆమోదం పొందిన గ్రాహకాలు ప్రముఖ ఉత్పత్తిదారులద్వారా లభిస్తున్నాయి)
 • ఈ వ్యవస్థని ఒక ధృఢమైన కట్టడంపై నుంచి,పెనుగాలులు వీచినప్పుడు నష్టం వాటిల్లకుండా పైకప్పుతో గట్టిగా బిగించాలి.

ఎంతపెద్ద విధానాన్ని కొనుగోలు చెయ్యవచ్చు?

 • ప్రాధమికమైన నియమమేమంటే,మనకు అవసరమైన దాని కన్నా తక్కువ సామర్ధ్యమున్నదాన్ని
 • కొనుగోలు చేయటము ఉత్తమం.
 • ఎక్కువ నీరు కావాల్సివచ్చినప్పుడు,నీటిని వేడెక్కించే ఇతర ప్రత్యామ్నాయమార్గాలను ఉపయోగించవచ్చు.
 • తద్వారా ఉత్తమఫలితాలను పొందటమేగాక,నిర్వహణాపరమైన సమస్యలూ తగ్గుతాయి.
 • రోజుకు ఎంతవేడినీరు అవసరమవుతుందో అన్న అంశాన్ని ఖచ్చితంగా అంచనా కట్టటం అత్యుత్తము.
 • అంచనా కట్టేటప్పుడు,సూర్యుడున్న రోజుల్లోనే,ఒక నియమితపరిమాణములో మాత్రమే ఈ సోలార్ వాటర్ హీటర్లు
 • నీటిని వేడెక్కించగలవు అన్న అంశాన్ని గుర్తుంచుకోవాలి.
 • తొట్టి సామర్ధ్యము,గ్రాహకపరిధి యొక్క కలయిక ఈ వ్యవస్థలో నీటియొక్క ఉష్ణోగ్రతను నిర్ణయిస్తాయిఅన్న విషయము కూడా గుర్తుంచుకోవాలి.
 • సహజముగా ఇది 50 – 60°సి,వద్ద ఉంటుంది సాధారణమైన స్నానపునీటి ఉష్ణోగ్రత(40°సి)కన్నా ఇది చాలా ఎక్కువ.
 • దిగువన ఇవ్వబడ్డ పట్టిక ద్వారా కూడా మీ అవసరాలను అంచనా కట్టవచ్చును.
 • నలుగురు పెద్దలున్న ఒక కుటుంబానికి వందలీటర్ల వ్యవస్థ సరిపోతుందన్నది,సౌరనీటి వ్యవస్థలపరిమాణానికి ఒక నిర్దిష్ట ఉదాహరణ.

వేడినీటి అవసరాలకోసం అంచనాలు-కొన్ని ఉపయోగకరమైన నియమాలు

పరికరం

60డిగ్రీలసెంటీగ్రేడు వద్ద కావాల్సిన వేడినీరుC

ఇంటిల్లపాది స్నానాలకు-బక్కెట్లనుపయోగించి

10-20లీటర్లు ఒక్కొక్కరి స్నానానికి

ఇంటిల్లిపాదికి మిశ్రమకొళాయిల షవరు ఉపయోగించిస్నానాలకు

10-15 నిమిషాల స్నానానికి 20-30 లీటర్లు

కొళాయి కారుతుండగా గడ్డం చేసుకోటానికి

7-10 లీటర్లు

ఇంటిల్లిపాది తొట్టిస్నానానికి(ఒక్కసారి నింపి)

50-75లీటర్లు

వాష్ బేసిన్ మిశ్రమకొళాయితో(చేతులు కడుక్కునేందుకు,దంతధావనం వగైరా)

3-5 లీటర్లు ఒక్కొక్కరికి ఒక రోజుకు,

వంటగదిలో శుభ్రపరచటానికి

2-3లీటర్లు ఒక్కొక్కరికి ఒక రోజుకు,

గిన్నెలు కడుగు డిష్ వాషరుకు40

వాషరుకు40-50 లీటర్లు ఒకసారి కడిగేందుకు

బట్టలుతుకు యంత్రం(వాషింగ్ మిషన్)

40-50 లీటర్లు ఒకఉతుక్కు


గమనిక:అన్ని అంచనాలు 60సెంటీగ్రేడు ఉష్ణోగ్రతవద్ద గలవేడినీరుకు మాత్రమే ఇవ్వబడ్డాయి.

ఓక పెద్ద సోలార్ వాటర్ హీటింగ్ వ్యవస్ధ

సోలార్ వాటర్ హీటర్ ధర ఎంత?

 • సోలార్ వాటర్ హీటర్ మొత్తము ధర అనేకవిషయాలపై ఆధారపడి ఉంటుంది.
 • సామర్ధ్యము,ఉపయోగించిన బ్యాక్-అప్ రకము,లోపలతొట్టికి ,వెలుపలతొట్టికి వాడిన ముడిసరుకు, వేడినీటిని స్నానాలగదికి సరఫరాచేసే గొట్టాల పొడవు,సదరు బ్రాండుకున్న విలువ ఇవన్నీ కలిపి పరిగణలొకి తీసుకోవాలి.
 • భారతప్రమాణాల సంస్థ ఆమోదం పొంది,మనదేశములో తయారైన2చదరపు మీటర్లచదరపు పళ్ళెమువంటి సంగ్రాహకపు ధర రూ.15,000-20,000 మధ్యలో ఉంది.కానీ ఈ ధర ప్రామాణికము కాదు, ఉత్పత్తి దారులను బట్టి ఒక ధరల్లో మార్పులుండొచ్చు.

సోలార్ వాటర్ హీటర్ వ్యవస్థను నెలకొల్పేందుకు ఆ స్థలానికి ఉండాల్సినవి.

 • సోలార్ వాటర్ హీటర్ వ్యవస్థ పనిచేసేందుకు కావాల్సిన ప్రాధమిక అవసరం,నిరంతరాయంగా సూర్యరశ్మి లభించటం,
 • సోలార్ వాటర్ హీటర్ వ్యవస్థను ఇంటిపైకప్పు పైనే నెలకొల్పుతారు.
 • ఈ వ్యవస్థలోని సంగ్రాహకాలు సూర్యునికి అభిముఖంగా ఉండాలి,వీలయినంత సూర్యరశ్మిని రాబట్టుకునేందుకు
 • దక్షిణం,పడమర,తూర్పు వైపుగా వీటిని ఉంచాలి.తద్వారా సూర్యరశ్మికి అంతరాయం ఉండదు.
 • దక్షిణదిశ రెండువైపులా 120°, 60°డిగ్రీలవృత్తచాపంవద్ద సాధారణంగానీడపడదు)
 • ఉపయోగించే ప్రతి1 x 2మీటర్ల గ్రాహకస్థలానికి నీడపడని3 చదరపు మీటర్ల స్థలం అవసరం అనేది సాధారణ నియమం.
 • ఆ స్థలం చదునుగా,వాననీటిపారుదలకు దూరంగా,వేడినీటిని వాడేస్నానాలగదికి సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా చూడాలి.
 • ఈ వ్యవస్థ మట్టము నుండి సుమారు 2.5 మీటర్ల ఎత్తులో చల్లనినీరు లభించాలి.

పైకప్పు మీదే కాక ఇంకెక్కడన్నా ఈ విధానాన్ని నెలకొల్పవచ్చా?

 • ఈ వ్యవస్థను దక్షిణం వైపున్న గోడకు కొక్కానికి తగిలించి నెలకొల్పవచ్చు. కానీ ఈ పద్ధతి కష్టసాధ్యము,అదనపు వ్యయంకూడా అవుతుంది.
 • కొక్కానికి తగిలించేటప్పుడు సక్రమంగా బిగించాలి.
 • మరమ్మత్తులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి.
 • ఉపయోగించే స్థలానికి దగ్గరగా ఉండటంతో నీటిని సరఫరా చేసే గొట్టాలకయ్యే వ్యయం ఈ ఏర్పాటువల్ల తగ్గుతుంది.

నీటిసరఫరా సక్రమంగా లేకపోతే ఏమి జరుగుతుంది?

 • సోలార్ వాటర్ హీటర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు గాను 2.5 మీటర్లఎత్తులో క్రమమైన చన్నీటిసరఫరా ఉండాలి.
 • నిరంతరం చన్నీటి లభ్యతలేనప్పుడు,మరియొక చన్నీటి తొట్టిని ఏర్పాటుచేసుకోవాలి,కనీసం సోలార్ వాటర్ హీటర్ యొక్క సామర్ధ్యానికి చాలినంత సామర్ధ్యంతోనైనా,
 • ఒకవేళ చన్నీటి సరఫరాకు అంతరాయం కలిగితే సోలార్ వాటర్ హీటర్ల వ్యవస్థ
 • పెద్దగాదెబ్బతినదు కానీ,నీటిసరఫరాను పునరుద్ధరించేవరకూ వేడినీటిని పొందలేము

మబ్బులు పట్టిన రోజుల్లో ఏం జరుగుతుంది?

 • సోలార్ వాటర్ హీటర్ల ద్వారా నీరు వేడెక్కటం తీవ్రంగా దెబ్బతింటుంది.
 • మబ్బులు పట్టినరోజులలో సూర్యుని నుంచి గ్రహించే శక్తి దాదాపు శూన్యము,సూర్యశక్తి గ్రాహకాలనుంచి ఉత్పత్తికూడా శూన్యము.
 • పాక్షికంగా మబ్బులు పట్టినరోజుల్లో మాత్రం కొంత ఉత్పత్తిని ఆశించవచ్చు.
 • కానీ,ఈ వ్యవస్థను సరైన విద్యుత్తుప్రత్యామ్నాయ హీటరుతో కలిపి రూపకల్పన చేయించుకుంటే మబ్బులు పట్టినరోజులలో అవసరాలను తీరుస్తుంది.

ఎంత విద్యుఛ్ఛక్తి,డబ్బు పొదుపు చెయ్యవచ్చు?
దిగువ ఇచ్చినపట్టికలో,దేశములోని విభిన్నప్రాంతాలలో విభిన్నమైన రోజుకు వందలీటర్ల సోలార్ వాటర్ హీటర్ల ద్వారా సుమారు ఎంత విద్యుఛ్ఛక్తి,డబ్బు పొదుపు చెయ్యవచ్చు అన్న విషయాలను తెలుసుకోవచ్చు.
2 చదరపు మీటర్ల గ్రాహకస్థలాన్ని వినియోగించుకునే 100 లీటర్ల సోలార్ వాటర్ హీటర్ల ద్వారా అయ్యే పొదుపు.

 

ఉత్తర ప్రాంతం

తూర్పు ప్రాంతం

*దక్షిణప్రాంతం

*పశ్చిమప్రాంతం

ఏడాదికి ఎన్నిరోజులు వాడుతారో అన్న అంచనా

200 రోజులు

200 రోజులు

250 రోజులు

250 రోజులు

పూర్తిస్థాయిలో ఉపయోగిమ్చినప్పుడుఏటా ఆదా అయ్యే విద్యుత్తు-కిలోవాట్ హవర్స్

950

850

1200

1300

విభిన్న ధరలవద్ద ఆదా అయ్యే డబ్బు రూపాయలు/సంవత్శరాలు

రూపాయలు. 4/కిలోవాట్ హవర్స్

3800

3400

4800

5200

రూపాయలు.5/కిలోవాట్ హవర్స్

4750

4250

6000

6500

రూపాయలు. 6/కిలోవాట్ హవర్స్

5700

5100

7200

7800


వినియోగధోరణి మరియుపొదుపు దక్షిణప్రాంతాలకు సంబంధించినంతవరకూ బంగలూరు విలక్షణమైన వాతావరణానికీ,పశ్చిమప్రాంతాలకు సంబంధించినంతవరకూ పుణె విలక్షణమైన వాతావరణానికీ చెందినవి.

సోలార్ వాటర్ హీటర్ ఎంతకాలం మన్నుతుంది?
భారతప్రమాణాలసంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణమైన ముడి సరకులతో తయారయిన సోలార్ వాటర్ హీటర్లు,సాధారణ నిర్వహణలో15 -20 సంవత్శరాలవరకూ మన్నుతాయి.

సోలార్ వాటర్ హీటర్ నిర్వహణలోవిద్యుఛ్ఛక్తి అవసరం ఉంటుందా?
ఎలాంటి సోలార్ వాటర్ హీటర్ నిర్వహణలోవిద్యుఛ్ఛక్తి అవసరం ఉండదు.అయినప్పటికీ మబ్బుపట్టిన దినాలలో వేడినీటి అవసరాలు తీర్చేందుకు,ప్రత్యామ్నాయంగా మరొక సోలార్ వాటర్ హీటర్ కొరకు విద్యుఛ్ఛక్తి అవసరం ఉంటుంది.

సౌరశక్తి ద్వారా వేడిచేయబడిన నీరు తొట్టిలో ఎంతకాలం వేడిగా ఉంటుంది?లేదా సూర్యుడు లేని దినాల్లో కూడా ఉదయాన్నే వేడి నీరు లభిస్తుందా?

 • పగలు సౌరశక్తి ద్వారా వేడిచేయబడిన నీటిని వేడినిపోనివ్వకుండా నిరోధించేతొట్టిలో నిలువచేస్తారు.
 • వేడినిపోనివ్వకుండా నిరోధించేతొట్టి 24 గంటలపాటు నీటిఉష్ణోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పు రాకుండా కాపాడుతుంది.
 • తద్వారా ముందురోజు వేడెక్కిన నీరు తరువాతి రోజు ఉదయానికీ ఉపకరిస్తుంది.

ఈ విధానాలకు ప్రభుత్వము నుంచి ఏమైనా ఆర్ధికప్రోత్శాహకాలు లభిస్తాయా?
భారత ప్రభుత్వం వారి నూతన మరియు సహజ వనరుల ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ, నివాస గృహసోలార్ వాటర్ హీటర్లకొరకు మృదురుణాల సౌకర్యం కలగజేసింది.నామమాత్రపు వడ్డీతో జాతీయ బ్యాంకులు ఈ రుణాలను అందజేస్తున్నాయి.

నివాస గృహాలకు సోలార్ వాటర్ హీటర్ పరికరాలను ఎవరు సరఫరా చేస్తారు?
దేశములో 50కి పైబడిన భారతప్రమాణాలసంస్థ ఆమోదము పొందిన సరఫరాదారులున్నారు.

ఉత్పత్తి నిర్వహణకు కావల్సిన ఆవశ్యకతలేమిటి?
నివాస గృహాలకు సోలార్ వాటర్ హీటర్ పరికరాలతో ఉత్పత్తినిర్వహణకు ఎలాంటి ప్రత్యేకార్హతలు అవసరం లేదు. అయినప్పటికీ,ఈక్రిందివాటిని అనుసరిస్తే, ఉన్నతస్థాయిలో ఈ వ్యవస్థలను నిర్వహించుకోవచ్చు.

 • ఉదయంగానీ,సాయంత్రం గానీ వేడెక్కిన నీటిని ఒకసమయములోనే వాడేందుకు ప్రయత్నించండి.
 • తరచూ వేడినీటి కొళాయిని తెరుస్తూ,కట్టేస్తూ ఉండటంవల్ల విద్యుఛక్తి పొదుపు తగ్గుతుంది.
 • విద్యుత్తు బ్యాకప్ అవసరమైనప్పుడు అంగీకారత్మకమైన అతితక్కువ ఉష్ణోగ్రతలో తాపస్థాపకాన్ని(ధర్మోస్టాట్) అమర్చాలి.
 • ఉత్తరభారతదేశములో వేసవికాలం వేడినీటిని స్నానాలకు వాడకపోవచ్చు.
 • ఈ వ్యవస్థను పూర్తిగా వాడకూడదనుకున్నప్పుడు నీటిని పూర్తిగా వొంపేసి,సంగ్రాహకాలను కప్పెయ్యాలి.
 • వేసవికాలం కూడా వేడినీటి వాడకం ఉంటుంది కానీ తక్కువమోతాదు లో
 • అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా సంగ్రాహకాన్ని కొంత భాగంవరకూ కప్పెయ్యాలి.
 • సంగ్రాహకాలమీద ధూళి పేరుకుపోయి వాటి పనితీరును అడ్డుకుంటుంది.
 • వాటిని కనీసం వారానికొకసారి శుభ్రపరచాలి.

యాజమాన్యనిర్వహణకు కావల్సిన ఆవశ్యకతలేమిటి?

 • నివాసగృహసోలార్ వాటర్ హీటర్లకు చెప్పుకోదగ్గ యాజమాన్యనిర్వహణ అవసరం ఉండదు.
 • ఎప్పుడన్నా నీరు కారిపోతుంటే నీటిగొట్టాలు బాగుచేసేవ్యక్తితో మరమ్మత్తు చేయించుకొనవచ్చు.
 • ఒకవేళ నీటి నాణ్యత కఠినంగా,భారంగా ఉంటే,ఏళ్ళు గడిచేకొద్దీ సంగ్రాహకాలమీద పొరలు పేరుకూ పోవచ్చు.
 • ఈపొరలను ఆమ్లాలతో శుభ్రపరచాల్సి ఉంటుంది,కనుక సరఫరాదారులను సంప్రదించటం ఉత్తమం.
 • పగిలిన గాజును కూడా సరఫరాదారులచే మార్పించాలి. వెలుపలికి కనిపించేభాగాలకు రంగులు వేసుంటే తుప్పుపట్ట కుండా నిరోధించేందుకు గాను వాటికి ప్రతి 2-3 సంవత్శరాలకొకసారి మరలా వేయించాలి

నివాసగృహాలలోని సోలార్ వాటర్ హీటర్ పరికరాలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం

ఎదురైన సమస్య సంభావ్యమైన కారణం

వేడినీటి కొళాయిలో నీరు లేదు

చల్లని నీరు సరఫరా లేదు
బయటకు వెళ్ళే కవాటము మూసుకుపోయింది

గొట్టాలలో గాలి.....

చల్లని నీటిసరఫరా మామూలుగానే ఉన్నా నీరు వేడెక్కటంలేదు.

వేడినీటివాడకం అధికంగా ఉండొచ్చు.ఉపయోగిస్తున్న స్థానాలను,ధోరణినీ తనిఖీ చెయ్యండి

సంగ్రాహకము మీద నీడ పడి ఉండొచ్చు.
పొరలు పేరుకు పోయి ఉండటంతో సంగ్రాహకం ద్వారా నీటి సరఫరా లేకపోయుండొచ్చు,ఉత్పత్తిదారుడిని సంప్రదించండి.

నీరు చాలినంత వేడిగా ఉండటం లేదు లేదాసరిపడా వేడినీరు లభ్యం కావట్లేదు అతితక్కువ వేడి నీరు అందుతుంది.

మబ్బులు పట్టిన వాతావరణం,
వినియోగం అత్యధికంగా ఉండటం
తరచూ వేడినీటికొళాయిని తెరవడం-మూయడంవల్ల,
సంగ్రాహకం మురిగ్గా ఉండటం వల్ల
సంగ్రాహకంలో ఆవిరితేమ అడ్డుపడటం,దాన్ని చల్లబరచటం ద్వారా,వ్యవస్తలోని నీటిని పూర్తిగా ఖాళీచేయటం ద్వారా
తొలగించవచ్చు. సంగ్రాహకంలో ఆవిరితేమ అడ్డుపడటం
వెలుపలవి/లోనిగొట్టాలకు నొక్కులు పడటం

ఆధారము : http://mnre.gov.in/

సౌరశక్తితో పనిచేసే వాటర్ హీటర్లు

(నీటిని వేడిచేసే పరికరం)కు, ఐ.ఆర్.ఇ.డి.ఎ (IREDA)/బ్యాంకులు మరియు యితర ఆర్థిక సంస్థల ద్వారా, వడ్డీ రాయితీ పథకం (Interest subsidy scheme - ఇంటరెస్ట్ సబ్సిడీ స్కీము) క్రింద యిచ్చేవడ్డీ రేట్లు

1) అర్హతకల వ్యవస్థలు

సౌరశక్తితో పనిచేసే వాటర్‌ హీటర్లు (నీటినివేడిచేసే పాత్ర లేక పరికరం) సమతలమైన పళ్ళెం (ఫోటోప్లేట్)కలవైనా లేక నాళాకృతిలో ఉండేవైనా (యివాక్యుయేటెడ్ ట్యూబ్యులర్ కలెక్టర్స్), ఏ పరిమాణంలో వైనా.

2) రుణగ్రహీతలు

ఉపయగించే వారు ఎవరైనా

3) రుణాలు యిచ్చే సంస్థలు

భారతీయ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (ఇండీయన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజన్సీ) (IREDA) వద్ద నుంచి రుణాలు అందుబాటులో ఉంటాయి. ఇదేకాక, ప్రభుత్వరంగ/ప్రైవేటురంగ బ్యాంకులు, షెడ్యూల్డ్-కోఆపరేటివ్ బ్యాంకులు, భారతీయ రిజర్వు బ్యాంకు సమ్మతించిన ఆర్థిక సంస్థలు, ఐ.ఆర్.ఇ.డి.ఎ (IREDA)లోని నడుమ ఉండే ఉత్పత్తి/సరఫరా సంస్థలు మరియు యితర ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఆర్థిక సంస్థలు, (FIS) వంటి వాటి నుండి కూడ రుణాలుపొందవచ్చు. IREDA మరియు యితర ఆర్థిక సంస్థలు, బ్యాంకులు విడుదల చేసిన నిధులు, MNRE కి బదులుగా IREDA ద్వారా నిర్వహించబడి ఈ పధకం అమలుపరచబడుతుంది.

4) రుణధనం

IREDA/బ్యాంకు/FI (ఆర్థిక సంస్థ), ఆ పథకం యొక్క అంచనా కట్టిన ధరలో 85% (ఎనభై ఐదు శాతం) వరకు.

5) రుణము యొక్క కాల పరిమితి (duration)

గరిష్ఠ పరిమితి, ఐదు సంవత్సరముల వరకు.

6) వడ్డీరేటు

గృహావసరాలకు 2% (రెండు శాతం) పెరిగే తరుగుదలను మినహాయించుకోని సంస్థల వాడకం దార్లకు 3% (మూడు శాతం) పెరుగుతున్న తరుగుదలను మినహాయించుకునే పారిశ్రామిక, వాణిజ్య వినియోగ దారులకు 5% (ఐదు శాతం)

FIS(ఆర్థిక సంస్థలు)/ బ్యాంకులు/IREDA నడుమ పని చేసే వ్యవస్థలకు సేవాప్రతిఫలం మరియు ప్రోత్సహించే వారికి బహుమతులు.

@ FIS (ఆర్థిక సంస్థలు) /బ్యాంకులు/IREDA నడుమ పని చేసే వ్యవస్థలు యిచ్చే ప్రతీరుణ రాయితీకి 200/- (రెండువందల రూపాయలు) @IREDA మరియు దాని నడుమ వ్యవస్థల/ బ్యాంకులు FIS (ఆర్థిక సంస్థల) ల ఏజంట్లు (ప్రతి నిధులు) లేక విక్రయ దారులు, సోలార్ వాటర్‌ హీటర్లను ఖరీదు చేసే సరియైన వినియోగదారులను కనుగొనేవారికి ప్రాంతానికి సంబంధించి యిచ్చే వడ్డీరాయితీలో చ.కి.మీకు 100/- చొ|| న యివ్వడం జరుగుతుంది.

బ్యాంకుల జాబితా/సౌరశక్తితో నీరు వేడిచేసే ప్రక్రియలో పాల్గొనే ఆర్థిక సంస్థలు.

ప్రభత్వం రంగ బ్యాంకులు (పబ్లిక్‌ సెక్టార్ బ్యాంకులు (Public sector banks) )

 1. కెనరా బ్యాంకు
 2. మహారాష్ట్ర బ్యాంకు
 3. యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా
 4. సిండికేట్ బ్యాంకు
 5. పంజాబ్ & సింధే బ్యాంకు
 6. పంజాబ్ నేషనల్ బ్యాంకు
 7. ఆంధ్రా బ్యాంకు
 8. విజయా బ్యాంకు
 9. దెనా బ్యాంకు
 10. బ్యాంక్ ఆఫ్ యిండియా
 11. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్

ఎన్.బి.ఎఫ్. సిఎస్(NBFCS)

 1. IREDA (ఐ.ఆర్.యి.డి.ఎ)
 2. నాగార్జునా క్రెడిట్స్ & కేపిటల్ లిమిటెడ్‌
 3. SREI (ఎస్.ఆర్.ఇ.ఐ) యిన్ ఫ్రాస్ట్రక్చర్ పైనాన్స్ లిమిటెడ్
 4. భోంస్లే లీజింగ్ ఫైనాన్స్ కంపనీ లిమిటెడ్
 5. మధ్యప్రదేశ్‌ ఫైనాన్సియల్ కార్పోరేషన్

ప్రైవేటు బ్యాంకులు

 1. రత్నాగర్ బ్యాంక్ లిమిటెడ్
 2. ద యునైటెడ్ వేస్ట్రన్ బ్యాంక్ లిమిటెడ్

కో-ఆపరేటివ్ బ్యాంకులు

 1. నాగపూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్
 2. జతాగావ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్
 3. కల్యాణ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్
 4. షోలాపూర్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్
 5. అకోలా జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్
 6. ద అకోలా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్
 7. పర్వారా సహకారి బ్యాంక్ లిమిటెడ్
 8. కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్
 9. శిక్షక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్
 10. ఇచల్ కరంజీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్

సౌరశక్తితో పనిచేసే నీటి పరికరాలు - తాజా నిజాలు

 • భోజనశాలలు, ఆ సుపత్రులు, ఫలహారశాలలు, పాల ఉత్పత్తి కేంద్రాలు, గృహాలు, పరిశ్రమలు మొదలైన వాటికి వేడి నీరు 60-80 c వద్ద ఉండాలి.
 • 100-300 లీటర్లు సామర్ధ్యం కలిగిన సోలర్ వాటర్ హీటర్లు గృహావసరాలకు సరిపోతాయి.
 • అతి పెద్దవైన సోలార్ వాటర్ హీటర్లను, ఫలహారశాలలు, భోజనశాలలు, అతిధిగృహాలు, హోటళ్ళు, ఆసుపత్రులు మున్నగు వాటిలో వినియోగించవచ్చు.

ఇంధన ఆదా :- గృహంలో ఉపయోగించే ఒక 100 లీటర్ల సామర్థ్యం కలిగిన ‘సోలార్ వాటర్ హీటర్’ విద్యుత్ తో పనిచేమే ‘గీజర్’ కి బదులుగా వాడడం వలన, సంవత్సరానికి 1500 యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుంది.
శక్తి ఉత్పత్తిలో ఖర్చు ఆదా :- ఒక్కొక్కటి 100 లీటర్ల సామర్థ్యం కలిగిన 100 సోలార్ వాటర్ హీటర్లను ఉపయోగించడం వలన ఒక మెగా వాట్ (IMW) గరిష్ఠ పరిమాణ విద్యుత్తు ఆదా అవుతుంది.
పర్యావరణ ప్రయోజనాలు :- ఒక 100 లీటర్ల సామర్థ్యం కలిగిన ‘సోలార్ వాటర్ హీటర్’ సంవత్సరానికి, 1.5 టన్నుల కార్బన్-డై-ఆక్సైడ్ విడుదలను నివారిస్తుంది.
పనిచేసే కాలం :- 15-20 సంవత్సరాలు.
ఉజ్జాయింపు ఖరీదు :-
100 లీటర్ల సామర్థ్యం కలిగిన ‘సోలార్ వాటర్ హీటర్’ ఖరీదు సుమారు 22,000 రూపాయలు
అధిక సామర్థ్యం కలిగిన ‘సోలార్ వాటర్ హీటర్లు’ అమర్చడానికి ఒక్కొక్క లీటరుకు 110-150 రూపాయలు.
పెట్టుబడి తిరిగి వచ్చే సమయం :-

 • విద్యుత్తుకు బదులుగా వాడినప్పుడు 3-4 సంవత్సరాలలో
 • కొలిమిలో వాడే యింధనం కు బదులుగా వాడినప్పుడ 4-5 సంవత్సరాలు.
 • బొగ్గుకు బదులుగా వాడినప్పుడు 6-7 సంవత్సరాలలో

సౌరశక్తి ద్వారా నీటిని వేడిచేసే సరైన పద్ధతుల ఎంపికకు సూచనలు

 • సమతుల పల్లెం ద్వారా సౌరశక్తినని సేకరించు (Flat plate collector (FPC)) ఆధారిత విధానం ఏదైనా ధాతువుతో తయారైనవి. ఖాళీ పంపుల ద్వారా సౌరశక్తి సేకరించు (evacuate tube collector (ETC)) ఆధారిత విధానాలతో పోల్చి చూస్తే దీని మన్నిక జీవితకాలం ఎక్కువ. ఇ.టి.సి విధానంలో పంపులు గాజుతో చేయడం వల్ల అవి సహజంగా విరిగిపోయే స్వభావం కలిగి ఉంటాయి.

 • ఇ.టి.సి ఆధారిత పద్దతి ఇ.పి.సి ఆధారత విధానం కన్నా 10 నుండి 20 శాతం వరకు తక్కువ ధరకు లభిస్తుంది. అవి అతి చల్లని ప్రాంతాలలో కూడా చాలా బాగా పనిచేస్తాయి మరియు సున్నకన్నాతక్కువ డిగ్రీల వేడి దగ్గర గడ్డ కట్టే పరిస్థితి ఏర్పడదు. ఎఫ్.పి.సి ఆధారిత విధానం కూడా బాగా పనిచేస్తూ సున్నకన్నా తక్కువ వేడి దగ్గర గడ్డకట్టకుండా పనిచేసినా ఉన్నా వాటి ధర ఎక్కువగా ఉంటుంది.

 • ఎక్కడయితే నీరు కొంచెం మందంగా ఉండి, క్లోరిన్ శాతం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎఫ్.పి.సి ఆధారిత విధానం వేడి మార్పుచేసే ఎక్ఛేంజరు తో పాటు తప్పని సరిగా ఏర్పాటు చేయాలి. అది ఒకస్థాయి వరకు సౌరశక్తిని సేకరించు రాగి ట్యూబుల్లో క్లోరిన్ పేరుకుపోకుండా నిరోధించగలుగుతుంది. ఇది నీటి ఉదృతిని ఆపుచేయడం ద్వారా వేడి చేసే పనితీరును తగ్గిస్తుంది. ఇ.టి.సి ఆధారిత విధానంలో ఇలాంటి సమస్యలు తలెత్తవు.

 • ఒక ఇంటిలో ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉండి, ఒక స్నానాల గది ఉన్నట్టయితే వారికి రోజుకు 100 లీటర్ల సామర్థ్యం కల సౌరశక్తి పద్దతి సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్నానాల గదులు ఉంటే, వారు వాడే కొళాయిల సంఖ్య మరియు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి సామర్ధ్యాన్ని పెంచుకోవలసి ఉంటుంది. సాధారణంగా సామర్థ్యాన్ని ఉదయాన స్నానానికి వాడే వేడి నీటి అవసరాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అయితే సాయంత్రం మరియు ఇతర వేళల్లో కూడా వాడుతూ ఉంటే దానిని బట్టి సామర్థ్యాన్ని నిర్ణయించవలసి ఉంటుంది.

 • మనకు ఎన్నకునే రకం మరియు ప్రాంతం బట్టి ఒక 100 యల్.పి.డి సామర్థ్యం ఉన్నది రూ.16,000 నుండి రూ.22,000 ల వరకు ధర ఉంటుంది. కొండ ప్రాంతాలు మరియు ఉత్తర ఈశాన్య ప్రాంతాలలో దాని ధర 15 శాతం నుండి 20 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. ఏది ఏమైనా సామర్థ్యపు స్థాయి పెరిగే కొలది ధర పెరుగక పోవచ్చు. అలా కాక సామర్థ్యం స్థాయి పెరిగే కొలది దాని ధర నిష్పత్తిలో లెక్కించినచో తగ్గుతున్నట్టు ఉంటుంది. ఒకవేళ ఓవర్ హెడ్ ట్యాంకు ఆ భవనానికి లేదా ఇంటికి నిర్మించి ఉండకపోయి వుంచే సౌరశక్తి వస్తువులతో పాటు అవసరమైన చల్లని నీరు ఉంచే ట్యాంకు మరియు దాని నిలబెట్టే స్టాండు మనం నిర్మించుకోవలసి వస్తుంది. అయితే దానికి అయ్యే వ్యయాన్ని ధరలు లెక్కించకూడదు. దీంతో పాటు వేడినీటి ఇన్సులేటెడ్ పైపు లైను ధర కూడా లెక్కించ కూడదు. ఇది స్నానాల గదుల సంఖ్యను బట్టి ఒకటి కన్నా ఎక్కువ అవసరమౌతాయి. అదనంగా ఇలాంటి వస్తువులపై కనీసం 5 నుంచి 10 శాతం వ్యయం అవుతుంది.

 • సౌరశక్తి పద్దతిలో స్టోరేజి ట్యాంకులో విద్యుత్ ను నిల్వ ఉంచడం చేయకూడదు. ఒకవేళ 10 యల్.పి.డి సామర్థ్యం లేదా అంతకన్నాతక్కువ ఉన్న ఎలక్ట్రిక్ గీజర్ మీకు ఉన్నట్టయితే లేదా వెంటనే వేడిచేసే గీజర్ గాని ఉన్నట్టయితే మంచిదే . మీరు గీజర్ మరియు దాని థర్మోస్టాట్ 40O డిగ్రీల దగ్గర ఉంచి సౌరశక్తి తో పనిచేసే సేకరణ యంత్రానికి బయటలైనుకు కనెక్ట్ చేయాలి. మీ గీజర్ 40O డిగ్రీల లోపల ఉన్న నీటిని తీసుకున్నప్పుడు మాత్రమే పనిచేయడం మొదలవుతుంది. ఒకవేళ నీటి వేడి 42O డిగ్రీలకు మించితే అది ఆగిపోతుంది. ఈ పద్దతి వల్ల మనం అవసరాలకు అనుగుణంగా చాలా విద్యుత్ ను మరియు వేడి నీటిని ఆదా చేయవచ్చును. ఏదిఏమైనా మీరు నిల్వ సామర్థ్యం కలిగిన గీజర్ ను కలిగి ఉన్నట్టయితే దానికి ప్రత్యేకంగా ఓ నీటి కొళాయిని అమర్చుకోవడం మంచిది మరియు మీరు విద్యుత్ గీజరు వాడినట్టయితే ఎప్పుడయితే సౌరశక్తితో వేడి నీళ్లు అందవో అప్పుడు విద్యుత్ తో వేడి నీళ్లు పొందవచ్చును.

ఆధారము : http://mnre.gov.in/

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు