పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇతర ఉపయోగకరమైన చిట్కాలు

ఈ విభాగంలో రోజు కార్యకలాపాలలో శక్తి ఆదా చేసేందుకు ఉపయోగకరమైన చిట్కాల గురించి వివరించడం జరిగింది.

రీసైకిల్ పేపర్ ఉపయోగించండి

కాగితాన్ని రీసైకిల్ చేసే ప్రక్రియద్వారా కాగితం తయారీలో తక్కువ ప్రాకృతిక వనరులను మరియు తక్కువ విష రసాయనాలు ఉంటాయి. ఒక టన్ను 100% వ్యర్థ కాగితాల నుంచి తయారు చేసిన కాగితం క్రింది ప్రయోజనాలు కలిగి ఉంటుంది.

  • సుమారు 15 చెట్లు ఆదా
  • 2,500 kWh శక్తి ఆదా
  • 20,000 లీటర్ల నీరు ఆదా
  • 25 కిలో గ్రాముల గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది

మీ పత్రంలో (డాక్యూమెంటులో) కేవలం 1 ఫాంట్ పరిమాణాన్ని తగ్గించటం 18 శాతం వరకు కాగితపు వాడుకను తగ్గిస్తుంది అని చెబుతారు. ఎందుకు అది ప్రయత్నించరు ...

స్పామ్ మెయిల్స్ మరియు శక్తి వృథా

ఇమెయిల్ కార్బన్ ఫూట్ ప్రింటు మీద మెకాఫీ పరిశోధనలో ఒక యూజర్ (పంపడం, ఫిల్టరింగ్ మరియు పఠనం) ఒక సాధారణ సంవత్సరం మొత్తంలో 135 కిలోల కార్బన్ ఫుట్ ప్రింటు సృష్టిస్తాడు. ఇది ఒక కారులో 360 కిలోమీటర్ల వెళ్ళడానికి సమానం. అత్యంత అద్భుత నిజమేమిటంటే 78శాతం వచ్చే ఇమెయిల్స్ స్పామ్ అని తేలింది. నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం 62 ట్రిలియన్ స్పామ్ సందేశాలు పంపబడతాయి. దీనికోసం 33bn కిలోవాట్ గంటల (kWh) విద్యుత్తు అవసరమవుతుంది మరియు సంవత్సరానికి సుమారు 20 మిలియన్ టన్నులకు సమానమైన కార్బన్ డయాక్సైడుకు కారణం అవుతుంది. అందుకే, స్పామ్ సౌకర్యం సమర్ధవంతంగా ఉపయోగించడం ముఖ్యం.

మూలం : గోబర్ టైమ్స్

సంబంధిత వనరుల

  1. గోబర్ టైమ్స్ వెబ్సైట్
2.98832684825
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు