অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శక్తి సంరక్షణ

శక్తి సంరక్షణ

మనం ఇంధనాన్ని ఎందుకు ఆదా చేయాలి

ప్రతి మనిషి అవసరాల మేరకు భూమి అన్నీ సమకూరుస్తుంది, కానీ వారి అత్యాశ మేరకు మాత్రం కాదు  - మహాత్మాగాంధీ

శక్తిని ఉత్పత్తి చేసేదానికన్నా  వేగంగా దాన్ని ఖర్చుఆధారం పెడుతున్నాం.
బొగ్గు, నూనె, సహజ వాయువు వంటి - అత్యధికంగా వాడే ఇంధన వనరులు తయారవ్వాలంటే కొన్ని వేల ఏళ్ల సమయం కావాలి.

శక్తి వనరులు పరిమితం
ఇండియాలో శక్తివనరులు  ప్రపంచ శక్తివనరుల్లో 1 శాతమేఆధారం  ఐనా ఇండియా జనాభా  ప్రపంచ జనాభాలో 16 శాతం.

మనం వాడే శక్తిలో అధిక శాతం ఒక్క సారికే వాడగలం. పునారావృతం కాదు.
ఇంధన వాడకంలో 80 శాతం ఇంధన వినియోగ పునరుత్పాదనకాని శక్తి వనరుల నుండే జరుగుతుంది.  మనకున్న శక్తి వనరులు మరో 40 ఏళ్లల్లో  అయిపోతాయని అంచనా.

శక్తిని పొదుపు చేస్తే దేశానికెంతో ధనం ఆదా చేసిన వారమౌతాం.
మన ముడి చమురు అవసరాల్లో 75 శాతం  దిగుమతి  చేసుకొంటున్నాం. దీనివల్ల ఏడాదికి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది.

శక్తిని పొదుపు చేస్తే డబ్బును పొదుపు చేసినట్టే.
మీ గ్యాస్ సిలిండర్ ఒక వారం అదనంగా వాడుకోగలిగితే లేదా మీ కరెంటు బిల్లు తక్కువయినా మీకెంత ఆదానో ఒక్కసారి ఆలోచించండి.

ఇంధనశక్తిని ఆదా చేస్తే మన ఇందన శక్తి వనరులను  ఆదా చేసినట్టే.
వంటచెరకును సమర్ధవంతంగా వాడుకోగలిగితే మన ఇంధనావసరాలు తగ్గుతాయి. వాటి సేకరణలో పడే కష్టం తగ్గుతుంది.

శక్తిని ఆదా చేస్తే శక్తిని ఉత్పత్తి చేసినట్టే.
ఒక యూనిట్ శక్తిని ఆదా చేస్తే, రెండు యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేసినట్టే.

శక్తిని ఆదా చేస్తే కాలుష్యాన్ని తగ్గించినట్టే.
శక్తిని ఉత్పత్తి చేయడం, వాడటం అనేది కాలుష్యానికి, 83 శాతం కన్నా అధికంగా గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తికి దారి తీస్తుంది.

శక్తిని రేపటి అవసరాలకై కాపాడుకోవడం మన కర్తవ్యం

'ఈ భూమి, నీరు, గాలి అనేవి మనకు మన తల్లిదండ్రులిచ్చిన కానుక కాదు. మన పిల్లలనుంచి మనకు అందిన ఋణం మాత్రమే!' ఒక భారతీయ సామెత

ఇంధన వనరులను సంరక్షించడం ఒక అలవాటుగా చేసుకోండి.

గృహావసరాల కొరకు

వెలుతురు కొరకు

అవసరం లేనప్పుడు దీపాలను ఆర్పివేయాలి

ట్యూబ్ లైట్ల మీద, బల్బులపైన, ఇతర విద్యుత్పరికరాల మీద చేరే దుమ్మును క్రమం తప్పక శుభ్రం చేయాలి.

ఐ ఎస్ ఐ మార్కుగల విద్యుత్ పరికరాలనే వాడాలి.

కాంతికి అడ్డం రాకుండా ట్యూబ్ లైట్లను, బల్బులను అమర్చుకోవాలి.

సి ఎల్ ఎఫ్ లైట్లని వినియోగించి శక్తిని పొదుపు చేయాలి.

ట్యూబ్ లైట్లనే ఎందుకు వాడాలి?

ట్యూబ్ లైట్లను కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ లైటు(సి.ఎఫ్.ఎల్) అంటారు. వీటి వాడకం వల్ల మామూలు బల్బు కంటే మూడింట రెండు వంతుల విద్యుత్తు తక్కువ కాలుతుంది . ఇందువల్ల కాంతి ఏమీ తగ్గదు. కాంతి కూడా బాగుంటుంది.

సి ఎఫ్ ఎల్ బల్బ్ లు ఇన్ కేండిసెంట్ బల్బులిచ్చేటంత ఉష్ణాన్ని,తగు కాంతినిస్తూ,75 శాతం విద్యుత్తు వినియోగం అవుతుంది.

సి ఎఫ్ ఎల్ ధర కొంచెం ఎక్కువే, అయినా మంచి కాంతినిస్తూ విద్యుత్తు తక్కువకాలడం వల్ల పొదుపు.

23వాట్ ల ట్యూబ్ 90/100 వాట్ ల బల్బుకు సమానమైనకాంతినిస్తుంది.

రోజుకూ డె బ్బై ఐదు వాట్ ల రెండు బల్బులను వాడే బదులు నాలుగు గంటల పాటు రెండు 15 వాట్ల ట్యూబులని వాడితే, ఏడాది కి 18 కిలో వాట్ల విద్యుత్ ఆదా అవుతుంది.

తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ కాంతి - సి.ఎఫ్.ఎల్ (కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటు)

విద్యుచ్ఛక్తి  వాడుక తగ్గించండి -  ఖర్చు ఆదాచేయండి.

నేడు భారత దేశంలో 80 శాతం  విద్యుత్తు దుర్వినియోగం అవుతోంది. మనం వాడే అన్ని రకాల దీపాలు, బల్బులు ఇతర విద్యుత్ పరికరాలలో ఎక్కువ విద్యుచ్ఛక్తి ఖర్చవుతుంది.

సి.ఎఫ్.ఎల్ (కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటు) వాడడం వల్ల విద్యుత్తుకయ్యే ఖర్చు చాలా తక్కువ . సి ఎఫ్ ఎల్ సంప్రదాయ బల్బు కంటే 5 రెట్ల ఎక్కువ కాంతినిస్తుంది .

మామూలు బల్బుకంటే సి ఎఫ్ ఎల్ 8 రెట్ల కంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది.

ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు, సి ఎఫ్ ఎల్ లైట్లు తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయ. పైగా ఎక్కువ వేడిమిని ఇవ్వవు.

60వాట్ ల మామూలు బల్బుకు బదులు 15వాట్ల సి.ఎఫ్.ఎల్. వాడి తే, గంటకు 45వాట్లే ఖర్చవుంది. అంటే నెలకు 11 యూనిట్లు ఆదా అవుతాయి. అలా ఖర్చులు తగ్గిపోతాయి.

సి.ఎఫ్.ఎల్ బల్బులకు 5 నుండి  8 మాసాలు కాల పరమితి ఉంటుంది.

విద్యుత్తు వినియోగాన్ని క్రింది విధంగా పొదుపు చేస్తే, యిలా పొదుపు చేసిన విద్యుత్తును విద్యుత్తు సౌకర్యంలేని గ్రామాలకు అందించవచ్చును.

వివరాలు

60వాట్ బల్బు

15వాట్ సి ఎఫ్ ఎల్

ఆదా/పొదుపు

బల్బుఖర్చు

10రూ.

116రూ.

 

వాటేజ్

60

15

45

వెలిగే సమయం

6మాసాలు,1000గం

4 సం.లు 8000గం.

ఏడాది కి విద్యుత్  
వినియోగం(వాట్స్)

115

36

79

యూనిట్ ధర

రూ.2.75/-

రూ.316.25

రూ.99.00

రూ.217.25

నాలుగేళ్లకయ్యే  ఖర్చు

రూ.1265.00

రూ.396.00

రూ.869

ఆధారం : ఆంధ్ర ప్రదేశ్ సంప్రదాయేతర ఇంధన అభివృద్ది సంస్థ.

వంట కొరకు

వంటకు :

 • ఇంధన పొదుపు పొయ్యినే వాడాలి.
 • వంట చేసేటప్పుడు పాత్రలపై మూతలు పెట్టడంవ ల్ల వంటచేసే సమయం తగ్గుతుంది . ఇంధనం ఆదా అవుతుంది .
 • వంట చేసే ముందు పప్పులు, బియ్యం నాననివ్వాలి.

ద్రవరూపంలో ఉన్న పెట్రోలియం గ్యాస్ (ఎల్ పి జి) మరియు దాని వినియోగం

ఎల్ పి జి అంటే ఏమిటి?

ద్రవ కర్బనాల మిశ్రమమే ఈ ద్రవరూపంలో ఉన్న పెట్రోలియం గ్యాస్ (ఎల్ పి జి). ఇవి పరిసర ఉష్ణోగ్రత మరియు వత్తిడి వద్ద వాయు స్థితిలో ఉంటాయి. కాని వీటిని వత్తిడి వెసల్ లలో సులువుగా నిల్వ ఉంచడానికి, హ్యండిల్ చేయడానికి మరియు రవాణా చేయడానికి, వత్తిడితో ద్రవరూపంలో ఉంచుతారు. ముడి చమురుని శుద్ధి చేయడం ద్వారా లేదా సహజ వాయువుని విడగొట్టడం ద్వారా ఇది దొరుకుతుంది. ఐసోబ్యుటేన్, బ్యుటిలిన్, ఎన్ - బ్యుటేన్, ప్రొపిలిన్ మొదలైనవి చిన్న మొత్తాలలో లేదా భాగాలలో ఉంటాయి.

ఎల్ పి జి వినియోగాలు ఏమిటి?

ఎల్ పి జి ని ఒక సురక్షితమైన, పొదుపైన, వాతావరణానికి అనువైన మరియు ఆరోగ్యవంతమైన వంట చెరుకుగా పరిగణిస్తారు. గృహోపయాగానికే కాకుండా, వివిధ పారిశ్రామిక మరియు వ్యాపార అవసరాలకు సమర్థవంతమైన శక్తిగా ఎల్ పి జి ని కూడా ఉపయోగిస్తారు.

మార్కెట్ లో ప్రామాణిక పరిమాణంలో లభించే ఎల్ పి జి సిలిండర్లు ఏమిటి?

అత్యంత సాధారణంగా, గ్రామీణ, పర్వత మరియు ప్రవేశానికి కష్టతరమైన ప్రాంతాలలో 5 కేజీల చిన్న సిలిండర్లులో ఎల్ పి జి సిలిండర్లు లభ్యమౌతాయి. ప్రారిశ్రామిక మరియు వ్యాపార వినియోగానికి, 19 కెజీ సిలిండర్లు లభ్యమౌతాయి. కొన్ని ప్రైవేటు కంపెనీలు గృహోపయోగానికి 12 కెజీ సిలిండర్లును అమ్ముతున్నాయి.

మోటారు వాహనాలలో ఇతర ఎల్ పి జి తో నడిచే ఉపకరణంలలో లేదా ఇతర గృహోపయోగానికి కాని అవసరాలకు, గృహాలకు ఉపయోగించే సిలిండర్లను ఉపయోగించవచ్చా?

లేదు. ఎల్ పి జి నియంత్రణ ఉత్తర్వు క్రింద, మోటారు వాహనాలలో లేదా ఇతర గృహోపయోగానికి కాని ఉపకరణంలో ఎల్ పి జి ని వినియోగించడాన్ని నిషేధించారు.

భారతదేశంలో గృహోపయోగానికి వినియోగించే ఎల్ పి జి మార్కెటింగులో ఉన్న కంపెనీలు ఏమిటి?

ముఖ్యమైన కొన్ని ప్రభత్వరంగ కంపెనీలు ఏమిటంటే:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్

ప్రైవేటురంగ కంపెనీల ఉదాహరణలు ఏమిటంటే:

శ్రీ శక్తి ఎల్ పి జి లిమిటెడ్

ఎస్ హెచ్ వి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్

ఇంటికి కొత్త ఎల్ పి జి కనెక్షన్ పొందే విధానం ఏమిటి?

గృహానికి కనెక్షన్ కి, డొమెస్టిక్ ఎల్ పి జి మార్కెటింగులో ఉన్న కంపెనీ యొక్క ఒక డీలర్ ని సంప్రదించాలి. మీ దగ్గరలో ఉన్న డీలరెవరో తెలుసుకోవడానికి, సంబంధిత కంపెనీ యొక్క వెబ్ సైట్ ని సంప్రదించండి.

కొత్త కనెక్షన్ కి ధరఖాస్తు చేస్తున్నప్పుడు, ఈ క్రింద ఇచ్చిన ఏదైనా ఒక డాక్యుమెంటుని మీ రెసిడెన్స్ ఋజువు కోసం చూపించాలి: రేషన్ కార్డు, విద్యుశ్చక్తి బిల్లు, టెలిఫోన్ బిల్లు, పాస్ పోర్టు, ఉద్యోగమిచ్చిన వారి సర్టిఫికెట్, నిశ్చయించిన/స్వాధీనం చేసిన ఫ్లాట్ లెటర్, ఇంటి రిజిస్టేషన్ పేపర్లు, ఎల్ ఐ సి పోలసీ, ఓటర్ల గుర్తింపు కార్డు, అద్దె రశీదు, ఆదాయిపు పన్ను వారి జారీ చేసిన పి ఏ ఎన్ కార్డు, డ్రైవింగు లైసెన్స్. అయినప్పటికినీ, కొన్ని రాష్ట్రాలలో, కొత్త కనెక్షన్ ఇవ్వడానికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

సిలిండరుకి మరియు రెగ్యులేటరుకి సురక్షిత జమని చెల్లించాల్సి ఉంటుంది. సురక్షిత జమని చెల్లించిన తరువాత సబ్ స్ర్కిష్షన్ రసీదుని ఇస్తారు. రసీదుని సురక్షితంగా ఉంచవలసి ఉంటుంది ఎందుకంటే, భవిష్యత్తులో కనెక్షన్ ని బదిలీ చేయడానికి ఇది అవసరమౌతుంది.

డొమెస్టిక్ ఎల్ పి జి కనెక్షన్ ని బదిలీ చేయడానికి విధానం ఏమిటి?

(i) నగరం లోపలనే బదిలీ లేదా ప్రక్కనున్ననగరానికి బదిలీ

సబ్ స్ర్కిష్షన్ రసీదుని (ఎస్ వి) ఇచ్చిన తరువాత, ప్రస్తుతం ఉన్న పంపిణీదారుడు బదిలీ డాక్యుమెంటుని ఇస్తారు.

కొత్త పరపిణీదారునికి, బదిలీ డాక్యుమెంటుతో సబ్ స్ర్కిష్షన్ రసీదుని ఇవ్వాలి. కొత్త పంపిణీ దారుడు అసలు ఎస్ వి ని ఆమోదించి, బదీలీని జారీ చేస్తారు. బదిలీ మరియు ఎస్ వి డాక్యుమెంట్లు సురక్షితంగా ఉంచుతారు. ఇక్కడ, ఉపకరణములు (సిలిండర్+రెగ్యులేటరు) తిరిగి ఇవ్వనపసరం లేదు కాని వినియోగ దారుడు తన కొత్త గమ్యానికి తీసుకుని వెళ్ళవచ్చు.

(ii)సుదూర ప్రాంతానికి కనెక్షన్ బదిలీ

సబ్ స్ర్కిష్షన్ రసీదుతో అభ్యర్ధన లెటరుని ఇచ్చిన తరువాత, ప్రస్తుత స్థానము నుండి ముగింపు రసీదు (టి వి) ని జారీ చేస్తారు. అతని/ఆమె ప్రస్తుతం ఉన్న ఉపకరణాలని (సిలిండరు/లు మరియు రెగ్యులేటర్) తిరిగి ఇచ్చిన తరువాత, ఎస్ వి లో వ్రాసిన మొత్తాన్ని వాపసు ఇస్తారు. టి వి లో వ్రాసిన అదే జమ మొత్తాన్ని చెల్లించడం ద్వారా కొత్త ప్రదేశంలో తిరిగి కనెక్షన్ ని పొందవచ్చు. దయచేసి కొత్త ఎస్ వి ని సేకరించి దానిని సురక్షితంగా ఉంచండి.

ఎల్ పి జి ఇన్స్టాలేషన్ సమయంలో గుర్తించు కోవలసిన విషయం ఏమిటి?

గ్యాస్ ఇన్సటల్లేషన్ ఎక్కడ చేస్తారో ఆ ప్రదేశం చాలా ముఖ్యం. ఈ క్రింద ఇచ్చిన జాగ్రత్తలను తీసుకుంటే, వంటగదిలో జరిగే ప్రమాదాలకి ఇన్సూరెన్స్ వలె అవుతుంది.

ఎల్ పి జి ఏ గదిలో వినియోగిస్తారో, ఆ గదికి గాలి, వెలుతురు అటువైపు ఇటువైపు బాగా వచ్చేవిలా ఉండాలి. మూసి ఉన్న కిటికీలు మరియు తలుపులతో గదిలో ఎల్ పి జి ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. సిలిండరు, ప్రెజర్ రెగ్యులేటరు నాబ్ మరియు రబ్బరు ట్యూబు సులువుగా తీయడానికి అనువుగా ఉండే చోట ఇన్స్టాలేషన్ చేయాలి. సిలిండర్లు నేల మీద పెట్టాలి అంతేగాని నేల క్రింద స్థాయిలో లేదా దిగువగానున్న గదిలో లేదా బేస్ మెంట్లు మొదలైన వాటిలో పెట్ట కూడదు. సిలిండర్లు అలమార్లలో పెడితే, ఈ అలమార్లు గాలి వెలుతురు వచ్చేటట్లుగా క్రింద భాగాన మరియు పై భాగాన ఖాళీ ఉంచాలి. సగం ఖాళీ ఉంచితే చాలు. నేల మీద వంట ఉపకరణాన్ని పెట్టవద్దు. ఎల్లప్పుడూ టేబులు మీద గాని లేదా అనువైన ఎత్తులో ఉంచిన స్లాబ్ మీద వంటని నిలబడి చేసుకునే విధంగా ఉపకరణాన్ని ఉంచాలి. చెక్కతో చేసిన టేబులుని వినియోగించ రాదు. టేబుల్ చెక్కతో చేసినదైతే, టేబుల్ మీద ఒక ఏస్బెస్టాస్ షీటుని వేసి దాని మీద పొయ్యిని పెట్టాలి. ఉపకరణాన్ని కిటికీకి నేరుగా ఎదురుగా పెట్టకూడదు.బలమైన గాలి వీచినపుడు మంట ఆరిపోయే అవకాశముంటుంది. దీని వలన గదిలో ఎల్ పి జి జమ అవుతుంది. ఉపకరణం టేబుల్ లేదా స్లాబ్ మీద ఉండి ఉపకరణం యొక్క ఒక ప్రక్క సమతలమైన గోడని ఆనుకుని ఉండాలి. ఉపకరణం యొక్క వెనుక ప్రక్క ఈ గోడకి ఎదురుగా ఉండాలి. ఈ గోడ మీద అలమార లేదా చెంచాల చట్రాలు ఉండకూడదు. గోడ మీద పెట్టిన ఏదైన వస్తువుని తీయడానికి వెలుగుతున్న పొయి మీదుగా వంగినపుడు మీ బట్టలు అంటుకునే అవకాశం ఉంటుంది. ఒక గదిలో రెండు కన్నా ఎక్కువ సిలిండర్లు ఉంచకూడదు. రెండు సిలిండర్లు ఉంచడానికి, వంటగది కనీసం 10 చదరపు మీటర్లు భూవైశాల్యాన్ని కలిగి ఉండాలి. సిలిండర్లని ఎల్లప్పుడు నిటారుగా వాల్వ్ పైకి ఉండేలా ఉంచాలి. సిలిండరుని వేరే ఇతర స్థితిలో ఉంచినట్లయితే, ద్రవ రూపంలో ఉన్న ఎల్ పి జి తెరిచి ఉన్న వాల్వ్ నుండి బయటికి వచ్చి, ప్రమాదకరమైన పరిస్థితిని కలగ చేస్తుంది. మీ గ్యాస్ ఉపకరణానికి ఒక మీటరు దూరం లోపల ఎలక్ట్రిక్ ఓవెన్, కిరోసిన్ పొయ్యి మొదలైనటువంటి వేడిని చేసే ఏ పరికరాలని ఉంచకూడదు. ఎండకి, వర్షానికి, ధూళికి మరియు వేడికి గురికాకుండా సిలిండరుని ఉంచాలి. సిలిండరు పైన ఏదైనా పాత్రని/వంట గిన్నెని/బట్టలుని మొదలైన వాటిని ఉంచకూడదు. పైన ఉండే రింగు స్టే ప్లేటుకి కట్టి ఉన్న సురక్షిత/సంరక్షణ క్యాప్ ని ఎల్లప్పూడూ ఉంచాలి. ఎందుకంటే గ్యాస్ తప్పించుకోకుండా ఉండడానికి, గ్యాస్ లీకవుతున్న సందర్భంలో వాల్వ్ స్పిండిల్ నుండి గ్యాస్ తప్పించుకోకుండా క్యాప్ ని పెట్టడానికి, పైన ఉండే రింగు స్టే ప్లేటుకి కట్ట బడి ఉన్న సురక్షిత/సంరక్షణ క్యాప్ ని ఎల్లప్పుడూ కట్టి ఉంచాలి. వాల్వ్ మీద క్యాప్ ని పెట్టకుండా ఖాళీ లేదా నిండి ఉన్న సిలిండర్లని ఉంచకూడదు. ప్రెజర్ రెగ్యులేటరుని ఆపరేట్ చేయడానికి, ప్రెజర్ రెగ్యులేటరు సైన్ ప్లేట్ పైన ఇచ్చిన సూచన లని అనుసరించండి.

ఎల్ పి జి సిలిండర్ల వినియోగానికి సాధారణ చిట్కాలు ఏమిటి ?

(i) ఖాళీ సిలిండరు కనెక్షన్ ని తీసివేయడం

వంట గదిలో మరియు ప్రక్క గదిలో ఉన్న అగరవత్తులు, కొవ్వొత్తులు, పూజ దీపములతో పాటు అన్ని మంటలని ఆర్పివేయాలి. వంట పొయ్యి మీద అన్ని కుళాయిలని కట్టాలి. రెగ్యులేటరు స్విచ్ఛ్ ఆన్ పొజిషన్ నుండి ఆఫ్ పొజిషిన్ కి త్రిప్పాలి. రెగ్యులేటరుని పట్టుకుని, రెగ్యులేటరుని నెమ్మదిగా త్రిప్పి బుష్ (నల్లని ప్లాస్టిక్ లాకింగ్ రింగు ని పైకి లాగాలి. అలా రెగ్యులేటరు సిలిండరు మీద వాల్వ్ నుండి వేరవుతుంది. సిలిండరు వాల్వ్ మీద సురక్షిత ప్లాస్టిక్ క్యాప్ ని పెట్టండి. క్యాప్ ని ధృఢంగా స్పష్టమైన క్లిక్ ధ్వని వినిపించే వరకు కిందికి నొక్కండి. ఇప్పుడు ఖాళీ సిలిండరుని తీసివేయవచ్చు.

(ii) నిండి ఉన్న సిలిండరు కనెక్షన్ ఇవ్వడం

సురక్షిత క్యాప్ ని తీయడానికి, దానిని కిందికి నొక్కి, దారాన్ని లాగి అలాగే ఉంచి సిలిండరు వాల్వ్ నుండి క్యాప్ ని పైకి తీయాలి. సిలిండరు వాల్వ్ లోపల సీలింగ్ రింగు, మీ చిటికెన వ్రేలి సాయంతో దాని స్థానంలో ఉన్నదేమోనని చెక్ చేయాలి. రింగు లేకపోతే సిలిండరుని వినియోగంచవద్దు. సురక్షిత క్యాప్ ని తిరిగి పెట్టి, మీ పంపణీదారుని సిలిండరు మార్చమని సంప్రదిచండి. నిండి ఉన్న సిలిండరు మీద రెగ్యులేటరు పెట్టడానికి, ఈ క్రింద ఇచ్చిన సూచనలని పాటించండి.

రెగ్యులేటరు స్విచ్ఛ్ నాబ్ ఆఫ్ ఫొజిషన్ లో ఉండేటట్లు చూడండి రెగ్యులేటరుని పట్టుకుని ప్లాస్టిక్ బుష్ ని పైకి లాగండి. రెగ్యులేటరుని నిటారుగా వాల్వ్ మీద ఉంచి, దాని కొన వాల్వ్ షడ్భుజి ని తాకేవరకు నెమ్మదిగా త్రిప్పుతూ కిందకి నొక్కండి నల్ల ప్లాస్టిక్ బుష్ ని వదిలి, అపుడు దానిని కిందకి నొక్కాలి. (మీరు క్లిక్ ధ్వనిని వినవచ్చు) ప్రెజర్ రెగ్యులేటరు ఇప్పుడు సిలిండరు మీద లాకయ్యంది.

(iii) బర్నర్లని వెలిగించడం

రెగ్యులేటరు స్విచ్ఛ్ నాబ్ ని ఎడమ ప్రక్కగా ఆన్ పొజిషన్ కి వచ్చేవరకు తిప్పాలి. పొయ్యి బర్నర్ దగ్గర, వెలిగించిన అగ్గిపుల్లని పట్టుకుని పొయ్యి నాబ్ ని ఆన్ పొజిషన్ కి తిప్పాలి.

(iv) మిగతావి

వంట చేస్తున్నప్పుడు, నైలాను దుస్తుల్ని లేదా అటువంటి బట్టలని ధరించకూడదు. ఉపకరణాన్ని వినియోగంలో ఉండగా దానిని వదలి వెళ్ళకూడదు గ్యాస్ ఇన్సటల్లేషన్ ఏ భాగాన్నైనా మరామ్మత్తు, సవరించడం లేదా తనీఖీ చేయడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు లేదా నకిలీ మెకానిక్ ని అలా చేయడానికి అనుమతించ కూడదు. వంట అయిన తరువాత లేదా రాత్రి సమయంలో రెగ్యులేటరుని ఆన్ పొజిషన్ లో ఉంచి ఎప్పుడూ వదలకూడదు. పొయ్యిని వెలిగించేముందు, ఎల్ పి జి లీకేజ్ వాసనని ఎల్లప్పుడూ చూడాలి. ఎలుకలు, బొద్దింకలు మొదలైనవి రాకుండా వంటగదిని చాల వరకు శుభ్రంగా ఉంచాలి.

వినియోగదారులకు సాధారణ సురక్షా సలహాలు ఏమిటి?

i. రబ్బరు ట్యూబింగు మరియు ప్రెజర్ రెగ్యులేటర్ గురించి గుర్తుపెట్టుకోవలసిన విషయాలు

అది ఆమోదించిన నాణ్యతని కలిగి ఉండాలి, (ఐ ఎస్ ఐ / బి ఐ ఎస్ మార్క్). ఆమోదించబడిన పంపిణీదారుల నుండి మాత్రమే బి ఐ ఎస్ వారిచే ఆమోదించబడిన రబ్బరు ట్యూబ్ లను మరియు ప్రెజర్ రెగ్యులేటర్లను పొందాలి. ఇది ఎంత తక్కువ సాధ్యమయితే అంత మంచిది. గరిష్ట పొడవు సుమారు 1.5 మీటర్లు ఉండాలి. మీ ఉపకరణం యొక్క నాజిల్ కొలతలు మీ రెగ్యులేటర్ కొలతలిలా ఉండేటట్లు చూడాలి మరియు సరియైన వ్యాసంగల రబ్బరు ట్యూబింగుని ఉపయోగించాలి. మీ డీలరు కొలతల గురించి మీకు సలహా ఇస్తారు తనిఖీ చేయడానికి సులువుగా ఉండే చోట అది ఉండాలి. వేడిమికి మరియు మంటకి దూరంగా ఉంచాలి. పొయ్యి మరియు రెగ్యులేటర్ నాజిల్ యొక్క పూర్తి పొడవుని కవరు చేసేలా దానిని తోయాలి. బర్నరు వలన ఆది వేడి కాకుండా చూడాలి మరియు చుట్టుకోకుండా/మెలికలు తిరగకుండా చూడాలి. తడి గుడ్డతో మాత్రమే దానిని శుభ్రం చేయాలి. నాజిల్ మీద ట్యూబ్ ని వదులు చేయడానికి సబ్బుని ఉపయోగించరాదు. పగుళ్ళు, రంధ్రాలు, మెత్తదనం మరియు చిన్న చిన్న రంధ్రాలని ప్రత్యేకంగా చివరలలో క్రమబద్ధంగా చెక్ చేయాలి. ముందుగా కాకపోయినా, ట్యూబింగ్ ని ప్రతి 2 సంవత్సరాలకు మార్చాలి. రబ్బరు ట్యూబింగ్ ని ఏ ఇతర వస్తువు లేదా స్లీవ్ చే కవరు చేయకూడదు.

ప్రెజర్ రెగ్యులేటర్ కూడా చాలా ముఖ్యమైనది. దీనిని సిలిండర్ అవుట్లెట్ వాల్వ్ కి కనెక్ట్ టేయబడుతుంది. ఇది, సిలిడరు నుండి వచ్చే గ్యాస్ యొక్క వత్తిడిని నియంత్రిస్తుంది మరియు హాట్ ప్లేటుకి నిలకడైన వత్తిడితో సరఫరా చేస్తుంది.

ii. గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నప్పుడు గుర్థుంచుకొవలసిన విషయాలు

సిలిండరు కంపెనీ సీలుతో మరియు సురక్షా క్యాప్ తో విడుదల చేస్తున్నారా అని చెక్ చేయాలి మీకు ఎలా ఉపయోగించాలో తెలియకపోతే, దయచేసి విడుదల చేసే వ్యక్తిని చూపించమని అడగండి సిలిండర్లను సమతల ప్రదేశం మీద నేలమీద పెట్టాలి

iii. గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే ముందు గుర్తించుకోవలసిల విషయాలు

సిలిండరు వాల్వ్ లోపల, రబ్బరు ‘ఓ’ రింగు ఉందో లేదోనని చెక్ చేయాలి ఏదైనా లీకేజి గుర్తులు కనిపిస్తున్నాయోనని చెక్ చేయాలి − ఒకసారి తనిఖీ చేయడం ద్వారా గాని, సబ్బు నీటితో గాని లేదా వాసన ద్వారా గాని లీకుల్ని చెక్ చేయడానికి వెలిగించిన అగ్గిపుల్లలని ఎప్పుడూ ఉపయోగించకూడదు సిలిండరుని ఎల్లప్పుడూ నిటారుగా నేలమీద, మంచి గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచాలి అలమారా లో ఎల్ పి జి సిలిండరు ని ఉంచకూడదు ఎల్ పి జి పొయ్యిని ఎల్లప్పుడూ ఎత్తులో సిలిండరు ఎగువ భాగాన వంట గది స్లాబ్ మీద పెట్టాలి ఇతర వేడిని పుట్టించే మూలాలనుండి సిలిండర్ ని దూరంగా ఉంచాలి

iv. గ్యాస్ సిలిండర్లు వినియోగించిన తరువాత చేయవలసిన పనులు

సిలిండరు ఉపయోగించనప్పుడు రెగ్యులేటర్ నాబ్ ని ‘ఆఫ్’ స్థానంలో పెట్టి మూయాలి సురక్షిత క్యాప్ ని పెట్టి ఖాళీ సిలిండర్లని ఒక చల్లని మరియు బాగా గాలి వెలుతురు వచ్చే ప్రదేశం లో ఉంచాలి

ఎవరైనా గ్యాస్ వాసనని పసిగడితే ఏమి చేయాలి?

వాయు రూపంలో ఉన్న ఎల్ పి జి కి రంగు మరియు వాసన లేదు. అందుకని, అది లీకేజి అయినప్పుడు దానిని సులువుగా పసిగట్టడానికి, ఒక ప్రత్యేకమైన వాసన రావడానికి ఒక ప్రత్యేకమైన ఓడర్ ని దానికి కలుపుతారు. ప్రేలుడు సంభవించే తక్కువ పరిమితిలో 1/5 వంతు సాంద్రత వద్ద గాలిలో దాని వాసనని పసిగట్టవచ్చు.

గ్యాస్ యొక్క వాసనని తెలిస్తే,,

కంగారు పడవద్దు ఎలక్ట్రికల్ స్విచ్ఛ్ లని ఆపరేటు చేయవద్దు. ప్రధాన విద్యుశ్ఛక్తి సరఫరాని బయటినుండే తీసివేయాలి పొయ్యి నాబ్లు ఆఫ్ స్థానంలో ఉండేటట్లు చూడాలి ఎల్ పి జి లీకేజిని పసిగట్టడానికి అగ్గిపుల్లని వెలిగించరాదు. అన్ని మంటలు, దీపాలు, అగరు వత్తులు, మొదలైనవి ఆర్పివేయాలి నాబ్ ని కుడి వైపుకి ఆఫ్ స్థానంకి తిప్పిడం ద్వారా ప్రెజర్ రెగ్యులేటర్ ని స్విచ్ఛ్ ని ఆఫ్ చేయాలి. అన్ని తలుపులని, కిటికీలని తెరవాలి ఇంకా వాసన ఉంటే, కార్యాలయ సమయంలో మీ గ్యాస్ పంపిణీదారుని పిలవండి. కార్యాలయ పనివేళల తరువాత లేదా సెలవు దినాలలో అత్యవసర పరిస్థితులకి మీ దగ్గరలో ఉన్న అత్యవసర సేవల సెల్ కి దయచేసి ఫోన్ చేయండి. ఒక అనుభవం ఉన్న వ్యక్తి రెగ్యులేటర్ని వేరుచేయవచ్చు.. వాల్వ్ మీద సురక్షిత క్యాప్ ని పెట్టాలి.

మూలం : ఆయిల్ మార్కెటింగ్ ఏజెన్సీల వెబ్ సైట్లు

ఎల్ పి జి ( లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ) పంపిణీ దారులనుండి, ఏబ్రాండ్ (ముద్ర) కల స్టవ్ గాని లేక యితర వస్తువులను గాని, వినియోగదారులు తప్పనిసరిగా కొనవలసిన అవసరం లేదు.

ఎల్ .పే .జి పంపిణీ దారులనుండి, వినియోగదారులు ఏ బ్రాండ్ ఎల్.పి.జి స్టవ్ నైనా గాని లేక యితర వస్తువులను గాని కొనవలసిన తప్పనిసరి అగత్యం లేదు. వినియోగదారులు, తమకు నచ్చిన ప్రదేశం నుండి ఎల్ .పి.జి  స్టవ్ లను కొనుక్కునే స్వేచ్ఛ ఉంది. వినియోగదారులకు ఈ విషయం గురించి, పత్రికలు, టి,వి. మాధ్యమాల లో ప్రకటనల ద్వారా, ఎల్ .పి జి సిలిండర్ యిచ్చినప్పుడు యిచ్చే రసీదుల మీద ముద్రించడం ద్వారా, వ్యక్తి గత సూచన ఉత్తరాల ద్వారా తెలియపరుస్తున్నారు.

ప్రభుత్వరంగ ఇంధన అమ్మక సంస్థలు ( Public sector oil marketing companies – omcs) వినియోగదారులకు అందించే సేవలో నాణ్యత పెంచేందుకు, సురక్షితమైన మన్నికగల ఉత్పత్తులను ప్రమాణం కల వాటిని అందిస్తున్నట్టు తెలుపుతున్నారు. ఇవి Lpg పంపిణీ దారులకు, ఇంధన సామర్థ్యం కల Lpg స్టవ్ లు , సురక్షా Lpg గొట్టాలు ( hoses) ఆర్పివేసే వంట యింటి, రవాణా చేయగలిగే నిప్పు యంత్రాలు, వంట యింటి, సాధనాలు (ఉదాహరణకు ప్రెజర్ కుక్కర్లు, నాన్ స్టిక్ వంట పాత్రలు, ఇండక్షన్ కుక్కర్లు మొదలైనవి.), మంటతో వెలిగే Lp గ్యాస్ లైటర్, మరియు ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్ల వంట యింటి, ఇంటి వస్తువులను అమ్మడానికి అనుమతి నిచ్చాయి. ఈ వ్యాపార నూతన విధానానికి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (భారత ఇంధన సమాఖ్య) నాన్ ప్యూయల్ బిజినెస్ ఏక్టివిటీ non – fuel business activity) (ఇంధన సంబంధంలేని వ్యాపార క్షేత్రం) అని, భారత పెట్రోలియమ్ కార్పోరేషన్ లిమిటెడ్ (భారత పెట్రోలియమ్ సమాఖ్య) బియాండ్ ఎల్.పి.జి (beyond lpg – lpg ని మించి) అని, హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ( hpcl – Hindustan petroleum corporation limited - హిందూస్థాన్ పెట్రోలియమ్ సమాఖ్య) allied retail business - అల్లైడ్ రిటైల్ బిజినెస్ - ( ఉమ్మడి చిల్లర వ్యాపారం) అని పేర్లు పెట్టాయి.

మంత్రిగారు, omc లు ఎప్పుడు ఎటువంటి ఉత్పత్తినైనా, క్రొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు, బలవంతంగా వినియోగదారులకు అమ్మినట్లు అభియోగం వచ్చినా, వాటిని పరిశోధించాలని ప్రకటించారు. ఒక వేళ, ఆ అభియోగం నిరూపింపబడితే ఆ Lpg పంపిణీ దారుడివై క్రమ శిక్షణ చర్య, అమ్మకపు నియంత్రణా సూచనలననుసరించి తీసుకొనబడుతుంది. (marketing discipline guidelines – mdg)

ఆధారం http://pib.nic.in/

యల్.పి.జి. వంట గ్యాస్ సిలిండర్ గడువు తేది తెలుసుకోవడం

మనలో చాలామందికి తెలియని నిజమైన విషయం ఏమిటంటే యల్.పి.జి. వంట గ్యాస్ సిలిండర్ ను తయారీ చేసి గ్యాస్ నింపే ముందు లేదా పంపిణీ చేసే ముందు చట్టబద్దంగా ఒక నిర్ణీత కాలవ్యవధిలో పరీక్షలు జరుపుతారు. ఆ సిలిండరు తిరిగి పరీక్షించవలసిన గడువు ముగింపు తేదిని సూచిస్తూ గ్యాస్ సిలిండర్ నిలువుగా నిలబెట్టినప్పుడు పైన ఉన్న మూడు ఇనుప బద్ధల ప్రక్కల్లో ఒక దానికి హెచ్చరిస్తూ వ్రాసి ఉంచుతారు. దాని వివరములు ఈ క్రింది విధంగా ఉంటుంది.

ఈ తేది ఒక ఇంగ్లీషు అక్షరం మరియు రెండు అంకెలతో ఉన్న సంఖ్యతో ఉంటుంది. అందులో ఇంగ్లీషు అక్షరాలు A లేదా B లేదా C లేదా D లు గా ఉంటాయి. ఇవి మన సంవత్సరంలోని త్రైమాసికమును సూచిస్తుంది. A అంటే మార్చితో ముగిసే మొదటి త్రైమాసికమని, అలాగే B అంటే జూన్ తో ముగిసే రెండవ త్రైమాసికమని , C అంటే సెప్టంబరుతో ముగిసే మూడవ త్రైమాసికమని, D అంటే డిసెంబరుతో ముగిసే నాలుగవ త్రైమాసికమని అర్థం చేసుకోవాలి. అలాగే దానితో పాటు ఉన్న అంకెలు ఏ సంవత్సరం ఆ సిలిండర్ తిరిగి చట్టబద్దంగా పరీక్షించవలసి ఉందో ఆ సంవత్సరాన్ని సూచిస్తుంది.(ఉదా 2008 అయితే 08 అని).

వినియోగదారులు సిలిండర్ ను పై వివరాల ఆధారంగా అది గడువుతేది అయిపోయిందో లేదో గుర్తించవచ్చు. ఒకవేళ అలాంటి గడువుతేది ముగిసిన లేదా పరీక్షించవలసిన తేది మీరిన సిలిండరును ఒక వేళ మీకు పంపిణీ చేసి ఉంటే వెంటనే మీరు సంబంధిత ఆహార మరియు పౌర సరఫరాల శాఖ అధికారులకు లేదా ప్రేలుడు పదార్ధాలు లేదా పెట్రోలియం మరియు భద్రతా సంస్థ ముఖ్య నియంత్రణాధికారి కి తెలియపరచాలి.(http://peso.gov.in)

ఆధారము: ది హిందు దిన పత్రిక

ఇతర అవసరాల కొరకు

పేపర్ రీ-సైక్లింగ్ / కాగితం పునరుత్పత్తి

రీ సైకిల్డ్ పేపరు తయారీలో తక్కువగా సహజవనరులు వినియోగమవుతాయి. కాగితం

తయారీ విషయంలో విషపూరితమైన రసాయనిక ద్రవ్యాలు చాలా తక్కువ.

ఒక టన్ను కాగితం, 100% వ్యర్ధ కాగితం నుండి తయారవుతుంది .

15 వృక్షాలు ఆదా అవుతాయి

2500 కిలోవాట్ ల విద్యుత్తు ఆదా అవుతుంది .

20,000 లీటర్ల నీరు ఆదా అవుతుంది .

25 కి. గ్రా గాలి కాలుష్య పదార్దాలు తగ్గుతాయి.

వ్యవసాయ కార్యకలాపాల్లో ఇంధనాల పొదుపు

సాగు నీటి పారుదల.

 • ఐ.ఎస్.ఐ మార్కు పంపు సెట్లను వినియోగించడం వల్ల పంటనీటి పంపుల సామర్థ్యంలో దాదాపుగా 25 నుండి 35 శాతం వరకూ మెరుగుదల సాధించవచ్చు.
 • పంపుసెట్టుకు పెద్ద వాల్వు ఉంటే విద్యుత్తు/డీ జిల్ పరిమాణంలో ఆదా అవుతుంది.
 • దీనివల్ల బావి నుండి తోడి పోతకు తక్కువ ఇంధనం/విద్యుత్తు ఖర్చు అవుతుంది .
 • ప్రమాణీకరించిన వంపుల కంటే పైపుల్లో ఎక్కువ వంకర టింకరలు ఉంటే డెబ్భై శాతం వరకూ ఘర్షణ నష్టాలు ఉంటాయి..
 • పైపు ఎత్తు రెండు మీటర్లకు తగ్గిస్తే రైతుకు నెలకు 15 లీటర్ల డీజిలు ఆదా అవుతుంది .
 • బావిలో నీటి మట్టం కన్నా పంపుసెట్టు 10 అడుగుల ఎత్తు దాటఉంటే పంపుసెట్టు సామర్ధ్యం పెరుగుతుంది .
 • మంచి నాణ్యమైన పి వి సి సెక్షన్ పైపు వాడకం వల్ల ఇరవై శాతం విద్యుత్తు ఆదా చేయవచ్చు.
 • ఉత్పత్తిదారు సిఫారసు చేసిన మేరకు క్రమం తప్పకుండా పంపుసెట్టుకు ఆయిలు, గ్రీజు పెడుతూ ఉండాలి.
 • పవరు ఫ్యాక్టరి వోల్టేజీని ఆదా చేయాలంటే, ఐ ఎస్ ఐ మార్కు గల మోటారుకు సరైన కెపాసిటి గల షంట్ కెపాసిటర్నే వాడాలి.
 • పగటి పూట బావిదగ్గర విద్యుత్ బల్బును ఆపివేయాలి.

పిల్లలకు ప్రకృతి సూత్రాలు

 1. కాగితాలను వృధా చేయొద్దు – కాగితాలు తయారు చేయడానికి చెట్లను నరకాల్సి ఉంటుంది. కాగితాలను ఆదా చేస్తే చెట్లను రక్షించినట్లే.
 2. పాఠశాలకు నడిచిగానీ, సైకిల్ తొక్కుకుంటూగానీ, బస్ లోగానీ వెళ్ళండి. దీనివలన ఇంధనం ఆదా అవుతుంది, కాలుష్యం తగ్గుతుంది.
 3. స్నానం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు కుళాయి ఆపండి. నీళ్ళు ఆదా అవుతాయి.
 4. పాఠశాలలో సేంద్రియ తోటను ప్రారంభించండి... దానికోసం ప్రకృతిసిద్ధమైన ఎరువును తయారుచేయండి. సహజసిద్ధమైన వనరులను బాగా ఉపయోగించుకోవడం ఎలాగో మీరు నేర్చుకుంటారు.
 5. వాడనప్పుడు కరెంటు దీపాలు, ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఆఫ్ చేయండి. విద్యుత్ ఆదా అవుతుంది.
 6. ఆయా కాలాలలో లభించే పళ్ళను తింటూ ఉండండి. మీరు ప్రకృతిని, డబ్బును ఆదా చేసినవారవుతారు.
 7. చెట్లు నాటండి. అవి మీ పర్యావరణాన్ని పచ్చగానూ, ఆరోగ్యంగానూ ఉంచుతాయి.
 8. ప్యాకేజ్డ్ వస్తువులు, డిస్పోజబుల్స్ తక్కువగా వాడడం ద్వారా చెత్తను తగ్గించండి. మీ పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచినవారవుతారు.
 9. మీ ఆటల సమయాన్నివీడియో గేమ్స్, టీవీతో కాకుండా ప్రకృతిలో గడపండి. మీరు ఇంధనాన్ని ఆదా చేసినవారవుతారు...ఆరోగ్యంగా కూడా ఉంటారు.
 10. ప్రకృతిని రక్షించే ప్రచార ప్రతినిధిగా మారండి. ఈ సూత్రాలను మీమిత్రులు అందరికీ తెలిసేటట్లు చూడండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate