অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శక్తి ఉత్పత్తి

శక్తి ఉత్పత్తి

 1. సౌర లాంతర్లు
  1. నష్టాలు
  2. సౌర లాంతరు ఎలా పని చేస్తుంది ?
 2. సోలార్ స్వేదన పరికరము
  1. నిర్మాణం
  2. విధానము
 3. సౌర పొయ్యి
  1. ప్రయోజనాలు
  2. నష్టాలు :
  3. సౌర (సోలార్ ) పొయ్యిలలొ రకాలు :
 4. సూర్యశక్తి ద్వారా నీటిని పంపిణీ చేయువిధానము
  1. సౌరశక్తిని ఉపయోగించి నీటిని తోడే పధ్ధతిపై తరచు వచ్చే సందేహాలు
 5. సోలార్ వీధి ధీపాల పద్ధతి
 6. సూర్యరశ్మితో ఇంట్లో విద్యుత్ దీపాలు వెలిగించుకునే వధ్దతి
 7. వ్యవసాయానికి సోలార్ (సూర్య రశ్మి తో పనిచేసే) ఉత్పత్తులు
  1. సూర్య రశ్మితో పనిచేసే.త్రీ-ఇన్-వన్ సాధనం
  2. పి.వి. విన్నోవర్-కమ్ డ్రయ్యర్
  3. పళ్లతోటల కోసం పి.వి. జనరేటర్.
  4. సోలార్ పి.వి. డస్టర్ (పొడి మందు చల్లడానికి వాడే పరికరం)
  5. పి.వి.మొబైల్ యూనిట్
  6. మరిన్ని వివరాల కోసం, సంప్రదించండిః
 8. వంట చెత్త ఆధారిత బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం
 9. బయో ఇంధనాలు
 10. వృక్షజాల వ్యర్ధ పదార్థాల ఆధారిత విద్యుదుత్పత్తి
  1. సాంకేతిక పరిజ్ఞానం
  2. ప్రయోజనాలు
  3. ఖర్చులు
 11. ధర్మల్ మరియు విద్యుత్ సాధనాలకు వృక్షజాల వ్యర్ధ పదార్థాలతో తయారయ్యే వాయువు
 12. చెరుకు పిప్పి ఆధారిత సహ – ఉత్పత్తి
  1. సాంకేతిక పరిజ్ఞానము
  2. సాధన-సామాగ్రి
  3. ఖర్చు
  4. సామర్థ్యం
 13. వాయు శక్తి
 14. పవన విద్యుదుత్పత్తి
  1. సాంకేతిక పరిజ్ఞానం
  2. గాలిమరల స్థాపన
  3. పవన విద్యుత్తు పథకాలకు అయ్యే ఖర్చు
 15. నీరు తోడుటకు మరియు వికేంద్రమైన విద్యుదుత్పత్తికి ఉపయోగపడే పవనశక్తి
  1. నీరుతోడే గాలిమర:
  2. పవన విద్యుదుత్పత్తి యంత్రం
  3. పవన – సౌర సంకీర్ణ వ్యవస్థ

సౌర లాంతర్లు

ఒక సౌర లాంతరు, కాంతి - మాధ్యమంగా గల ( solar photo – voltaic technology) సాంకేతికను ఉపయోగిస్తూ తయారు చేయబడినది . గ్రామీణ ప్రాంతాలలో, విద్యుత్ సరఫరా తక్కువగానూ, అరకొరగానూ ఉండడంవల్ల, ఈ సౌర లాంతరును, విరివిరిగా ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో కూడ ప్రజలు, విద్యుత్ సరఫరాలో

నష్టాలు

అంతరాయం కలిగినప్పుడు ప్రత్యామ్నాయంగా సౌర లాంతరునే,

 • సూర్యరశ్మి ఉండే చోట నీడ లేని ప్రదేశంలో సౌర పొయ్యిని పెట్టాలి. వంట గిన్నెలను నింపే ముందు కనీసం 45 ని|| సేపు ఎండలో ఉంచాలి, దీని వల్ల పొయ్యి, ఆహారం వండుకోవడానికి వీలుగా తయారు కావడమే కాక వంట త్వరితంగా పూర్తవుతుంది.
 • పరావర్తిత దర్పణం (ఛాయను చూపే అద్దం) సూర్యుని వైపు ఉండె టట్టుగా పొయ్యిని సర్ధుబాటు చేయాలి. పరావర్తిత కిరణాలు పారదర్శక గాజు మూత పై పడతాయి. ఇదే స్ధితిలో ఉండేటట్లు కొక్కేల ద్వారా బిగించి దర్పణాన్ని ఉంచాలి.
 • సౌర పొయ్యి గాజుమూత తెరచి, వంట పాత్రలను తగిన విధంగా అవుర్చి, గాజుమూతను సరిగా మూసివెయాలి. ఒకసారి వంట పాత్రలను పెట్టాక, వంట పూర్త¸ అయ్యేదాక గాజు మూత తెరవరాదు.
 • వంట పూర్తిగా ఉడికిన పివు్మట మూత తీయాలి. చాల వేడిగా వున్న వంట పా్రతలను సౌర పొయ్యి నుండి బట్టతో పట్టుకొని తీయాలి.

దాని యొక్క సాధారణ నిర్మాణం వలన, వినియోగిస్తున్నారు.

సౌర లాంతరు ఎలా పని చేస్తుంది ?

ఒక సౌర లాంతరు మూడు ముఖ్యమైన భాగాలతో తయారు చేయబడుతుంది - సోలార్ pv ప్యానెల్ - సౌర కాంతిని ప్రసరింపచేసే ( photo voltaic) ఫలకం - నిలువ చేసుకునే ఘటం (battery) మరియు దీపం (lamp) ఈ ప్రక్రియ చాల సులభమైనది. సౌరశక్తి, spv ( solar photo – voltaic panel - సౌరకాంతి ప్రసార ఫలకం ) ప్యానెల్ ద్వారా విద్యుచ్ఛక్తిగా మార్చబడుతుంది. పూర్తిగా మూసివేయబడిన, నిర్వహణావసరం లేని ఒక ఘటం (battery) లో, రాత్రి అవసరాలకై నిలువ చేయబడుతుంది. ఒక్కసారి ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయిన శక్తితో దీపం రమారమి 4 – 5 గంటలపాటు వెలుగుతుంది.

ఆధారము : www.geda.org.in

సోలార్ స్వేదన పరికరము

గ్రామీణ ప్రాంతాలలోని స్త్రీలు, ప్రత్యేకంగా ఉప్పునీటి ప్రాంతాలలో నివసిస్తున్న వారికి త్రాగు నీటిని సేకరించి, త్రాగడానికి పనికివచ్చేలా శుద్ధి చేయడం కష్టంగా ఉంటుంది. నీటి స్వేదన పరికరము, సూర్యకిరణాలని ఉపయోగించుకుని ఉప్పునీటిని శుద్ధి చేస్తాయి. అందుకే ఇది ఒక సామాన్యమైన, ఖర్చులేని మరియు ఎల్లప్పుడూ ఉండే సాంకేతిక పున పునః సృష్టి కాగల శక్తి.

నిర్మాణం

సోలారు నీటి స్వేదన పరికరము, స్థానికంగా దొరికే పూర్తిగా స్వదేశీయమైన వాటితో కావలసిన సామర్థ్యంతో నిర్మించబడిన ఒక చిన్న తక్కువ లోతుగల ట్యాంక్ అట్టడుగున తగిన నల్లని రంగు వేస్తారు. ట్యాంక్ పై కర్రల సహాయంతో పైకప్పుని ఎటవాలుగా చేసి వాటిపై గాజు షీట్లతో ట్యాంకుని కప్పాలి. స్వేదన పరికరము మధ్య భాగము ఎత్తుగా, గాజు షీట్లు ప్రక్క గోడలను తాకేలా ఉంచాలి.సోలార్ స్వేదన పరికరము

విధానము
సూర్య కిరణాలు ఏవిధంగా సముద్రపునీటిని ఆవిరి చేసి దానిని ఘణి ఘనీభవించి చేసి, శుధ్ధ మైన వర్ష పు నీటిని ఇస్తుందో, అదేవిధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఆవిరి అవడం - ఘనీభ వించడం సూత్రం మీద ఆధారపడి ఫుంది. ఎండలో పుంచిన ట్యాంకు లోనికి వుప్పు నీటిని పంపించాలి. నల్లని ట్యాంకు అడుగు భాగము సూర్యశక్తిని గ్రహించి వేడెక్కుతుంది. ఈ వేడి ట్యాంకులోని నీటిని ఆవిరి చేస్తుంది. ఆ ఆవిరి గాజు షీటు మీద ఘనీభవించి చివరిగా అది శుద్ధమైన త్రాగేనీటి బిందువులుగా మారుతుంది. ఈ విధంగా శుద్ధమైనా నీరు అడుగు భాగమున సేకరించబడి కుళాయికి చేరుతుంది. అందుచేత కుళాయిని త్రిప్పగానే మీరు పరిశుభ్రమైన తాగేనీరుని పొందుతారు. ఆ నీటిని తరువాత ఉపయోగించడానికి నిల్వచేసుకోవచ్చు. ఈ స్వేదన పరికరం రోజుకి ఒక చదరపు మీటరు విస్తీర్ణానికి సరాసరి 2 నుండి 3 లీటర్లు త్రాగేనీటిని ఇస్తుంది.

 

ఉత్పాదక స్థానం : కేంద్ర ఉప్పు & సముద్ర రసాయనాల పరిశోధన సంస్థ ( సి ఎస్ ఎమ్ ఆర్ ఐ ) గిజూభాయి బడేకర్ మార్గ్, భావనగర్ -364 002, గుజరాత్

సౌర పొయ్యి

సౌరశక్తితో (సూర్యశక్తితో) ఆహారాన్ని వండడానికి వినియోగించె సాధనాలే సౌర పొయ్యిలు.

ప్రయోజనాలు
 • వంటగ్యాస్, కిరసనాయిలు, విదు్యచ్ఛక్తి,బొగ్గు, వంట చెరకు (కట్టెలు) అవసరం లేదు.
 • సౌరశక్తి ఉచితంగా అందుబాటులో ఉండేది కాబట్టి ఇంధనానికి ఖర్చుచెయనవసరం లేదు.
 • సౌరపొయ్యి ద్వారా వండడం వల్ల ఆహారం పౌష్టిక విలువలు కల్గిఉంటుంది. సాంప్రదాయ ఇంధనాల ద్వారా వండడంలో కన్నా మాంసకృత్తులు 10 - 20 శాతం వరకు ఇగిరి పోకుండా ఉంటాయి. ధయమిన్ విటమిన్ 20 - 30 శాతం వరకు ఎక్కువగా నిలిపి ఉంచగల్గుతుంది. విటమిన్ ఎ 5 - 10 శాతం ఎక్కువ నిలకడగా ఉంటుంది.
 • సౌరశక్తిని ఉపయొగించి వండిన ఆహారం కాలుష్య రిహతం మరియు సురక్షితమైనది.
 • వివిధ పరిమాణాలలో సౌర పొయ్యిలు లభ్యమౌతున్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి వంట పొయ్యిని ఎంచుకోవచ్చును.
 • అన్ని వంట ప్రక్రియలను (మరగించడం, వేయించడం వంటి ) సౌర పొయ్యిని ఉపయొగించి చేసుకోవచ్చును.
 • ప్రభుత్వ పథకాలు అందిస్తున్న రాయితీల ద్వారా సౌర పొయ్యిలను కొనుక్కోవచ్చును.
నష్టాలు :
 • వండడానికి తగినంత సూర్యరశ్మి కావాలి.
 • సాంప్రదాయ పద్ధతులలో వండడం కన్నా ఎక్కువ సమయం పడ్తుంది.
సౌర (సోలార్ ) పొయ్యిలలొ రకాలు :

1. ఇంటిలో వండుకొనేందుకు : పెట్టెవలె ఉండే సౌర పొయ్యి.

2. సామూహిక వంటల కొరకు : స్కెఫ్లర్ సాంద్రతరమైన వంట పొయ్యిలు.

సౌర పొయ్యిలోని ముఖ్యమైన భాగాలు :

 • వెలుపలి పెట్టె : సాధారణంగా ఇనుముతో గాని, అల్యూవిునియమ్ రేకుతో గానీ (లేదా) బలపరచబడిన ప్లాస్టిక్ పొరలతోగానీ తయారు చేయబడి ఉంటుంది.పెట్టె
 • లోపలి వంట పెట్టె ( ట్రె ) : ఇది అల్యూమినియమ్ రేకుతో చేయబడుతుంది. వెలుపలి పెట్టె కన్నా లోపల పెట్టె కొద్దిపాటి చిన్నదిగా ఉంటుంది. నల్లరంగుపూత వేయబడి ఉండడం వల్ల సూర్య వికిరణాన్ని సులభంగా గ్రహించుకుని వంట పాత్రలకు ఉష్ణాన్ని బదిలీ చేస్తుంది.
 • రెండు గాజు మూతలు : జతగా గల గాజు మూతలు లోపలి పెట్టెను కప్పి ఉంచుతాయి. లోపల పెట్టెకన్నా ఈ మూతలు కొద్దిగా పెద్దవిగా ఉంటాయి. ఈ తయారు చేయబడిన రెండు గాజు మూతల మధ్య 2 సెం|| ఖాళీగా ఉంచి అల్యూవిునియమ్ ఫలకంలో అమర్చబడతాయి. ఈ రెండు గాజు మూతల మధ్య ఖాళీలో గాలి చేరి బంధకంగా ఉండి ఉష్ణాన్ని అదుపులో ఉంచి వెలుపలికి రాకుండా చేస్తుంది. రబ్బరు పట్టీ తో అంచులను అతికించడం వల్ల వేడిని బయటకు పోకుండా ఉంచుతుంది.
 • ఉష్ణ బంధకం : లోపల , బయట ఉండే పెట్టెల మధ్య ఖాళీతో బాటు లోపలి పళ్ళెం వంటి పెట్టె అడుగున కూడా ఉష్ణ బంధక పదార్ధముతో అనగా గాజు పోగులతో చేసిన మూతలను పేర్చడం వలన ఉష్ణాన్ని నష్ట పోకుండా ఉంచుతుంది. ఈ ఉష్ణ బంధక పదార్ధము, బాష్ప శీల పదార్ధానికి సంబంధం లేకుండా స్వేఛ్చగా ఉండాలి.
 • దర్పణం : సౌర పొయ్యి ప్రధాన మూతకు లోపలి భాగంలో అమర్చబడిన దంర్పణం (అద్దం) వల్ల ఉష్ణ వికిరణం పెరిగి, వేడిని గ్రహించుకునేందుకు వీలుగా ఉంటుంది. సూర్యరశ్మి దర్పణం పై బడి పరివర్తనం చెంది, లోపలి పాత్రలోనికి జతగాగల గాజు మూతల ద్వారా ప్రవేశిస్తుంది. ఈ వికిరణమే నేరుగా చేరి అదనంగా ఉష్ణ ప్రసారం వల్ల లోపలి ఉష్ణోగ్రతను పెంచి వంట ప్రక్రియ త్వరితంగా జరుగుతుంది.
 • పాత్రలు : మూతలతో కూడిన గిన్నెలు సర్వ సాధారణంగా అల్యూమీనియం లేదా న్టేయిన్లెస్ స్టీలు తో గాని తయారుచేయబడి ఉంటాయి. సౌర వికిరణాన్ని నేరుగా గ్రహించుకోవడానికి చేసుకోవడానికి ఈ పాత్రలకు వెలుపలి భాగంలో కూడ నల్లని రంగు పూత పూయ బడి ఉంటుంది. విదు్యచ్ఛక్తి సదుపాయం వున్న సౌర పొయ్యిలు కూడా బజారులో దొరుకుతున్నాయి.

సౌర పొయ్యిని వినియోగించి ఆహారాన్ని ఎలా వండాలి?

 • సూర్యరశ్మి ఉండే చోట నీడ లేని ప్రదేశంలో సౌర పొయ్యిని పెట్టాలి. వంట గిన్నెలను నింపే ముందు కనీసం 45 ని|| సేపు ఎండలో ఉంచాలి, దీని వల్ల పొయ్యి, ఆహారం వండుకోవడానికి వీలుగా తయారు కావడమే కాక వంట త్వరితంగా పూర్తవుతుంది.
 • పరావర్తిత దర్పణం (ఛాయను చూపే అద్దం) సూర్యుని వైపు ఉండె టట్టుగా పొయ్యిని సర్ధుబాటు చేయాలి. పరావర్తిత కిరణాలు పారదర్శక గాజు మూత పై పడతాయి. ఇదే స్ధితిలో ఉండేటట్లు కొక్కేల ద్వారా బిగించి దర్పణాన్ని ఉంచాలి.
 • సౌర పొయ్యి గాజుమూత తెరచి, వంట పాత్రలను తగిన విధంగా అవుర్చి, గాజుమూతను సరిగా మూసివెయాలి. ఒకసారి వంట పాత్రలను పెట్టాక, వంట పూర్త¸ అయ్యేదాక గాజు మూత తెరవరాదు.
 • వంట పూర్తిగా ఉడికిన పివు్మట మూత తీయాలి. చాల వేడిగా వున్న వంట పా్రతలను సౌర పొయ్యి నుండి బట్టతో పట్టుకొని తీయాలి.
 • సూర్యరశ్మి ఉండే చోట నీడ లేని ప్రదేశంలో సౌర పొయ్యిని పెట్టాలి. వంట గిన్నెలను నింపే ముందు కనీసం 45 ని|| సేపు ఎండలో ఉంచాలి, దీని వల్ల పొయ్యి, ఆహారం వండుకోవడానికి వీలుగా తయారు కావడమే కాక వంట త్వరితంగా పూర్తవుతుంది.
 • పరావర్తిత దర్పణం (ఛాయను చూపే అద్దం) సూర్యుని వైపు ఉండె టట్టుగా పొయ్యిని సర్ధుబాటు చేయాలి. పరావర్తిత కిరణాలు పారదర్శక గాజు మూత పై పడతాయి. ఇదే స్ధితిలో ఉండేటట్లు కొక్కేల ద్వారా బిగించి దర్పణాన్ని ఉంచాలి.
 • సౌర పొయ్యి గాజుమూత తెరచి, వంట పాత్రలను తగిన విధంగా అవుర్చి, గాజుమూతను సరిగా మూసివెయాలి. ఒకసారి వంట పాత్రలను పెట్టాక, వంట పూర్త¸ అయ్యేదాక గాజు మూత తెరవరాదు.
 • వంట పూర్తిగా ఉడికిన పివు్మట మూత తీయాలి. చాల వేడిగా వున్న వంట పా్రతలను సౌర పొయ్యి నుండి బట్టతో పట్టుకొని తీయాలి.

ధరః

సౌర పొయ్యిల ధర రూ|| 2500 నుండి 4000 మధ్యలొఉంటుంది. పరిమాణము, నమూనాలను బట్టి వీటి ధర వూరుతుంది.

సామూహిక స్కెఫ్లర్ సాంద్రతరమైన వంట పొయ్యిలుః

సాంద్రతరమైన సాముదాయిక సౌర పొయ్యిలు పరావర్తిత పరావలయ సౌర సాంద్రీకరణం ద్వారా సౌరశక్తిని గాఢత చెందిస్తాయి.

పరావల సౌర సాంద్రీకరణం సౌర వికిరణాన్ని కేంద్ర భాగంలో ఉండేటట్లు వంట పా్రతలను ఉంచుతారు.

సౌర పొయ్యిలోని భాగాలు

భాగము ఎ - సౌర సాంద్రీకరణ ఫలకం ( ప్రాథమిక పుటాకారపు గాజు పలక )

సౌర శక్తి కేంద్ర స్ధానంలో పడేటందుకు ఈ చట్రం తోడ్పడుతుంది.సౌర పొయ్యిలోని భాగాలు

భాగము బి - స్వయంగా పని చేసే వ్యవస్ధ

సాధారణ స్వయం చాలక వ్యవస్ధ ద్వారా సౌర చట్రం సూర్యుడు ఉండే దిశ వైపు కదులుతూ ఉండడం వలన నిరంతరంగా సరిపడు సాంద్రీకరణ సౌరశక్తి చేరుతుంది.

భాగము సి- ద్వితీయ పుటాకార గాజు పలక

వంట గదిలో వంట చేేస ప్రాంతానికి వంట వండే గిన్నెలకు కొద్దిగా దిగువన ఉండేటట్లు పుటాకార గాజు ఫలకంను ఉత్తరం ముఖంగా ఉంచాలి. ఈ రిఫ్ల క్టర్ సాంద్రీకరణ చెందిన సౌర వికిరణమును గ్రహించి పై చిత్రంలో చూపిన విధంగా వంట గిన్నెల అడుగు వైపుకి పరావర్తితమౌతుంది.

భాగము డి - వంట పాత్రలు

సూర్యశక్తి ద్వారా నీటిని పంపిణీ చేయువిధానము

సూర్యరశ్మి ద్వారా నీరు తోడే పధ్ధతిలో సౌరశక్తిని ఉపయొగించి ఒత్తిడి ద్వారా అవసరమైన ప్రదేశాలకు నీటిని సరఫరా చేయటం జరుగుతుంది.

భాగాలు:

 • సూర్యకిరణాలను గ్రహించగల ఒక చదునుగా ఉన్న పళ్ళెంలాంటి పరికరము.
 • ఈ దిగువ ఇచ్చిన వాటిలో ఏదైనా ఒక నీరు తోడే యంత్రము, మిశ్రమ ఛాయా కిరణాల వరస శ్రేణులతో కలిసి పనిచేయాటానికి సరిపడుతుంది.Solar water pumping system
 • ఉపరితలమునకు బిగించిన యంత్రము ద్వారా వివిధ దిశలకు సరఫరా చేయగల నీటి పంపు.
 • నీటి అడుగు భాగాన్నించి కూడా పనిచేయగల యంత్రం.
 • నీటిలో తేలియాడే యంత్రం
 • ఎమ్. ఎన్ . ఆర్ .ఇ. నుండి అనుమతి పొందిన ఏ ఇతర రకాలయిన నీటి యంత్రాలు. (సాంప్రదాయేతర ఇంధన వ్యవహారాల మంత్రిత్వశాఖ)

గొట్టములు:

సూర్యరశ్మి ద్వారా నీరు సరఫరా పనిచేయువిధానము:

సూర్యరశ్మి వలన ఉద్భవించిన మిశ్రిత ఛాయాకిరణాల (పివి) ద్వారా ఉత్పన్నమైన శక్తిని ఉపయోగించి, ఈవ్యవస్థ పనిచేస్తుంది. పి.వి. లోహంతో చేయబడిన వరుస శ్రేణులు సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మారుస్తాయి. ఈ విద్యుచ్ఛక్తి నీటి యంత్రము పని చేయాటానికి ఉపయోగపడుతుంది.

ఈ సౌరశక్తి నీటి సరఫరా వ్యవస్థ ద్వారా ఆరుబయలు బావులనుండి, బోరు బావులనుండి, నీటి ప్రవాహాల నుండి, కుంటలనుండీ, కాలువలనుండి, నీరుతోడటానికి ఉపయోగపడుతుంది.

ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాటానికి నీడ సోకని ఆరుబయలు ప్రదేశం అవసరమవుతుంది. సూర్యరశ్మిని గ్రహించగల లోహపుచట్రమును ఏర్పాటు చేయాటానికి అప్పుడే వీలవుతుంది.

ప్రయోజనం
ఒక 1800 వాట్ల పి.వి. వరుసల సామర్థ్యం కలిగి మరియు 2 అశ్వశక్తి ఉన్న సౌరశక్తి వ్యవస్థ ఒక్కరోజులో6 నుండి 7 మీటర్ల లోతు నుండి 1.4 లక్షల లీటర్ల నీటిని తోడి సరఫరా చేయగలదు. ఈ నీటి
పరిమాణము 5 నుండి 8 ఎకరాల భూమిని సాగులోనికి తీసుకొచ్చి వివిధ పంటలు పండించడానికి
సరిపోతుంది.

రమారమి ఖర్చు:
వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే ఖర్చు రూ. 4,50,000/-
భారత ప్రభుత్వము ఇచ్చే రాయితి. రూ.1,80,000/-
(మరల ఉపయోగించే ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ)

ఇతర ఉపయోగాలు

 • ఉచితంగా లభ్యమయ్యే సూర్యకాంతిని ఉపయోగించటం వలన, ఎటువంటి అదనపు ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు.
 • విద్యుచ్ఛక్తి అవసరము లేదు
 • ధీర్ఘకాలము పని చేస్తుంది
 • ఎంతో నమ్మకమైనది, మరియు మన్నికైనది
 • ఉపయోగించటం, నిర్వహించటం చాలా తేలిక
 • పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది.

ఆధారము : www.hareda.gov.in

సౌరశక్తిని ఉపయోగించి నీటిని తోడే పధ్ధతిపై తరచు వచ్చే సందేహాలు

సోలార్ ఫోటో వోల్టాయిక్ (ఎస్.పి.వి.) నీటి పంపిణీ వ్యవస్థలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు?

ఎస్.పి.వి. నీటి పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్వహించటానికి, అన్ని రాయితీలు పోగా అయ్యే ఖర్చు రూ. 1,90,000 నుండి రూ. 2,70,000 వరకూ ఉంటుంది. ఐతే ఈ ఖర్చు, పంపిణీదారుల మీద మరియూ ఏ రకమైన పరికరాలను కొనుగోలు చేస్తున్నామనే అంశం మీద అధారపడి ఉంటుంది.

ఇందుకోసం ఏమైనా ఋణాలు అందుబాటులో ఉన్నాయా?

 

 • భారత పునరుత్పాదిత ఇంధనాభివృద్ధి సంస్థ (ఐ.ఆర్.ఇ.డి.ఎ) ద్వారా సంవత్సరానికి 5% వడ్డీతో తేలికపాటి ఋణాలు అందుబాటులో ఉన్నాయి.
 • ఎస్.పి.వి. నీటి పంపిణీ వ్యవస్థ ఏర్పాటుకై ఇచ్చే రాయితీలో 90 శాతం వరకూ గరిష్ట పరిమితిగా తేలికపాటి ఋణాలు లభిస్తాయి.
 • రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకోనట్లైతే, సెట్ అమ్మకపు ధరలో 90% వరకూ ఋణం లభిస్తుంది.
 • ఋణం తీసుకున్న మొదటి సంవత్సరంలో ఎటువంటి మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. మొదటి సంవత్సరం చివరినుంచి 10 సంవత్సరాల లోపు అసలు, వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

 

భారత ప్రభుత్వ నూతన మరియు పునరుత్పాదన ఇంధన వ్యవహారాల శాఖ యొక్క ఎస్.పి.వి. నీటి సరఫరా పథకం క్రింద ఏఏ రకాల పనులకు రాయితీలు అందుబాటులో ఉంటాయి?

వ్యవసాయం మరియు దాని అనుబంధ పనులైన ఉద్యానవనాలు, పశు పోషణ, కోళ్ళ పెంపకం, వాణిజ్య పంటలు, తోటలు, అడవుల పెంపకం, చేపల పెంపకం, ఉప్పు తయారి, మంచినీటి తయారి మొదలగు కర్యక్రమాలకు రాయితీలు లభిస్తాయి. ఈ పధకం క్రింద బ్యాటరీ చార్జింగ్ ద్వారా నడిచే పనులకు రాయితి సౌకర్యం లేదు.

ఈ జాతీయ పథకం క్రింద సోలార్ ఫోటోవోల్టాయిక్ నీటి పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటానికి ఎవరు అర్హులు?

వ్యక్తిగత వ్యవసాయదారులు, ప్రభుత్వేతర సంస్థలు, సహకార సంస్థలు, కంపెనీలు, ఇతర సంస్థలు మరియు ప్రభుత్వ విభాగాలు.

ఎస్.పి.వి. నీటి పంపిణీ వ్యవస్థ సామర్ధ్యం ఎంత ఉంటుంది?

మార్కెట్లో 200 వాట్ల నుండి 3000 ల వాట్ల వరకూ సామర్ధ్యం గల ఫోటోవోల్టాయిక్ వ్యవస్థలు దొరకుతాయి. (మోటారు పంపు సెట్ సామర్ధ్యం 0.5 అశ్వశక్తి నుండి 2 అశ్వశక్తి వరకూ ఉంటుంది.)

ఒక నీటి పంపు ఎంత నీటిని తోడి సరఫరా చేయగలదు?

 • ఎస్.పి.వి. నీటి పంపిణీ వ్యవస్థ ద్వారా, బాగా ఎండగా ఉన్న రోజయితే, ఏడు మీటర్ల లోతు నుండి 1800 వాట్ల విద్యుత్ ప్రవాహికను ఉపయోగించి 1,35,000 లీటర్ల నీటిని తోడి పంపిణీ చెయ్యవచ్చు. అదే 900 వాట్ల విద్యుత్ ప్రవాహికను ఉపయొగిస్తే 65,000 లీటర్ల నీరు సరఫరా అవుతుంది.
 • బాగా లోతుగా ఉన్న బావుల్లో నీటిలో మునిగే పంపుల ద్వారా అయితే, 1200 వాట్ల యంత్రాన్ని ఉపయోగించి 45000 ల నీటిని పంపిణీ చేయొచ్చు.
 • పంపు ద్వార ఎంత నీరు తోడవచ్చు అనే విషయం, రోజులో ఉదయం నుండి సాయంకాలం వరకూ ఉన్న సూర్యకిరణాల తీవ్రత మీద అధారపడి ఉంటుంది. మిట్టమధ్యాన్నం పంపిణీ గరిష్ట స్థాయిలో ఉంటుంది. భూమిలోపల లోతు పెరిగేకొద్దీ పంపు ద్వారా పంపిణీ అయ్యే నీటి పరిమాణం, ప్రవాహ వేగం తగ్గిపోతూ ఉంటుంది.
 • ఎస్.పి.వి. పంపు పంపిణీ వ్యవస్థ ఎంత నీరు తోడగలదనే విషయాన్ని, ఆ పంపు సెట్ ను అమ్మిన సరఫరాదారు, దానిని ప్రదేశంలో ఏర్పాటు చేసే సమయం లోనే కొనుగోలుదారులకు స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది.

ఎస్.పి.వి. పంపిణీ వ్యవస్థను ఉపయోగించి ఏదయినా పంటకు సంబంధించి, ఎంత ప్రదేశానికి సాగు నీరు అందించవచ్చు?

10 మీటర్ల లోతు నుండి కనుక నీటిని తోడినట్లయితే ఎస్.పి.వి. వ్యవస్థ ద్వారా 0.5-6 హెక్టార్లకు నీరు సరఫరా చేయవచ్చు. అయితే, భూగర్భ జలాల లభ్యత, ఏ రకమైన భూమి, నీటి నిర్వహణా విధానం అనే మొదలగు అంశాల మీద ఎంత భూమిని సాగు చేయవచ్చు అనే విషయం అధారపడి ఉంటుంది.

-సరాసరి గరిష్ట విద్యుత్ ప్రవాహాన్ని పరిగణన లోకి తీసుకుంటే, ఒక 900 వాట్ల ఎస్.పి.వి నీటి వ్యవస్థ ద్వారా వివిధ పంటలకు ఈ దిగువ ఇచ్చిన పట్టిక ప్రకారం ప్రదేశాలకు నీటిని సరఫరా చేయవచ్చు.-

వ. సంఖ్య

పంటలు

సాగు అయ్యే ప్రదేశం (హెక్టారులలొ)

సాగు పద్ధతి

1

సంవత్సరం పొడుగునా పండే కూరగాయల సాగు

1.00

భూమి ఉపరితలం మీద

2

మిరప, జొన్న, వేరుశెనగ

1.41

భూమి ఉపరితలం మీద

3

వరి నారుమళ్ళు

0.70

భూమి ఉపరితలం మీద

4

వెల్లుల్లి

2.08

సూక్ష్మ రంధ్రాల ద్వారా నీటిని విరజిమ్మే పద్ధతి

5

దోసకాయ

1.82

బిందు సేద్యం

6

వేరుశెనగ

1.97

సూక్ష్మ రంధ్రాల ద్వారా నీటిని విరజిమ్మే పద్ధతి

7

ద్రాక్ష

2.14

బిందు సేద్యం

8

నిమ్మ

4.89

బిందు సేద్యం

9

అరటి

2.36

బిందు సేద్యం

10

దానిమ్మ

7.32

బిందు సేద్యం

కొనుగోలు చేసిన నీటి పంపిణీ వ్యవస్థ నిర్వహణ గురించి ఏమైనా పూచీ (గారంటీ) సౌకర్యం ఉందా?

 • పి.వి. వ్యవస్థ సెట్ పరికరాలు వాటి నిర్వహణపై 10 సంవత్సరాల గారంటీ తో సరఫరా చేయబడతాయి.
 • విద్యుచ్ఛక్తితో నడిచే యంత్రాలు మరియు వాటి ఉప-పరికరాలు 2 సంవత్సరాల పూచీతో లభిస్తాయి.
 • ఎస్.పి.వి. నీటి పంపిణీ వ్యవస్థ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి కావలసిన కనీస విడిపరికరాలు 3 సంవత్సరాల పూచీతో లభిస్తాయి.

ఆధారము : http://www.ireda.gov.in/

సోలార్ వీధి ధీపాల పద్ధతి

పోటోవోల్టిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సోలార్ సెల్స్ ద్వారా సూర్యకాంతిని డిసి విద్యుత్ గా మార్చి సోలార్ వీధి దీపాల పద్ధతిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఉత్పత్తి కాబడిన విద్యుత్ ను మనము డైరెక్టుగా అదే రోజు వాడుకోవచ్చు లేదా బ్యాటరీలో విద్యుత్తును నిల్వ ఉంచుకొని రాత్రి వేళలో ఉపయోగించువచ్చు.

సోలార్ వీధి ధీపాల పద్ధతి లోని భాగాలు :

 • సోలార్ ఫోటోవోల్టిక్ మాడ్యూల్
 • బ్యాటరీ బాక్సు
 • చార్జి కంట్రోలర్ తో పాటు బల్బు
 • బల్బు స్థంభం

సాధారణంగా ఈ సోలార్ వీధి ధీపాలు ఈ క్రింది పరికరాలను కల్గి ఉంటాయి

 • 74 వాట్ సోలార్ పివి మాడ్యూల్
 • బ్యాటరీ బాక్సుతో పాటు 12 వాట్, 75 ఎ హెచ్ టుబులర్ బ్యాటరీ
 • చార్జి కంట్రోలర్ తో కూడిన ఇన్వర్టర్ (20-35 కిలోహెజ్)
 • 11 వాట్ సి.యఫ్.యల్. లాంపు మరియు దాని పిక్స్ చేసే పరికరాలు
 • నేలపై వాతావరణానికి తట్టుకునేటట్టు రంగు పూయబడిన, హర్డ్ వేర్ అమర్చబడిన 4 మీటర్ల మిల్డ్ స్టీల్ ల్యాంపు స్థంభం

గిరిజన, గ్రామీణ ప్రాంతాలలో వీధి ధీపాలకు సోలార్ వీధి ధీపాలు ఒక ఖచ్చితమైన పరిష్కార మార్గం. రోజుకి 10 లేదా 11 గంటలకు సరిపడ విద్యుత్తును నిల్వ చేసుకుని, దానిని రాత్రి వేళల్లో ఉపయోగించుకునే విధంగా ఈ సోలార్ వీధి ధీపాల పద్ధతి అందిస్తుంది. ఈ పద్దతిలో ఆటోమేటిక్ గా పనిచేసే స్విచ్ ఉంటుంది. ఇందులో ఆన్, ఆఫ్ ఉంటుంది. ఇది ఎక్కువ చార్జి అయినా, తక్కువ చార్జి అయినా ఆటోమేటిక్ గా పనిచేసి, లెడ్ ఇండికేటర్స్ లో సూచిస్తూ కనీస విద్యుత్ చార్జీ అయ్యేట్టు చేస్తుంది.
సోలార్ పోటోవోల్టిక్ మాడ్యూల్ యొక్క జీవిత కాలం 15 నుంచి 20 సంవత్సరాలని నివేదికలు సూచిస్తున్నాయి. అతితక్కువ నిర్వహణతో సోలార్ వీధి ధీపాల పద్ధతితో పాటు టుబులర్ బ్యాటరీలు పనిచేస్తాయి. ఎక్కువ కాలం పనిచేస్తాయి. మంచి గా పనిచేస్తాయి.

సుమారుగా వీటి ధర
ప్రధానమైన పరికరాలతో చూస్తే సుమారుగా వీటి ధర రూ. 24,000, ఇవి వివిధ మోడల్స్ లో లభిస్తున్నాయి. మోడల్ ను బట్టి ధర ఉంది.

ప్రయోజనాలు

 • విధ్యుత్ అవసరం లేదు
 • అమర్చడం చాలా సులువు
 • అతి తక్కువ నిర్వహణతో వీటిని ఆపరేట్ చేయవచ్చు
 • పర్యావరణానికి హాని కల్గించదు

ఆధారము: www.geda.org.in

సూర్యరశ్మితో ఇంట్లో విద్యుత్ దీపాలు వెలిగించుకునే వధ్దతి

సౌరశక్తి (సూర్యరశ్మి)ని నేరుగా విద్యుఛ్చక్తిగా మార్చగలిగే సోలార్ సెల్స్ ఉపయోగంతో ఇంటిలో దీపాలు వెలిగించుకునే పధ్దతి సౌరశక్తి వాడకం ద్వారా సాధ్యమవుతుంది. ఈ విద్యుఛ్చక్తిని బ్యాటరీలలో నిలువచేసుకొని, అవసరమైనపుడు దీపాలు వెలిగించుకోవడానికి వాడుకోవచ్చు.

దీనిని ఉపయోగించుకునే ప్రదేశాలుః

 • విద్యుత్ సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలలో
 • ఇళ్లలోనూ మరియు వ్యాపార సంస్ధలలోను అత్యవసర పరిస్ధితిలో దీపాలు వెలిగించుకోవడానికి

సౌరశక్తితో ఇంట్లో విద్యుత్ దీపాలు వెలిగించుకునే వధ్దతిని విర్వహించుకోవడం మరియు దాని విడిభాగాలు.
ఇళ్లలో దీపాలు వెలిగించుకునే ఈ విధానం ఒక ఫిక్సెడ్ ఇన్స్టలేషన్ వంటిది, గృహావసరాలకోసం, గృహాలలో వాడుకోవడానికి రూపకల్పన చేయబడినటువంటిది. ఈ పధ్దతిలో ఈ క్రింది భాగాలు ఉంటాయిః

 • సోలార్ పి.వి. మోడ్యూల్ (సోలార్ సెల్స్)
 • ఛార్జ్ కంట్రోలర్
 • బ్యాటరీ, మరియు
 • లైటింగ్ సిస్టమ్ (లైట్లు మరియు ఫ్యాన్లు)

ఈ హెచ్.ఎల్.ఎస్. (హోమ్ లైటింగ్ సిస్టమ్) యొక్క రూపకల్పనావిధానం ఈ క్రింద వివరించబడింది. ఈ సోలార్ మోడ్యూల్ ఇంటి పైకప్పుమీద ఉండే ఖాళీ ప్రదేశంలో గానీ లేక ఆరుబయట గాని సూర్యరశ్మికి ఎదురుగా, ప్రత్యక్షంగా ఉండేటట్లుగా బిగించబడుతుంది. ఇంట్లో సురక్షితమైన ఒక ప్రదేశంలో దీని చార్జ్ కంట్రోలర్ మరియు బ్యాటరీ ఉంచబడతాయి. ఈ సోలార్ మోడ్యూల్ ను తరచుగా, ఒక నిర్ణీత వ్యవధి ప్రకారం దుమ్ము, ధూళి చేరకుండా తుడిచి, సమర్ధవంతంగా పనిచేయడానికి శుభ్రం చేస్తూవుండాలి

నిర్వహణకు పట్టే టైము

ఈ సమయం ఈ సిస్టం యొక్క సామర్ధ్యం (కెపాసిటీ) పై ఇది ఆధాపడివుంటుంది. అయితే సాధారణంగా పూర్తిగా చార్జ్ చేయబడిన బ్యాటరీతో , రోజుకి 3 – 4 గంటలసేపు పనిచేయగలిగే విధంగా ఈ పధ్దతి రూపకల్పన చేయబడి వుంటుంది. 1 – 2 ఎండలేని రోజులకు లేక మబ్బుతో ఉండే రోజులకు సరిపోయేంత సౌరశక్తిని నిలువ ఉంచుకోవడానికి వీలుగా ఈ పధ్దతి రూపొందించబడి ఉంటుంది.

ఈ విధానానికి అయ్యే ఖర్చు మరియు ఆర్ధిక సహాయం.

నాబార్డ్ మరియు ఎమ్.ఎన్.ఆర్.ఇ. వారి ద్వారా ఆర్ధిక సహాయం అందించబడే ఈ హోమ్ లైటింగ్ సిస్టమ్ (ముందుగా అనుమతించబడిన పి.వి. మోడళ్లు) యొక్క సాంకేతిక మరియు ఆర్ధిక ప్రామాణికాలు:

మోడల్

ఫొటో వోల్టాయిక్ మోడ్యూల్
(డబ్ల్యు.పి)

12 వి. బ్యాటరీ
(ఎ. హెచ్.)

ఈ పధ్దతి నుండి ఆశించబడే సామర్ధ్యం – లైటింగ్ లోడ్/ఇతర లోడ్ లు మరియు నిర్వహించుకునే కాల వ్యవధి

అంచనా వేయబడిన ఖర్చు (రూ.లలో)

మూలధనంపై అత్యధి కంగా ఆర్ధిక సహాయం
పొందడానికి అర్హత

అత్యధికంగా పొంద గలిగే ఋణం (రూ.లలో) సాలీనా 5 శాతం వడ్డీతో

I

10

10

10వా/4 గంటలకు

3000

900

1500

II

18

20

10వా/8 గంటలకు
20వా/4 గంటలకు

5400

1620

2700

III

37

40

10వా/12 గంటలకు
30వా/4 గంటలకు

11100

3330

5550

IV

50

60

20వా/8 గంటలకు
40వా/4 గంటలకు

15000

4500

7500

V

70

70

20వా/12 గంటలకు
30వా/8 గంటలకు
50వా/4 గంటలకు
60వా/4 గంటలకు

21000

6300

10500

VI

85

120

40వా/8 గంటలకు

25500

7650

12750

VII

100

120

30వా/12 గంటలకు

30000

9000

15000

VIII

120

135

40వా/12 గంటలకు
50వా/8 గంటలకు

36000

10800

18000

IX

150

150

60వా/8 గంటలకు

45000

13500

22500

X

180

180

50వా/12 గంటలకు

54000

16200

27000

XI

200

2x120

60వా/12 గంటలకు

60000

18000

30000

మొత్తం ఖర్చు, అత్యధికంగా మూలధనంపై లభించే ఆర్ధికసహాయం మరియు ఆర్ధికసహాయంతో ఇవ్వడానికి అర్హతగల ఋణం సొమ్ము, ఒక డబ్ల్యు.పి. కు రు.లు 300/-గా లెక్కించబడి, 2010-11 సంవత్సరానికి ఎమ్.ఎన్.ఆర్.ఇ.. వారిచే నిర్ణయించబడిన దానిపై ఆధారపడి గుణించబడింది. ఒకవేళ ఈ విధానానికి వాస్తవంగా పెట్టబడిన ఖర్చు, పైన అంచనావేయబడిన దానికంటే తక్కువగా అయిన పక్షంలో వాస్తవంగా అయిన ఖర్చులో ఆర్ధికసహాయం మరియు ఋణానికి గల అర్హతలను 30 శాతం గాను మరియు 50 శాతంగాను ఆ వరుసక్రమంలో, గుణించి లెక్కించడం జరుగుతుంది.

ఆధారము: http://nabard.org/

www.geda.org.in

వ్యవసాయానికి సోలార్ (సూర్య రశ్మి తో పనిచేసే) ఉత్పత్తులు

సూర్య రశ్మితో పనిచేసే.త్రీ-ఇన్-వన్ సాధనం

ఈ వినూతనమైన సూర్య రశ్మితో పనిచేసే సాధనాన్ని ఒక సోలార్ వాటర్ హీటర్ (నీటిని వేడి చేసే పరికరం) గా చలికాలంలో వాడుకోవచ్చు, వాతారణం మబ్బులు లేకుండా, సాధారణంగా వుండే రోజులలో ఒక సోలార్ కుకర్ గానూ మరియు పళ్లను, కూరగాయలను ఆరబెట్టడానికి ఒక సోలార్ డ్రైయర్ గా కూడా వినియోగించుకోవచ్చు. చలికాలంలో తక్కువ స్ధాయిలో ఉండే సూర్య రశ్మిను ఉపయోగించుకుంటూ, 50-60 డి. సెం.లలో ఇది ఇంచుమించు 50 లీటర్ల వేడి నీటిని, కాచి ఇవ్వ గలదు. అలాగే సోలార్ కుకర్ గా ఇది ఒక కుటుంబానికి సరిపోయే ఆహారాన్ని 2-3 గంటలలో వండగలదు, అది కూడా సూర్య రశ్మిని అంతగా అనుసరించకుండా. ఒక డ్రయ్యర్ గా పళ్లు, కూరగాయలను ఆరపెట్టి, పొడిగా ఉంచ గలదు. పగటిపూట ఉష్ణోగ్రతను సమర్ధవంతంగా కావలసిన స్ధాయిలో ఉంచుతూ, నీరు ఒక సింక్ (వేడిని పీల్చుకుని) గా పనిచేస్తూ, ఉష్ణోగ్రతను క్రమబధ్దీకరిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట కూడా ఈ సోలార్ సౌకర్యంతో తయారైన వేడినీటితో, ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండడానికి ఇది తోడ్పడుతుంది.

పి.వి. విన్నోవర్-కమ్ డ్రయ్యర్

సోలార్ విన్నోవర్ (చెరగడం) కమ్ డ్రైయ్యర్ కోయడబడిన వ్యవసాయ ఉత్పత్తులను చెరగడంలో ఒక ఉపయోగకమైన, అనువైన పరికరం. ముఖ్యంగా సహజసిధ్దంగా వీస్తూ వుండే గాలులలో స్తబ్దత ఏర్పడిన సమయంలో, అలాగే పళ్లను, కూరగాయలను బలవంతంగా గాలిని ప్రసరింప చేస్తూ నిర్జలీకరణం (డిహైడ్రేషన్) చేయడానికి కూడా అనువైన పరికరం. ఈ పరికరంలో ఒక పి.వి. మోడ్యూల్, సంపూర్ణమైన ఒక చెరగడానికి ఉపయోగించే పరికరం, గాలిని ముందుగా వేడి చేయడానికి ఒక టన్నెల్, ఈ ఉత్పత్తులను నిర్జలీకరణం చేసేటప్పుడు సరైన రీతిలో విన్నోవర్ ఫ్యాన్ గాలి ప్రసరణను అధికం చేయడానికి అంతర్గతంగా కనెక్టు చేసేలా ప్రత్యేకంగా రూపొందించిన సోలార్ డ్రయ్యింగ్ క్యాబినెట్ ఉంటాయి. ఈ పరికరాన్నుపయోగించి 35-50 కి.గ్రా. శుభ్రం చేయబడిన గింజలను/విత్తనాలను కేవలం ఒక గంటలో పొందవచ్చు.

ఇంతే కాకుండా, వివిధ రకాల పళ్లను, కూరగాయలను మామూలుగా ఆరుబయట ఎండలో ఆరబెట్టడానికి తీసుకునే టైముకంటే తక్కువగా, అంటే సగానికంటే తక్కువ టైములో నిర్జలీకరణం చేయవచ్చు. ఫ్యాన్ గాలి వేగవంతం చేయడంతో, అధిక కాంతి ప్రసరణతో, ఇది ఉష్ణోగ్రతను క్రమబధ్దీకరిస్తూ ఉండగా, విస్తృత పరచిన టన్నెల్ లో ముందుగా చేసిన వేడి, ఈ డ్రైయింగ్ క్యాబినెట్ లోపల ధర్మల్ గ్రేడియంట్ (ఉష్ణ స్రవణత) ను తగ్గించివేస్తుంది. ఆ విధంగా అతి శ్రేష్టమైన నాణ్యతతో కూడిన, ఆరబెట్టబడిన వాటిని మనం అందుకోవచ్చు, అదే సువావసనతో, అదే రంగుతో. ఈ విధానాన్ని మరికొన్ని అదనపు హంగులతో, అంటే ఛార్జింగు రిగ్యులేటర్ తో సహా ఒక బ్యాటరీను దానిలో పెట్టి ప్రకాశవంతంగా, వెలుగును విరజిమ్మేదిగా చేయవచ్చును. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రోసెస్ చేయడానికి మరియు దీని ద్వారా జనరేట్ చేయబడిన పి.వి. విద్యుత్ ను కూడా ఏవైనా ఇతర పనులకు సంవత్సరాంతం వినియోగించుకుంటూ దీనిని అత్యంత ఉపయోగకరమైన సాధనంగా చేయవచ్చు.

పళ్లతోటల కోసం పి.వి. జనరేటర్.

ప్రధానంగా ఇది ఒక సోలార్ పి.వి. పంపుచే ఆపరేట్ చేయబడే సేద్యపు నీటి పారుదల పధ్దతి. 900W తో ఒక క్రమపధ్దతిలో ఏర్పాటు చేయబడిన 800W డి.సి. మోటారు పంపు మోనో బ్లాక్ తో మరియు నీటి వినియోగాన్ని పొదుపు చేసే ఓ.ఎల్.పి.సి. డ్రిప్పర్స్ (నీటిబొట్లు వెదజల్లుతూ వుండే పరికరం), మామూలుగా పొలం అంతా నీరుపెట్టే పద్దతిలోని అన్ని సమస్యలను తొలగిస్తూ, పళ్లతోటలకు చాలా అనువైనదిగా ఉంటుంది. మొక్కలకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని బట్టి, శక్తి (ఎనర్జీ) అవసరాలను బట్టి ఇది వుంటుంది మరియు కాంతిప్రసరణతో సంభవిస్తూ వుండే ఒత్తిడిలో హెచ్చు, తగ్గులను సరిచేయడానికి ఈ విధానాన్ని రూపొందించవలసి ఉంటుంది, తోటలో ఒకే రీతిలో నీటిని వినియోగిస్తూ వుండడాన్ని చూడడంతో పాటుగా. ఇది 4-5 హెక్టార్ల మేర దానిమ్మ తోటకు నీటిని అందిస్తుంది. ఖర్చులో మిగిలే లాభం యొక్క నిష్పత్తి 2 కు మించి ఉండి, ఇది లాభసాటి అయినదని ఋజువు చేస్తుంది. భూమి, నీరు ఉండి విద్యుశ్చక్తి లేనటువంటి చోట ఇది ఒక వరమే.

డి..సి-డి.సి. కన్వర్టర్ వంటి ఉప పరికరాల (సబ్ కంపోనెంట్స్) తోను, స్టోరేజ్ బ్యాటరీలు మరియు తగిన ఇన్వర్టర్ తోను ఈ నీటిపారుదల పి.వి. సిస్టమ్ ఇప్పుడు ఒక జనరేటర్ గా మార్చబడింది. కేవలం ఒక పంపుగానే కాకుండా దీనిని అదనంగా పంట తర్వాత నిర్వహించుకునే పనుల కోసం ఉపయోగించుకునే చిన్న మిషన్లను తిప్పడానికి కూడా వినియోగించుకోవచ్చు.

సోలార్ పి.వి. డస్టర్ (పొడి మందు చల్లడానికి వాడే పరికరం)

వ్యవసాయంలో మొక్కల సంరక్షణ అనేది ఒక ముఖ్యమైన అంశం. సోలార్ పి.వి.డస్టర్ పంట మొక్కలపై పొడి క్రిమిసంహారక మందు చల్లడానికి వాడే ఒక వినూతనమైన సాధనం. ప్రధానంగా ఇది ఒక పి.వి. పానెల్ వాహకంతో, ఒక స్టోరేజ్ బ్యాటరీతో మరియు ఒక ప్రత్యేకంగా రూపొందించబడిన, అనువైన, డస్టర్తో కలిసి వుంటుంది. ఒక కేరియర్ సహాయంతో తలపై పెట్టుకుని మోసుకెళ్లడానికి వీలుగా వుండే ఈ పివి.పానెల్, పనిచేసే వ్యక్తికి నీడగా ఉపయోగపడుతూ, అదే సమయంలో ఈ డస్టర్ ను నడపడానికి అవసమయ్యే శక్తికోసం బ్యాటరీను ఛార్జ్ చేస్తూ వుంటుంది,. ఇదే సిస్టమ్ ను అల్ట్రా లో వాల్యూమ్ (యు.ఎల్.వి) (తక్కువ స్ధాయిలో) ఒక స్ప్రేయర్ ను కూడా నడపగలదు. దీనికి అదనంగా, వెలుతురును ప్రసరించే ఒక డయోడ్ (లైట్ ఎమిటింగ్ డయోడ్) ను కాంతివంతంగా మెరిసిపోతూ వుండేటట్లు చేయడానికి కూడా ఉపయోగించ వచ్చు. ఇంట్లో కూడా సంవత్సరాంతం లైట్లను వెలిగించుకోవడానికి మరియు డస్టర్ ను/స్ప్రేయర్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపరేట్ చేసుకోవడానికి ఈ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు.

పి.వి.మొబైల్ యూనిట్

స్వయం-చోదిత (సెల్ఫ్ ప్రొపెల్లింగ్) పి.వి. మోడ్యూల్ కదులుతూ వుండే స్వయం చోదిత పవర్ సిస్టమ్ వంటిది. దీనిని అనేక విధాలైన పనులను విర్వహించుకోవడానకి ఉపయోగించుకోవచ్చు – అంటేః గ్రామీణ ప్రాంతాలలో దూరంగా ఒంటరిగా వుండే గృహసముదాయాలలో, ముఖ్యంగా ఎండు నేలలలో ఉండే ధని (పల్లెలలో) లలో గృహావసరాలకు, వ్యయసాయానికి మరియు గ్రామీణ సంబంధితమైనవి. ఈ యూనిట్ ముఖ్యంగా రెండు 70W పోలిక్రిస్టల్లిన్ పి.వి.మోడ్యూల్స్ తో ఉండి, చార్ఝి రిగ్యులేటరుకు కనెక్టు చేయబడి వుంటూ, మడిచిపెట్టుకునే వీలున్న సిస్టమ్. ఆటోమెటిగ్గా తాళం వేసుకునే సౌకర్యంతో, ఈ పి.వి. పానెల్సు (70 W) ను దానిలో ఒక ఎత్తైన యాంగిల్ లో, ఒక ఇన్వర్టర్ మరియు ఒక డి.సి. మోటార్ తో ఆపరేట్ చేయగలిగే డ్రైవ్ సిస్టమ్ ను పెట్టుకోవడానికి ఈ యూనిట్ ను సునాయాసంగా డ్రైవ్ చేయవచ్చు. అలాగే ఒక ఏ.సి. మరియు డి.సి. లోడ్స్ ను ఉభయతారకంగా, అపరేట్ చేయడానికి ఉపయోగించ వచ్చు.. ఒక చర్నర్ (మజ్జిగ చేసేకునేందుకు ఉపయోగించే గిలక వంటిది) ను వెన్నను తీయడానికి, ఒక బ్లోయర్ (గాలిని వేగంగా విడుదల చేసే సాధనం) ను , ఒక విన్నోవర్ (ఆరబెట్టడానికి ఉపయోగించే జల్లెడ) ను, ఒక ఎలో వెరా (కలబంద) ఎక్స్ ట్రాక్టర్ ను (బయటకు తీసే సాధనం) మొదలగు పనులను నిర్వహించడానికి ఆ విధానం విజయవంతంగా పరిక్షించబడింది. ఇటువంటి పి.వి. మొబైల్ యూనిటి ను గ్రామాలలో అద్దెకు ఇవ్వవచ్చు.

మరిన్ని వివరాల కోసం, సంప్రదించండిః

సెంట్రల్ ఆరిడ్ జోన్ రిసెర్చ్ ఇన్స్టి ట్యూట్,
జోధ్ పూర్ – 342003, రాజస్ధాన్, ఇండియా.
ఫోన్ నం. +91-291 2786584, ఫ్యాక్స్ +91-291 2788706.

ఆధారము: అక్షయ్ ఊర్జా సౌజన్యంతో . వాల్యూమ్ 4, ఇష్యూ 4.

వంట చెత్త ఆధారిత బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం

పర్యావరణానికి ఉపయోగపడే విధంగా బార్క్ సంస్థ ఆవరణలో ఉద్యానవన స్థలం నందు వివిధ ఫలహారశాలలో పారవేసే వంటచెత్త ఆధారంగా ఒక బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. ఈ బయోగ్యాస్ కేంద్రంలో ఫలహారశాలయందు ఉత్పత్తి అయ్యే చెత్తను వినియోగించాలని ఆశించడం జరిగింది. బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం ఈ క్రింది భాగాలను కలిగి ఉంటుంది :

 • గట్టిగా ఉన్న చెత్తను కలిపేందుకు ఒక పిండి మర (మిక్సెర్) /పల్పర్ ( 5 హెచ్.పి మోటర్) (A mixer/pulper (5 HP motor) for crushing the solid waste)
 • ప్రకియకు ముందుగా చెత్తను కలిపే ట్యాంకులు (Premix tanks)
 • ప్రక్రియకు ముందుగా చెత్తను పిండిచేయు యంత్రాలు (Pre digest tank)
 • సౌరశక్తితో నీళ్ళను వేడిచేయు పరికరాలు (Solar heater for water heating)
 • చెత్తను అరగదీసే ప్రధాన ట్యాంకు (35 మి3) (Main digestion tank (35 m3))
 • ఎరువుల గుంతలు (Manure pits)
 • ఉత్పత్తి అయ్యే బయోగ్యాస్ తో వెలిగించే గ్యాస్ దీపాలు (Gas lamps for utilisation of the biogas generated in the plant)

ప్రక్రియ

వంటింటిలో సాధారణంగా ఏర్పడే చెత్త అనగా కూరగాయల ముక్కలు, వండి పాచిపోయినవి మరియు వండని ఆహారం, వడగట్టిన టీ పొడి, చెడిపోయిన పాలు మరియు పాల ఉత్పత్తులు లాంటి చెత్త పదార్థాలను ఈ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో వినియోగించడం జరుగుతుంది.

వంటింటి చెత్త సేకరిస్తున్నప్పడు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు :

 • కొబ్బరి చిప్పలు, కొబ్బరి పీచు, గ్రుడ్లు పెంకులు, ఉల్లిపాయల ముక్కలు మరియు ఎముకలు లాంటి వాటిని ప్రత్యేకంగా ఓ పెట్టెలో ఉంచాలి. వీటిని బయోగ్యాస్ ఉత్పత్తి ప్రకియలో వినియోగించరాదు.
 • తేమ చెత్త వస్తువులను 5 లీటర్ల మేరకు చిన్న టిన్నులలో సేకరించవలెను. (వండని ఆహారం లేదా వండి పాడయిన ఆహారం , చెడిపోయిన పాల ఉత్పత్తులు మొదలగునవి). వివిధ కూరగాయల తొక్కలు, పాడయిన బంగాళా దుంపలు మరియు టమోటాలు,కొత్తిమీర ఆకులు మొదలగు వాటిని 5 కిలోల చొప్పున ఒక చెత్తసంచిలోకి సేకరించాలి. బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం సక్రమంగా పనిచేయాలంటే ఈ విధంగా విడదీసి సేకరించే పద్దతి చాలా ముఖ్యమైనదన్న విషయం గుర్తించాలి.

బార్క్ ఆవరణలోని బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి సాంప్రదాయంగా చేస్తున్న రూపకల్పనలలో రెండు ముఖ్యమైన మార్పులు చేయడం జరిగింది :

 • చెత్తను ట్యాంకులో వేయకమునుపే దానిని 5 హెచ్.పి పిండి మరతో పొడి చేసి కలుపడం కొత్తగా ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ పక్రియలో చెత్త నీళ్లతో (1:1) కలసి మిశ్రమ రూపంలో బురదగా పోతుంది.
 • చెత్త వేగంగా హీన స్థితికి చేర్చేందుకు గాను థర్మోపోలిక్ మైక్రోబ్స్ అనేది వాడవలెను. ఇది అత్యధిక వేడిలో బాగా పనిచేస్తుంది. వాతావరణం వల్ల సూక్ష్మక్రిములు ఎక్కువ వేడిలో కూడా స్థిరంగా ఉండగలుగుతాయి. అయితే చాలామటుకు తీవ్రమైన వాతావరణం పరిస్థితులలో ఇమడలేకపోతాయి. ఏది ఏమైనా ఇది మంచి పద్దతిగా ఉంది. దీనివల్ల సూక్ష్మక్రిములు వంటింటి చెత్తను కుళ్ళిపోయేటట్టు చేస్తాయి. అంతేగాక చెత్తలోని విష పద్దార్థములను తొలిగించేందుకు సాయపడుతుంది. అనంతరం అది మిథేన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. దీంతో అది సాంప్రదాయ బయోగ్యాస్ గా రూపొందుతుంది.

చెత్తను సేకరించే ట్యాంకులో ఎక్కువ ఉష్ణోగ్రతను ఉండేలా చూడాలి. చెత్త ట్యాంకులో థర్మోపోలైస్ పెరుగుదలను కాపాడుతూ వేడి నీళ్ళతో చెత్తను కలియపెడుతూ ఉండాలి మరియు ఉష్ణోగ్రత పరిధిని 55-60o సెంటీగ్రేడ్ మధ్యన ఉండేటట్లు చూడాలి. వేడి నీళ్ళు సోలార్ వేడి యంత్రము నుండి సరఫరా చేయాలి. కేవలం ఒక గంట సూర్యరశ్మి ఉంటే కూడా ఒక రోజు అవసరాలకు వేడి నీళ్ళ ఉత్పత్తికి సరిపోతుంది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఘనచెత్త పదార్థం ద్వారా నడుచు బయోగ్యాస్ కేంద్రాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నడువాలంటే ఎంత వీలైతై అంతగా ఊపిరి ఆడకుండా చేసేది లేకుండా జాగ్రత్తలు తీసుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఊపిరి ఆడకుండా అవ్వడం ఎందుకంటే చిక్కని బయోగ్యాస్ క్రమ్ముకొన్నప్పుడు ప్రక్రియకు అవసరమైన సూక్ష్మక్రిములకు అది చేరకపోవడమే. దీనికి సరైన గుణాత్మక పరిష్కారం ఏమిటంటే ఘనపద్దార్థంగా ఉన్న చెత్తను ద్రవరూపంగా మార్చితే అది మరింత అందుబాటులో ఉండి సూక్ష్మక్రిముల చర్యకు తోడ్పడుతుంది. ఘనపద్ధార్థం నుండి ద్రవపదార్థంగా మారేందుకు ఎక్కువ శక్తిగల మిక్సింగ్ యంత్రాన్ని దీని కోసం వాడవలసి ఉంటుంది.

అనంతరం ముందు మనం వేసే ట్యాంకులోని ద్రవరూపంలో ఉన్న చెత్త పదార్ధం ప్రధాన ట్యాంకులోకి చేరుకుంటుంది. సూక్ష్మజీవులు వృద్ధి చెంది అది కుళ్లిపోవడంతో అది మెథానోకోకస్ వర్గానికి చెందిన సూక్ష్మజీవులుగా మారుతాయి. ఈ సూక్ష్మక్రిములు సహజంగా పశువులు నెమరు వేయునప్పుడు ఉంటాయి. అని ద్రవ పదార్థంగా మారిన పేడలోని సెల్లులోసిక్ పద్దార్థం నుండి మిథేన్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ పక్రియలో సరిగ్గా జీర్ణంకాని లిగ్నోసెల్యులోసిక్ మరియు హెమిసెల్యులోసిక్ పదార్ధాలు ప్రవహించి ట్యాంకులో చేరుకుంటాయి. ఒక నెల తర్వాత ట్యాంకు నుండి మంచి నాణ్యతతో కూడిన ఎరువును తవ్వి బయటకు తీయవచ్చు. ఈ ఎరువు నుండి ఏ దుర్వాసనా రాదు. ఇందులోని సేంద్రియగుణాలు చాలా ఉన్నతమైనవి మరియు ఇది మట్టిలో నేల సాంద్రతను పెంచుతుంది, దీంతో ఇది ఉత్పత్తికి జవాబుదారీగా ఉంటుంది. ప్రధాన ట్యాంకులో గ్యాస్ ఉత్పత్తి అయినప్పుడు, దానిపై భాగంలోని శిఖరంలా ఉన్నది నెమ్మదిగా పైకి లేస్తుంది. ఇది గరిష్టంగా 8 అడుగుల ఎత్తుకు చేరి 35 m3 గ్యాస్ ను కలిగి ఉంటుంది. ఈ గ్యాస్ మిథేన్ తో కలసి ఉంటుంది (70-75%),కార్బోడైయాక్సైడ్(10-15%) మరియు నీటి ఆవిరి (5-10%) లు ఉంటాయి. దీనిని జి.ఐ. పంపుల ద్వారా దీపస్థంబం వరకు తీసుకు వెళుతారు. కుదించబడిన నీటి ఆవిరి ప్రవాహానికి కూడా పంపులైనులో అవకాశం కల్పించడం జరిగింది. ఈ గ్యాస్ నీలిరంగు మంటతో మండుతుంది. దీనిని వంట చేయడానకి వినియోగించవచ్చును.

ఈ కేంద్రంలో ఉత్పత్తి అయిన గ్యాస్ ను ఉత్పత్తి కేంద్రానికి చుట్టూ ఉండే గ్యాస్ లైట్లను వెలిగించవచ్చు. అంతే గాక దీనిని ఫలహారశాలలో ఉపయోగించే వీలు ఉంది. దీని ద్వారా ఏర్పడే ఎరువు కూడా చాలా శ్రేష్టమైనది. దీనిని పొలానికి వినియోగించవచ్చును.

వంటఇంటి లోని చెత్తను ఎలా వేరు చేసే విధానం పైననే బయోగ్యాస్ కేంద్రం విజయవంతం కావడం ఆధారపడి ఉంది. బయోగ్యాస్ కేంద్రం మంచి సామర్థ్యంతో నడవకుండా కొబ్బరి ముక్కలు మరియు పీచు, గ్రుడ్లు పై పెంకులు, ఉల్లిపాయల పొరలు, ఎముకలు మరియు ప్లాస్టిక్ ముక్కలు సమస్యలు సృష్టిస్తాయి. ఫలహారశాలనుండి సేకరించిన చెత్తలో తరుచుగా స్టీల్ సామాన్లు , చెంచాలు కనిపిస్తుంటాయి. ఎముకలు, గ్రుడ్ల పై పెంకులు మరియు ఇతర వస్తువులు కలుపడంలో భౌతికంగా సమస్యలు సృష్టిస్తాయి. అలాగే ఉల్లి పొరలు, కొబ్బరి పీచు మరియు ప్లాస్టిక్ వస్తువులు చెత్తను ఈ ప్రకియలో సూక్ష్మజీవులు వర్గికరణ చేయకుండా నిరోధిస్తుంది. ఇది ముందుగా వేసే ట్యాంకులోనూ, ఫ్రధాన ట్యాంకులోకి చేరుకుని కేంద్రం పనిచేయకుండా పాడుచేస్తుంది.

ఆధారము: http://www.dae.gov.in

బయోగ్యాస్ డైజెస్టర్ నమూనాలను పోల్చిచూడడం

బయో ఇంధనాలు

జట్రోపా

జట్రోపా కర్కాస్ అనేది బహుళ వంటలకు ఉపయోగపడని నూనె నిచ్చే ఒక రకమైన ఎడతెగక పెరిగే పొద. దీని పుట్టుక అమెరికా, పశ్చిమాసియాల నుంచి వచ్చింది. దీనికి రబ్బరు పాలను ఉత్పత్తిచేసే గుణం ఉంది. అందువల్ల జంతువులు వీటి జోలికి పోవు. ఇది చాలా కరువుకాటకాలనూ తట్టుకొని జీవించే పంట. సాగుచేయడానికి కష్టమైన భూమిలో సైతం పెరుగుతుంది. తక్కువ వ్యయమౌతుంది. ఈ పంటను 30ఏళ్ల వరకు ఆర్థిక భారం ఎక్కువలేకుండా పండించవచ్చు. జట్రోపా నుంచి తీసిన నూనెను బయో డీజిల్ మిశ్రమంగా 20% దాకా వాడొచ్చు ఐతే, రీఫైన్డ్ ఆయిల్ మరింత శుభ్రమైన బయోడీజిల్గా పనిచేస్తుంది. మరిన్ని వినరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

చక్కెర దుంప

చక్కెర దుంప (Beta vulgaris Var. Saccharifera L.) అనేది ఉష్ణదేశాల్లో రెండేళ్లకోసారి పండే పంట. ఇది నెమ్మదిగా ఉష్ణ మండల, ఉప ఉష్ణమండల దేశాల్లో ప్రత్యామ్నాయ శక్తిపంటగా ఇథనాల్ ఉత్పత్తికై ప్రసిద్ధి పొందుతోంది. ఇథనాల్ను పెట్రోల్తోగానీ, డీజిల్తోగానీ 10 శాతందాకా కలిపి బయో ఇంధనంగా వాడుకోవచ్చు. చక్కెర దుంపయొక్క ఉప ఉత్పత్తులైన దుంపపైభాగం పచ్చని గడ్డిగా , దాని పిప్పి, ఫిల్టర్ కేకులను పశువుల
దాణాగా వాడొచ్చు. మరిన్ని వినరాలకు క్లిక్ చేయండి

తియ్య జొన్న

తియ్య జొన్న అనేది వరి తర్వాత అంత ఎక్కువ స్థలంలో పండే అతి ముఖ్యమైన జొన్న పంట. దీనిని ధాన్యానికి, పశువుల దాణాకోసం ఎక్కువగా పండిస్తారు. దీనిని వ్యాపారాత్మకంగా ఆహార పరిశ్రమలో, విలువాధారిత పరిశ్రమలలో ఇథనాల్, సిరప్, బెల్లం, పశువుల దాణా ఉత్పత్తికి కూడా వాడతారు. మరిన్ని వినరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

లామిగ (పొంగమియా)

అనేక రకాలైన ఆహారయోగ్యము కాని చెట్లను జీవ రసాయన ఇంధనం (బయోఫ్యూయల్) ఉత్పత్తి చేయుట కొరకు పెంచవచ్చును. దీని కొరకు కరాన్జ (లామిగ) అనే చెట్లు సరియైనవి. ఇవి దేశంలో వివిధ ప్రాంతాలలో విస్తారంగా పెరుగుతాయి. పొంగమియా పిన్నాటా జాతుల రూపంలో విరివిగా పెరుగుతాయి.

లామిగ యొక్క ముఖ్యలక్షణములుః

 • ఈ చెట్లు నత్రజనిని స్థాపిస్తాయి. ఈ కారణము వలన భూమి బాగా సారవంతమౌతుంది.
 • వీటిని సాధారణంగా జంతువులు పశుగ్రాసముగా తీసుకోవు.
 • ఈ చెట్లు పల్లపుప్రాంతాలు, ఉప్పుశాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, క్షారసంబంధిత భూములను తట్టుకుంటాయి.
 • ప్రతికూల వాతావరణపరిస్థితులను తట్టుకుంటాయి. ( మధ్యస్త నుండి అధికవర్షపాతము వరకు)
 • ఇవి దిగువ శ్రేణి, నిరుపయోగమైన బీడు భూములు మరియు వ్యవసాయయోగ్యమైన భూములలో కూడా పెంచవచ్చును.
 • పొంగమియా విత్తనములు ముఫ్పైనుండి నలభై శాతము నూనెను కల్గి ఉంటాయి.
 • వీటి ప్రక్కల (పార్శ్వ) వేళ్ళు గుబురుగా పెరుగుట వలన భూక్షయాన్ని, ఇసుకదిబ్బలు వంటి వాటిని అదుపుచేయడంలో సహాయపడుతుంది.
 • ఈ చెట్ల వేళ్ళు, బెరడు, ఆకులు, సారము (పసరు) మరియు పుష్పములు ఔషధ లక్షణాలను కల్గిఉంటాయి. వీటి ఎండుటాకుల్ని నిల్వ ధాన్యాలలో కీటకవికర్షిణిగా ఉపయోగిస్తారు.

లామిగ నూనె యొక్క లక్షణాలుః

 • ఈ విత్తనముల నుండి ఆహారయోగ్యముకాని నూనెను అధికంగా తీయవచ్చును.
 • ఈ విత్తనాలు తొంభైఐదు శాతం గుజ్జును కల్గి ఉంటుంది.
 • ఇలా వచ్చిన నూనె పరిమాణము ఇరవై ఏడు నుండి నలభై శాతము మధ్యలో ఉంటుంది.
 • గుజ్జు నుండి నూనెను తీయడానికి యంత్రాలనుపయోగించినప్పుడు, నూనె ఇరవై నాలుగు నుండి ఇరవైఆరున్నర శాతము దిగుబడి నమోదయినది.
 • దీనిని నిల్వ ఉంచినపుడు ఈ ముడి చమురు పసుపు, నారింజ రంగు నుండి గోధుమ రంగు లోకి మారుతుంది. ఇది చేదు రుచిని , వెగటు వాసనను కల్గి ఉండి మరియు ఆహారయోగ్య మైనది కాదు.
 • జీవ రసాయన ఇంధనంగా ఉపయోగించడమే కాకుండా దీపాలు వెలిగించడానికి, కందెన / జారుచేయు తైలముగా, నీరు-రంగులను జతపరచండంలోను, పురుగులమందులలో, సబ్బులు తయారు చేయుటలో, తోళ్ళ పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తారు.
 • మనుష్యుల, జంతువుల చర్మ వ్యాధులకు, కీళ్ళవాత రోగముల చికిత్సకు ఈ నూనె ప్రసిద్ధిగాంచినది.
 • ఈ లామిగ తెలగపిండి (నూనె తీసివేయగా మిగిలినది) లో నత్రజని ఎక్కువగా ఉండుటవలన వలన ఆధికంగా భూమి సారవంతమవడానికి ఉపయోగిస్తారు. ఇది భూమిలో కలుపుట వలన క్రిమిసంహారిగా,బద్దెపురుగు సంహారిగా ఉపయోగపడతుంది.

లామిగ నూనె, ప్రామాణిక పెట్రోలియం డీజిల్ మధ్య పోలిక:

 • జీవరసాయన ఇంధనమైన లామిగ నూనె భౌతికధర్మాలు చాలా వరకు సాంప్రదాయ ఇంధనమైన డీజిల్ ను పోలిఉంటుంది.
 • ఇది ఏవిధంగా చూసినా సాంప్రదాయ ఇంధనం (డీజిల్) కన్నా శుభ్రమైన ఇంధనం.

సామాజిక బృందాల ద్వారా జీవ ఇంధనం (బయో ఫ్యూయల్) మొక్కల పెంపకం

వృక్షజాల వ్యర్ధ పదార్థాల ఆధారిత విద్యుదుత్పత్తి

 • భారతదేశం, తన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మరియు అడవులకు సంబంధించిన పనుల వలన, అపరితమైన పరిమాణంలో వృక్షజాల వ్యర్ధ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని అంచనాల ప్రకారం, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూలంగానే ప్రతి ఏటా 500 మిలియన్ టన్నుల వ్యర్ధ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలుస్తోంది.
 • ఈ పరిమాణం, దానిలో ఉండే ఉష్ణ అంశం ప్రకారమే దాదాపు 175 మిలియన్ టన్నుల చమురుతో సమానం.
 • గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, ఈ వ్యర్ధ పదార్థాలలో కొంత భాగం దాణాగా మరియు ఇంధనంగా వాడబడు తున్నాయి. అయిన్నప్పటికీ, కొన్ని పరిశీలనల ప్రకారం, కనీసం 150 – 200 మిలియన్ టన్నుల వ్యర్ధ పదార్థాలు సరియైన విధంగా ఉపయోగించబడడంలేదు. అందువలన, వీటిని, తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ ప్రయోజనాల కొరకు అందుబాటులోనికి తీసుకుని రావచ్చు.
 • రకరకాల పొట్టు, ఊక, ఎండుగడ్డి ఈ వ్యర్థాలలో ఉన్నాయి. ఈ పరిమాణం ఉన్న వ్యర్థాలు 15000 - 25,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది.
 • ఇవే కాకుండా, బంజరు భూములలో, రహదారుల ప్రక్కన, రైలుపట్టాల వెంబడి పెరిగే మొక్కలు, చెట్లు మొదలగువాటి నుండి వచ్చే వృక్షజాల వ్యర్ధ పదార్థాల నుండి గూడ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధంగా వృక్షజాల వ్యర్ధ పదార్థాల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు, పరిమాణం 70,000 మెగావాట్లు మించి ఉంటుందని అంచనా వేయబడింది.
 • ఈ విధంగా, వృక్షజాల వ్యర్ధ పదార్థాల నుండి తయారయ్యే విద్యుత్తు ఉత్పాదక శక్తి మొత్తం రమారమి 1,00,000 మెగావాట్ల పరిమాణం వరకు చేరుతుంది.
సాంకేతిక పరిజ్ఞానం

ఈ వృక్షజాల వ్యర్ధ పదార్థాలతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయ బొగ్గు – ఆధారిత (థర్మల్) విద్యుదుత్పత్తి మాదిరిగానే ఉంటుంది. ఈ వ్యర్ధ పదార్థాల ను, మరగబెట్టే పాత్రలలో (బాయిలర్స్) ఆవిరి వచ్చేదాకా కాయాలి. ఆ తరువాత, ఆ ఆవిరి, క్రమవ్యవధానం లో విద్యుత్ ప్రవాహన్ని యిచ్చే చక్రం (టర్బో ఆల్టర్నేటర్) లోనికి ప్రసరించి, విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ప్రయోజనాలు

అవసరాన్ని బట్టి ఉపయోగించుకునేందుకు వీలుగా, ఈ వృక్ష జాల వ్యర్ధ పదార్థాలను నిలవ ఉంచుకొనవచ్చు. అందువలన విద్యుత్తు పరిమాణానికి సరిపోయేటంతగా, ప్రణాళికను ఏర్పరుచుకొనవచ్చును.
ఈ ప్రణాళికలకు ఉపయోగపడే సాధన – సామాగ్రి, బొగ్గుతో తయారయ్యే (థర్మల్) విద్యుత్తుకు వాడే సాధన – సామాగ్రి ఒకటే అయినందువల్ల, క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు.
గ్రామీణ ప్రాంతాలకు, ఇవి చేరువగా ఉన్నందువలన, ఈ ప్రణాళికలు గ్రామ ప్రాంత విద్యుత్తు సరఫరా నాణ్యతను పెంచగలుగుతాయి.
ఒకే కేంద్రంలో, వివిధ రకాల వృక్షజాల వ్యర్ధ పదార్థాలను ఉపయోగించడం వలన, చేసే పనులకు సౌలభ్యత ఏర్పడుతుంది.

ఖర్చులు

సామాన్యంగా, ఈ వృక్షజాల వ్యర్ధ పదార్థాల ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు, రూ. 3 కోట్లు/ మెగావాట్ - రూ. 4 కోట్లు / మెగావాట్ వరకూ పెట్టుబడి ఖర్చు ఉంటుంది. వ్యర్ధ పదార్థాల ధర, కేంద్రం నిర్వహించగలిగే విద్యుత్తు భారం మరియు సామర్థ్యం మీద విద్యుదుత్పత్తి యొక్క ఖర్చులు ఆధారపడి ఉంటాయి.

ఆధారము: వృక్షజాల వ్యర్ధ పదార్థాలు (బయోమాస్). పుస్తకం . రచన – నవ్య మరియు పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వశాఖ (భారత ప్రభుత్వం)

ధర్మల్ మరియు విద్యుత్ సాధనాలకు వృక్షజాల వ్యర్ధ పదార్థాలతో తయారయ్యే వాయువు

వృక్షజాల వ్యర్ధాలతో తయారయ్యే వాయువు అంటే ఏమిటి?

ఘనరూపంలో ఉండే వృక్షజాలవ్యర్థాలు, పూర్తిగా మండడానికి కావలసిన దానికన్నా తక్కువగా సరఫరా అయిన గాలితో పార్శ్వ దహనం ద్వారా, ఉష్ణ – రసాయన మార్పిడి జరుగడం వలన తయారయ్యే మండే వాయువుల మిశ్రమా(ప్రొడ్యూసర్ గ్యాస్)న్ని, వృక్షజాల వ్యర్థాలతో తయారయ్యే వాయువులు అంటారు. సాధారణ మండే వాయువులోని ఇతర వాయువులు ఈ విధంగా ఉంటాయి.

 • కార్బన్ మోనాక్సైడ్ – 18% - 20%
 • హైడ్రోజన్ - 15% - 20%
 • మిథేన్ - 1% - 5%
 • కార్బన్ – డై – ఆక్సైడ్ – 9% - 12%
 • నత్రజని - 45% - 55%
 • కెలోరిఫిక్ విలువ - 1000 – 1200 కిలో కేలరీలు/ఘనపు మీటరు

వృక్షజాల వ్యర్థపదార్థాలను వాయువుగా ఎందుకు మార్చాలి?

 • మండే వాయువును, డీజిల్ కి బదులు ఇంధనంగా తగిన విధంగా రూపొందించిన/ అనుసరించిన అంతర్గత దహనయంత్రాలు (ఇంటర్నల్ కంబస్చన్), జనరేటర్లతో కలిసి వినియోగించి విద్యుదుత్పత్తిని చేయవచ్చు.
 • చమురువంటి సంప్రదాయ శక్తి రూపాలకి బదులుగా, మండే వాయువును, పరిశ్రమలలో చాలా దహన ప్రక్రియలలో ఉపయోగించవచ్చు.
 • ఈ వాయు ఉత్పత్తి ప్రక్రియ, పర్యావరణ నియమాలకు అనుగుణంగా, స్వచ్ఛంగా, అంగీకరయోగ్యంగా వృక్షజాల వ్యర్థాలను మిగలినవాటి కంటే ఎక్కువగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.
 • ప్రస్తుతం ఉన్న డీజిల్ జనరేటర్ సెట్ల (చమురు వాడబడే ఉత్పత్తి యంత్రాలు) లో, పాక్షికంగా నైనా ఈ మండే వాయువును ఉపయోగించడం వలన అధిక మొత్తంలో ధనం ఆదా అవుతుంది.

ఎటువంటి వృక్షజాల – వ్యర్థాలను వాయు రూపంలో మార్చవచ్చు ?

సర్వసాధారణంగా అందూబాటులో ఉండే వాయు ఉత్పత్తి యంత్రాలు, కలప/కలప వ్యర్థాలను ఉపయోగించు కుంటాయి. కొన్నిటికి వరి ఊకను కూడ వాడవచ్చు. ఇతర ఎన్నో కలపకాని వృక్షజాలను కూడ వాయువులు గా మార్పిడి చేయవచ్చు. కాని వాటిని అలా చేయడానికి, వాయు ఉత్పత్తి యంత్రాలను అందుకు తగ్గట్టుగా తయారు చేయవలసి ఉంటుంది. మరియు వృక్షజాల వ్యర్థాలు, చాల సందర్భాలలో గట్టిగా కుదింపబడేలా చేయవలసి రావచ్చు.

వాయు ఉత్పత్తి యంత్రాలు ఎలా పని చేస్తాయి?

ఈ యంత్రాలు “పైకి లాగబడేవి” (అప్ డ్రాఫ్ట్) లేక క్రిందకి లాగబడేవి (డైన్ డ్రాఫ్ట్) అనే రెండు విధాలుగా ఉంటాయి. క్రిందకి లాగబడే రకం వాయు ఉత్పత్తి యంత్రంలో ఇంధనం మరియు గాలి ఒకే ప్రవాహంలో ప్రయాణిస్తాయి. పైకి లాగబడే రకం వాయు ఉత్పత్తి యంత్రంలో, ఇంధనం మరియు, గాలి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. అయినప్పటికీ, ప్రాధమిక ప్రతి క్రియల ప్రదేశం ఒకటే ఉంటుంది.

ప్రతి క్రియ జరిగే ఉత్పాదక కేంద్రంలో పై నుండి ఇంధనం నింపబడుతుంది. ఇంధనం క్రిందకి దిగుతున్నప్పుడు, అది పొడిగా అయ్యేటట్లు (డ్రైయింగ్) మరియు ఉష్ణం ప్రసరించేటట్లు (పైరోలసిస్) చేయబడుతుంది. గాలి, ఉత్పాదక కేంద్రంలోని, ఆక్సీకరణం చెందే ప్రదేశంలోనికి పంపబడుతుంది. ఉష్ణప్రసారాల పదార్థాలు మరియు వృక్షజాల – వ్యర్థ పదార్థాలు, పాక్షికమైన దహన ప్రక్రియ లోనికి ప్రవేశించిన ఈ గాలి వలన, ఉష్ణోగ్రత 1100 డిగ్రీల సెంటీగ్రేడు వరకూ పెరుగుతుంది. బరువైన హైడ్రోకార్బన్లను, తారులను విడగొట్టడానికిక ఈ ఉష్ణోగ్రత దోహదకారి అవుతుంది. ఈ పదార్థాలు క్రిందికి పయనించే క్రమంలో, క్షయకరణ ప్రదేశానికి చేరుకుంటాయి. అక్కడ, కార్బన్ -డై-ఆక్సైడ్, మరియు నీటి ఆవిరి, ఎర్రని మండే బొగ్గుపై చూపే చర్యవలన ‘మండే వాయువు’ (ప్రొడ్యూసర్ గ్యాస్) ఏర్పడుతుంది. ఇంజన్లకు పంపే ముందు, వేడిగా మురికిగా ఉండే ఈ వాయువుని, చల్లబరిచే యంత్రాలు (కూలర్లు), శుభ్రపరచే యంత్రాలు (క్లీనర్లు), మరియు వడగట్టే యంత్రాలు (ఫిల్టర్లు) ఉండే వ్యవస్థ ద్వారా ప్రవహింప చేస్తారు.

మండే వాయువుతో ఏమి చేయవచ్చు?

జోడు ఇంధన ఐసి (అంతర్గత దహన యంత్రాలు) ఇంజన్లలో (డీజిల్ చమురుకు బదులుగా 60% - 80% వరకు వాడే) లేదా నూరుశాతం వాయువు మండే విద్యుత్ రణదహన యంత్రాల (స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్) ద్వారా విద్యుదుత్పత్తి ప్రక్రియలో శుభ్రమైన మండే వాయువుని ఉపయోగించవచ్చు. చిన్న బాయిలర్లు, కొలుములు, వేడిగాలి ఉత్పత్తి యంత్రాలు, ఆరబెట్టే యంత్రాలు (డ్రైయర్లు) మున్నగు వాటిలో వలె చాలా సాధనాలలో వేడి చేయడానికి ఉపయోగించే సంప్రదాయ శక్తి రూపాలకి బదులుగా మండేవాయువును ఉపయోగించ వచ్చు.

ప్రత్యేక సామర్థ్యాలు

వృక్షజాల – వ్యర్థపదార్థ ఆధారిత వాయు ఉత్పత్తి యంత్రాల వ్యవస్థలు, కొన్నికిలో వాట్ల విద్యుత్తు నుండి, ఒక మెగావాట్ విద్యత్ వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. వేడిచేసే ప్రక్రియల్లో, ప్రస్తుత గరిష్ఠ పరిమితి, ఒక యూనిట్ సైజుకి 200 – 300 కిలోగ్రాము/ప్రతి గంట. చమురు వాడకానికి సమానమైనది.

ఖర్చులు

ఒక సామాన్యమైన వృక్షజాల-వ్యర్థ పదార్థాల ఆధారిత వాయు ఉత్పత్తి కేంద్రం నుండి తయారయ్యే విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ యొక్క పెట్టుబడి ఖర్చు రూ. 4 కోట్లు/మెగావాట్ నుండి రూ. 4.5 కోట్లు/మెగావాట్లు వరకూ ఉంటుంది. విద్యుదుత్పత్తి యొక్క ఖర్చు, వృక్షజాల-వ్యర్థాల ఖరీదు, కేంద్ర సామర్థ్యం మొదలగువాటి మీద ఆధారపడి, రూ 2.50/కిలోవాట్ మరియు రూ. 3.50/కిలోవాట్ వరకూ ఉండవచ్చని అంచనా. థర్మల్ వినియోగంలో, పెట్టుబడి ఖర్చులు, ప్రతి ఒక్క మిలియన్ కిలో కేలరీల సామర్థ్యానికి సుమారు రూ. 0.5 - 0.7 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

ఆధారము: వృక్షజాల-వ్యర్థ పదార్థాలు (బయోమాస్). పుస్తకం రచన – నవ్యమరియు పునురుత్పాదక శక్తి వనరుల యంత్రిత్వశాఖ (భారత ప్రభుత్వం)

చెరుకు పిప్పి ఆధారిత సహ – ఉత్పత్తి

సాంకేతిక పరిజ్ఞానము

సహ ఉత్పత్తి అనేది సామాన్యమైన పదాలలో చెప్పాలంటే, శక్తిని ఉత్పత్తి చేసే క్రమంలో, ఒకే ఇంధనాన్ని ఉపయోగించి ఒక శక్తి రూపానికి మించి శక్తి రూపాలను ఉత్పత్తి చేయడం. ఆవిరి, విద్యుత్తు సహఉత్పత్తులై, శుద్ధిచేసే పరిశ్రమల మొత్తం ఇంధన వాడక సామర్థ్యాన్ని అధికంగా పెంచుతాయి. సహఉత్పత్తికి కావలసిన కనీస నియమం ఏమిటంటే, ఉష్ణము మరియు విద్యుత్తు అనుకూలమైన నిష్పత్తిలో ఒకే సమయంలో ఉపయోగించగలగడం. చక్కెర పరిశ్రమలో ఇది పూర్తిగా జరుగుతుంది. విద్యుదుత్పత్తి సమయంలో, తక్కువ ఉష్ణోగ్రతగల సింకు వద్ద అధిక పరిమాణంగల ఉష్ణం వెలువడి, వృధా అవుతుంది. సాధారణమైన విద్యుతుత్పత్తి కర్మాగారాలలో, ఈ ఉష్ణం కండెన్సర్లలో వృధాఅయి, ఆవిరిలోని 70 శాతం ఉష్ణం వరకు వాతావరణం లోనికి విసర్జింపబడుతుంది. అదే, సహ ఉత్పత్తి పద్ధతిలో ఈ ఉష్ణం వృధా కాకుండా, శుద్ధి చేసే ప్రక్రియలో కావలసిన ఉష్ణోవసరాలకు వినియాగింపబడుతుంది.

సాధన-సామాగ్రి

చెరకు పిప్పిని మండించే అధిక పీడనంగల బాయిలర్లు, అవిరి చక్రాలు (స్టీమ్ టర్బైన్లు), తంత్రులు-చట్రాలు మధ్యజరిగే నిరంతర కదలికలు గల విద్యుత్ వ్యవస్థ (గ్రిడ్ - ఇంటర్ - ఫేజింగ్ - సిస్టమ్) ఈ పథకాలకు కావలసిన ముఖ్యమైన సాధన-సామాగ్రి అంతా స్వదేశీయమైనది. ఈ విధంగా, మొత్తం మీద, ఇంధన వినియోగ సామర్థ్యం 60 శాతం, కొన్ని సందర్భాలలో అంతకు మించి అధికం చేయవచ్చు. ఈ సహ ఉత్పత్తి పథకాలలో, విద్యుదుత్పత్తి సామర్ధ్యం కొన్ని కిలోవాట్ల నుండి ఎన్నో మెగావాట్ల వరకూ ఉంటుంది, అదే సమయంలో ఉష్ణోత్పత్తి సామర్థ్యం 100 కంటే తక్కువ కిలోవాట్ల థర్మల్ పరిధి నుండి ఎన్నో మెగావాట్ల థర్మల్ వరకూ ఉంటుంది.

ఖర్చు

చక్కెర కర్మాగాలలో స్థాపించే చక్కెర పిప్పి ఆధారిత సహ ఉత్పత్తి పరిశ్రమలకు పెట్టబడి ఖర్చు రూ. 3 కోట్లు/మెగావాట్, మరియు రూ. 4 కోట్లు/మెగావాట్ మధ్య ఉంటుంది. సగటున 160 రోజుల పని కాలం (క్రషింగ్ సీజన్) కలిగిన ఒక సామాన్యమైన చక్కెర కర్మాగారానికి సహ-ఉత్పత్తి ద్వారా అదనంగా విద్యుదుత్పత్తి కొరకు చేసే పెట్టుబడి ఖర్చులు దీర్ఘ కాలానికి లాభదాయకంగా ఉన్నట్లు చూసాము.

సామర్థ్యం

దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న చక్కెర కర్మాగారాలలో సహ ఉత్పత్తి పథకాల ద్వారా 3500 మెగావాట్ల విద్యుత్తు అదనంగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.

ఆధారము: వృక్ష జాల వ్యర్థ పదార్థాలు (బయోమాస్) పుస్తకం : రచన – నవ్య మరియు పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వశాఖ, (భారత ప్రభుత్వం)

వాయు శక్తి

పవన విద్యుదుత్పత్తి

ప్రపంచవ్యాప్తంగా, పవనశక్తి ఉపయోగాలలో, విద్యుదుత్పత్తి అతి ముఖ్యమైనదిగా వెలుగులోకి వచ్చింది. ఈ విధానం సులభమైనది. వేగంగా వీచేగాలి, ఒక చక్రంలోని బ్లేడులను త్రిప్పుతూ, ఉత్పత్తి కేంద్రలో విద్యుత్తు ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఈ బ్లేడులు మరియు ఉత్పత్తి యంత్రం (నేసెల్లె అనబడే హౌసింగ్ లో ఉండే) ఒక శిఖరం పై ఎక్కించ బడతాయి.

సాంకేతిక పరిజ్ఞానం

పవన చక్రాలకు సాధారణంగా మూడు తిరిగే బ్లేడులు ఉంటాయి. అవి, వీచే గాలితో తిరుగుతూ, ఉత్పత్తి యంత్రానికి నేరుగా గాని, ఒక గేర్ బాక్స్ తో గాని కలిసి ఉంటాయి. ఈ చక్రం బ్లేడులు, నేసెల్లె లోపల ఉండి, సమతలమైన కేంద్రం చుట్టూ తిరుగుతూ, ఉత్పత్తి యంత్రానికి అనుసంధానించబడి ఉంటాయి. ఈ యంత్రం (కప్పబడి) లోపల ఉంటుంది. ఈ నేసెల్లె లోపల మిగిలిన విద్యుత్ పరికరాలు, చలించే వ్యవస్థలు ఉండి, చక్రాన్ని గాలివీచే దిశకు మళ్ళేలా చేస్తాయి. గ్రహణ యంత్రాలు గాలివీచే దిశను పరిశీలిస్తాయి మరియు శిఖరకొన గాలివీచే దిశకు మళ్ళింప బడుతుంది.
గాలివేగం మారుతూ ఉండడం వలన ఈ యంత్రం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు తనంతటతానే నియంత్రించ బడుతుంది. ఈ చక్రాల యొక్క వ్యాసాలు 30 మీటర్ల నుండి 90 మీటర్ల వరకూ ఉంటాయి. వాటి శిఖరాలు, ఎక్కడైతే పవన విద్యుదుత్పత్తి యంత్రాలు అమర్చబడతాయో, అవి 25 మీటర్ల ఎత్తునుండి 80 మీటర్ల ఎత్తు వరకూ ఉంటాయి.
గాలి చక్రాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తు సరైన విధంగా నియంత్రించబడి, స్థానిక విద్యుత్ కేంద్రానికి పంప బడుతుంది. పవన విద్యుదుత్పత్తి యంత్రాల నుంచే కేంద్రాల సామర్థ్యాలు ప్రస్తుతం 225 కిలోవాట్ల నుండి 2 మెగావాట్లు వరకు మరియు వాటిని సెకనుకు 2.5 మీటర్లు నుండి సెకనుకు 25 మీటర్ల గాలివేగాలు మధ్య ఆపరేట్ చేయవచ్చు.

గాలిమరల స్థాపన

గాలివేగం సమాచారం, సంభవించే ప్రాంతాలనుండి, ఒకటి రెండు సంవత్సరాల కాలానిది సేకరించి, సరి అయిన ప్రదేశాలను గాలిమరల స్థాపనకి గుర్తిస్తారు. తరువాత ఒకదానికొకటి అడ్డంకి లేకుండా చూసుకుని, వాటిని నిర్మించే స్థలాలను తగినంత దూరంలో ఉండేటట్లు నిర్ణయించి స్థాపిస్తారు. స్థలాలను నిర్ణయించిన తరువాత, గాలి చక్రాలను అమర్చడానికి రెండు లేక మూడు నెలల కాలం పడుతుంది. ఈ సాధన సామాగ్రి మొత్తం, ప్రమాణాల కనుగుణంగా, సామర్థ్య నియమాలు, నిర్దేశిత అంశాలు ఉన్నట్లు పరీక్షింపబడి సంస్థల ద్వారా ధృవీకరింపబడతాయి. స్థాపించిన తరువాత, ఈ యంత్రాలు వాటి తయారీదారుల పర్యవేక్షణలో, నిర్వహించ బడతాయి

పవన విద్యుత్తు పథకాలకు అయ్యే ఖర్చు

ప్రాంతాల పరిస్థితులను బట్టి, పవన విద్యుదుత్పత్తి కయ్యే ఖర్చు మెగావాట్ కు 4 కోట్ల నుండి 5 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. ఈ యంత్రాల నిర్వహణ ఖర్చు కిలోవాట్ కు రూ 0.25 నుండి రూ. 0.60 వరకూ ఉంటుంది. ఏడుఎనిమిది సంవత్సరాల సమయంలో ఈ పథకాల పెట్టుబడి కయ్యే ఖర్చు 5 నుండి 8 సంవత్సరాలలో తిరిగి వస్తుందని అంచనా.

ఆధారము: పవన శక్తి - పవనశక్తి “నవ్య మరియు పునరుత్పాదక శక్తి వనరులు, (భారత ప్రభుత్వం)

నీరు తోడుటకు మరియు వికేంద్రమైన విద్యుదుత్పత్తికి ఉపయోగపడే పవనశక్తి

దేశంలోని గ్రామీణ మరియు మారుమూల గాలి ఎక్కువగా వీచే ప్రాంతాలకు, వికేంద్రీకరణమైన పద్ధతులలో, నీరు తోడుటకు మరియు చిన్న తరహా విద్యుత్ అవసరాలకు, నీరు తోడే గాలిమరలు, పవన విద్యుత్ ఉత్పత్తి యంత్రాలు (తక్కువ గాలితో నడిచే ఉత్పత్తి యంత్రాలు) మరియు పవన- సౌర సంకీర్ణ వ్యవస్థలు బాగా ఉపయోగపడతాయి.

నీరుతోడే గాలిమర:

ఒక నీరుతోడే గాలిమర, బావుల నుండి, చెరువుల నుండి, బోరు - బావుల నుండి నీటిని తోడి, త్రాగు నీటి అవసరాలకు, చిన్న తరహా సేద్యానికి, ఉప్పు సేద్యానికి, చేపల పెంపకానికి మొదలైన వాటికి, ఉపయోగపడు తుంది. అందుబాటులో ఉన్న గాలిమరలు రెండురకాలు. ఒకటి నేరుగా చలించేవి మరియు రెండవది గేరుతో చలించేవి.
అతి సాధారణంగా ఉపయోగించే గాలిమర, 10 - 20 మీటర్లు ఎత్తు కలిగిన దృఢమైన ఉక్కు శిఖరం పై 12 – 14 బ్లేడులు కలిగిన సమతలంగా ఉండే ఇరుసు కలిగిన 3–5.5 మీటర్లు వ్యాసం ఉన్న చక్రంతో ఉంటుంది. ఈ చక్రం, దానికి అనుగుణంగా పనిచేసే 50–150 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన పంపుతో ఒక కడ్డీ ద్వారా కలుపబడి ఉంటుంది. ఇటువంటి గాలిమరలు, గాలివేగం గంటకూ 8–10 కిలోమీటర్లు ఉన్నప్పుడు నీటిని తోడడం ప్రారంభిస్తాయి. సామాన్యంగా, ఒకగాలిమర, గాలివేగం, నీటిమట్టం లోతు, గాలిమర నమూనా పై ఆధారపడి, గంటకు 1000 నుండి 8000 లీటర్ల నీటిని తోడే సామర్థ్యం కలిగి ఉంటుంది.
గాలిమరలు, 60 మీటర్ల లోతు నుండి నీటిని తోడే సామర్థ్యం కలిగి ఉంటాయి. నీటిని తోడే గాలిమరల వలన ఒక మంచి ప్రయోజనం ఉంది అది ఏమిటంటే, ఈ పని చేయడానికి వాటికి ఎటువంటి ఇంధనమూ అవసరం లేదు. అందువలన, సుదూరంగా ఉండే ఎక్కువగా గాలి వీచే ప్రాంతాలలో, వేరే ఎటువంటి సంప్రదాయ వనరులతో నీటిని తోడడం సాధ్యం కానప్పుడు, వీటిని నిర్మించవచ్చు.
అయినప్పటికిని, నీటిని తోడే గాలిమరలు కూడ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇవి, మధ్యస్థాయి గాలి వ్యవస్థ లలోనే (ప్రతి గంటకి 12 – 18 కిలోమీటర్లు) సంతృప్తికరంగా పనిచేస్తాయి. అంతేకాక, నివేశన స్థలాలు ఎంచుకునేటప్పుడు, ఇళ్ళు మరియు చెట్లు వంటి అడ్డంకులు చుట్టుప్రక్కల లేకుండా చూసుకొని ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది ఈ వ్యవస్థల యొక్క ఖరీదు ఎక్కువగా ఉండడం వలన కుదరదని భావిస్తారు.
ఖర్చు : ఒక నీటినితోడే గాలిమర యొక్క ఖరీదు దాని నమూనాను బట్టి రూ.45,000 నుండి రూ.1,50,000 వరకూ ఉంటుంది. అదనంగా రూ.10,000 నుండి రూ.20,000 వరకూ పునాదికి, నిలవ ఉంచే తొట్టె మరియు గాలిమర నిర్మాణానికి కావలసి వస్తాయి. ఈ వ్యవస్థలో చలించే భాగాలు ఉన్నందువలన, తరచూ మరమ్మత్తు ల నిర్వహణ చేయవలసి ఉంటుంది. మరమ్మత్తులు, మరియు నిర్వహణ ఖర్చు, ఒకగాలిమరకు, సంవత్సరాని కి సుమారు రూ.2000 వరకూ అవుతాయి.
“నవ్య మరియు పునరుత్పాదక శక్తి” మంత్రిత్వశాఖ, గాలి మరకి అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీని, నేరుగా చలించే గాలి మరకి రూ. 20, 000, గేర్ నమూనాకి రూ. 30, 000, మరియు ఎవి – ఎస్ ఎస్ ఆరోవిల్లె నమూనాలకు రూ. 45,000 గరిష్ట పరిమితి వరకు, ఇస్తుంది. విద్యుధీకరణ చెందని ద్వీపాలకు, పైన పేర్కొన్న గాలిమరల నమూనాలకు గరిష్ట పరిమితి వరుసగా రూ. 30,000, రూ. 45,000, మరియు రూ. 80,000 వరకు వీటికయ్యే ఖర్చులో 90 శాతం వరకూ రాయితీనిస్తుంది.

పవన విద్యుదుత్పత్తి యంత్రం

ఒక పవన విద్యుదుత్పత్తి యంత్రం, 30 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన గాలితో విద్యుత్తును ఉత్పత్తి చేసే చిన్న యంత్రం. ఈ యంత్రాలు స్థిరమైన పద్ధతిలో పనిచేసేవి లేదా సోలార్ ఫోటోవొల్టాయిక్ (ఎస్ పి వి) వ్యవస్థలతో కలిసి, పవన- సౌర సంకీర్ణ వ్యవస్థగా ఏర్పడి వికేంద్రీకృతమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. విద్యధీకరణ లేని ప్రాంతాలలో, సరిపోయినంత గాలివేగం గల ప్రదేశాలలో పవన విద్యుదుత్పత్తి యంత్రం విద్యుదుత్పత్తికి అనువైనది. దీనిలో 2 – 3 బ్లేడులు కలిగిన 1 – 10 మీటర్ల వ్యాసం ఉన్న చక్రం, స్థిరంగా ఉండే అయస్కాంత ఉత్పత్తి యంత్రం, నియత్రించే సాధనాలు, చలించే వ్యవస్థ, శిఖరం, నిలవఉంచే బ్యాటరీ మున్నగునవి ఉంటాయి. పవన విద్యుదుత్పత్తి యంత్రం యొక్క చక్రం, గంటకు 9 – 12 కిలోమీటర్ల గాలి వీచినప్పుడు, చలించడం ప్రారంభిస్తుంది. అయినప్పటికిని, అది తన పూర్తి సామర్థ్యాన్ని, గంటకు 40 – 45 కిలోమీటర్ల వేగం తో గాలి వీచినప్పుడు వెలికితీస్తుంది. ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు, విద్యుత్తును ఉత్పత్తి చేయలేక పోవడం అనే దీని పరిమితిని, ఒక బ్యాటరీ బ్యాంకులో విద్యుత్తును నిలవఉంచడం ద్వారా అధిగమించవచ్చు.
పవన విద్యుదుత్పత్తి యంత్రాలు కిలోవాట్ కు రూ.2 లక్షల నుండి రూ.2 లక్షల 50వేల ఖరీదు కలిగి ఉంటాయి. అదనంగా, నిర్మించడానికి రూ. 5 వేల రూపాయలు కిలోవాట్ కు ఖర్చు అవుతాయని ఒక అంచనా. మరమ్మత్తులు, మరియు నిర్వహణ ఖర్చు సంవత్సరానికి సుమారు కిలోవాట్ కు 2000 రూపాయలు.

పవన – సౌర సంకీర్ణ వ్యవస్థ

ఒక పవన విద్యుదుత్పత్తి యంత్రం, మరియు సోలార్ – ఫోటోవొల్టాయిస్ (ఎస్ పి వి) వ్యవస్థలు కలిసి పని చేసినప్పుడు, ఉత్పత్తి అయ్యే విద్యుత్తు పరస్పరం పూరకంగా ఉండి, ఈ సంకీర్ణ వ్యవస్థ వలన వికేంద్రీకరించిన పద్ధతిలో నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్ సరఫరా జరుగుతుంది. పవన – సౌర సంకీర్ణ వ్యవస్థలో, ముఖ్యంగా ఒకటి లేక రెండు పవన విద్యుదుత్పత్తి యంత్రాలు తగినంత సామర్థ్యం కలిగిన సోలార్ ఫోటో వొల్టాయిక్ పలకలతో, విద్యుత్ ప్రసారాలను నియంత్రించే యంత్రంకు అనుసంధానించబడి, ఇన్వర్టర్ (విద్యుత్ నిలవఉండే), బ్యాటరీ బ్యాంకు మొదలైన వాటితో కలిగి ఏ సి విద్యుత్తును అందిస్తాయి. విద్యుత్ కేంద్రం నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు చేరలేనప్పుడు, విద్యుధీకరణ చెందని అతి దూరప్రాంతాల కనీస విద్యుదవసరాలను తీర్చడం, ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ప్రయోజనం. గాలి మరియు సౌర అంశాల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు బ్యాటరీ బ్యాంకులో నిలవచేయబడి, అవసరమైనప్పుడు అనుగుణంగా ఉపయోగ పడుతుంది.
గాలి మరియు సౌర అంశాల నిష్పత్తి మీద ఆధారపడి, ఈ వ్యవస్థ ఖర్చు ఒక కిలోవాట్ 2 లక్షల 50 వేల రూపాయల నుండి 3 లక్షల 50 వేల రూపాయల వరకూ ఉంటుంది. ఈ వ్యవస్థను ఏర్పరచడానికి అయ్యే వ్యయం, నిర్మాణ పనుల ఖర్చుతో రమారమి కిలోవాట్ కు 10,000 రూపాయల వరకూ ఉంటుంది. మరమ్మత్తు లు, మరియు నిర్వహణ ఖర్చు సంవత్సరానికి సుమారు కిలోవాట్ కు 3,000 రూపాయలు ఉంటుంది.
ఈ వ్యవస్థకు, కొన్ని గరిష్ట పరిమితులతో 50 శాతము రాయితీలు యివ్వబడ్డాయి. వ్యక్తులకు, పరిశ్రమలకు, మరియు అధ్యయనం మరియు అభివృద్ధి, మరియు విద్యాసంస్థలకు గరిష్ట పరిమితి కిలోవాట్ కు 1.25 లక్షల రూపాయలు వరకు రాయితీ యివ్వబడుతుంది. “నవ్య మరియు పునరుత్పాదక శక్తి” మంత్రిత్వశాఖ, ఈ వ్యవస్థను ఉపయోగించే సాంఘిక సంస్థలకు, నేరుగా ఉపయోగించే కేంద్రరాష్ట్ర ప్రభుత్వశాఖలు, రక్షణ మరియు సైనిక దళాలకు పనులకయ్యే ఖర్చులలో 75 శాతం, గరిష్ట పరిమితి కిలోవాట్ కు 2 లక్షల రూపాయలు వరకు రాయితీనిస్తుంది. విద్యుధీకరణ చెందని ద్వీపాలకు, పనులకయ్యే ఖర్చులలో 90 శాతం, కిలోవాట్ కు 2.4 లక్షల రూపాయల గరిష్ట పరిమితితో రాయితీనిస్తుంది.

ఆధారము: పవనశక్తి “నవ్య మరియు పునరుత్పాదక శక్తి వనరులు (భారత ప్రభుత్వం)© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate