హోమ్ / శక్తి వనరులు / పర్యావరణం / పర్యావరణ మిత్ర కార్యక్రమం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పర్యావరణ మిత్ర కార్యక్రమం

ఒక పర్యావరణ మిత్ర (పర్యావరణం యొక్క ఫ్రెండ్), వ్యక్తిగత, పాఠశాల, కుటుంబం మరియు కమ్యూనిటీ స్థాయిల్లో ప్రవర్తన మరియు యాక్షన్ లో సానుకూల మార్పు ద్వారా పర్యావరణ పౌరసత్వం లక్షణాలు ప్రదర్శించువాడు.

ఒక పర్యావరణ మిత్ర ఎవరు?

ఒక పర్యావరణ మిత్ర (పర్యావరణం యొక్క ఫ్రెండ్), వ్యక్తిగత, పాఠశాల, కుటుంబం మరియు కమ్యూనిటీ స్థాయిల్లో ప్రవర్తన మరియు యాక్షన్ లో సానుకూల మార్పు ద్వారా పర్యావరణ పౌరసత్వం లక్షణాలు ప్రదర్శించువాడు. కేవలం విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, మొత్తం పాఠశాలలు మరియు ఈ లక్షణాలకు ప్రదర్శించే వారందరూ పర్యావరణ మిత్ర గా ఉండవచ్చు.

పర్యావరణ మిత్ర కార్యక్రమం ఏమిటి?

పర్యావరణ మిత్ర అనేది దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలలోని, ఎవరైతే అవగాహన, జ్ఞానం, నిబద్ధత, మరియు తమ సొంత రంగాల్లో పర్యావరణ సమతుల్యతకు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనడానికి సామర్ధ్యం కలిగి ఉన్న యువ నాయకుల నెట్వర్క్ సృష్టించడానికి ఒక దేశవ్యాప్త ప్రయత్నం.

పర్యావరణ మిత్ర కార్యక్రమం ప్రాధమికంగా తరగతి 6 నుండి 8 (వయస్సు 11-15) విద్యార్థులు చేరడానికి ప్రయత్నిస్తుంది.

పర్యావరణ మిత్ర కార్యక్రమం యొక్క నమూనా ఏమిటి?

విద్యార్థులు, పర్యావరణ మిత్ర గా, “హ్యాండ్ ప్రింట్” యాక్షన్ పాటించడం ద్వారా ఒక వైవిధ్యం కోసం నిబద్ధత చూపిస్తారు. ఈ యాక్షన్ ఒక స్థానిక సమస్య పరిష్కరించడం వైపు కావచ్చు, లేదా బడి ఆవరణలోనే పరిస్థితి మెరుగు కోసం కావచ్చు మరియు ఇంటిలో లేదా ఈ ఐదు నేపథ్య ప్రాంతాల కమ్యూనిటీలో కావచ్చు:

 1. నీళ్ళు మరియు పరిశుభ్రత
 2. శక్తి
 3. వేస్ట్ మేనేజ్మెంట్
 4. జీవవైవిధ్యం మరియు గ్రీనింగ్
 5. సంస్కృతి మరియు వారసత్వం

ప్రాజెక్టు ఆధారిత విద్యా విధానంలో విద్యార్థి నేర్చుకోవడం ద్వారా, పర్యావరణ సమతుల్యతలో అవగాహనను పెంపొందించుకునేందుకు అవసరమైన వైఖరి, విలువలు మరియు పర్యావరణ సమతుల్యతకు ప్రవర్తనను ధృడపరచును మరియు అనుభవం తక్షణ వాతావరణంలో ప్రయోగాత్మక ఉపయోగించటం ద్వారా నైపుణ్యాలను నిర్మింప చేస్తుంది.

పర్యావరణ మిత్ర కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

పర్యావరణ మిత్ర కార్యక్రమం ప్రతిజ్ఞ, పర్యావరణ మిత్ర కార్యక్రమం లక్ష్యాలు, ఉపాధ్యాయుల పాత్ర, ఇతివృత్తాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇతివృత్తాల వివరణ: నీరు: కీలక అంశాలు, సంరక్షణ వ్యర్ధాల నిర్వహణ: కీలక అంశాలు, నాణ్యత, పరిశీలనలు, శక్తి: కీలక అంశాలు, శక్తి ఉపయోగాలు, శక్తి వనరుల వర్గీకరణ, అనుకూల ప్రతికూల అంశాలు, శక్తి సంరక్షణ, జీవ వైవిధ్యం: కీలక అంశాలు, జీవ వైవిధ్య ప్రాధాన్యత, విలువలు, జీవ వైవిధ్య సంరక్షణ, సంస్కృతి వారసత్వ సంపద: కీలక అంశాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కార్యాచరణ భావనలు: నీరు, నీటి వాడకంలో జాగ్రత్తలు, నీటి శుబ్రత జాగ్రత్తలు, శక్తి, శక్తి సంరక్షణ, ఇందన పొదుపు సూత్రాలు, వ్యర్థాల నిర్వహణ, చెత్తతో ఎరువు, జీవ వైవిధ్యం, మొక్కల పెంపకం, సంస్కృతి వారసత్వ సంపద, పర్యావరణ మిత్ర కార్యక్రమాల నమూనా నివేదిక కొరకు ఇక్కడక్లిక్ చేయండి.

పాఠశాలలలో పర్యావరణ మిత్ర ఎందుకు?

పాఠశాల అనేది విద్యార్థులు ఒక సంవత్సరం సగటున 200 రోజులు, 5-8 గంటలపాటు గడుపే ప్రదేశం. నిజానికి తాము మెలకువ ఉండే గంటల గణనీయమైన సమయం ఇక్కడ గడుపుతారు. పాఠశాల సమయం మరియు ప్రదేశంలో పాఠ్యప్రణాళికకు సంబంధించిన శిక్షణ మాత్రమే కాకుండా పాఠ్యయేతర మరియు సహ విద్యా విషయక కార్యక్రమాల ద్వారా జీవిత నైపుణ్యాల అభివృద్ధి కోసం ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది.

అందువలన పాఠశాల స్థాయిలో పర్యావరణ మిత్ర కార్యక్రమాలు అందుబాటులో తేవడం ద్వారా విద్యార్థులు, జ్ఞానము మరియు అనుభవాలను పొంది నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని, విలువలతో మరియు వైఖరులను జీర్ణించుకొను కోసం ఒక నిర్మాణాత్మక అవకాశం లభిస్తుంది.

ఇందుకోసం పర్యావరణ మిత్ర ఒక చక్కటి పుస్తకాన్ని అందుబాటులో ఉంచింది. ఇది ప్రతీ ఒక్కరు చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని పొందటానికి ఈ క్రింది లింక్స్ ని క్లిక్ చేయండి.

 1. పర్యావరణ మిత్ర 1వ భాగం
 2. పర్యావరణ మిత్ర 2వ భాగం
 3. పర్యావరణ మిత్ర 3వ భాగం
 4. పర్యావరణ మిత్ర 4వ భాగం
 5. పర్యావరణ మిత్ర 5వ భాగం

ఆధారము: సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్

3.04644808743
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు