హోమ్ / శక్తి వనరులు / పర్యావరణం / ప్యాకేజ్డ్ తాగు నీరు మరియు మినరల్ వాటర్ గురించి తరుచూ అడిగే ప్రశ్నలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్యాకేజ్డ్ తాగు నీరు మరియు మినరల్ వాటర్ గురించి తరుచూ అడిగే ప్రశ్నలు

ఈ విభాగంలో ప్యాకేజ్డ్ తాగు నీరు మరియు మినరల్ వాటర్ గురించి తరుచూ అడిగే ప్రశ్నలు గురించి వివరించడం జరిగింది.

సహజ మినరల్ వాటర్ అంటే ఏమిటి?

సహజ మినరల్ వాటర్ అంటే ఏ ప్రాసెసింగ్ లేకుండా సూచించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా భూగర్భ నీటి వనరుల నుంచి ప్యాకేజీ చేసినవి.

ప్యాకేజ్డ్ తాగు నీరు అంటే ఏమిటి?

ప్యాకేజ్డ్ తాగు నీరు అంటే శుభ్రపరచవలసిన అవసరం ఉన్న ఏ నీటినైనా తీసుకొని దానిని వడపోసి, UV లేదా ఓజోన్ శుద్దీకరణ చేసి లేదా రివర్స్ ఓస్మోసిస్ (RO) వంటి విధానాలను  ఉపయోగించి మానవ వినియోగానికి సరిపోయే విధంగా మార్చిన నీరు.

ప్యాకేజ్డ్ తాగు నీటి ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముఖ్యమైనని ఏమిటి?

ప్యాకేజ్డ్ తాగు ప్లాంటు ప్రధానంగా 4 విభాగాలను కలిగి ఉంటుంది: నీటి ట్రీట్ మెంటు, బాటలింగ్, నాణ్యత నియంత్రణ (ల్యాబ్) మరియు పూర్తి ఉపయోగం:

సాధారణంగా, ఒక ప్రామాణిక 2000 LPH ప్యాకేజ్డ్ తాగు నీటి ప్లాంటుకు కింది అవసరాలు ఉంటాయి:

 • మొత్తం స్థలము: మొత్తం 5000 చ.అ. స్థలము, అందులో 3000 చ.అ నిర్మాణ ప్రాంతం ఉండాలి.
 • విద్యుత్: 65 HP
 • ముడి నీరు: సుమారు 3000 LPH ముడి నీటిలో 70% ఉపయోగించబడుతుంది మరియు 30% తిరస్కరించబడుతుంది. సూచించిన శాతం ముడి నీటి TDS (మొత్తం కరిగిన ఘనపదార్థాలు)పై ఆధారపడి ఉంటుంది.
 • ప్రాజెక్టు వ్యయం: సుమారు రూ. 75 లక్షలు యంత్రాలు, యూటిలిటి, ఫర్నిచర్ మొదలైనవాటికి అవసరం అవుతాయి. (గమనిక - ఖర్చు 2013 లో అంచనా వేసింది)

మినరల్ వాటర్ మరియు ప్యాకేజ్డ్ తాగు నీటి ధర ఏంత?

 • మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ప్యాకేజ్డ్ తాగు నీటి ధర ఒక లీటరుకు రూ. 10-12 ఉంటుంది. సహజ మినరల్ వాటర్ లీటరుకు రూ.20  మొదలు రూ 125 వరకు ఉండవచ్చు.

ఒక లీటరు సీసా త్రాగునీటిని ఉత్పత్తి చెయడానికి ఎంత నీటిని ఉపయోగిస్తారు.

 • అంతర్జాతీయ సీసా నీరు అసోసియేషన్ ప్రకారం, ఒక లీటరు సీసా నీరు ఉత్పత్తి చేయడానికి సగటున1.39 లీటర్ల నీరు అవసరమవుతుంది.

ఏ లైసెన్సులు/ ఆమోదాలు అవసరం?

భారతదేశం లో ఒక ప్యాకేజ్డ్ తాగు నీటి ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి ఈ క్రింది లైసెన్సులు / ఆమోదాలు పొందవలసి వుంటుంది:

 • చిన్న తరహా పరిశ్రమ నమోదు
 • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నుండి ఐఎస్ఐ సర్టిఫికేషన్
 • కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్
 • ముడి నీటి అధీకృత ప్రయోగశాల నుండి నీటి పరీక్ష నివేదిక
 • కీటక నివారణ సర్టిఫికేషన్
 • రసాయన శాస్త్రవేత్త, మైక్రోబయాలజిస్టు నుండి సర్టిఫికెట్లు
 • కార్మికులకు మెడికల్ సర్టిఫికేట్లు
 • గ్రామ పంచాయతీ నుండి నో అబ్జక్షన్ సర్టిఫికెట్  (NOC), ఒకవేళ వర్తిస్తే.
 • ట్రేడ్మార్క్ నమోదు
 • ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి/ లీజుకు సంబంధించిన యాజమాన్య పత్రాలు
 • కంపెనీలు / భాగస్వామ్యం దస్తావేజు యెక్క మెమోరండం ఆఫ్ అసోసియేషన్, ఒకవేళ వర్తిస్తే.
 • విద్యుత్ లోడ్ మంజూరు
 • మంజూరు అయిన ప్లాను లేఔట్

భారతదేశం లో ప్యాకేజ్డ్ నీటి మార్కెట్ నియంత్రించబడుతుందా?

 • అవును, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ఐఎస్ఐ మార్క్ పొందటం ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలనుకున్న అందరు తయారీదారులకు తప్పనిసరి. ప్యాకేజ్డ్ సహజ మినరల్ వాటర్ IS: 13428 కింద  మరియు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ IS: 14543 కింద నిర్వహించబడుతుంది.

ఐఎస్ఐ మార్క్ కోసం దరఖాస్తు చేసి ఉత్పత్తి ప్రారంభించవచ్చా?

 • లేదు, ప్లాంటు యొక్క అధికారిక తనిఖీ జరగకుండా, స్వతంత్ర ల్యాబ్ పరీక్షలు నిర్వహించకుండా, మరియు లైసెన్స్ సంఖ్య అధికారిక ఆమోదం పొందకుండ, యూనిట్ వాణిజ్య ఉత్పత్తిని మొదలు పెట్టకూడదు.

అంతర్గత ప్రయోగశాల తప్పని సరిగా కలిగి ఉండాలా?

 • అవును,  3025 ప్రకారం, అన్ని భౌతిక, రసాయన మరియు సూక్ష్మ పరీక్షలు చేసేందుకు వీలుగా ప్రయోగశాల ఉండాలి మరియు నిపుణులైన కెమిస్టులు / మైక్రోబయాలజిస్టులు పరీక్షలు నిర్వహించాలి.

ఎంతనీటి పరిమాణాన్ని ప్యాక్ చేయాలో చెప్పడానికి ఏవైనా ప్రమాణాలు ఉన్నాయా?

 • ఉన్నాయి, ఫిబ్రవరి 28, 2001 న వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం (తూనికలు మరియు కొలతల [ప్యాకేజ్డ్ వస్తువుల] రూల్స్ 1977 యొక్క ప్రమాణాల సవరణ), సీసాలో పట్టే నీరు సూచించిన ప్రమాణాలు మాత్రమే విక్రయం చేయటం ఇప్పుడు తప్పనిసరి.
 • ఇవి 100 మిలీ / 150 ml / 200 మిలీ / 250 మిలీ / 300 మిలీ / 330ml [డబ్బాల్లో మాత్రమే ] , 500ml / 750 ml / 1 లీటరు / 1.5 లీటర్ / 2, 3, 4, 5 లీటర్ల ఆ తరువాత 5 లీటర్ల గుణిజాలు

ఒకే ప్రాంగణంలో సాఫ్ట్ డ్రింక్ యూనిట్ మరియు బాటిల్ వాటర్ యూనిట్లను నడపడానికి అనుమతి ఉంటుందా?

 • లేదు,  సాఫ్ట్ డ్రింక్ [చక్కెర మరియు రుచికి] వాడే పదార్థాలు  పరిసరాలను మరియు పరికరాలను కలుషితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి,  ఒకే చోట రెండు యూనిట్లు పనిచేయడానికి అనుమతించరు.

ప్లాస్టిక్ సీసాలలో ప్యాక్ చేసిన నీటిని తాగటం సురక్షితమా?

 • సూపర్ మార్కెట్ అరలలో దొరికే సహజ నీటి సీసాలను PET (పాలిథిలిన్ టెరాఫ్తలెట్)తో తయారు చేస్తారు. ఇది పూర్తిగా సురక్షితం.

నేను నీటి నిల్వ కోసం ప్లాస్టిక్ సీసాలు మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చా?

 • ఒకసారి ఉపయోగించడానికి తయారుచేసిన ప్లాస్టిక్ నీటి సీసాలను పునర్వినియోగం కోసం తయారు చేయరు. పరిశుభ్రత మరియు వినియోగదారుని భద్రత దృష్టితో, నీటి నిల్వ కోసం ఒకసారి ఉపయోగించడానికి తయారుచేసిన ప్లాస్టిక్ నీటి సీసాలను పునర్వినియోగించడం మంచిదికాదు. అయితే, వాటిని మొక్కలను పెంచడానికి,  బిందు సేద్యం మొదలైన ఇతర ప్రయోజనాల కోసం తిరిగి ఉపయోగించవచ్చు.

ఎందుకు బాటిల్ నీటి రుచి లో మార్పు  ఉంటుంది?

 • సహజ ఆధార సీసాలోని నీరు వివిధ సాంద్రతల ఖనిజాలు కలిగిఉంటుంది మరియు భూమి, భౌగోళికతను బట్టి ప్రతి సీసా నీరు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగిఉంటుంది .

మూలం: ఇండియా వాటర్ పోర్టల్

3.09210526316
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు