వ్యర్థ పదార్థాల నిర్వహణ యొక్క అవలోకనం
రోజువారి జీవితంలోని వ్యర్దాలను కింది విధంగా వర్గీకరించవచ్చు
- గృహ వ్యర్థాలు
- ఆసుపత్రి వ్యర్థాలు
- పారిశ్రామిక వ్యర్థాలు
- వ్యవసాయ వ్యర్థాలు
వాతావరణం, జీవులు మరియు చెట్లపై ప్రభావాన్ని బట్టి వ్యర్థాలను కింది విధంగా వర్గీకరించనచ్చు
- విషపూరిత వ్యర్థాలు/ప్రమాదకర వ్యర్థాలు
ఉదా: పారిశ్రామిక వ్యర్థాలు
- విషం కాని వ్యర్థాలు
ఉదా: గృహ వ్యర్థాలు
- వ్యాధి ఉత్పత్తి వైరస్ & బాక్టీరియాను కలిగిన వ్యాధికారక వ్యర్థాలు.
ఉదా: హాస్పిటల్ వ్యర్థాలు.
ఉత్పతైన వ్యర్థాలు బయోడిగ్రేడబుల్ (బాక్టీరియా ద్వారా కుళ్ళిపోయేలా చేయవచ్చు. ఉదా కూరగాయలు, మురుగు మొదలైన గృహ సేంద్రియ వ్యర్ధాలు) లేదా బయోడిగ్రేడబుల్ కానివి (ఉదా: ప్లాస్టిక్) కావచ్చు.
గృహ వ్యర్థాలు
- మురుగు - మానవ మలమూత్రాలు మరియు స్నానపు గదులు మరియు వంటశాలలలో నుండి వచ్చే నీరు.
- వంటగది వ్యర్థాలు: విషరహితం/బయోడిగ్రేడబుల్ - కూరగాయలు, మొదలైనవి
- చెత్త - కాగితాలు, చెత్త, జుట్టు, ఇంటి దుమ్ము మొదలైనవి - విషరహితం/బయోడిగ్రేడబుల్.
- ఇతర వ్యర్థాలు : ప్లాస్టిక్ కవర్లు/సీసాలు/టిన్నులు మొదలైనవి -బయోడిగ్రేడబుల్ కానివి పునర్వినియోగ పరచ దగినని మరియు విషపూరితమైనవి.
పారిశ్రామిక వ్యర్థాలు
ఇది ప్రధానంగా మూడు రకాలు
- ఘన వ్యర్థాలు
- విష పూరితమైనవి - గనుల వ్యర్థాలు
- విష పూరితం కాని వ్యర్థాలు - నిర్మాణ సామాగ్రి, ఇటుక వంటివి
- ద్రవ వ్యర్థాలు
- కర్బన వ్యర్థాలు - చర్మ/స్వేదన/చక్కెర ఫ్యాక్టరీలలోనివి (అధోకరణం చెందుతాయి)
- అకర్బన వ్యర్థాలు - రసాయన మరియు ఎరువుల పరిశ్రమలలోనివి (అధోకరణం కావు, రసాయనాలతో శుద్ధం చేయవచ్చు)
- వాయు వ్యర్థాలు:
ఏ. విషపూరితమైనవి - అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి విషపూరిత పొగలు
బి. విషపూరితం కానివి- స్టీమ్/నీటి ఆవిరి.
హాసుపత్రి వ్యర్థాలు
- బాక్టీరియా/శిలీంధ్రాలు మరియు వైరస్ వంటి రోగ కారక చీము మరియు రక్తంతో నిండిన దూది మరియు డ్రెస్సింగ్ బ్యాండేజీ.
- వాడిన సూదులు.
- వాడిన సిరంజిలు/సీసాలు/ప్లాస్టిక్ సంచులు మొదలైనవి, ఎక్కువగా గాజు లేదా ప్లాస్టిక్ తో చేసినవి.
- ఆపరేషన్ థియేటరులోని వ్యర్థాలు - కణజాలం/రక్తం/మాంసం, మొదలైనవి. ఆసుపత్రిలోని వ్యర్థాలు అత్యంత వ్యాధికారకమైనవి.
వ్యవసాయ వ్యర్థాలు
- బయోమాస్: బియ్యం ఊక, చెరకుపిప్పి తదితర వ్యవసాయ అవశేషాలు
- కెమికల్స్: పురుగు మందులు, ఎరువుల శేషాలు
రేడియోధార్మిక వ్యర్థాలు
ఇవి మామూలుగా భారీ నీరు లేదా ఖర్చయిన అణు ఇంధనాలు. రేడియో ధార్మిక వ్యర్థాలు వాతావరణానికి మరియు మానవ భవిష్యత్ తరాలకు చాలా ప్రభావితం చేస్తాయి. వాతావరణంలో చాలా కాలం ఉండ గలికే కారణంగా ఇది జన్యువులు లేదా జీవ రూపాల జన్యు పదార్ధాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది పర్యావరణానికి మరియు అన్ని జీవరాసులకు అత్యంత ప్రమాదకరమైనది. రేడియో ధార్మిక వ్యర్థాల నిర్వహణ కూడా ప్రమాదకరం ఎందుకంటే అది నిర్వహణలో ఉన్న వ్యక్తి పైనకూడా ప్రభావం చూపుతుది.
వ్యర్థాల విభజన
- ఎండినవి: ప్లాస్టిక్ కాగితం, గాజు, లోహము, చెత్త, రబ్బరు, మొదలైనవి.
- తడిచినవి: మిగిలిపోయిన ఆహారం, వంటగది వ్యర్థాలు, కుళ్ళిన పదార్థాలు, మాంసం, వీధి మరియు ఇంటిని ఉడ్చినవి, మురికి కాగితాలు.
- విషపూరిత మైనవి: పెయింట్స్, పురుగు మందులు, విష రసాయనాలు, విరిగిన ట్యూబ్ లైట్లు, గడువు ముగిసిన మందులు, వాడేసిన బ్యాటరీలు, మొదలైనవి.
- గట్టివి: డైపరులు, సానిటరీ నేప్కిన్లు, డ్రెస్సింగులు, వాడిన పత్తి, ఇంజక్షన్ సిరంజిలు మరియు సూదులు, మట్టి మరియు బిల్డర్ల వ్యర్ధాలు.
వ్యర్థపదార్థాలనిర్వహణ
క్రింది కారణాల వల్ల ఈ రోజుల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ చాలా అవసరం
- గాలి, నీరు మరియు భూమి వంటి సహజ వనరుల కాలుష్యాన్ని నిరోధించడానికి.
- ఖనిజాలు, నీరు వంటి వనరులు పూర్తిగా నష్టపోకుండా నివారించడానికి.
- త్వరగా తరిగి పోతున్నశిలాజ ఇంధనాలు మరియు ఇతర సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయ శక్తి ఉత్పత్తికి.
- ఉత్పత్తి అయిన వ్యర్ధాలను వీలైనంతగా ఉపయోగించడానికి.
- ఒక మంచి మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం.
వ్యర్థాలనునిర్వహించడంఎలా
వ్యర్థాలను నిర్వహించాలంటే
- తయారీ ప్రక్రియను మరింత సమర్ధంగా నిర్వహించాలి తద్వారా వ్యర్థాలు తగ్గించవచ్చు.
- పునరుపయోగాన్ని పెంచాలి, తద్వారా వ్యర్థాలు ఉత్పత్తి తగ్గించవచ్చు.
- ఉత్పత్తి వ్యర్థాల రీసైక్లింగ్ చేయాలి.
ఉదా: ప్లాస్టిక్స్, సీసాలు, మురుగు మరియు విసర్జనలు
- ఎల్లప్పుడూ 3 Rలను గుర్తుపెట్టుకొండి - తగ్గించు, తిరిగీ ఉపయోగించు, రీసైకిల్.
- గృహ వ్యర్థాలను అధోకరణ మరియు అధోకరణకాని వాటిగా వేరుచేయి.
- అధోకరణ – కంపోస్ట్ చేయి
- అధోకరణ కానివి - రీసైకిల్ చేయి.
- కాగితాన్ని పూర్తిగా ఉపయోగించు (రెండు వైపులా ఉపయోగించు).
- షాపింగ్ కోసం ప్లాస్టిక్ కవర్లు లేదా సంచులు ఉపయోగించడం మానుకోండి. బట్టతో చేసిన సంచులను ఉపయోగించు.
- ప్లాస్టిక్స్ తో ప్యాక్ చేసినవి కాకుండా పేపరు లేదా హార్డ్ బోర్డుతో ప్యాక్ చెసిన ఉత్పత్తులు కొనుగోలు చేసి తయారీదారును ప్రోత్సహించండి.
- శుభ్రం చేసిన తర్వాత పాత సీసాల్లో నూనె / డీజిల్ కొనుగోలు చేయండి.
- ఎక్కువ కాలం నడవడానికి, మీ వాహనాన్ని సరిగా నిర్వహించండి.
- పిల్లలకు రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క ప్రాముఖ్యతను వివరించి వారిని అది చేయడానికి ప్రోత్సహించండి.
- తయారీ పద్ధతులను మెరుగు పరుచు/పరిచయం చేయి. తద్వారా వ్యర్థాలు ఉత్పత్తి తగ్గించవచ్చు.
- వ్యర్థాల నిర్వహణ గురించిన అవగాహనను పెంపొందించు - భారతదేశం వ్యర్థాలను ఆర్థికంగా భరించలేదు.
- కంపోస్టింగు మరియు వర్మికల్చరును పెంచాలి.
- సేంద్రీయ వ్యర్ధాలను నిర్వహించడం సులభం. ఎందుకంటే ఇవి కొంత కాలానికి కుళ్ళిపోతాయి. దీనిని పేడను కంపోస్టింగ్ ప్రక్రియతో ఎరువుగా మార్చి నిరూపించవచ్చు. ఈ ఎరువు రసాయన ఎరువుల కంటే సురక్షితమైనది. వానపాములను కంపోస్టింగ్ ప్రక్రియలో వాడటాన్ని వర్మికల్చరు అంటారు. ఇది చాలా ఉపయోగకరమైనది మరియు విజయవంతమైనగా నిరూపించబడింది.
ఆధారము: CPR పర్యావరణ విద్య కేంద్రము