অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పర్యావరణ వాస్తవాలు

పర్యావరణ వాస్తవాలు

 1. ప్లాస్టిక్ సంచులు- ఒక పర్యావరణ ప్రమాదం
  1. ప్లాస్టిక్ అంటే ఏమిటి?
  2. ప్లాస్టిక్ సంచులు వేటితో తయారవుతాయి?
  3. ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయా?
  4. మోసుకువెళ్ళే ప్లాస్టిక్ సంచులు వలన కలిగే సమస్యలు
  5. వ్యర్ధ ప్లాస్టిక్ యాజమాన్య వ్యూహరచనలు
  6. ప్లాస్టిక్ ల కి ప్రత్యామ్నాయాలు
 2. భారతదేశంలో రక్షిత జీవావరణ ప్రాంతాలు
 3. శీతోష్ణస్థితి మార్పు
  1. శీతోష్ణస్థితి మార్పుకి కారణాలు
  2. సహజ కారణాలు
  3. మానవ సంబంధిత కారణాలు
  4. గ్రీన్‌ హౌస్‌ ఫలితం
  5. గ్రీన్‌ హౌస్‌ వాయువులకు ఫలసిద్దికి మనం ఎలా తోడ్పడగలం?
  6. మనపై శీతోష్ణ స్థితి మార్పు ప్రభావం ఎలా ఉంటుంది ?
  7. ఉపద్రవాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
 4. కోపెన్ హెగన్ సదస్సు
 5. ఓజోన్‌ మరియు వాతావరణం
  1. ఓజోన్‌ అంటే ఏమిటి?
  2. ఓజోన్‌ లాభ నష్టాలు
  3. ఓజోన్‌ తరిగిపోవడమంటే ఏమిటి?
  4. ఓజోన్‌ తరిగి పోవడం వల్ల మన పై ప్రభావం ఎలా ఉంటుంది ?
 6. కో్యొటో ప్రోటోకాల్‌
  1. ఉద్గారాల(ప్రసరణలు)వర్తకం- కర్బన వాణిజ్యం
  2. పరిశుద్ధతాభివృద్ధియంత్రాంగం
  3. సంయుక్తాచరణ
 7. పచ్చనిచెట్టూ ప్రత్యక్షదైవమే!
 8. నీరు - ఆవశ్యకత
 9. పర్యావ'రణం'లో నెగ్గేదెలా?
  1. వూరట కొంతే...
  2. కలిసికట్టుగా ముందుకు

ప్లాస్టిక్ సంచులు- ఒక పర్యావరణ ప్రమాదం

ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన జరిగే సమస్య, వ్యర్ధ పదార్థాల యాజమాన్య పద్ధతులలోని లోపాలే ప్రాథమికంగా కారణము. కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాల కాలుష్యం మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి.

ప్లాస్టిక్ అంటే ఏమిటి?

ప్లాస్టిక్ అంటే పోలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల చెయిన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది.

ప్లాస్టిక్ సంచులు వేటితో తయారవుతాయి?

ప్లాస్టిక్ సంచులు మూడు రకాల మౌలిక పోలిమర్లలో ఏదైన ఒక దానితో తయారవుతాయి. పోలీఎథిలిన్- 1)ఎక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (హెచ్ డి పి ఇ), 2) తక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (ఎల్ డి పి ఇ), 3) సరళంగా తక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (ఎల్ ఎల్ డి పి ఇ). కిరాణా సంచులు సామాన్యంగా హెచ్ డి పి ఇ తో మరియు డ్రై క్లీనర్ నుండి ఇచ్చే సంచులు ఎల్ డి పి ఇ అయి ఉంటాయి. ఈ మెటీరియల్ లో పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, పోలిమర్ చెయన్ శాఖలుగా ఏర్పడే పరిమాణం. హెచ్ డి పి ఇ మరియు ఎల్ ఎల్ డి పి ఇ శాఖలుకాని చెయిన్లతో సరళంగా చెయన్లు ఉంటాయి ; ఎల్ డి పి ఇ లో శాఖలుతో చెయిన్ల ఏర్పడతాయి.

ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయా?

ప్లాస్టిక్ అంతర్యంగా విషపూరితం లేదా హానికరం కాదు. కాని సేంద్రీయ మరియు రసాయనాల రంగులు, పిగ్ మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటి ఆక్సిడెంట్లు, స్టెబిలైజర్లు మరియు ధాతువులు వంటి ఎడిటివ్లతో ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తారు. ప్లాస్టిక్ సంచులకి తళతళ లాడే రంగుని ఇవ్వడానికి ఉపయోగించే రంగులు మరియు పిగ్ మెంట్లు, పారిశ్రామిక ఎజోడైలు. ఇందులో కొన్ని కేన్సరు కలుగచేసే పధార్థాలు ఉన్నాయి. ఈ సంచులలో ఆహర పదార్థాలు కట్టినప్పుడు అవి కలుషితమౌతాయి. పిగ్ మెంట్లలో ఉండే కాడ్మియము వంటి బరువైన ధాతువులు కూడా చేరి ఆరోగ్యానికి హానికరమౌతాయి

ప్లాస్టి సైజర్లు అనేవి తక్కువ బాష్పశీల స్వభావముగల సేంద్రీయ ఈస్టర్లు. అవి, ఆహార పదార్థాలకి శ్రవించిడం ద్వారా వలస పోగలుగుతాయి. ప్లాస్టిసైజర్లలో కూడా కేన్సరు కలుగ చేసే పదార్థాలని కలిగి ఉంటాయి. యాంటి ఆక్సిడింట్లు మరియు స్టెబిలైజర్లు సేంద్రీయ మరియు అసేంద్రీయ రసాయనాలు. ఇవి మేన్యుఫేక్చరింగు విధాన సమయంలో, ఉష్ణ వియోగం చెందకుండా రక్షిస్తాయి.

కాడ్మియం మరియు సీసం వంటి విషపూరిత ధాతువులు, ప్లాస్టిక్ సంచుల మాన్యుఫేక్చరింగులో ఉపయోగించినప్పుడు కూడా శ్రవించి ఆహార పదార్ధాలని కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులలో శోషించినపుడు, వాంతులని మరియు గుండె పెద్దది కావడం కలగచేస్తుంది. ఎక్కువ కాలం సీసానికి గురైతే, మెదడు టిష్యూలు క్షీణించి పోతాయి.

మోసుకువెళ్ళే ప్లాస్టిక్ సంచులు వలన కలిగే సమస్యలు

ప్లాస్టిక్ సంచులని సరిగా పారవేయకపోతే, డ్రైనేజి సిస్టమ్ లోకి వెళ్ళి వాటిని మూసి వేయడం వలన అశుభ్రమైన వాతావారణాన్ని కలుగచేసి, నీటి ద్వారా వేచ్చే వ్యాధులను కలుగచేస్తాయి. పునర్వినియోగం /రంగుల ప్లాస్టిక్ సంచులు, భూమిలోనికి శ్రవించి మట్టిని, మరియు ఉప మట్టి నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాలని కలిగి ఉండవచ్చు. పునర్వినియోగం చేయడానికి ఉపయోగించే యూనిట్లు పర్యావరణపరంగా పటిష్టమైనవి కాకపోతే, పునర్వినియోగం సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయి. మిగిలిపోయిన ఆహారం కలిగిఉన్న లేదా ఇతర వ్యర్ధ పదార్ధాలతో కలిసిపోయి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. పాడవ్వని మరియు చొచ్చుకు పోనీయని స్వభావంకల ప్లాస్టిక్ కారణంగా, మట్టిలో పారవేస్తే, భూగర్భ జల ఏక్విఫెర్లు నింపకుండా అడ్డుకోవచ్చు. అంతే కాకుండా, ప్లాస్టిక్ ఉత్పాదనల లక్షణాలని మెరుగు పరచడానికి మరియు పాడయ్యే ప్రతి చర్యని నిరోధించడానికి సాధారణంగా ఎడిటివ్లను మరియు ప్లాస్టిసైజర్లను, ఫిల్లర్లను, ఆగ్నిమాపకాలని మరియు పిగ్ మెంట్లని ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

వ్యర్ధ ప్లాస్టిక్ యాజమాన్య వ్యూహరచనలు

పలుచని ప్లాస్టిక్ సంచులు తక్కువ విలువ కలిగి ఉండి వాటిని వేరుపరచడం కష్టతరంగా ఉంటాయి. ప్లాస్టిక్ సంచుల మందాన్ని పెంచితే, ప్లాస్టిక్ సంచుల ఖరీదైనవిగా ఉండి, వాటి ఉపయోగాన్ని తగ్గించ వచ్చు. ప్లాస్టిక్ మేన్యుఫేక్చర్ అసోసియేషన్ మరియు చెత్తని తీసుకు వెళ్ళేవారు కూడా వ్యర్ధ సేకరణ మరియు తొలగించే విధానంలో పాల్గొనాలి.

ప్లాస్టిక్ నీటి సీసాలు, ప్లాస్టిక్ సంచులు పారవేయడం వలన మున్సిపల్ ఘన వ్యర్ధ యాజమాన్యానికి ఒక సవాలుగా తయారయింది. పర్యాటక ప్రదేశాలలో, చాలా పర్వత రాష్ట్రాలలో (జమ్ము & కాశ్మీర్, సిక్కిం, పశ్చిమ బెంగాలు) ప్లాస్టిక్ సంచులు/సీసాలని ఉపయోగించడాన్ని నిషేధించాయి. హిమాచల్ ప్రదేశ్ లో, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ పి బయోడిగ్రేడబుల్ గార్బేజ్ (నియంత్రణ) చట్టం, 1995 క్రింద, 15.08.2009 నుండి రాష్ట్ర మంతటా, ప్లాస్టిక్ ఉపయోగించ డానిని నిషేధించడానికి క్యాబినెట్ తీర్మానం తీసుకుంది. కమీటీలని మరియు టాస్క్ ఫోర్స్ లని నియమించడం ద్వారా, దేశంలో వ్యర్ధ ప్లాస్టిక్ వలన వాతావరణానికి కలిగిన నష్టాన్ని క్రేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేసింది. కమిటీ మరియు టాస్క్ ఫోర్స్, సమస్యని అధ్యయనం చేసి సిఫార్సు చేస్తారు. ప్లాస్టిక్ సంచులు మరియు కంటైనర్లని నిర్వహించడానికి మరియు నియంత్రించడానికి, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వశాఖ, పర్యావరణ (సంరక్షణ) చట్టం, 1986 క్రింద, రిసైకిల్డ్ ప్లాస్టిక్ మేన్యుఫేక్చర్ మరియు వినియోగ నిబంధనలు 1999ని జారీ చేసింది మరియు దానిని 2003లో సవరించింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మీద, బ్యురో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి ఐ ఎస్) 10 ప్రమాణాలని ప్రకటించింది.

ప్లాస్టిక్ ల కి ప్రత్యామ్నాయాలు

ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలి మరియు ఆర్ధికపరమైన ఇన్సెంటివ్లతో ప్రేరేపించాలి. అయినప్పటికీ, పేపరు సంచులు తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యముగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి, మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది.

భారతదేశంలో రక్షిత జీవావరణ ప్రాంతాలు

క్రమ సంఖ్య

పేరు

స్ధాపించిన తేదీ

విస్తీర్ణం (చ.కి.మీ ల .లో)

ఉన్న ప్రాంతం

1.

అచ్చనాకమర్ - అమరకంటక్

2005

3835.51

మధ్య ప్రదేశ్ లోని అనుపూర్ మరియు దిండోరి జిల్లా మరియు చత్తిస్ ఘర్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలోని కొన్ని భాగాలను కవరు చేస్తుంది.

2.

అగస్త్యమలై

12.11.2001

1828

కేరళలోని నెయ్యార్, పెప్పర మరియు షెందుర్నీ వన్యప్రాణుల ఆశ్రయాలు మరియు వాటికి ఆనుకుని ఉండే ప్రదేశాలు.

3.

దిహాంగ్ – దిబాంగ్

02.09.98

5111.5

అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ లోనూ, మరియు దిబాంగ్ లోయలోని కొన్ని భాగాలు

4.

దిబ్రు – షికోవా

28.07.97

765

దిబ్రుఘర్ లో కొంత భాగం మరియు టిన్ సుకియా జిల్లాలోని కొన్ని భాగాలు (అస్సామ్)

5.

గ్రేట్ నికోబార్

06.01.89

885

అండమాన్ మరియు నికోబార్ లలో చాలా వరకు దక్షిణం పైపు ఉన్న దీవులు (అండమాన్ మరియు నికోబార్ దీవులు)

6.

గల్ఫ్ ఆఫ మన్నార్

18.02.89

10,500

భారత దేశం మరియు శ్రీలంక మధ్య ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ యొక్క బారతదేశానికి చెందిన భాగం (తమిళ నాడు)

7.

ఖంగే హెండ్జోంగా

07.02.2000

2619.92

హెండ్జోంగా కొండలలో కొన్ని భాగాలు మరియు సిక్కిమ్

8.

మానస్

14.03.89

2837

కొక్రోజా, బొంగాయి గాఁవ్, బార్పేట, నల్బరి, కామ్ రూప్ మరియు దరాంగ్ జిల్లాల లోని కొన్ని భాగాలు (అస్సామ్)

9.

నందా దేవి

18.01.88

2860.69

చమోలి, పితోరాఘర్ మరియు బాగేశ్వర్ జిల్లాలలోని కొన్ని భాగాలు (ఉత్తర ఖాండ్)

10.

నీలగిరి

01.09.86

5520

వయనాడ్ లో కొంత భాగం, నాగర్గోల్, బండిపూర్ మరియు ముదుమలై, నీలాంబర్, సైలెంట్ వ్యాలీ మరియు శిరువాణి కొండలు (తమిళ నాడు, కేరళ మరియు కర్నాటక)

11.

లోక్రేక్

01.09.88

820

గారో కొండలలోని కొన్ని భాగాలు (మేఘాలయ)

12.

పచ్ మర్హి

03.03.99

4926

బిటుల్ మరియు హోషంగాబాద్ లోని కొన్ని భాగాలు మరియు మధ్య ప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలు

13.

సమిలిపాల్

21.06.94

4374

మయూర్ భన్జ్ జిల్లాలోని కొన్ని భాగాలు (ఒరిస్సా)

14.

సుందర్బన్స్

29.03.89

9630

గంగా లోని డెల్లా (మైదాన ప్రాంతం) లలో కొన్ని భాగాలు మరియు బ్రహ్మపుత్ర నది పరీవాహకం. (పశ్చిమ బెంగాల్)

నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్, 2008, ఎమ్.ఓ.ఇ.ఎఫ్. వారి సౌజన్యంతో

శీతోష్ణస్థితి మార్పు

మనము వేసవి కాలంలో వేడిమిని శీతా కాలంలో చల్లగాను అనుభూతి చెందుతాము. వెర్వేరు శీతోష్ణ పరిస్థితులను అనుభవిస్తాము. ఒకే కాల వ్యవధిలో ఒక మోస్తరు వాతావరణ పరిస్థితిని పొందుతాము. వర్షపాతం, సూర్యరశ్మి, గాలి, తేమ, ఉష్ణం, శీతోష్ణస్థితి తీవ్రతలు వాతావరణాన్ని నిర్ణయించే కారకాలు .

వాతావరణ స్థితిలో గుర్తించదగిన మార్పులు హఠాత్తుగా సంభవిస్తాయి. ఎక్కువ కాలం తక్కువ స్ఫుటంగాను శీతోష్ణస్థితి మార్పులు ఉంటాయి. భూవాతావరణంలోని మార్పులను అన్ని జీవరాశులు సహజంగానే దాని కనుగుణంగా సవరించుకుంటాయి. అయినప్పటికి 150 - 200 సం||నుండి జరుగుతున్న వేగవంతమైన శీతోష్ణస్థితిలోని మార్పులకు అనుగుణంగా సవరించుకోవడం కొన్ని మొక్కల, జంతువుల జాతులకు కష్టసాధ్యమౌతుంది. మానవ కార్యకలాపాలే జరుగుతున్నమార్పుల వేగానికి జవాబు దారౌతుంది.

శీతోష్ణస్థితి మార్పుకి కారణాలు

శీతోష్ణస్థితిలోని మార్పులకు రెండు కారణాలు అవి

సహజ కారణాలు

అనేక సహజ కారకాలు శీతోష్ణస్థితిలో మార్పుకి కారణమౌతున్నాయి. ఖండచలనం, అగ్ని పర్వతాలు, సాగర వెల్లువలు, భూమి ఒక వైపు ఒరుగుదల వంటి ముఖ్య కారకాలు.

 • ఖండచలనం

లక్షల కొద్దీ సంవత్సరాల తరబడి భూద్రవ్యం క్రమ క్రమంగా చలించి పక్కకు చేరింది. భూ ద్రవ్యంలో గల జల భాగాల స్థితిని సాగర వెల్లువలను గాలులను ఈ చలనం మార్చుతుం ది. ఈ మార్పు శీతోష్ణస్థితిపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఖండ కదలికలు ఈనాటికి జరుగుతున్నాయి.

 • అగ్ని పర్వతాలు

అగ్ని పర్వతాలు బద్దలై పెద్ద పరిమాణంలో గల పొగలో సల్ఫర్‌ డయాక్సైడ్‌(SO2) నీటి ఆవిరి, దుమ్ము, బూడిద, వాతావరణంలోకి వదిలి వేయబడుతుంది. అగ్ని పర్వతాల చర్య కొద్ది రోజులు మాత్రమే ఉన్నప్పటికి దాని ద్వారా వెలువడిన ఎక్కువ పరిమాణంలో గల వాయువులు, బూడిద సంవత్సరాల తరబడి వాతావరణంపై ప్రభావం చూపిస్తాయి. సూర్యుని నుండి వచ్చే కిరణాలకు వాయువులు, దుమ్ము రేణువుల పాక్షిక అడ్డంకి వల్ల చల్లదనం కల్గుతుంది.

 • భూమి ఒరుగుదల

గ్రహాల సంచార కక్ష్య తలానికి లంబంగా 23.5 డిగ్రీల కోణంలో భూమి ఒరుగుతుంది. భూమి ఒరుగుదల వల్ల ఋతువులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. భూమి ఒరుగుదల ఎక్కువగా ఉంటే వేసవిలో వేడిమి, శీతకాలంలో చలి అధికం. తక్కువ ఒరుగుదల ఉంటే వేసవిలో చల్లగాను, శీతకాలంలో చలి తక్కువగాను ఉంటుంది.

 • సాగర వెల్లువలు

శీతోష్ణస్థితి పరిస్థితులకు సాగరాలు ప్రధానమైన అంశాలు. ఇవి భూమిని 71 శాతం వరకు ఆక్రమించాయి. వాతావరణం లేదా భూమి పైభాగం కన్నా సాగరాలు సూర్య వికిరణాన్ని రెండు రెట్లు ఎక్కువ శోషణం చేస్తాయి. సాగర వెల్లువల కదలికల ద్వారా గ్రహమంతటికి విస్తారమైన మొత్తంలో ఉష్ణం చేరుతుంది.

మానవ సంబంధిత కారణాలు
గ్రీన్‌ హౌస్‌ ఫలితం

భూమి సూర్యుని నుండి శక్తిని గ్రహించడం వల్ల భూ ఉపరితలం ఎక్కువ వేడిగా ఉంటుంది. వాతావరణంలో ఈ శక్తి ప్రవేశించి, కొంత శాతం (సుమారు 30) వెదజల్లబడుతుంది. కొంత భాగం వాతావరణం నుండి నేలకు సముద్రాల ఉపరితలానికి పరావర్తితమౌతుంది. కొన్ని వాయువులు వాతావరణంలో భూమి పై కప్పులాగా ఆవరించి కొంత శక్తిని శోషణం చేస్తాయి. కార్భన్‌డైఆక్సైడ్‌, మీథెన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి వాయువులు నీటి ఆవిరితో కలిసి ఒక శాతం కన్నా తక్కువగా వాతావరణంలో ఇమిడి ఉంటాయి. విటిని గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. అధికంగా గల వికిరణ శక్తిని గాజు ఎలా అయితే ఆటంకపరుస్తుందో ఈ వాయువులు క ప్పు (గ్యాస్‌ బ్లాంకెట్‌) గా ఏర్పడి భూమి నుండి వెలుపలికి వచ్చిన కొంత శక్తిని శోషణం చేసి ఉష్ణోగ్రత స్థాయిని సమతులం చేస్తాయి. అందుకే దీనిని గ్రీన్‌ హౌస్‌ ఫలితం ( గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌) అంటారు.

ఈ గ్రీన్‌హౌస్‌ ఫలితమును ప్రథమంగా జీన్‌ బాప్టిస్ట్‌ ఫరియర్‌ అనే ఒక ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు గుర్తించాడు. వాతావరణంలోను, గ్రీన్‌హౌస్‌ లోను సారూప్యతను స్పష్టీకరించాడు. భూమి ఏర్పడినప్పటి నుంచీ గ్రీన్‌హౌస్‌ వాయువుల కప్పు ఉండేది. మానవ సంబంధిత కార్యకలాపాలు ఎక్కువైన కొద్దీ వాటి ఫలితంగా గ్రీన్‌ హౌస్‌ వాయువులు వాతావరణంలో విడుదలయ్యాయి. దీని వల్ల వాయువుల దుప్పటి గట్టిపడి సహజ గ్రీన్‌ హౌస్‌ ఫ లితాన్ని భగ్నం చేసింది.

బొగ్గు, చమురు, సహజ వాయువుల వంటి ఇంధనాలను మండించినప్పుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలౌతుంది. అడవులను నాశనం చేసినప్పుడు చెట్లల్లో నిల్వ ఉండే బొగ్గు (కార్బన్‌) బొగ్గు పులుసు వాయువు ( కార్బన్‌ డైఆక్సైడ్‌ ) గా వాతావరణంలోకి చేరుతుంది. వ్యవసాయ కార్యకలాపాలు పెరగడం వల్ల

నేల వినియోగ విధానాలు మారడం ఇతర వనరుల ద్వారా మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ స్థాయిలో పెరుగుదల కన్పిస్తుంది. పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియల ద్వారా కృత్రిమమైన కొత్త గ్రీన్‌ హౌస్‌ వాయువులు సి .ఎఫ్‌.ఎస్ వంటి (క్లోరోప్లూరో కార్బన్‌) ఆటోమొబైల్‌ వెలిగ్రక్కే పొగలను బయటకు పంపించడం వల్ల ఓజోన్‌ ఏర్పడింది. సర్వసాధారణంగా దీనినే భౌగోళిక ఉష్ణోగ్రత లేదా శీతోష్ణ స్థితిమార్పులేదా గ్రీన్‌ హౌస్‌ ఫలితంగా చెప్పడం జరుగుతుంది.

Click here ఇక్కడ క్లిక్‌ చేసి గ్రీన్‌ హౌస్‌ ఫలితాన్ని మరియు శీతోష్ణస్థితి మార్పు దృశ్యాన్ని చూడవచ్చు.

గ్రీన్‌ హౌస్‌ వాయువులకు ఫలసిద్దికి మనం ఎలా తోడ్పడగలం?
 • బొగ్గు, పెట్రోలు మొదలగు శిలాజ ఇంధనాల వినియోగంపై,
 • ఎక్కువ భూభాగం కొరకు చెట్లను నరకడంపై,
 • శిధిలం కాని వ్యర్ధ పదార్థం - ప్లాస్టిక్‌ ఉత్పత్తిపై,
 • వ్యవసాయం లో విచక్షణారహితంగా ఎరువుల, క్రిమి సంహారక వినియోగంపై
మనపై శీతోష్ణ స్థితి మార్పు ప్రభావం ఎలా ఉంటుంది ?

మానవ జాతికి ఈమార్పు హెచ్చరిక చేస్తోంది. 19వ శతాబ్ది నుండి భూమి ఉష్ణోగ్రత 0.3 - 0.6 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ వరకు పెరిగింది. ఈ పెరుగుదల అతి స్వల్పంగా ఉన్నప్పటికి గొప్ప విపత్తు కల్గే ప్రాముఖ్యతలు క్రింద ఇవ్వబడ్డాయి.

వ్యవసాయం జనాభా పెరుగుదల ఫలితంగా ఆహారపు అవసరాలు పెరిగాయి. దీని ఫలితంగా ప్రకృతి వనరుల పై ఒత్తిడి పెరుగుతుంది. నేల గుణాత్మకత, తెగుళ్లు, వ్యాధులపై ఉష్ణోగ్రత వర్షపాతంలో సహజ స్థితిలో వచ్చే అప్రత్యక్ష మార్పుల వల్ల శీతోష్ణస్థితి మార్పు ప్రభావం వ్యవసాయ ఫలసాయంపై ప్రత్యక్షంగా పడ్తుంది . భారతదేశంలో వరి ఫలసాయం తగ్గుతుంది. స్థానిక వాతావరణంలో విపరీత పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత , అధిక వర్షపాతం, వరదలు, కరువులు మొదలగునవి పంట ఉత్పత్తులపై ప్రభావం చూపిస్తాయి.

వాతావరణం వేడిమితో ఉన్నప్పుడు శీతోష్ణస్థితి వల్ల వర్షపాతంలో హెచ్చు తగ్గులు జరుగుతాయి. దీని వల్ల కరువులు, వరదలు, హిమనదులు, ధృవమంచు పొరలు కరగడం. గత కొద్ది సంవత్సరాల నుండి తుఫానుల ప్రచండ తుఫానుల సంఖ్య పెరగడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు వస్తున్నాయి.

సముద్ర మట్టం పెరుగుదల శీతోష్ణస్థితి మార్పులో సముద్ర మట్టం పెరుగుదల ఒకటి. సాగరాలు వేడెక్కడం, హిమనదులు, ధృవమంచు పొర లు కరగడం వల్ల వచ్చే శతాబ్దికి అరమీటరు వరకు సముద్ర మట్టం పెరుగుతుంది. తీర ప్రాంతాలలో అసం ఖ్యాక భౌతిక మార్పులు జరుగుతాయి. విపరీత వరద ఉధృతం ముంచి వెయడం వల్ల, ఉప్పునీరు చొరబడడం, నేలకోరివేత వల్ల భూభాగం కోల్పోవడం జరుగుతుంది.

ఆరోగ్యం భౌగోళిక ఉష్ణోగ్రతతో ప్రత్యక్ష ప్రభావం కల్గి ఉండడం వల్ల ఉష్ణ సంబంధిత మరణాలు, నిర్జలీకరణం, అంటు వ్యాధుల వ్యాప్తి, పౌష్టికాహార లోపం మరియు ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బతింటాయి.

అరణ్యాలు, అటవీ జీవనం: సహజ వాతావరణంలో గల మొక్కలు, జంతువులు శీతోష్ణ స్థితి మార్పులకు సున్నితంగా ఉంటాయి. శీతోష్ణస్థితిలో మార్పు నిరంతరం పెరగడం వల్ల వివిధ రకాల మొక్కల, జంతువుల జాతులు లుప్తమవడం జరుగుతోంది.

ఉపద్రవాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
 • పునరావృతం కాని శక్తి వనరుల వినియోగాన్ని తగ్గించడం
 • పునరావృతమయ్యే సౌర మరియు గాలుల శక్తి మొదలగు వాటి వినియోగాన్ని పెంచడం
 • చెట్లను కాపాడడం చెట్లను ఎక్కువగా పెంచడం
 • ప్లాస్టిక్‌ వంటి శిధిలం కాని పదార్ధాలను విచక్షణారహితంగా వినియోగించడాన్ని మానుకోవడం

కోపెన్ హెగన్ సదస్సు

ఉష్ణోగ్రతల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి, ఉద్గారాలను తగ్గించడానికి, నిధులను సమీకరించడానికి రాజకీయ ఒప్పందం కుదరడంతో వాతావరణ మార్పుపై కోపెన్ హెగన్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సదస్సు ముగిసింది.

ఉద్గారాలను గణనీయంగా తగ్గించడానికి కట్టుబడటంద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలకు అడ్డుకట్టవేయడానికి మరియు అభివృద్ధిచెందుతున్న దేశాలలో వాతావరణ మార్పులను ఎదుర్కునేందుకు చర్యలు తీసుకోవడానికి నిధులను సమీకరించాలని ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాల మధ్య రాజకీయ ఒప్పందం కుదరడంతో కోపెన్ హెగన్ వాతావరణ సదస్సు ముగిసింది.

ఈ సదస్సులో అత్యధిక శాతం దేశాలు మద్దతు పలికిన “కోపెన్ హెగన్ ఒడంబడిక”కు ప్రపంచ దేశాల నేతలు అంగీకరించారు. వాతావరణ మార్పుల దుష్పరిణామాలను అడ్డుకోవాలంటే భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను రెండు డిగ్రీలు తగ్గించాలన్న శాస్త్రీయ వాదనను “కోపెన్ హెగన్ ఒడంబడిక” గుర్తించింది. 2010 జనవరి 31లోగా ఒడంబడికలో పొందుపరచబడే ఆర్ధికవ్యవస్థవారీ ఉద్గారాల పరిమితులను 2020నుంచి పారిశ్రామికదేశాలు ఉమ్మడిగాగానీ, విడిగాగానీ అమలుచేయడానికి కట్టుబడిఉండాలని ఒడంబడిక పేర్కొంది.

గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను నియంత్రించడానికి తాము తీసుకుంటున్న చర్యలను ప్రతి రెండేళ్ళకోసారి తెలపడానికి మరియు తమ స్వచ్ఛంద వాగ్దానాలను 2010 జనవరి 31లోగా ప్రకటించడానికి...దూసుకుపోతున్న ఆర్ధికవ్యవస్థలు కలిగిన దేశాలతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు అంగీకరించాయి.

ఓజోన్‌ మరియు వాతావరణం

ఓజోన్‌ అంటే ఏమిటి?

ఆమ్లజని (ఆక్సీజన్‌) మరో రూపమే ఓజోన్‌. ఇది విషవాయువు. ప్రతీ ఓజోన్‌ అణువులోను మూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్‌ అణువులు (O2) విడిపోతాయి.స్వేచ్చగా ఉన్న ఆక్సీజన్‌ పరమాణువు (O), తాడితంతో ఆక్సీజన్‌ అణువులోకి చేరి (O3) ఆక్సీజన్‌ పరమాణువులుగా మారి ఓజోన్‌ అణువవుతుంది.

ఓజోన్‌ లాభ నష్టాలు

వాతావరణపు గాలి పొరలో (భూ ఉపరితలానికి సుమారుగా 15 - 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది) ఓజోన్‌ సహజంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. వాహనాల కాలుష్యం నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల హైడ్రో కార్బన్‌ల స్థాయిలు పెరగడం వల్ల వాతావరణపు పైపొర భూఉపరితలానికి దగ్గర అయింది. సూర్యరశ్మిలో ఈ రసాయనాలు ఓజోన్‌గా మారతాయి. దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసవ్యాధిని పెంచడం శ్వాస కోశ వ్యాధులు మొదలగు సమస్యలను ఈ ఓజోన్‌ కల్గిస్తుంది. పంటలను కూడ నాశనం చేస్తుంది. వాతావరణపు గాలి పొరలో గల ఓజోన్‌ భూమిపై నున్న జీవరాశిని సూర్యుని నుండి వచ్చే అతినీలలో హిత కిరణాల నుండి రక్షిస్తుంది.

వాతావరణానికి దిగువున ఉన్న ఓజోన్‌ ఆరోగ్య సమస్యలను కల్గిస్తుంది.

ఓజోన్‌ తరిగిపోవడమంటే ఏమిటి?
క్లోరో ప్లూరో కార్బన్‌లు (CFCs) ఓజోన్‌ తరుగుదలకు ప్రాథమిక రసాయనాలు .రిఫ్రిజరేటర్లలో ఎయిర్‌ కండీషన్‌ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి.ఇవి క్లోరీన్‌ను కల్గి ఉంటాయి. రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్‌.సి ని విచ్చిన్నం చేసి క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.

మూడవ దశః ఈ క్లోరీన్‌ పరమాణువులు ఓజోన్‌ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్‌ తరిగి పోయేటట్లు చేస్తాయి.
ఓజోన్‌ తరిగి పోవడం వల్ల మన పై ప్రభావం ఎలా ఉంటుంది ?

ఓజోన్‌ పొర తరిగి పోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికం అవుతుంది. దీని వల్ల జన్యువులు, కళ్ళు దెబ్బ తినడంతో పాటు సముద్ర జీవరాశి పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

కో్యొటో ప్రోటోకాల్‌

( ప్రోటోకాల్‌ అనగా రాయబార సంబంధమైన ఒప్పందాలను నమోదు చేసి, సంతకం చేసే పత్రం అని అర్ధం )

ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌హౌస్‌ వాయు ప్రసరణలను తగ్గించే అంతార్జాతీయ చట్టబద్దమైన ఒప్పందంతో ఉన్నదే క్యోటో ప్రోటోకాల్‌ . 2005వ సంవత్సరం ఫిబ్రవరి 16న అమలులోకి వచ్చింది. గ్రీన్‌ హౌస్‌ వాయు(జిహెచ్‌జి) ప్రసరణలను తగ్గించడమనే బద్దితమైన లక్ష్యాలను పారిశ్రామిక దేశాల కొరకు ఏర్పరచింది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ (కర్బనద్వి ఆమ్లజని), మీథేన్‌, నై ట్రస్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ హెక్సా ఫ్లో రై డ్‌, హైడ్రో ఫ్లూరో కార్బన్‌ లు ఇంకనూ పెర్‌ ఫ్లూరో కార్బన్‌లు గ్రీన్‌ హౌస్‌ వాయువులలో చేరి ఉంటాయి. భారతదేశంతో కలుపుకొని 183 సంబంధిత దేశాలు 2008 వసంవత్సరం నాటికి ప్రోటోకాల్‌ లో స్థిరపరచబడాయి.

అభివృద్ధి చెందిన దేశాలలో 150 సంవత్సరాల కన్నా ఎక్కువగా పారిశ్రామిక కార్యకలాపాలు జరుగుతున్న ఫలితంగా వాతావరణంలో ప్రస్థుతము హెచ్చుస్థాయిలో గ్రీన్‌ హౌస్‌ వాయు ప్రసరణలవుతున్నాయి. దీనికి ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలు ప్రధాన బాధ్యత వహించాలని గుర్తించడం జరిగింది. ఈ ప్రోటోకాల్‌ క్రింద అభివృద్ధిచెందిన దేశాలకు గురుతరమైన బాధ్యతను, భిన్నమైన బాధ్యతలతో ఉమ్మడి అనే సూత్రంలో భాగంగా ఏర్పరచింది. ప్రోటోకాల్‌లో భాగంగా అభివృద్ధిచెందిన దేశాలు గ్రీన్‌హౌస్‌ వాయు ప్రసరణలను 1990వ సం| నాటికి సుమారుగా గల 5.2 శాతం స్థాయిల నుండి ఇంకా తక్కువ స్థాయికి తగ్గించడం చేయాలి.

కో్యటోయంత్రాంగం

ఈ యంత్రాంగం క్రింద జాతీయ ప్రామాణీకాల ద్వారా ఇందులో ఉండే దేశాలన్నీ ప్రాథమిక లక్ష్యాలను తప్పని సరిగా చేరుకోవాలి.
అయినప్పటికినీ, కో్యటో ప్రోటోకాల్‌ ఇంకనూ అదనంగా వాణిజ్య పరంగా గల మూడు యంత్రాంగాల ద్వారా లక్ష్యాలను చేరుకోవడానికి కల్పించింది. అవి ఏమిటంటే

 • ఉద్గారాల(ప్రసరణలు)వర్తకం- కార్బన్‌ వాణిజ్యం
 • పరిశుద్ధతాభివృద్ది యంత్రాంగం(సిడిఎమ్‌)
 • సంయుక్తాచరణు(జెఐ)
ఉద్గారాల(ప్రసరణలు)వర్తకం- కర్బన వాణిజ్యం

కో్యటో ప్రోటోకాల్‌ కింద కార్య సాధనకు చేసే ఒప్పందాన్ని అమలు పరుస్తామన్న హామీతో,ఆయా దేశాలు అంగీకరించిన లక్ష్యాలను వాయువుల ఉద్గారాలను పరిమితం చేయడం లేదా తగ్గించడం అనేది సాధించాలి.ఈ లక్ష్యాలు ఇంత స్థాయి వరకు ఉండవచ్చని ఆమోదించిన మేరకు లేదా అప్పగించబడిన మొత్తాలుగా వ్యక్తీకరింప బడినవి.ఆమోదింపబడిన ఉద్గారాలు అప్పగించబడిన మొత్తం విభాగాలుగా విభజింపబ డ్డాయి (ఎఎయుఎస్‌).
క్యోటో ప్రోటోకాల్‌ అనుమతించిన ఆయాదేశాల కు ఆమోదింపబడిన లక్ష్యాలకు మించి ఉద్గార విభాగాల నుండిఅదనంగా వచ్చిన(వినియోగింపబడ ని అనుమతినొందిన ఉద్గారాలు)అధిక సామర్ధ్యంగల వాయువులను అమ్మకం చేయవచ్చు.

ఉద్గారాల తగ్గింపులు లేదా తొలగింపుల విధానంలో ఒక కొత్త వర్తకపు సరుకును సృష్టించడమైనది.గ్రీన్‌ హౌస్‌ లో విడుదలయ్యే ప్రధానమైన వాయువు కార్బన్‌ డై ఆక్సైడ్‌. దీనినే కర్బన వర్తకం అంటారు.ఇప్పుడు ఇతర వర్తక సరుకు వలె కర్బనము అభివృద్ధిని తెలుసుకుని, వర్తకాన్ని చేయడం జరుగుతుంది.దీనినే కర్బన వాణిజ్యమని అంటారు.

కర్బన విపణిలో ఇతర వర్తక విభాగాలు

ఈ పథకం కింద ఇతర విభాగాలు బదిలీ చేయబడవచ్చు. ప్రతీ అంశము కూడ ఒక టన్ను కర్బన ద్వి ఆవ్లుజనితో సమానంగా ఉండే రూపంలో ఈ కింది విధంగా ఉండవచ్చు.

 • తొలగింపు విభాగం(ఆర్‌ ఎమ్‌ ఐ) భూ వినియోగం, భూ వినియోగంలో మార్పు, అటవీ పరిజ్ఞానంతో చేసే కార్యకలాపాలద్వారా అటవీ పునరుద్ధరణపై తొలగింపు విభాగం (ఆర్‌ ఎమ్‌ ఐ) ఆధారపడి ఉంది.
 • సంయుక్తాచరణ పథకం ద్వారా ఉద్గారాల తొలగింపు విభాగం(ఈ ఆం యు) ఏర్పడింది.
 • పరిశుద్ధతాభివృద్ధియంత్రాంగ పథక కార్యక్రమం నుండిధృవీకరించిన ఉద్గారాల తగ్గింపు విభాగం ఏర్పడింది.
పరిశుద్ధతాభివృద్ధియంత్రాంగం

ప్రోటోకాల్‌ లోని 12వప్రకరణం ప్రకారం పరిశుద్ధతాభివృద్ధియంత్రాంగం(సిడిఎమ్‌) నిర్వచింపబడింది. కో్యొటో ప్రోటోకాల్‌ క్రింద ఉద్గారాల తగ్గింపు లేదా ఉద్గార పరిమితి నిబద్ధత అందులోని దేశానికి అనుమతినిస్తుంది. ఇది ఉద్గార తగ్గింపు పథకాన్ని అభివృద్ధిచెందిన దేశాలలో అమలుపరుస్తోంది.ఇలాంటి పథకాలు ధృవీకరింపబడిన ఉద్గారాల తగ్గింపు(సిఇఆర్‌) అమ్మకపు గుర్తింపును సంపాదించవచ్చు. ఉద్గారించిన ప్రతీ వాయువుకూడ ఒకటన్ను కార్బన్‌ డై ఆక్సైడ్‌ నకు సమానంగా ఉంటూ కో్యటోలక్ష్యాన్ని చేరుకోవాలి.
ఉదాహరణకు, గ్రామీణ విద్యుద్ధీకరణ పథకంలో సౌర ఫలకాలను వినియోగించడంలో లేదా అధిక శక్తినిచ్చే సమర్ధవంతమైన బాయిలర్ల ప్రతిష్టాపనకు పరిశుద్ధతాభివృద్ధియంత్రాంగ కార్యకలాపం(సిడిఎమ్‌) చేరి ఉండాలి. నిలకడతో కూడిన అభివృద్ధిని, ఉద్గారాల తగ్గింపును ఈ యంత్రాంగం ప్రేరేపిస్తుంది.
పారిశ్రామిక దేశాలు ఎంతమేరకు తమ పరిశ్రమల నుం డివచ్చే ఉద్గారాలను తగ్గించుకోగలవో అంత మేరకు కొంత వెసులుబాటును కల్పించడం జరగాలి, లేదా వారి పరిమితలక్ష్యాలను చేరుకోవాలి.
ఇంతకు ముందు వెలువరించిన వాయువుల కన్నా తక్కువ లక్ష్యాలను పరిశుద్ధతాభివృద్ధి యంత్రాంగ(సిడిఎమ్‌)పథకం తప్పక నిర్ధారించాలి.
నాణ్యతపట్ల కఠినంగా ఉంటూ ప్రజామోదాన్ని పొందుతూ జారీ చేసే ప్రక్రియను అందించడం అనేది ఈ పథకాలు చేయాలి.
నియుక్తమైన జాతీయ ప్రామాణీకతామోదాన్ని ఇవ్వాలి. పరిశుద్ధతాభివృద్ధి యంత్రాంగ కార్యకలపాలలోప్రజానిధి ఫలితంగా అధికారాభివృద్ధికార్యకలాపాల తోడ్పాటుకు మళ్ళింపు ఉండకూడదు.

సంయుక్తాచరణ

కో్యటోప్రోటోకాల్‌లోని 6వ ప్రకరణం యొక్క నిర్వచనం ప్రకారం సంయుక్తాచరణ యంత్రాంగం పిలవబ డుతోంది. కో్యటో ప్రోటోకాల్‌ కింద ఉద్గారాల తగ్గింపులేదా ఉద్గార పరిమితి నిబద్ధత అందులోని దేశానికి అనుమతినిస్తుంది.ఇదిఉద్గారతగ్గింపు పథకాన్ని అభివృద్ధిచెందిన దేశాలలో అమలుపరుస్తోంది. ఇలాంటి పథకాలు , మరొక దేశపు ఉద్గారాల తగ్గింపు లేదా ఉద్గారాల తొలగింపు పథకం నుండి కో్యటో లక్ష్యమును చేరుకోవడానికి ప్రతి తొలగింపువాయువు కూడ ఒక టన్ను కార్బన్‌ డైఆక్సైడ్‌కు సమానంగా ఉండి ధృవీకరింపబడిన ఉద్గారాల తగ్గింపు విభాగాల(ఇఆర్‌ యు) అమ్మకపు గుర్తింపును సంపాదించవచ్చు.

పచ్చనిచెట్టూ ప్రత్యక్షదైవమే!

వృక్షాల విశిష్టతను మన పురాణాలు చాటాయి. వృక్షాల ప్రాముఖ్యం, పరిరక్షణ గురించి పిల్లలకు బోధించాలి. కానీ, అది మనం చెయ్యం.

రెండు సంఘటనలు ప్రస్తావిస్తాను. 2009లో చిలుకూరు బాలాజీ ఆలయంలో ధ్వజస్తంభాన్ని మార్చవలసి వచ్చింది. కావలసిన చెక్కను ఒక పొడవాటి చెట్టునుండి తీసుకుని, వేదమంత్రో చ్ఛారణల మధ్య ప్రతిష్ట చేస్తారు. అందుకు అనువైన చెట్టును నిర్ణయించడమే అన్నిటి కన్నా ముఖ్యం. అనుమతి కోసం అటవీ శాఖకు దరఖాస్తు చేసుకున్నప్పుడు వారు అంగీకరించి, అనువైన చెట్టు ఆదిలాబాద్‌లో ఉన్నదని చెప్పారు. ఆ చెట్టు పొడవు 100 అడుగులు. నరికిన తర్వాత దాని పొడవు 40 అడుగులు. ప్రతిష్ట తర్వాత పొడవు దాదాపు 31 అడుగులు.

ఆగమ శాస్త్రాల ప్రకారం ఏదైనా చెట్టు నరికితే, పరి హారంగా 1,000 మొక్కలను నాటాలి. ధ్వజస్తంభ ప్రతిష్టానంతరం దానికి ఇత్తడి కవచం వేసి అలంకారం చేశాక ప్రకృతికి నష్టపరిహారం ఎలా చేయాలా అని ఆలోచించాము. గుడికి వచ్చే భక్తులలో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేసే యువకుడికి అపూర్వమైన ఆలోచన కలిగింది. వారి బృందం ఆధ్వర్యంలో నడు స్తున్న ‘స్క్విరిల్స్’ పేరిట స్వచ్ఛందంగా ప్రతి వారాంతంలో 108 మొక్కలను చిలుకూ రులో అందరికీ పంచారు.

వారాంతంలో గుడి ఆవరణ పచ్చటి మొక్కలతో కళకళలాడేది. వేప, మామిడి, జామ వంటి మొక్కలను ప్రతి శనివారం ఉదయం పొద్దుట 10.30కు యువకులు భక్తులకు పంచేవారు. భక్తులు ప్రసాదంలా ఇళ్లకు తీసుకెళ్లి నాటుకునేవారు. చిన్నారులు చిట్టి చేతులతో మొక్కలు పట్టుకుని ప్రదక్షిణలు చేస్తుంటే కనువిందుగా అనిపించేది, ఆ మొక్కలే దేవునికి ప్రదక్షిణ చేస్తున్నట్టు. ఎందరెందరో భక్తులకు ఈ ఆలోచన నచ్చి, తమ పిల్లల పుట్టిన రోజుకు వచ్చినవారికి ఇలా మొక్కలను బహు మతిగా ఇస్తున్నామని చెప్పారు. ఎంత బాగుంది!

ఒకరోజు ఓ మధ్యవయస్కుడు వచ్చి నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నాడు. వ్యాపారం నష్టాల్లో ఉందట. అప్పులు తీర్చాలని బ్యాంకులు నోటీసులు జారీచేశాయట. వాస్తు శాస్త్ర నిపుణుని వద్దకు వెళ్తే ఆయన ఇంటికొచ్చి చూసి, ముందున్న రావిచెట్టు వల్లనే సమస్యలొస్తున్నాయని చెప్పా రట. రహదారిలో ఠీవిగా నిల్చున్న ఈ రావి వృక్షం వల్ల ఎండ పడక ఇల్లు చీకటిగా మారిందని చెప్పారట. చెట్టు కొట్టివేస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారట.

చెట్టు ఎవరికీ అపకారం చేయదు. దాన్ని పోషిస్తే పుణ్యం. కొట్టేస్తే మహాపాపం. రావి వృక్షం శ్రీమహా విష్ణువుకు మారు రూపం. ఆయన నివాసస్థలం. ‘వృక్షా ణాః అశ్వద్ధోస్మి’ అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమా త్ముడు’’ అన్నాను. దాన్ని పూజించు... నీ సమస్యలన్నీ మటుమాయమవుతాయని హితవు చెప్పాను. అటు తర్వాత ఆయన సమస్యలన్నీ తీరాయి. వ్యాపారం నెమ్మ దిగా పుంజుకుంది.
అపుత్రస్య చ పుత్రత్వం పాదపా ఏవ కుర్యతే
తీర్థేషు పిండదానాదీన్ రోపకాణాం దదన్తితే
మొక్కలు నాటితే సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అన్ని తీర్థాలలో పిండదానం చేసిన ఫలం వృక్షాల ద్వారా దక్కుతుంది అని దీని భావం. (పద్మ పురాణం)

వృక్షాలను పెంచిపోషిస్తే పర్యావరణానికి... తద్వారా ప్రపంచానికంతకూ మేలు జరగడమే కాదు. అలాచేసిన వారికి పుణ్యలోకాలు కూడా ప్రాప్తిస్తాయి.
- సౌందరరాజన్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు

ఆధారము: సాక్షి

నీరు - ఆవశ్యకత

సాధారణంగా నీరు త్రాగడం మన శరీరానికి ఎంతో మంచిదని నిపుణులు చెపుతున్నారు. అదే నిపుణులు అతిగా నీరు త్రాగడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయని చెపుతున్నారు. మన శరీర బరువులో సుమారు 60 శాతం నీరు ఉంటుంది. హృదయ, ఊపిరి మరియు జీర్ణ వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే మన శరీరానికి తగినంత నీరు అవసరం. ఈ నీరు రక్త కణాలకు పౌష్టికాలను సరఫరా చేస్తుంది. అంతే కాకుండా మెంబ్రేన్లు ఎండిపోకుండా తడిగా ఉండేలా చేస్తుంది. విష మరియు వ్యర్ధ పదార్ధాలను మాత్రం స్వేదం ద్వారా బయటకు విసర్జిమ్పజేస్తుంది. మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ అంతర్గతంగా మనిషికి నీరు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ నీరు త్రాగకపోతే మన శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు విషంగా పరిణమించి మరణం సంభవించే అవకాశం కూడ ఉంది. మన మూత్ర పిండాలు యూరిక్ యాసిడ్ ను, యూరియా ను తొలగించినప్పుడు అవి నీటిలో కరిగి మూత్రం రూపంలో బయటకు వెలువడుతుంది. కాని తగినంత నీరు లేకపోతే వ్యర్ధాలు గడ్డ కట్టుకొని పోయి మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా జీర్ణ క్రియలో రసాయనిక ప్రతిస్పందనలకు నీరు ఎంతో ప్రధానమైనది. ఈ నీరు మన శరీర ఉష్ణోగ్రతలను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుతుంది. కీళ్ళు పొడిబారిపోయి కీళ్ళనొప్పులు రాకుండా నీరు చేస్తుంది.

తీసుకోవాల్సిన నీటి మోతాదు :

చాలా మందికి ఎంత నీటిని తీసుకోవాలో అవగాహన లేదు. చాలా మంది కావాల్సినంత నీటిని తాగరు. రోజుకి ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం మంచిది. ఒకవేళ ఎక్సర్సైజులు, జాగింగ్ మరియు ఎరోబిక్స్ చేస్తున్నట్లయితే వారు మరో నాలుగు గ్లాసుల నీటిని అదనంగా త్రాగాలి. ముఖ్యంగా గర్భిని స్త్రీలు, పాలు ఇచ్చే మహిళలు ఎక్కువ నీటిని తీసుకోవాలి. జ్వరం, విరోచనాలు, మూత్రనాలంలో రాళ్ళు ఉన్నవారు సాధ్యమైన మేరకు ఎక్కువగా నీటిని త్రాగాలి.

నీరు తగినంత తీసుకుంటున్నారో లేదో తెలుసుకొనే పరీక్ష :

నీరు తగినంత మోతాదులో తీసుకుంటున్నారో లేదో తెలుసుకొనుటకు ఒక సారి ఎవరి మూత్రాన్ని వారు పరిశీలించుకోవాలి. అది యాపిల్ రసంగా ఉంటే దానిలో సాంద్రత ఎక్కువ ఉన్నట్లు అనగా శరీరంలో నీటి పరిమాణం తక్కువగా ఉందన్నమాట. మూత్రం తెల్లగా, వాసన లేకుండా, పలుచగా ఉంటే శరీరంలో తగినంత మోతాదులో ద్రవ పదార్ధాలు ఉన్నాయని చెప్పవచ్చు. వాంతులు, వికారం, వాపులు మరియు తల తిరగడం వంటివి ఉంటే శరీరంలో తగినంత నీరు లేదని చెప్పవచ్చు.

నీటి గురించి ఇతర విషయాలు :

నీటి గురించి ఇతర విషయాలు ఈ క్రింది పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి.

పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అపార్డ్

పర్యావ'రణం'లో నెగ్గేదెలా?

ప్రపంచ మానవాళి ఎంతో ఆతృతతో ఎదురుచూసిన పర్యావరణ సదస్సు నిరాశపరచింది. పర్యావరణ మార్పు బారినుంచి భూగోళాన్ని, ప్రజలను రక్షించే ప్రణాళికలు, ఆలోచనలతో అర్థవంతమైన చర్చలు జరుగుతాయనుకున్న ఐక్యరాజ్య సమితి పర్యావరణ మార్పు సదస్సులో పెద్దగా ప్రయోజనకరమైన నిర్ణయాలేమీ తీసుకోలేదు. భూతాపం వల్ల భూగోళం ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగింది. ఫలితంగా ఎదురవుతున్న పర్యావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి, ఆహార, నీటి కొరతలు భవిష్యత్తులో తగ్గాలంటే- ఉష్ణోగ్రతను రెండు డిగ్రీల కంటే ఎక్కువగా పెరగకుండా చూడాలి. అందుకు కొన్ని దేశాలు పారదర్శక లక్ష్యాలు, బాధ్యతతో వ్యవహరించాలి. ముఖ్యంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను అధికంగా విడుదల చేస్తున్న పారిశ్రామిక దేశాలు, ఆ వాయువుల విడుదల స్థాయిని నియంత్రించుకోవాలి. తమ ప్రమేయం లేకుండానే విష ఫలితాలు చవిచూస్తున్న వర్థమాన దేశాలకు పారిశ్రామిక దేశాలు 'గ్రీన్‌ ఫండ్‌' నిధులు భారీగా ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా 'ఒకే పద్ధతిలో' కర్బన ఉద్గారాలను లెక్కించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. ఇవన్నీ తూ.చ. తప్పకుండా అమలుపరచుకుంటేనే పర్యావరణ మార్పుల ప్రభావం నుంచి మానవాళి బయటపడుతుంది.

వూరట కొంతే...

అన్ని దేశాల్లో పర్యావరణ మార్పుల నేపథ్యంలో, ప్రతి సంవత్సరం నిర్వహించే 'పర్యావరణ మార్పు సదస్సు' ఈసారి ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇక్కడ చర్చించి అవగాహనకొచ్చిన అంశాలు, ఒప్పందాలే 2015లో ప్యారిస్‌లో జరగబోయే సదస్సుకు ప్రాతిపదిక అవుతాయి. పెరూ రాజధాని లిమాలో రెండు వారాలపాటు జరిగిన ఈ సదస్సులో అన్ని దేశాలూ కర్బన ఉద్గారాల విడుదలకు సమాన బాధ్యత తీసుకోవాలని నిర్ణయించాయి. 2015 మార్చి నాటికి తమ దేశాల ఉద్గారాలకు సంబంధించి వాస్తవాలను, అంచనాలను అందజేయాలని కోరాయి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రజల మౌలిక, సామాజిక అవసరాలు తీర్చటానికి పారిశ్రామికీకరణను వెంటనే తగ్గించుకోలేవు. దానివల్ల అభివృద్ధి కుంటువడుతుందని వర్ధమాన దేశాల ఆందోళన. పెరుగుతున్న సముద్ర మట్టాలతో ఉనికే ప్రమాదంగా మారిన ద్వీప దేశాలను కాపాడేందుకు పారిశ్రామిక దేశాలు ఏం చేస్తాయన్న ప్రస్తావనే లేదు. 2020నాటికి పర్యావరణ మార్పులకు తట్టుకునే విధంగా 'బీద దేశాలను' సమాయత్తం చేసేందుకు లక్ష కోట్ల డాలర్లతో నిధి ఏర్పాటుచేయడం మాత్రం ఎంతో కొంత వూరట కలిగించేదే. అంగీకరించిన లక్ష్యాలను చేరుకునేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటుచేసే ప్రయత్నం మాత్రం జరగలేదు. అమెరికా, ఐరోపా ఖండాలు ప్రధాన కాలుష్యకారకాలు. కాబట్టి అవే ఉద్గారాలను అధికంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక, సాంకేతిక సహాయం అందుతున్నప్పటికీ, వర్ధమాన దేశాల మీద అంతటి భారం మోపడానికి వీల్లేదు.

బొగ్గుపులుసు వాయువు విడుదల చైనాలో చాలా ఎక్కువ. పారిశ్రామికంగా కూడా మనకంటే చైనాదే ముందడుగు. ఇప్పుడు కుదిరిన ఒప్పందాల ప్రకారం భారత్‌ వెంటనే పారిశ్రామిక అవసరాలను పణంగా పెట్టి రాజీపడటం మంచిది కాదు. హరిత గృహనిర్మాణాలు చేపట్టడం ద్వారా కర్బన వాయువులను భారత్‌లో తగ్గించవచ్చు. అనుత్పాదకంగా ఉన్న కర్బన శిలీంద్ర ఇంధనాలతో నడుస్తున్న ప్రస్తుత 'ప్రజారవాణా వ్యవస్థ'ను సంస్కరించి రైల్వే వ్యవస్థను మరింత పటిష్ఠపరచాలి. అత్యంత పారదర్శక సౌరవిద్యుత్‌ ఉత్పత్తి వైపు ఇప్పటికే మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2022నాటికి వంద గిగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో చౌకగా దొరుకుతున్న శిలాజ ఇంధనాల ఆధిపత్యాన్ని అంత త్వరగా తగ్గించుకోలేం. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రాల పరిధిలోని బొగ్గు ఆధారిత ఇంధనాలను రెండింతలు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు వేస్తోంది. అధునాతన పద్ధతులు ఉపయోగించి తక్కువ కర్బన ఉద్గారాలనిచ్చే శిలాజ ఇంధన వనరులను అన్వేషించాలి. అణు, జల విద్యుచ్ఛక్తిని 2030నాటికి ప్రస్తుత అవసరాల్లో మూడోవంతుకు పెంచుకున్నా, ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పొడవైన తీరప్రాంతం, అత్యధిక జనాభాతో ఉన్న భారత్‌ పర్యావరణ మార్పుల పరిణామాలను ఎక్కువగానే ఎదుర్కోవాల్సి రావచ్చు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఇప్పటికే తాండవం చేస్తున్నాయి. దేశంలోని గాలిలో కాలుష్యం చైనా కంటే ఎక్కువని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.

అయిదో పర్యావరణ మార్పు అంచనా నివేదిక ప్రకారం... దేశ సాగు భూమిలో 70శాతం నీటిఎద్దడికి గురికానుంది. 12శాతం నేలలు వరదలకు; ఎనిమిది శాతం మృత్తిక నీటి ముంపు బారిన పడనుంది. మొత్తంగా సాగుభూమి అందుబాటు తగ్గి, భారత వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పడిపోనున్నాయి. ఈ దిశలో ప్రభుత్వం ఇప్పటినుంచే పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ సంబంధ కర్బన ఉద్గారాల్లో 40శాతం పైగా పశుసంపద వల్లే కాబట్టి, ఆధునిక పద్ధతుల్లో వాటి యాజమాన్యం చేపట్టాలి. వ్యవసాయానికి ప్రాణాధారమైన సాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత అసమర్థ సాగునీటి వాడక పద్ధతులకు స్వస్తి చెప్పి బిందు, తుంపర సేద్యం విధానాలను ప్రోత్సహించాలి. భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటినిల్వ చేపట్టాలి. అప్పుడే విద్యుత్‌ వాడకం తగ్గుతుంది. మీథేన్‌ వంటి హరిత గృహవాయువులను తగ్గించుకోవచ్చు. భూమిని చదును చేయటం, మల్చింగ్‌, పంటల వైవిధ్యీకరణ వంటి పద్ధతులతో నీరు, ఎరువుల వాడకం తగ్గుతుంది. పంట వ్యర్థాలను కాల్చే బదులు- మల్చింగ్‌కు వాడితే వాయుకాలుష్యాన్ని తగ్గించవచ్చు. నీటితో కలిపి ఎరువుల వాడకం, శ్రీ వరి సాగు పద్ధతులు సహా తక్కువ నీటితో పండే పంటలకు ప్రభుత్వం నూతన విధానాల ద్వారా ప్రోత్సహిస్తే వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. పర్యావరణ మార్పులను అరికట్టవచ్చు.

హరిత వాయువులను తగ్గించే విషయమై వచ్చే సంవత్సరం ప్యారిస్‌లో కుదరాల్సి ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలపై అమెరికా ఇప్పటికే భారత్‌ను దువ్వే ప్రయత్నం చేస్తోంది. సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వాడకం పెంచే ప్రణాళికలపై భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌ పర్యటన సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోదీ సెప్టెంబరులో అమెరికాలో పర్యటించినప్పుడు- శుద్ధ ఇంధనంపై ఇరుదేశాలు ఒక అవగాహనకొచ్చాయి. పర్యావరణ మార్పులతో దేశంలో అభివృద్ధి కుంటువడకూడదన్నది మన వాదన. పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను నివేదించాలని కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాలను కోరింది.

కలిసికట్టుగా ముందుకు

రెండు ప్రధాన లక్ష్యాలతో లిమా సదస్సు ప్రారంభమైంది. మొదటిది- 2015లో కుదరనున్న ప్యారిస్‌ ఒప్పందానికి ఒక రూపం తేవడం. అన్ని దేశాల అభిప్రాయాలు చేర్చి 37 పుటల ఒప్పంద పత్రాన్ని తయారుచేశారు. 196 దేశాలు అభిప్రాయాలు వెలువరించాయి. ఆయా దేశాల అభిప్రాయాలను నిక్షిప్తం చేశారే తప్ప- చర్చించే ప్రయత్నాలు జరగలేదు. దాదాపు అన్నిదేశాలు ఇదే పంథాను అనుసరించాయి. ఈవిధంగా సదస్సు మొదటి లక్ష్యం నీరుగారింది. రెండో లక్ష్యం- 2015నాటికి ఆయా దేశాలు తమ జాతీయ ఉద్గారాల లక్ష్యాలను నియమాలకు అనుగుణంగా మార్చుకోవటం. ఈ లక్ష్యాన్ని చేరటంలోనూ దాదాపు అన్ని దేశాలు బాధ్యత నుంచి తప్పుకొన్నాయి. వర్ధమాన దేశాలు పర్యావరణ మార్పులకు అనుగుణంగా సంసిద్ధం కావటం, ఉద్గారాల తగ్గింపు, అభివృద్ధి చెందిన దేశాలు బీద దేశాలకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందించటం ముఖ్యమైనవి. కానీ, పారిశ్రామిక దేశాలు పర్యావరణ మార్పులను తగ్గించే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఈ విషయంలో ఇకముందైనా యావత్‌ ప్రపంచం కలిసికట్టుగా ముందుకు కదిలితేనే భవిష్యత్తుకు భద్రత, భరోసా!.

ఆధారము: ఈనాడు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate