పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

విధానాలు

విభాగం వాతావరణంలో సంబంధించిన వివిధ విధానాల వివరిస్తుంది.

నీటి నాణ్యతా ప్రమాణాలు

వాడుతున్న నీరు

నీటి తరగతి

ప్రమాణం

సూక్ష్మజీవులు తొలగించబడిన, శుద్ధిచేయబడని తాగునీటి వనరులు

 • ప్రతి 100మి.లీ.కు మొత్తం సూక్ష్మజీవుల పరిమాణం 50 ఎంపీఎన్, లేదా అంతకంటే తక్కువ ఉండాలి
 • పీహెచ్ విలువ 6.5 మరియు 8.5మధ్య ఉండాలి
 • కరిగిన ఆక్సిజన్ 6మి.గ్రా/1 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
 • జీవరసాయన ఆమ్లజని అవసరం ఐదురోజులకు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ 2మి.గ్రా/1 లేదా అంతకంటే తక్కువ

బహిరంగ స్నానం(వ్యవస్థీకృతం)

బి

 • ప్రతి 100మి.లీ.కు మొత్తం సూక్ష్మజీవుల పరిమాణం500 ఎంపీఎన్ లేదాఅంతకంటే  తక్కువ ఉండాలి
 • పీహెచ్ 6.5 మరియు 8.5మధ్య ఉండాలి
 • కరిగిన ఆమ్లజని 5మి.గ్రా./1 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
 • జీవరసాయన ఆమ్లజని అవసరం ఐదురోజులు 20డిగ్రీల సెంటీగ్రేడ్ 3మి.గ్రా/1 లేదా అంతకంటే తక్కువ ఉండాలి

శుద్ధిచేయబడిన, సూక్ష్మజీవులు తొలగించబడిన తాగు  నీటివనరులు

సి

 • ప్రతి 100మి.లీ.కు మొత్తం సూక్ష్మజీవుల పరిమాణం 5000 లేదా అంతకంటే తక్కువ
 • పీహెచ్ ఆరు నుంచి తొమ్మిది మధ్య ఉండాలి
 • కరిగిన ఆమ్లజని 4మి.గ్రా./1లేదా ఎక్కువ ఉండాలి
 • జీవరసాయన ఆమ్లజని అవసరం ఐదురోజులు 20డిగ్రీల సెంటీగ్రేడ్ 3మి.గ్రా./1 లేదా అంతకంటే తక్కువ

మత్స్యసంపద, పశుగణాభివృద్ధి

డి

 • పీహెచ్ 6.5నుంచి8.5
 • కరిగిన ఆమ్లజని 4మి.గ్రా./1లేదా అంతకంటే ఎక్కువ
 • స్వేచ్ఛా నత్రజని(ఎన్) 1.2 మి.గ్రా./1 లేదా అంతకంటే తక్కువ

వ్యవసాయం, పరిశ్రమలలో శీతలీకరణ, వ్యర్ధపదార్ధాల నిర్మూలన

 • పీహెచ్ 6.0నుంచి 8.5
 • 25డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద విద్యుత్ వాహకత గరిష్ఠంగా 2250 మైక్రో ఓమ్స్/సెం.మీ
 • సోడియం శోషణ నిష్పత్తి గరిష్ఠంగా 26 ఉండాలి
 • బోరాన్ గరిష్ఠంగా 2మి.గ్రా/1 ఉండాలి

 

ఇ కంటే దిగువ

ఎ, బి, సి, డి, ఇ ప్రమాణాలను దేనినీ అందుకోలేనిది

వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ పథకం

వాతావరణ మార్పు జాతీయ కార్యాచరణ పధకం, లాంఛనంగా జూన్ 30, 2008 న ప్రారంభింపబడింది NAPCC, అభివృద్ధి లక్ష్యాలు కలిగి ఉండడమే కాకుండ. వాతావరణ మార్పుల గురించి సమర్థవంతంగా పనిచేసి ఫలితాలను రాబడుతుంది. జాతీయ కార్యాచరణ ప్రణాళికలో ఎనిమిది అతి ముఖ్యమైన “జాతీయ సంఘాలు” ఉన్నాయి. ఆ సంఘాలు వాతావరణ మార్పుల అవగాహన పై దృష్టి సారించి, వాటి అనుకూలతతీవ్రత, క్షీణత, శక్తి సామర్థ్యం మరియు ప్రకృతి వనరుల పరిరక్షణ గురించి అధ్యయనం చేస్తాయి.

ఆ ఎనిమిది సంఘాలు :

 • జాతీయ సౌరశక్తి సంఘం
 • శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచే సంఘం
 • ఆసరాగా ఉండే నివాసస్థలాలపై జాతీయ సంఘం
 • జాతీయ జల సంఘం
 • హిమాలయ పర్యావరణ పరిరక్షణకై జాతీయ సంఘం
 • హరిత భారతదేశం కొరకు జాతీయ సంఘం
 • వ్యవసాయ బలోపేతం కొరకు జాతీయ సంఘం
 • వాతావరణ మార్పులపై వ్యుహాత్మకమైన అవగాహన కొరకు జాతీయ సంఘం

జాతీయ సౌరశక్తి సంఘం

NAPCC, లో జాతీయ సౌరశక్తి సంఘంకు చాల ప్రాముఖ్యత యివ్వబడింది. దేశం మొత్తం శక్తి అవసరాలలో సౌరశక్తి యొక్క భాగం అధికం చేయడం. అంతేకాక ఇతర శక్తి పునరుత్పాదక వనరులను కూడ పొందే అవకాశాలను విస్తరించడం. ఈ సంఘం అంతర్జాతీయ సహకారంతో “పరిశోధన మరియు అభివృద్ధి”  కార్యక్రమం మొదలు పెట్టి తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా ఉండే సౌకర్యవంతమైన సౌరశక్తి వ్యవస్థను నెలకొల్పడానికి కృషి చేస్తుంది. NAPCC, సౌరశక్తి సంఘానికి, పట్టణ ప్రాంతాలలో, తక్కువ ఉష్ణోగ్రత (<150o c) వాణిజ్య సంస్థలకూ సౌరశక్తి విడుదల 80% వరకూ లక్ష్యంగానూ, మరియూ సాధారణ ఉష్ణోగ్రత (150oc to 250 oc) అభ్యర్థనల కు 60% విస్తరణ లక్ష్యంగానూ నిర్దేశించింది. ఇది సాధించడానికి గల కాల పరిమితిని 11వ మరియు 12వ పంచవర్ష ప్రణాళికల సమయం అంటే 2017 వరకూ గడువు యిచ్చింది. అదనంగా, గ్రామీణ అభ్యర్థనలను, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశీలించి, పని చేయాలని నిర్దేశించింది.

NAPCC, 2017 నాటిక్ సమగ్రమైన సౌకర్యాలతో, 1000 మెగావాట్లు/సంవత్సరానికి ఫోటోవోల్టాయిక ఉత్పత్తి, లక్ష్యంగానూ 1000 మెగావాట్లు (MW) సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం కలదిగానూ కావడానికి నిర్దేశించుకుంది.

శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచే సంఘం

భారత దేశ ప్రభుత్వం, శక్తి సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టింది. వాటికి అదనంగా, NAPCC, యొక్క లక్ష్యాలు

 • శక్తి వినియోగం కు పరిమితులు విధించడం ద్వారా , అధిక మొత్తంలో శక్తిని ఉపయోగించే పరిశ్రమల వినియోగం తగ్గించి, తద్వారా ఆదా అయిన శక్తినిల్వలను ఒక వ్యవస్థ ద్వారా క్రమపరచి, మార్కెట్ పద్ధతుల ద్వారా ఈ నిల్వలతో వ్యాపారం చెయ్యడం.
 • సాధ్యమైన విభాగాలలో, సామర్థ్యం కలిగిన వస్తువులు/ఉత్పత్తులను నూతన విధానంలో ఉపయోగించడం.
 • ఆర్థిక అవసరాల నిర్వహణా కార్యక్రమాలలో సహకరించే వ్యవస్థలను ఏర్పరచి, భవిష్యత్తు శక్తి వినియోగంలో ఆదా చేసేటట్లు, ప్రభుత్వ - ప్రైవేటు భాగ స్వామ్యాన్ని ఏర్పరచడం.
 • అనుమతి పొందిన సమర్థవంతమైన శక్తి పరికరాలపై పన్ను రాయితీలు, నైపుణ్య ఆధారిత వివిధ రకాల  పన్ను విధించడం , శక్తి సామర్థ్యం పెంచే దిశగా ద్రవ్య నిర్ణయాలు తీసుకోవడం.

ఆసరాగా ఉండే నివాస స్థలాలపై జాతీయ సంఘం

మూడు అంచెల విధానంలో, ఈ సంఘం నివాస స్థలాలు మరింత మన్నికగా ఉండేటట్లు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

 • గృహావసరాల భవనాలు, వాణజ్య సముదాయాలలో శక్తి సామర్థ్యం అభివృద్ధి చేయడం.
 • పురపాలక సంఘం  వారు సేకరించే వ్యర్థాల నిర్వహణ
 • ప్రభుత్వ రవాణా సౌకర్యం పట్టణాలలో అభివృద్ధి చేయడం.

జాతీయ జల సంఘం

నీటిని ఆదా చేయడం తక్కువగా వృధా అయ్యేటట్లు చూడడం, నీటి వనరుల నిర్వహణ క్రమబద్ధీకరించి, సరిసమానంగా పంపిణీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం. జాతీయ జల సంఘం యొక్క లక్ష్యాలు. జలసంఘం ఒక వ్యవ్యస్థను ఏర్పరుచుకుని, నీటి ఉపయోగ సామర్థ్యం 20% పెరిగేందుకు దోహదం చేస్తుంది. వర్షపాతంలో, వచ్చేతేడాలు, నదీప్రవాహాల్లోని మార్పులు వంటి వంటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి కొన్ని ప్రణాళికలు వేసుకుంటుంది. భూమి ఉపరితలం మీద, క్రిందా నీటి నిల్వలను పెంచడం, వర్షాధారిత వ్యవసాయం చేయడం, మరియు అధిక సామర్థ్యం కలిగిన సేద్య ప్రక్రియలైన తుంపర సేద్యం, బిందు సేద్యం వంటివి వచ్చును .

హిమాలయ పర్యావరణ పరిరక్షణ జాతీయ సంఘం

ఈ సంఘంలోని పధకం, స్థానిక సంఘాలు, ముఖ్యంగా పంచాయితీలను సాధికారం చేయడం ద్వారా పర్యావరణ వనరులను నిర్వాహించడంలో వాటికవే ముఖ్యపాత్రను యిస్తుంది. జాతీయ పర్యావరణ ప్రణాళిక 2006, లోని విషయాలను ఈ పధకం గట్టిగా సమర్థిస్తుంది.

 • పర్వత పర్యావరణంకు సంబంధించి నిరంతర అభివృద్ధిలో భాగంగా సక్రమమైన పద్ధతులలో భూమివినియోగం ప్రణాళిక, మరియు నీటి పారుదల నిర్వహణా పద్ధతులను చేపడుతుంది.
 • పర్వత ప్రాంతాలలో నిర్మిత మయ్యే కట్టడాలు, మున్నగు వాటిని, ఉత్తమమైన పద్ధతులలో, సున్నితమైన పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా, నిర్మించడం అందమైన ప్రకృతి ధ్వంసం కాకుండ చూడడం.
 • సంప్రదాయ రకాలైన పంటలను పండిచడం తోటలను పెంచడం వలన సహజమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించి, ఆ విధంగా చేసిన రైతులకు ధరలో లాభం కల్పించడం
 • విహార యాత్రలు నిరంతరం జరిగేటట్లు ప్రోత్సహించి వివిధ సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో స్థానిక సమాజంలో జీవనోపాధి మెరగయ్యేటట్లు పర్యాటక శాఖను అభివృద్ధి చేయడం.
 • పర్వత ప్రాంతాలలో, పర్యాటక రద్దీని క్రమబద్ధీకరించి, పర్వత పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా వ్యవహరించడం.
 • ప్యూహత్మకమైన కొన్ని పథకాల ద్వారా, కొన్ని “ప్రత్యేకమైన పర్వత సానువులలో”, “అనుపమానమైన విలువల”తో సంరక్షించడం.

హరిత భారత దేశం కొరకు జాతీయ సంఘం

ఈ సంఘం పర్యవరణ సేవలను, కార్బన్ సింక్స్ వంటి వాటి ద్వారా అధికం చేస్తుంది. ప్రధాన మంత్రి ‘హరిత భారతదేశం’  నినాదం మరియు ప్రచారం మీద ఆధారపడి 6 మిలియన్ హెక్టార్లు,  లలో అరణ్యాలను పెంచడం అనే లక్ష్యంను పెట్టుకుంది. మరియు, జాతీయ గమ్యంగా అరణ్యభూమి 23% నుండి 33% కుపెంచింది . అడవులు నశించివ భూమిలో, ఈ పనిని, రాష్ట్ర ప్రభుత్వ అటవీ విభాగం ఏర్పరిచిన ఉమ్మడి అరణ్య నిర్వహణా సంస్థలు నిర్వహిస్తాయి. ఈ సంస్థలు ఉమ్మడి సంఘాల ప్రత్యక్ష కార్యా చరణను ప్రోత్సహిస్తాయి.

భద్రమైన వ్యవసాయం కొరకు జాతీయ సంఘం

వాతావరణ మార్పులకు లోబడకుండా, భారతదేశపు వ్యవసాయ రంగం, క్రొత్తరకాల వంగడాలను, ముఖ్యంగా ఉష్ణాన్ని తట్టుకునేవి కనిపెట్టడం, పంటలు పండించే విధానంలో ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంబించడం లక్ష్యంగా ఈ సంఘం ఏర్పరుచుకుంది ఇది, సంప్రదాయ విజ్ఞానం, మరియు ఆచరణ యోగ్యమైన పద్ధతులు, సమాచారా సాంకేతిక విజ్ఞానం మరియు జీవ సాంకేతిక విజ్ఞానం లను సంఘటితం చేయడం ద్వారా సాధ్యపడుతుంది. ఇవేకాక, క్రొత్త రకపు రుణాలు, భీమ పథకాల ద్వారా కూడ వ్యవసాయం బలంగా ఎదుగుతుంది.

వాతావరణ మార్పులపై వ్యూహాత్మమైన అవగాహన కొరకు జాతీయ సంఘం

ఈ సంఘం, ప్రపంచ సంఘాలతో “అధ్యయనం మరియు సాంకేతిక విజ్ఞానం” అభివృద్ధికి సంబంధించి వివిధ రకాల ప్రణాళికలతో, కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తుంది. అదనంగా, వాతావరణ మార్పులపై అధ్యయనంచేసే అంకితభావమున్న సంస్థలు విశ్వవిద్యాలయాలకు, “వాతావరణ అధ్యయన నిధులు”  నుండి ధన సహాయం అందించి తనదైన అధ్యయన ప్రణాళికను ఏర్పరుచుకుంటుంది. ఈ సంఘం ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో నూతన సాంకేతిక ఆవిష్కరణలను, వాతావరణ మార్పులకు అనుకూలమైనవి, మార్పులు తగ్గించేవి, కనుగొనేటట్లు ప్రోత్సహిస్తుంది.

ఈ సంఘాల కార్యాచరణ

ఈ ఎనిమిది సంఘాలు ఆయా మంత్రిత్వశాఖ ఆధీనంలో ఏర్పడ్డాయి. ఇవి, తమ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోనే కాకుండ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రణాళికా సంఘం, పరిశ్రమలలోని నిపుణులు, విధ్యావేత్తలు మరియు పౌర సంఘంతో కలిసి పని చేస్తాయి.

మహాసౌర శక్తికి అంకురార్పణం

‘నవ్య మరియు పునరుత్పాదక శక్తి యొక్క మంత్రిత్వ శాఖ, దేశం యొక్క 11వ పంచవర్ష ప్రణాళిక సమయం లో, 14,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక శక్తి ఆధారిత, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలను నిర్మించడం లక్ష్యంగా నిర్దేశించింది.

ప్రభుత్వం కూడ, జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌరశక్తి సంఘం అధ్వర్యంలో సౌరశక్తి సాంకేతిక జ్ఞానం అభివృద్ధి చేసి, సంప్రదాయ కేంద్ర ఆధారిత విద్యుత్తుతో పోటీ పడే విధంగా సౌరవిద్యుత్తును తీర్చిదిద్దడానికి ఆమోదించింది. ఈ సంఘం, 20,000 మెగావాట్ల కేంద్రితమైన సౌరశక్తి విద్యుత్తు, మరియు 2000 మెగావాట్ల వికేంద్రీకృత సౌరశక్తి విద్యుత్తుతో సహా సౌరశక్తితో నడిచే 20 మిలియన్ దీపాలు, తమ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అదనంగా, 2022 సంవత్సరానికి, 20 మిలియన్ల చదరపు మీటర్ల సౌరఉష్ణగ్రాహక ప్రదేశాన్ని నిర్మించే దిశ గా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ పనిని మూడు దశలుగా అమలు చేస్తుంది. విద్యుత్ కేంద్రానికి అనుసంధానించిన సౌరశక్తి పరిశ్రమలకు 1,100 మెగావాట్లు, వికేంద్రీయమైన సౌరశక్తి పథకాలకు 200  మెగా వాట్ల సామర్ధ్యం, ఈ సంఘం యొక్క మొదటి దశ ప్రయత్నంగా, 2012 – 13 వరకూ ప్రభుత్వం అంగీకరించింది.

వీటితో పాటు, ఈ సంఘం, ఖర్చుని తగ్గించడానికి, సామర్థ్యం పెంచడానికి మరియు సౌరశక్తి వ్యవస్థల యొక్క పూర్తి నిర్వహణా సామర్థ్యం పెంచడానికి అధ్యయనం మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు మరి కొన్ని క్రొత్త పదార్థాల అభివృద్ధి, క్రొత్త పరికరాల ఆవిష్కరణలకు, చేయవలసిన విధివిధానాలకు తోడ్పుతుంది.

నవ్య మరియు పునరుత్పాదక శక్తి యొక్క మంత్రి, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాచే ఈ రోజు రాజ్యసభలో లిఖిత పూర్వకమైన జవాబుగా ఈ సమాచారం ఇవ్వబడింది.

జాతీయ పర్యావరణ కార్యాచరణ విధానం - 2006

 • జాతీయ పర్యావరణ కార్యాచరణ విధానం ఇప్పటికీ ఉన్న విధానాల మీద ఆధారపడి నిర్మింపబడింది. (ఉదాహరణకు జాతీయ అరణ్య కార్యాచరణ విధానం 1988; జాతీయ పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధికి కార్యాచరణ పద్ధతి వివరణ 1992; జాతీయ వ్యవమాయ విధానం 2000; కాలుష్య నివారణ కార్యాచరణ పద్ధతి 1992 జాతీయ జనాభా గురించి పథకాలు, 2000; జాతీయ జల పథకం 2002 మొదలైనవి.
 • ఈ విధానం, కార్యాచరణకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది, క్రమబద్ధీకరించడంలో సంస్కరణలు ఉపయోగించడానికి పర్యావరణ పరిరక్షణ కొరకు పథకాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి కేంద్ర, రాష్ర, మరియు స్థానిక ప్రభూత్వాలు ఏర్పరచే చట్టాలు నిర్మించడానికి మరియు సమీక్షీంచడానికి ఉపయోగపడుతుంది.
 • ఈ పథకం యొక్క ప్రధాన విషయం, ఏమిటంటే, ప్రజరందరి సంక్షేమం మరియు జీవనోపాధి ప్రకృతి వనరుల నుండి లభించినప్పటికీ,వారు మరింత మేలైన జీవనోపాధికి, పర్యావరణం పరిరక్షించుకుని ప్రకృతి వనరులను భద్రంగా కాపాడుకోవాలి అంతేకాని పర్యావరణ నాశనానికి కారకులు కాకుడదు. అని తెలియచెబుతుంది.
 • ఈ విధానం, వివిధ రకాలైన వ్యక్తుల భాగస్వామ్యం (స్టేక్ హోల్డర్స్ - stake – holders) పర్యావరణ పరిరక్షణలో ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వ సంస్థలు, స్ధానిక  సంఘాలు, విద్యా మరియు శాస్త్ర పరిశోధనా సంస్థలు, పెట్టుబడి సంస్థలు, మరియు అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వాములు, వారి వారి వనరులు, శక్తులనూ బట్టి పర్యావరణ నిర్వాహణను ఉత్తేజ పరుస్తారు.

పర్యావరణ స్థితి పై నివేదిక

భారత దేశ పర్యావరణ స్థితిపై నివేదిక యొక్క ముఖ్య ఉద్ధేశ్యం, భారతదేశ పర్యావరణ చిత్రం పూర్తి స్థాయిలో వివరించడం. ఇది, తార్కికమైన సమగ్ర సమాచారంతో నిర్ణయం తీసుకోవడంలో మూలాధారంగా ఉపకరిస్తుంది. పర్యావరణ స్థితిపై నివేదిక, ఈ ప్రణాళికకు కావలసిన మార్గ నీర్దేశిక సూత్రాలు మరియు వ్యూహాలు ఏర్పరచి, వాటి సహాయంతో రాబోయే దశాబ్దాలకు సరిపడా వనరులను సమీకరించడం, లక్ష్యంగా కలిగి ఉంది. పర్యావరణం యొక్క స్థితి గతులు విశ్లేషణ ఆధారంగా ఇదంతా జరుగుతుంది. జాతీయ పర్యావరణ కార్యాచరణ ప్రణాళికకు ఈ నివేదిక దారి చూపుతుంది.

భారత దేశ పర్యావరణ స్థితిపై నివేదిక, పర్యావరణం యొక్క (గాలి, నీరు, భూమి, జీవ వైవిధ్యం) స్థితిగతులు మరియు ఐదు ముఖ్యమైన అంశాలపై, అవివాతావరణ మార్పులు, ఆహారం భద్రత, నీటి భద్రత, శక్తి భద్రత మరియు పట్టణీకరణము నిర్వహించడం

ఆమూలాగ్ర పర్యవేక్షణ చేస్తుంది : ప్రస్తుత పర్యావరణ స్థితి, ప్రకృతి వనరులు, పర్యావరణంలో వచ్చే మార్పులు , వెనుక ఉండేఒత్తిడులు, ఈ మార్పుల వలన కలిగే పరిణామాలకు సంబంధించిన వివిధ ముఖ్యాంశాలపై ఈ నివేదిక ఒక లోతైన అవగాహన కలిగిస్తుంది. అంతేకాకుం పర్యవరణం శిధిలమవకుండా కాపాడి పర్యవేక్షించడానికి ప్రస్తుతం తీసుకునే చర్యలు ముందు ముందు చేయబోయే పథక రచనలను సమీక్షించి తగిన సూచనలను కూడ నివేదిక చేస్తుంది.

పర్యావరణ స్థతిపై నివేదిక 2009 లోని ముఖ్యాంశాలు

 • భారత దేశంలోని 45 శాతం భూమి, క్రమంగా తరిగిపోవడం, క్షార నేలలు, ఆమ్ల, క్షార మరియు రసాయనలవణాలు కలిగి ఉండడం, నీరు నిలువ ఉండిపోవడం, గాలి వలన హరించు పోవడం వంటి వాటి వలన శిధిలమై పోతోంది. భూమి శిధిలమైపోవడానికి గల ముఖ్య కారణాలు, అడవుల నరికివేత, రక్షణాత్మకం కాని వ్యవసాయం, గనుల త్రవ్వకం, మరియు భూమిలోపలి నీరును విపరీతంగా తోడి వెయ్యడం అయినప్పటికీ, శిధిలమైపోతున్న 147 మిలియన్ల హెక్టార్లలో, 2/3 వంతు మించి భూమిని తిరిగి సులభంగా పునరుజ్జీవితం చేయవచ్చు. భారతదేశ అరణ్యభూమి కూడ క్రమంగా అధికమవుతున్నది (ప్రస్తుతం 21% వరకు).
 • వాయు కాలుష్యం, భారతదేశంలోని అన్ని నగరాలలోనూ విస్తరిస్తోంది. భారతదేశంలోని ఏభైనగరాలంతటా ధూళికణాలతో నిండిన పదార్థం (చిన్న అణువులుగా గల దుమ్ము, ధూళి. ఊపిరితిత్తులలోనికి వెడతాయి) శ్వాస తీసుకునేందుకు యిబ్బంది పడేటంత అధికం అవుతుంది . వాహనాలు మరియు పరిశ్రమలు, ఈ పట్టణ వాయు కాలుష్యాలనికి మూల కారణాలు.
 • భారతదేశం  తాను వాడుకోగలిగిన నీటిలో 75 శాతం వాడుకుంటోంది. జాగ్రత్తగా ఉంటేనే భవిష్యత్తులో, ‘నీరు’ సరిపోవచ్చను. గృహావసరాల నీటి వినియోగంపై సరైన ధర నిర్ణయించక పోవడం, పారిశుధ్యలేమి , క్రమబద్ధీకరణ లైని విధంగపరిశ్రమలు  భూమి లోపలి నీరును తోడి వెయ్యడం, పరిశ్రమలు, కర్మాగారాలు విడుదల చేసిన , హానికర, విషపూరిత జలాలు, అసమర్ధమైన నీటి పారుదల వ్యవస్థ, మరియు రసాయన ఎరువులు, క్రిమసంహారక మందుల అధిక వాడకం , నేటి ఈ దేశ నీటి దుస్థితికి గల కారణాలు.
 • భారత దేశం, ప్రపంచంలోని 17 ‘అత్యంత జీవవైవిధ్యం’ కల దేశాల్లో ఒకటి [అనేక వృక్ష, జంతు జాతుల కు  ఆలవాలమైనందున ] అయినప్పటికీ తన అరణ్య సంపదయైన వృక్ష, జంతు జాతులలో 10 శాతం నశించి పోయే దశలో ఉంది. అరణ్యాలను ధ్వంసం చెయ్యడం, వేట, దండెత్తే జాతులు, అటవీ సంపదను అతిగా దోచుకోవడం, కాలుష్యం మరియు వాతావరణ మార్పులు, దీనికి గల ముఖ్య కారణాలు.
 • భారత దేశంలోని 1/3 వ వంతు పట్టణ జనాభా మురికి వాడలలో నివసిస్తున్నారు.
 • వాతావరణ మార్పులకు కారణమయ్యే ‘గ్రీన్ హౌస్ గ్యాస్’ (green house gas) విడుదలలో ప్రపంచంలో భారతదేశం 5 శాతం మాత్రమే అందజేస్తోంది. కాని, ‘గ్లోబల్వార్మింగ్‌ ’ (భూమి వేడెక్కడం) యొక్క దుష్ఫలితాలను 700 మిలియన్ల భారతీయులు, ప్రత్యక్షంగా, ఈ రోజు ఎదుర్కొనబోతున్నారు. ఈ ‘గ్లోబల్ వార్మింగ్’ వలన కరువు, వరదలు, తుపానులు తరుచుగా, తీవ్రంగా వస్తాయి. వ్యవసాయంపై కూడ దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇప్పటిక సముద్ర  నీటి మట్టం పెరుగుతోంది.

ప్రపంచ పర్యావరణ దినం - 2011

1972 నుండి ప్రతి సంవత్సరం జాన్ 5వ తేదీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రామ్ (సంయుక్త రాష్ట్రాల పర్యావరణ కార్యక్రమం – యునెప్) చే ప్రపంచ పర్యావరణ దినం (డబ్ల్యు.ఇ.డి) గా నిర్వహించ బడుతోంది. ప్రతికూలమైన పర్యావరణ సంబంధిత చర్యకై యు.ఎన్. యొక్క అతి పెద్ద ప్రపంచ ఉత్సవంగా, వేడుకగా ఇది నిర్వహింప బడుతోంది.

అడవులు ఒకింట మూడొంతుల భూభాగాన్ని ఆక్రిమించి ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా అతి ముఖ్యమైన విధులను విర్వహిస్తూ మరియు సెవలనందిస్తూ, అనేక సాధ్యతలతో భూమిని సజీవంగా ఉంచుతాయి. వాస్తవానికి 1.6 బిలియన్ ప్రజలు వారి జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడి ఉన్నారు. వాతావరణంలోకి ప్రాణవాయువును విడుదల చేస్తూ, బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డేయాక్సైడ్) ను నిలువ చేస్తూ వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటంలో ఇవి కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ వెలకట్టలేని జీవావరణ, ఆర్ధిక, సాంఘిక మరియు ఆరోగ్య సంబంధిత లాభాలున్నప్పటికీ, మనం బతకడానికి అవసరమైన అడవులనే మనం నాశనం చేసుకుంటున్నాము.

డబ్ల్యు.ఇ.డి. ఈ సంవత్సరం, యు.ఎన్. యొక్క అంతర్జాతీయ అడవుల సంవత్సరాన్ని, "అడవులు: ప్రకృతి మీ సేవలో" అన్న ఇతివృత్తంతో బలపరుస్తోంది. ఈ ఇతివృత్తం జీవన నాణ్యతకు మరియు అడవుల ఆరోగ్యం మరియు అడవుల జీవావరణ వ్యవస్ధకు మధ్య ఉన్న స్వతసిధ్దమైన బంధాన్ని ప్రస్ఫుటంగా వెల్లడిస్తోంది.

ఇండియా, ప్రపంచంలోనే అతి వేగంగా అభివృధ్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధగా, హరిత ఆర్ధిక వ్యవస్ధ (గ్రీన్ ఎకానమీ) కు సంబంధించిన మార్పుతో కూడిన ప్రక్రియను స్వీకరిస్తున్నటువంటిదై, జూన్ 5వ తేదీ నాడు జరుగబోయే ప్రపంచ పర్యావరణ దినం 2011 (డబ్ల్యు.ఇ.డ్) కు మొట్ట మొదటి ప్రపంచ అతిధేయ దేశంగా వ్యవహరించనుంది.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.02950819672
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు