మీ యొక్క వ్యక్తిగత కంప్యూటర్లు/ల్యాప్ టాప్ ల నుండి వెలువడుతూ వుండె ప్రకాశవంతమైన, అధిక వేడికల్గిన రేడియేషన్ మీకెంత హానికరమైనదోనని తెలుసుకొని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా?
మీ యొక్క వ్యక్తిగత కంప్యూటర్లు అధిక వేడిమి కల్గిన ఎలక్ట్రోమేగ్నటిక్ వెలుతురును వెలువరిస్తున్నట్టు పరిశోధనలు తెలిపాయి. కంప్యూటర్ యొక్క ప్రింటర్ , మోడెమ్ మరియు వై-ఫై (wi-fi) పరికరాలు విడుదల చేసే ఈ అధిక వేడిమి వలన నిద్రకు సంబంధించిన అనారోగ్యాల నుండి శరీర తత్వానికి సరిపడని ప్రతికూలచర్యలు మరియు గుండె సంబంధిత వ్యాధుల వరకు దారితీయవచ్చు. ఉదాహరణకు ఒక పాత సి ఆర్ టి 30 సెంటి మీటర్ల కంప్యూటర్ మానిటర్ తనముందునుండి రమారమి 3 మిల్లిగాస్ ల మరియు పక్కలనుండి 4 మిల్లిగాస్ ల ప్రకాశవంతమైన అధిక వేడిమిని విడుదల చేస్తుంది.
వ్యక్తిగత కంప్యూటర్ల నుండి వెలువడే హానికరమైన ప్రకాశవంతమైన అధిక వేడిమి నివారణకు కొన్ని చిట్కాలు.
సెల్ ఫోన్ ద్వారా మన మాటలు ఇతరులకు వినిపించాలన్నా, మన సందేశాలు ఇతరులకు చేరాలన్నా, ఆ సెల్ ఫోను రేడియో ధార్మిక శక్తిని (రేడియేషన్ ను) విడుదలచేయవలసి వుంటుంది. ఈ రేడియేషన్ వల్ల తలెత్తే ఆరోగ్యసమస్యలను గురించి నిర్ధారణ కానప్పటికి, తరచుగా సెల్‌ఫోన్‌ను వినియోగించేవారికి మెదడులోను, నోటిలోను కణుతులు ఏర్పడే అవకాశం , పిల్లలలో నడవడికకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువవుతుందని కొన్ని పరిశోధనలు (అన్నీ కావు) సూచిస్తున్నాయి. ప్రమాదానికి లోనుకాకుండా సురక్షితంగా వుండడంకోసం ఈ కింద పేర్కొంటున్న కొన్ని చిట్కాలను పాటించండి.
1. తక్కువ రేడియేషన్ ప్రభావం ఉండే ఫోన్లనే కొనండి
కొనుగోలుదారులకు మార్గదర్శకాలను సూచించే ఇ.డబ్ల్యు.జీ. అనే చిరుపుస్తకంలో మీరు ఆశించే ఫోన్ కోసం చూడండి. (మీరు ఉపయోగించే బ్యాటరీ క్రిందిభాగంలో మీ ఫోన్ నమూనా (మోడల్) నెంబరు ముద్రించి ఉండవచ్చు). వీలైనంత, అతి తక్కువ రేడియేషన్ విడుదల చేస్తూ, మీ అవసరాలను తీర్చ గలిగే దానితో మీ ఫోన్ ను మార్చుకోవడాన్ని పరిశీలించండి.
2. హెడ్ సెట్ ను లేదా స్పీకర్ ను ఉపయోగించండి
ఫోన్ల కంటే హెడ్ సెట్ లు అతి తక్కువ రేడియేషన్ ను విడుదల చేస్తాయి. సెల్ ఫోన్ హెడ్ సెట్ కు సంబంధించిన మార్గదర్శకాలను గమనించి, వైర్ తో ఉండే, లేదా వైర్లెస్ రకం హెడ్ సెట్ ను ఎంచుకోండి (ఎటువంటి రకం క్షేమకర మైనది అన్న విషయంపై నిపుణులు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు). కొన్ని వైర్ లెస్ హెడ్ సెట్ లు తక్కువ స్ధాయి రేడియేషన్ ను తెంపులేకుండా విడుదల చేస్తూనే ఉంటాయి అందుచేత, మీరు ఫోన్ మాట్లాడనపుడు హెడ్సెట్ ను చెవిదగ్గరనుంచి తీసివేయండి. స్పీకర్‌ను ఉపయోగించి ఫోన్ మాట్లాడడంకూడా మీ తల రేడియేషన్ కు గురికావడాన్ని తగ్గిస్తుంది.
3. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి
మీరు మాట్లాడేటప్పుడు, సందేశాలను పంపేటప్పుడు కూడా మీ ఫోన్ రేడియేషన్ ను విడుదల చేస్తూ ఉంటుంది కానీ , మీరు సందేశాలను అందుకునేటప్పుడు మాత్రం కాదు. అందుచేత ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం అన్నది మీరు రేడియేషన్ కు గురికావడాన్ని తగ్గిస్తుంది.
4. ఫోన్ ను మీ శరీరానికి దూరంగా వుంచండి
మీరు మాట్లాడేటప్పుడు (హెడ్ సెట్ తో గాని లేక స్పీకర్ తో గాని) ఫోన్ ను మీ శరీరానికి, అంటే ఛాతిభాగానికి, మొండేనికి దూరంగా వుంచండి , చెవివద్ద వుంచుకోవద్దు జేబులో పెట్టుకున్నా, లేదా బెల్టుకు తగిలించుకున్నా , మీ శరీరంలోని మృదువైన కణాలు రేడియేషన్‌ను తమలో ఇముడ్చుకోగలుగుతాయి.
5. మాట్లాడటం కంటే, సందేశాలను పంపడాన్నే ఎంచుకోండి
మౌఖికంగా కంటే, లిఖితపూర్వకంగా సందేశాలను పంపడానికి ఫోన్లు తక్కువ శక్తిని వినియోగిస్తాయి (అంటే తక్కువ రేడియేషన్). మీ చెవిదగ్గర ఫోన్ ను పెట్టుకుని మాట్లాడటం కన్నా లిఖిత పూర్వకమైన సందేశాలను పంపడం మీ తలను రేడియేషన్ కు దూరంగా ఉంచుతుంది.
6. సంకేతాలు (సిగ్నల్సు) బలహీనంగా ఉన్నాయా? అయితే ఫోన్ ను దూరంగా పెట్టేయండి
మీ ఫోన్ మీద తక్కువ గీతలతో సంకేతాలు కనిపిస్తున్నట్లయితే, సంకేతాలనందుకునే స్ధంబానికి (సిగ్నల్ టవర్) మీ సంకేతాన్ని చేరవేయడానికి అది ఎక్కువ స్ధాయిలో రేడియేషన్ విడుదల చేయడం జరుగుతోందన్న మాట. మీ ఫోన్లో సంకేతాలు బలంగా వున్నప్పుడే ఫోన్ చేయండి, లేదా అందుకోండి.
7. పిల్లల ఫోన్ వాడకాన్ని పరిమితం చేయండి
పెద్దలకంటె , చిన్న పిల్లల మెదళ్ళు రెండింతలు రేడియేషన్‌కు గురవుతాయి. అత్యవసరమైన పరిస్థితిలో తప్ప పిల్లల ఫోన్ వినియోగాన్ని పరిమితంచేయాలని కనీసం 6 దేశాలలోని నిపుణులు చేసిన సిఫార్సులతో ఇ.డబ్ల్యు.జీ ఏకీభవిస్తున్నది.
8. ‘రేడియేషన్ కవచాన్ని (షీల్డ్)‘ తీసివేయండి
యాంటెనా క్యాప్స్ , కీ ప్యాడ్ కవర్స్ వంటివి సెల్ ఫోన్ అనుసంధానత (కనెక్టివిటి) నాణ్యతను తగ్గించివేస్తాయి. అందువల్ల అలాంటి ఫోన్లు మరింత శక్తితో , మరింత రేడియేషన్‌తో పనిచేయవలసి వస్తుంది.
పర్యావరణ వ్యర్ధాలు ( E – waste), 2012 సంవత్సరానికి, 8,00000 టన్నులు అధికమయ్యేటట్లు భావన. 2005వ సంవత్సరంలో, 1,46,800 టన్నులు ఇ వ్యర్ధాలు దేశంలో ఉత్పత్తి అయ్యాయి. ఇది 2012 సంవత్సరం నాటికి, 8,00000 దాకా అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రీయ కాలుష్య నివారణ సంస్ధ ( central pollution board – cpcb) చేసిన ఒక సర్వే ప్రకారం పది పెద్ద నగరాలు పర్యావరణ వ్యర్ధాలను తయారు చేయడంలో ముందున్నాయి. అవి వరుసగా ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా, చెన్నై, అహమ్మదాబాద్, హైదరాబాద్, పూణె, సూరత్ మరియు నాగపూర్.
2010-11కేంద్ర బడ్జెట్ లో స్వచ్ఛమైన పర్యావరణం
కార్లు మరియు వాతావరణ మార్పులు
కారు నడుస్తున్నప్పుడల్లా గాలిలోకి కార్బన్ డయాక్సైడ్ (లేదా) సీఓ2 విడుదలవుతుంది. కారు నడిపే ప్రతి ఒక్కరూ, పెట్రోల్ లేదా డీజెల్ వాడకంవలన ఆ కారు వెనుకగొట్టం నుంచి ఏడాదికి 7,700 కిలోల సీఓ2ను గాలిలోకి వదులుతున్నారు. ప్రతి ఒక్క కారు విడుదల చేసే ఈ సీఓ2 పరిమాణాన్ని పీల్చుకోవడానికి మనకు సగటున మంచి పరిమాణంలో ఉండే చెట్లు ఒక వంద అవసరమవుతాయి.అవసరమైనంతవరకే వాహనాలను వినియోగించండి...చెట్లను విరివిగా నాటండి.
కాలుష్య నియంత్రణలో 123వ ర్యాంకులో భారత్
2010 వాతావరణ పనితీరు సూచిక(ఈపీఐ) గణాంకాల ప్రకారం కాలుష్య నియంత్రణలో భారత్ 123వ ర్యాంకులో ఉంది. ఇది పెరుగుతున్న ఆర్ధికాభివృద్ధి, వాతావరణంపై చూపుతున్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ సూచిక ప్రకారం కాలుష్య నియంత్రణను, సహజ వనరుల సద్వినియోగంలో, సవాళ్ళను ఎదుర్కోవడంలో ప్రపంచంలోకెల్లా ఐస్ ల్యాండ్ ప్రధమస్థానంలో ఉంది. స్విట్జర్లాండ్, కోస్టారికా, స్వీడన్ మరియు నార్వే దాని తర్వాత స్థానాలలో ఉన్నాయి.
యాలే విశ్వవిద్యాలయం మరియు కొలంబియా విశ్వవిద్యాలయంలలోని కొంతమంది పర్యావరణ నిపుణుల బృందంతో ఈపీఐ రూపొందించబడినది. పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యత, నీటి వనరుల సంరక్షణ, జీవవైవిధ్యం, ఆవాసాలు, అటవీ సంరక్షణ, మత్స్య సంరక్షణ, వ్యవసాయం వాతావరణ మార్పులు వంటి పది విభాగాలలో 163 దేశాల పనితీరుపై అధ్యయనంచేసి ఈ సూచిక ర్యాంకులు ఇస్తుంది.
ప్లాస్టిక్ సంచులకు బదులు ఏమి వాడడం అని చూస్తున్నారా ? బట్టతో కుట్టిన వాటిని ఎంచుకోండి. మీరు కొనవచ్చు, లేక మీరే ఒకటి స్వంతంగా తయారు చేసుకొనవచ్చు. ఒక బట్ట సంచిని కుట్టడానికి ప్రయత్నించండి. దానికి కావలసిన వస్తువులను సరి చూసుకోండి.
ఇప్పుడు సంచీని లోపల నుండి బయటకు తిప్పి, మడత తెలిసే లాగ ఇస్త్రీ చెయ్యాలి.నూలు సంచిని వాడడం గమ్మత్తుగా ఉంటుంది. కదా? ఇది ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన పర్యావరణం కోసం వేసే మేలైన ముందడుగు.
ఆధారము: http://www.gobartimes.org/20100815/
నీటిని సమృధ్దిగా తాగండి. సీసాలో వుండే నీటిని తాగడం మానివేయండి, ఇవి వ్యర్ధాలను మరింత పెంచి, సహజ వనరులు తగ్గిపోతూ వుండడానికి కారణవుతాయి.
కేఫైన్ అనే ఇంద్రియాలకు ఉల్లాసాన్ని కలిగించే ఆల్కలాయిడ్ ద్రవ్యంతో కూడి వుండే నీటిని తాగకండి. సహజసిధ్దమైన చల్లటి మజ్జిగ వంటిదానినే తాగండి.
లేత రంగులో ఉండే దుస్తులనే ధరించండి – కాటన్ దుస్తులైతే, మరీ మంచిది, అభిలషణీయం కూడా.
ఎండవేడికి శుష్కించిపోకుండా, నోరు తడారిపోకుండా ఉండడానికి, ఎక్కువగా ద్రవపదార్ధాలనే తీసుకోండి. సహజసిధ్దమైన కొన్ని ద్రవాలుః నిమ్మ రసం, లేత కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు మొ.వి.లేత కొబ్బరి నీటిలో విటమిన్లు మరియు ఖనిజాలతో పాటుm పంచదార, పీచు మరియు మాంసకృత్తులు ఉంటాయి.
ఎక్కువగా సలాడ్లను (పళ్ళు, కూరగాయ ముక్కలు) మరియు తాజాగా ఉండే పళ్లను – వీటిలో సహజంగానే నీరు ఉంటుంది, అంటే పుచ్చకాయ వంటివి. వాస్తవంగా ఈ పుచ్చపండులో ఇంచుమించు 92 శాతం నీరే ఉంటుంది, అలాగే 14 శాతం వరకూ విటమిన్ సి కూడా ఉంటుంది.విపరీతమైన చెమట వల్ల పోగొట్టుకున్న తేమను ఇది తిరిగి ఇస్తుంది. ఈ పండులో కొద్ది ప్రమాణంలో విటమిన్ బి మరియు పొటాషియమ్ కూడా ఉంటాయి.
మట్టికుండలో నిలువచేసిన నీళ్లనే తాగండి.
నూనెతో వుండే పదార్ధాలను తినకండి, ముఖ్యంగా అమ్ముతూ వుండే వారి వద్దనుండి కట్ చేసిన ముక్కలను తినకండి. బహుశా ఇవి ఈగలు మరియు దుమ్ము, ధూళి బారినపడి ఉండవచ్చు.
చేతిలో పెట్టుకునే చిన్న విసినకర్ర వంటిదాన్ని వాడండి. విద్యుత్ సరఫరా లేనప్పుడు కూడా ఇది పనిచేస్తుంది.
తెరిచి ఉంచిన కిటికీకు వట్టివేళ్లతో తయారుచేసిన ఒక తడిగా వుండే చాప ముక్క లాంటిదాన్ని వేళాడగట్టండి. ఇది ఇంట్లో చల్లటి గాలి ప్రసరించడానికి సహకరిస్తుంది.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు