హోమ్ / శక్తి వనరులు / విధివిధాన మద్దతు / ఆంధ్ర ప్రదేశ్ విండ్ పవర్ పాలసీ -2015 సంక్ష్మిప్తముగా
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆంధ్ర ప్రదేశ్ విండ్ పవర్ పాలసీ -2015 సంక్ష్మిప్తముగా

ఆంధ్ర ప్రదేశ్ విండ్ పవర్ పాలసీ -2015 సంక్ష్మిప్తముగా

ఆంధ్ర ప్రదేశ్ , ఎనర్జీ , ఇంఫ్రాష్ట్రక్చర్ & ఇంవెస్ట్మెంట్  (పి ఆర్ II) డిపార్ట్మెంట్  వారిచే  జి. ఓ. ఎమె ఎస్ . నం.9  తారీకు 13-02-2015 న  విడుదల  చేయబడిన ఆంధ్ర ప్రదేశ్ విండ్ పవర్ పాలసీ -2015 సంక్ష్మిప్తముగా  ఈ క్రింది విధము గా వున్నది.

ఆదేశము

ఆంధ్ర ప్రదేశ్ లో  పవన విద్యుత్ (విండ్ పవర్)  ప్రాజెక్ట్ లను అభివ్రుధ్ధి  పరచుటకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జి. ఓ. ఎమె ఎస్ . నం.48, ఎన ర్జీ (రెస్) డిపాట్ తారీకు 11-04-2008 మరియు జి. ఓ. ఎమె ఎస్ . నం.99 , ఎన ర్జీ (రెస్) డిపాట్ తారీకు 09-08-2008 ద్వారా ఆదేశములు జారీ చేయబడినవి.  .  ఈప్రకారము చేయబడిన పాలసీ 5 సంవత్సరముల వరకుపరిమితమైవున్నదిమరియు ఇది 2013 వ సంవత్సరములో పూర్తి అయిపోయినది.  రాష్ట్రములో వున్న పవన విద్యుత్  యొక్క శక్తి ని గుర్తించి , 4000 మె. వా.  అధిక పవనవిద్యుత్ శక్తిని రాబోవు 5 సంవత్సరములలొ రాష్ట్రములో  కలుపుటకు  ఒక పూర్తి అవగాహనతో  పవన్ విద్యుత్ పాలసీ  ను చేయుటఅవసర మయి వున్నది.

ప్రబుత్వము రాష్ట్రములోనిఅందరు స్టేక్ హోల్డర్లు –APTRANSCO, APDISCOMs NREDCAP  మరియు పవన విద్యుత్  ఉత్పత్తి దారులతోను,వారి అసోసియేషన్  చర్చలు జరిపి పవన్ విద్యుత్ పాలసీ2015 ను  ఈ క్రిందివిధముగాతయారు చేసి  విడుదల చేయత మైనది.

ప్రస్తావన

భారత దేశము పవన విద్యుత్తుకు  ప్రపంచములోని అతిపెద్ద కవ్యాపార కెంద్రములలోనిది.  పన విద్యుత్ కన్వెంషనల్విద్య్త్  వుత్పాదనపధ్ధతులతో పోలిస్తె చాలా పొదుపైనదీ మరియు నేషనల్ ఇంస్టిట్యూట్  ఆఫ్ విండ్ ఎనర్జీ (ఇంతకు ముందు సెంటర్ ఫర్  విండ్ఎన్ర్జీ అని పిలువబడే)  లెక్కలప్రకారము  ఆంధ్ర ప్రదేశ్ (కంబైన్డ్ స్టేట్ ) 80m  లెవెల్లో  14497మెగావాట్ల శక్తి సమర్ధతకలిగివున్నదనీ  ఎక్కువ సమర్ధత్  అనంతపూర్,కడప,కర్నూల్, చిత్తూర్,నెల్లూర్ జిల్లాలలో వుపల్బ్ధ మవుతుందనీ అంచనావేయబడినది.

ఆంధ్ర ప్రదేశ్ లో  పవన విద్యుత్ (విండ్ పవర్)  ప్రాజెక్ట్ లను అభివ్రుధ్ధి  పరచుటకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము  ఇదివరలో, “ వీండ్ పవర్ పాలసీ”ని జి. ఓ. ఎమె ఎస్ . నం.48, ఎన ర్జీ (రెస్) డిపాట్ తారీకు 11-04-2008 మరియు జి. ఓ. ఎమె ఎస్ . నం.99 , ఎన ర్జీ (రెస్) డిపాట్ తారీకు 09-08-2008 ద్వారా ఆదేశములు జారీ చేయబడినవి. ఈప్రకారము చేయబడిన పాలసీ 5 సంవత్సరముల వరకుపరిమితమైవున్నదిమరియు ఇది   ఎప్రిల్ 2013 వ సంవత్సరములో దాని కాల గడువు పూర్తి అయినది.  .  రాష్ట్ర విభన తరువాత  పెరుగుతున్న విద్యుత్ అవసరాలను పరిగణలోనికి తీసుకొని,శుధ్ధ శక్తిఅవసరాల ద్రుస్ట్యా,  ఆంధ్ర ప్రదేశ్  ప్రభ్త్వము పవన విద్యుత్  ఉత్పత్తిని  పెద్ద ఎత్తున ప్రోత్సహించే ఉద్దేస్యములోవున్నది.

ఉద్దేశ్యములు

  1. రాష్ట్రములో పెరుగుతున్న విద్యుత్  డిమాండ్ లకు అనుగుణ్యముగా, వాతావరణము భరించగల, ఆర్ధికముగానిలద్రొక్కుకునేరెతిలో  పవన విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించుటకు, అభివ్రుద్ది పరచుట.
  2. పెద్ద పవన విద్యుత్ పవర్ ప్రాజెక్టుల స్తాపనకు  ప్రై వేటు పెట్టుబడులను రాష్ట్రమునకు ఆకర్షించుట .
  3. రాష్ట్రములో  ఉత్పత్తిసౌకర్యాలను  స్తాపించటానికి  పెట్టుబడుల ను ప్రోత్సాహించి వాటి ద్వారా  ఉపాధి అవకాశములను మెరుగుపర్చుట.

ఆపరేటివ్  పీరియడ్ (అమలు సమయము)

ఈపాలసీ విడుదల చేసిన రోజునుండి అమలులోనికి వచ్చి 5 సంవత్సరముల వరకు అమలు లో వుంటుంది మరియు/లేక కొత్తపాలసీ విడుదల చేసే వరకుఅమలులో వుంటుంది.

పవన విద్యుత్ (విండ్ పవర్) ప్రొజెక్ట్ లు  ఈ పాలసీ అమలులో ఉన్నకాలములో కమిషన్ అయినవి ఈ పాలసీ లో వివరించిన ప్రోత్సాహకాలు , ప్రాజెక్ట్ కమిషన్ అయిన 10 సంవత్సరముల వరకు పొందుటకు  అర్హతవుంటుంది- ఏ  ప్రోత్సహకానికయినా సమయము ప్రత్యేకముగా పెర్కొన బడ నంత వరకు.

ఎలిజబల్ డెవలపర్స్ (అర్హత  కలిగిన డెవలపర్లు)

అన్ని రెజిస్టర్డ్ కంపెనీలు, జాయింట్ వెంచర్ కంపెనీలు,కెంద్ర  మరియు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ఊత్పత్తి,, వితరణ (డిష్ట్రిబ్యూ షన్ ) కంపెనీలు, పబ్లిక్/ ప్రైవేట్ సెక్టర్  పవన్ విద్యుత్ డెవలపర్లు,,  పవర్ ప్రాజెక్ట్ లను స్తాపించి   విద్యుత్ ను సొంత ఉపయోగమునకు వాడుకొనుటకు, గ్రూప్ఉపయోగమునకు వాడుకొనుటకు, మరియు/లేక యుటిలిటీలకు , మూడవ పార్టీలకుఅమ్మటానికి   ఎలక్ట్రిసిటీ ఏక్ట్ 2003 సమయాసమయమున మెరుగుపర్చిన దాని  ప్రకారము అర్హులు.

ఎవరయితే పవన విద్యుత్ ( విండ్ పవర్)  ప్రాజెక్ట్ లను స్తాపించి విద్యుత్ ను రాష్ట్రములోకాని, రాష్ట్రము బయట కాని  అమ్మతలచు కున్నారొ, /మరియు/ లేక సొంత ఉపయోగమునకు వాడుకొనుటకు,/  గ్రూప్ ఉపయోగమునకు వాడుకొన తలచారో ఈపాలసీ 5 వ పేరాలొ పేర్కొన్ననోడల్అధికారికి  తెలియ పరచవలసివుంటుంది.

పవన విద్యుత్  ప్రాజెక్ట్ ల విభాగాలు (కాటగరీ ఆఫ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్)

కాటగరీ-1:

ప్రభుత్వ/ రెవెన్యూ భూములలొ  లేక అటవీ ప్రాంతములో లేక అసైనెడ్  భూములలో  మరియు ప్రైవేటు భూములలో స్తాపించబడిన ప్రాజెక్ట్ లు, వుత్పత్తి చేసిన విద్యుత్ ను రాష్ట్ర ములోనే  అమ్మేవి.

కాటగరీ-2:

రాష్ట్రము లో కాని లేక రాష్త్రముబయటకానీ విద్యుత్ ను సొంత ఉపయోగమునకు వాడుకొనుటకు, గ్రూప్ఉపయోగమునకు వాడుకొనుటకు, /  మూడవ పార్టీలకు అమ్మ్జ టానికి  స్తాపించిన పవర్ ప్రాజెక్ట్ లు

కాటగరీ-3:

సగటు  కొనుగోలుధరకు విద్యుత్ ను అమ్మేవి, మరియు రెన్యువబల్ ఎనర్జీ సర్టిఫికెట్లను వాడుకొనేవి.

 

కాటగరీ-1

కాటగరీ-1 ప్రభుత్వ/ రెవెన్యూ భూములలొ  లేక అటవీ ప్రాంతములో లేక అసైనెడ్  భూములలో  మరియు ప్రైవేటు భూములలో స్తాపించబడిన ప్రాజెక్ట్ లు వుత్పత్తి చేసిన విద్యుత్ ను రాష్ట్ర ములోనే  అమ్మేవి:

పవన విద్యుత్ ప్రాజెక్ట్‌లు ( విండ్ పవర్ ప్రాజెక్ట్)  పూర్తి గా కానీ కొంత కానీ ప్రభుత్వ /రెవెన్యూ  భూములు లేక అటవీప్రాంతములో స్తాపించబడినవి వుత్పత్తి చేసిన విద్యుత్ ను రాష్ట్రములో నే  అమ్మాలి.

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వము  వచ్చిన ప్రతి పాదలను  రెవెన్యూభూములు పవన్ విద్యుత్  స్తోమత వున్నచోట్లలో  ఉపలభ్డి వుంటె  వాటిని ఎవరు ముందు వస్తే వారికి NREDCAP వారి సిఫారిస్ తో కొత్త భూముల కేటాయింపునకు ప్రభుత్వ రెవెన్యూ (ఎసైన్మెంట్-1) డిపార్త్మెంట్  విడుదల చేసిన జి. ఓ  నంబరు 571 తా: 14-09-2012 ప్త్రకారము  కేటాయించుటకు  పరిగణిచ వచ్చు.

ప్రాజెక్ట్ లు తొందరగా అమలుచేయటానికి  జిల్లా కలెక్టర్  NREDCAP వారికి ముందుగా దోవలతో సహా   భూములను అధీనముచేయాలి. ఆ భూములు NREDCAP మరియు డెవలపర్ కు జాయింట్ పేరుతో కేటా యించాలి.  జిల్లా కలెక్టర్  కావలసిన భూమి ప్రతిపాదలను ఒప్పంద పత్రాలను పరిగణ లోకి తీసుకొని ఆ డెవలపర్ కు కట్టు బడి మొదలు పెట్ట టానికి అనుమతిం చాలి. NREDCAP వారు వారిఅదికారములను ఆ ప్రాజెక్ట్ కమిషన్ అయినతరువాత వెనక్కు తీసికొనవలెను.

అటవీ భూములు ఐనచొ ఆడెవలపర్ వారి అప్లికేషన్ ను  నోడల్ ఏజంసీ ద్వారా అటవీ శాఖకు  వారి మార్గసూచనలు/ రెగ్యులేషన్ల ప్రకారము భూమిని కేటాయించటానికి పంపించ వలసివుంటుంది.

ప్రైవేటు భూములలో పవన్ విద్యుత్ప్రాజెక్త్లు స్తాపించుటకు అర్హ త కలిగిన డెవలపర్ తన సొంతముగా భూమిని కొనుగోలుచేసుకొనవలెను.

కాటగరీ-2

కాటగరీ-2: రాష్ట్రము లో కాని లేక ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రముబయటకానీ విద్యుత్ ను సొంత ఉపయోగమునకు వాడుకొనుటకు గ్రూప్ఉపయోగమునకు వాడుకొనుటకు/  మూడవ పార్టీలకు దైరెక్ట్ గా  అమ్మ్జ టానికి  స్తాపించినవి.

ప్రభుత్వము పవన విద్యుత్ ఉత్పత్తి దారులను,  వారి ప్రాజెక్ట్  లకు  వారు స్తాపించ దలచు కున్న శక్తి మేరకు  ( కెపెసిటీ లిమిట్ లేకుండా) రాష్ట్రము లో కాని లేక ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రముబయటకానీ విద్యుత్ ను సొంత ఉపయోగమునకు వాడుకొనుటకు, గ్రూప్ఉపయోగమునకు వాడుకొనుటకు, /  మూడవ పార్టీలకు దైరెక్ట్ గా  అమ్మ్జ టానికి  స్తాపించుటకు ప్రొత్సహిస్తుంది.  ఈ ప్రాజెక్ట్  లు రెన్యువబల్ ఎనర్జీ సర్టిఫికెట్ లకు తగిన కమిషన్ విడుదలచేసిన మార్గదర్శకములు, రెగ్యులేషన్  ల ప్రకారము  అర్హులుఅవుతారు.

కాటగరీ-3

కాటగరీ-3: రెన్యువబల్ ఎనర్జీ సర్టిఫికెట్ల మెకానిజం లో వున్నప్రాజెక్ట్ లు :

ప్రభుత్వము పవన విద్యుత్ ఉత్పత్తి దారులను,  వారి ప్రాజెక్ట్  లకు  వారు స్తాపించ దలచు కున్న శక్తి మేరకు

( కెపెసిటీ లిమిట్ లేకుండా) రెన్యువబల్ ఎనర్జీ సర్టిఫికెట్ల మెకానిజం  ద్వారా   అమ్మకాలకు ప్రోత్సహిస్తుంది.

పవన్ విద్యుత్ (విండ్ పవర్ )  వుత్పత్తిదారులు  వారి ఎక్రడిషన్కొరకు  రాష్ట్రములోని  ఎక్ర్డిడిటేషన్  ఏజంసీ కి  తరువాత కేన్ద్ర ఏజన్సీకి  సంబధితకమీషన్ వారి విధివిధానములు , నిబ్సంధనల ప్రకారము ఆర్ ఇ సి మెకానిజంద్వారా  రెన్యువబ్ల్ర్ ఎనర్జీ  సర్టిఫికెట్లు  విడుదల చేయుటకురిజిష్టర్ చేయించుకొనవలెను.  ఇటు వంటి వ్యుత్పతికేన్ద్రాలనుమ్చి వుత్పత్తి అయిన విద్యుత్ ను ఆంధ్ర ప్రదేశ్  డిస్ట్రిబ్యూషన్  కంపెనీలు  ఎ పి ఇఆర్ సి అప్పుడపుడు నిర్ణయించిన సగటుఖరీదు ధర మీద కొనుగోలు చేస్తాయి.

కెపెసిటీ ఎలాట్మెంట్

పవన విద్యుత్ (విండ్ పవర్)  ప్రాజెక్ట్ లు  ఎం ఎన్ ఆర్ ఇ నోటిఫై చేసిన ప్రాంతములలో కాని, ఎం ఎన్ ఆర్ ఇ/ఎన్ ఐ డబ్ల్యుఇ / ఎన్ ఆర్ ఇడి సి ఎపి / జిఓ ఎ పి ద్వారా ఎక్కడైతే జరపబడ్డాయో అక్కడేసమ్మతించబడతాయి.  ఒక వేళ  విండ్ రిసోర్స్  ఎస్సెస్మెంట్ స్టడీలు  ప్రైవేటు డెవలపర్లు  జరుపుదామనిఉద్దేసిస్తే, అట్టి వారికి కెపాసిటీ ఎలాట్మెన్ట్  ఎన్ ఐ డబ్ల్యు ఇ వారి విండ్ డేటా  వెలిడేషన్ రిపోర్ట్ సమర్పించిన తరువాతనే  వారికి కెపాసిటీ ఎలాట్మెంట్  కు పరిగణీంపబడతాయి. ఏస్తలమును విన్డ్ ఫారం డెవలప్మెంట్  కొరకు అప్లై చేయదలచుకున్నారో  దానిని టోపో గ్రాఫ్ మీద, గూగుల్ మేప్ మీద  క్లియర్ గా మార్క్ చేసి  ఎంత కెపాసిటీ విండ్ ఫారమ్  అభివ్రుధ్ధి  చేయ దలచుకున్నారో  ఆవిషయములు తెలియపర్చాలి.  ఎన్. ఆర్. ఎడి. . ఎ. పి.  40 మెగావాట్ల కెపాసిటీ వరకు బాధ్యులు  ఆపై కెపాసిటీ లకు వారి సిఫార్సులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమునకుపంపాలి. ,.

విండ్ రిసోర్స్ ఎస్సెస్మెన్ట్  స్టడీస్  ఇన్ ప్రైవేట్ సెక్టర్

విండ్ రిసోర్స్ ఎస్సెస్మెన్ట్  స్టడీస్  యివాటి తరువా అభివ్రుద్దిపనులు ప్రైవేటు సంస్తలు వారే గుర్తించిన ప్రదేశాలలో జరుపుటకు ఎవరు ముందువస్తే వారికి  నోడల్ ఎజన్సీ  అనుమతిజారీ చేస్తుంది. మరియు ప్రైవేటు సంస్తలు  చేపట్టిన ,విండ్మెజర్మెంట్ స్టడీలు , వాటి తరువాయి  అభివ్రుద్దిపనులు ఎం. ఎన్. ఆర్.ఇ  వారిచే  జారీ చేయబడిన సర్క్యులర్ నం. 51/9/2007-WE తా. 20-06-2008 ప్రకారముగు  అదుపు చేయబదతాయి.

దరఖాస్తుదారుడు వారి ప్రాజెక్ట్ హద్దులు శుభ్రముగా 1:50,000 స్కేలు గల  టోపో  షీట్ లో వారు ఎక్కడైతే  వారి విండ్ అస్సెస్మెంట్ స్టడీలు జరపదలుచుకున్నారో తెలియపర్చవలెను. ఈ సంబధమై వచ్చినఅన్ని దరఖాస్తులను ఆ దరఖాస్తు తారీకుకు ఆ ప్రత్యేకముగా గుర్తించినప్రదేశము  ఇంక ఎటువంటి సంస్తకు విండ్ మెజర్మెంట్ ఎస్సెస్మెంట్  స్టడీలకు   కేటాయించలేదని, లేక ఆప్రదేశము ఎన్.  ఐ.డబ్ళ్యూ. ఇ/ఎన్. ఆర్. ఇ. డి. సి.ఎ.పి వారి నిరూపించిన 5కి. మీ. పరిధి లొ లేదనీ లేక జరుగుచున్న వాటిలో ఆదర ఖాస్తు తారీకుకు లేదనీ నిశితముగా పరిశీలించబడతాయి. అటు వంటి విండ్ రిసోర్స్  ఎస్సెస్మెంట్ స్టడీలు ఎన్. ఆర్. ఇ. డి. సి.ఎ.పి వారి తో ఒప్పందపత్రాలు సంతకాలు చేసిన 24 నెలల లోపు పూర్తికావలయును. విండ్ మానిటరింగ్ అభ్యాసముపూర్తిఅయిన తరువాతవారికి ఒప్పంద పూర్తిఅయిన తారీకునుంచి ప్రత్యేకముగా180 రోజుల వ్యవధి వారు తయారు చేసినవిండ్ మానిటరింగ్ దేటాను ఎన్.  ఐ.డబ్ళ్యూ. ఇ వారిచే నమ్మతగిన దానిగానిర్ధారణచేయించుకొని కెపాసిటీఎలాట్మెంట్ కు దరకాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఆప్రాజెక్త్వారు కెపాసిటీ ఎల్లాఅట్మెంట్కుదరకాస్తుచేయకపోతే వారికిఇచ్చిన  ప్రైవేటు విండ్ రిసోర్స్  ఎస్సెస్మెంట్ స్టడీల కు ఇచ్చిన అనుమతి రద్దుచేయబడుతుంది. దరఖాస్తు దారుడు ఒక ఒప్పందపత్రము ఎన్. ఆర్. ఇ. డి. సి.ఎ.పి వారికి దాని ప్రతి ఎన్.  ఐ.డబ్ళ్యూ. ఇ వారికి ఇస్తూ దానిలో వారు  ఇచ్చిన సమాచారమును (డేటా) ఎన్. ఆర్. ఇ. డి. సి.ఎ.పి వారితో వారి తరువాత/అధికకెపాసిటీ ఎలాట్మెంట్ కొరకు  పంచుకోవచ్చునని తెలియపరుస్తూ ఇవ్వాలి.

సోలార్ అండ్ విండ్ హై బ్రిడ్  పవర్ ప్రాజెక్ట్ లు

ఉన్న మౌలిక సదుపాయములను వాటికిసంబంధించిన సౌకర్యాలనూ మెరుగ్గా ఉపయో గించుకొనుటకు  సౌర్య(సోలార్) పవన (విండ్)  హైబ్రిడ్  విద్యుత్ ప్రాజెక్ట్‌లను స్తాపించుటకు  ప్రభుత్వముప్రోత్సాహ పరుస్తుంది. ఉవంతి ప్రాజెక్ట్ లవిద్యుత్ ధరలు(టారిఫ్)  ఎ పి ఇ ఆర్ సి నిర్ణయించిన ప్రకారము వుంటుంది.

రీ పవరింగ్

పవన విద్యుత్ (విండ్‌పవర్) డెవలపర్లు  ఎక్కువసామర్ధ్యముకల,  మెరుగు పరచినసాంకేతికనైపుణ్యత కలిగిన  పవన విద్యుత్  వుత్పత్తి చేయు  యంత్రములను(విండ్  ఎలక్ట్రిక్ జనేరేటర్లను) తగిన మైక్రో సిటింగ్ స్టడీ  లను జరిపి ప్రాజెక్ట్ లకు అందుబాటులోయున్న  పవన శక్తి ని  పొదుపు గా వుపయోగించు కొనుటకు  ప్రభుత్వముప్రోత్సాహిస్తుంది.

తక్కువ సామర్ధ్యము తక్కువఎత్తులో  ఉన్నపవన (విండ్ పవర్ ) విద్యుత్ఉత్పత్తియంత్రాలను  స్తాపించారో అటువంటిప్రాజెక్టులు  15 సంవత్సరములుపూర్తి చేసినవి అయితే వారిపాతటర్బైన్లను  కొత్త పవన  విద్యుత్ (విండ్ పవర్ ) యంత్రాలతోమార్చేప్రతిపాదనలను  పరిగణించపడతాయి.  అటు వంటిసందర్భాలలో  వారువారివిద్యుత్కొనుగోలు ఒప్పందం (పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్) 25 సంవత్సరములు   పొడిగించే ట ట్ల యితే వారి ప్రతిపాదనలను పరిగణింపబడతాయి. అటువంటి  ప్రాజెక్ట్ లకు చెల్లించేవిద్యుత్ చార్జీలు (టారిఫ్)  సౌలభ్యమయిన వారిప్రాజెక్ట్నుపునరుద్దరించుటవలనకలిగిన అధిక సామర్ధ్యము  ఎపి ఇ ఆర్ ఇ సి వారిచెఅపుడపుడు నిర్నయించినదైవుంతుంది.

జీ ఓ ఏ పి ఇంసెంటివ్స్

జీ ఓ ఏ పి ఇంసెంటివ్స్:  (  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వమునుంచి ప్రోత్సహకాలు) రాష్ట్రము లో  పవన విద్యుత్ (విండ్ పవర్) కెపాసిటీని చేర్చుటకై, అర్హులయిన డెవలపర్లు ఎవరైతే వారి ప్రాజెక్టు లను పైన ఒకటవ పేరాలో చెప్పబడిన ఈ పాలసీ అమలు సమయములో స్తాపిస్తారో వారికి ఈ క్రింది ప్రోత్సహకాలు అందచేయబడతాయి.

(అ) పవర్ ఎవక్యూషన్:

  1. అర్హత కలిగిన డెవలపర్లు వారి వ్యుత్పత్తి చేసిన విద్యుత్ ను గ్రిడ్ తో  కలపటానికి అవసరమయ్యే పూర్తి  ఇంటర్కనెక్షన్ సౌలభ్యాల పూర్తిఖర్చును వారే భరించ వలసి వుంటుంది.
  2. అర్హులై న  పవర్ డెవలపర్లు  వారిపవన విద్యుత్ ఫారమ్‌లను  నడుపుటకు  ఏ పి ఈ ఆర్ సి
  3. పవన విద్యుత్ ప్రాజెక్ట్ లు ( విండ్  పవర్ ప్రాజెక్ట్ లు ) వారి విండ్ ఫారం లో  విండ్  ఫారం  లోపల  నుంచి పూలింగ్ సబ్ స్టేషన్ వరకుఅయ్యే మౌలిక సదుపాయముల ఖర్చుపై ఏ పి ట్రాంస్కో/ డీస్కం లకు  చెల్లించవలసి  సూపర్విజన్ చార్జీల చెల్లింపు కై మినహాయింప బడతారు. విండ్ ఫారము లో విండ్ ఫారం లోపలి  నుంచి  పూలింగ్ సబ్ స్టేషన్ వరకు అన్ని ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ లు  చట్ట ప్రకారమునిర్ణయించబడినవై  వుంటాయి వాటిని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ గనరల్ వారిచె కాని లేక చట్టబద్ధమైన అధికారులచే ధ్రువీకరింపబడతాయి.  .
  4. AP ట్రాన్స్ కో  /డిస్కం లు ఎవాక్యుఏషన్ కోసరము టెక్నికల్ ఫీజబిలిటీ   కొరకువచ్చిన ప్రొపోజల్  లను అప్లికేషన్ వచ్చిన 14 రోజులలో  డిస్పొజ్ చేస్తుంది. ఏ దయినా అప్ స్ట్రీం సిస్టమ్‌ను బలపరచివలసి వుంటే  వాట్లను  AP ట్రాన్స్ కో  /డిస్కం లుప్రయారిటీ బేసిస్ లో  భరిస్తాయి

(ఇ). పవర్ వీల్ చేయుటకు  ట్రాం స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్  చార్జీలు:

విండ్ పవర్ స్టేషన్ నుంచి వుత్పత్తి అయిన విద్యుత్ ను వారు కోరుకున్న చోటునకు వారి సొంత ఉపయోగమునకు కాని3వ పార్టీ సేల్ కు కాని రాష్ట్ర విద్యుత్  గ్రిడ్ నుంచి వీల్ చేయుటకు  ఎమీ  ట్రాంస్మిషన్ అండ్ డిష్ట్రిబ్యూషన్ చార్జీలు వుండవు. కానీ విండ్ పవర్ స్టేషన్ నుంచి వుత్పత్తి అయిన విద్యుత్ ను రాష్ట్ర ము బయట అమ్మటానికి అయితే  అవి ఎ పి ఇ ఆర్ సి వారినియమ నిబంధనల ప్రకారము వుంటాయి.

( ఉ)ఎనర్జీ బాంకింగ్  :

100% విద్యుత్ ను సంవత్సరము లో 12 నెలలు  ఎనర్జీ  బాంకింగ్ కు అనుమతి ఇస్తారు. బాంకింగ్ చార్జీలు @2% వస్తు రూపేణా  డ్రా యల్ పాయింటువద్ద ఎడ్జస్ట్ చేయ బడుతుంది.. బాంకింగ్ సంవత్సరము ఏప్రిల్‌నుంచి  మార్చ్.

బాంక్డ్ ఎనర్జీ నుంచి ప్రతిఆర్ధిక సంవత్సరములో 5 నెలల కాలము 1 ఎప్రిల్ నుంచి 30 జూన్ వరకు,1  ఫిబ్రవరీ నుంచి 31 మార్చ్ వరకుఎనర్జీ ని తీసుకోనివ్వరు. ఇదికాక బాంక్డ్ ఎనర్జీ నుంచి, ,సంబంధిత రీటైల్ టారిఫ్ ఆర్డరు లో నిర్దేసించిన టాయిమ్  ఆఫ్ ధి డే (ToD) పీక్ అవర్స్ సమయములలో కూడా  పూర్తి సంవత్సరములో  ఎనర్జీ ని తీసుకోనివ్వరు. అయినప్పటికీ బాంకింగ్ నుంచి తీసుకోవటాన్ని పరిమితముచేసే ఏర్పాట్లను రాష్ట్రములో పవర్ సప్లై పొజిషన్ ను అనుసరించి సమీక్ష చేయ బడతాయి.

సింక్రోనైజేషన్ అయిన తారీకు నుంచి కమ్మర్షియల్ ఆపరేషన్ అయిన తారీకు వరకు (సి ఓ డి)  గ్రిడ్ లోకి పంపిన ఎనర్జీని డీమ్డ్ఎనర్జీ బాంకింగ్ కింద పరిగణిస్తారు

ఊపయోగ పడని బాంకెడ్ ఎనర్జీని డిస్కమ్ (లు)   సంబంధిత సంవత్సరములొ APERC నిర్ణయించిన  పూల్డ్ పవర్ కొనుగోలు ధరకు డీమ్డ్  కొనుగొలు గా పరిగణి స్తాయి . నెలవారీగా ఎనర్జీసెటిల్ మెంట్  చేయబడుతుంది.

(ఎ).      ఓపెన్ ఆక్సిస్ :

రాష్ట్రపరిధిలో  ఓపెన్ ఆక్సిస్ క్లియరెంస్ ప్రాజెక్ట్ యొక్క పూర్తికాలము లేదా 25 సంవత్సరములు ఏది తక్కువఅయితే అది APERCరెగ్యులేషన్స్ (సమయాసమయములొ మెరుగుపరచిన) ప్రకారము ఆమోదించ బడతవి.  నోడల్ ఏజంసీ నుంచి ఉత్పత్తి దారునకు21 రోజులలో ఎమీ జవాబు/ సూచనరాని పక్షములో అటువంటిదరఖాస్తు డీమ్ద్ ఓపెన్ ఆక్సిస్గా పరిగణింపబడతాయి.

(ఐ). `ఎలక్ట్రిసిటీ డ్యూటీ :

అన్ని  విండ్ పవర్ ప్రాజెక్ట్ లు   విండ్  పవర్  ఆంధ్ర ప్రదేశ్ డిస్కం లకు అమ్మటానికి ఎలక్ట్రిసిటీ  డ్యూటీ మినహాయింపు వుంటుంది.

(ఒ).    డీండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పిపిపి) స్టేటస్ :

క్యాటగరీ 1 లొవున్న ప్రాజెక్ట్‌లు, ఎవరైతే ఆంధ్ర ప్రదేశ్ డిస్కం లకు పవర్అమ్మటానికి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నారో వార్ల్కి డీండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పిపిపి) స్టేటస్ ఇవ్వబడుతుంది.

(ఔ).    నాన్ ఎగ్రికల్చర్ స్తేటస్:

ప్రభుత్వము నిర్ణయించిన సంభధిత రుసుము చెల్లించిన తరువాత విండ్ పవర్ ప్రాజెక్ట్ లు   స్తాపించినచోటుకు డీండ్ నాన్ ఎగ్రికల్చర్ స్తేటస్ ఇవ్వబడుతుంది.

(క).    డీమ్డ్ ఇండస్ట్రీ స్టేటస్:

ఇండస్ట్రీ  డిపార్ట్ మెంట్ వారు ఎడ్మినిస్టర్ చేస్తున్న  స్కీం లలో  విండ్  పవర్ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా  అర్హత కల ఇండస్ట్రీ గా పరిగణింపబడి, ఇండస్ట్రియల్ యూనిట్లకు దొరికే అన్ని ప్రోత్సహకాలు  ఆస్కీముల ద్వారా విండ్ పవర్ ప్రొడ్యూసర్లకు కూడా ఉపలబ్ధి అవుతాయి.

(ఖ)       మస్ట్ రన్ స్టేటస్:

విండ్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఇంజక్షన్ ను డీమ్డ్ షెడ్యుల్డ్ గా సంబంధితకమిషన్  వారి  జారీ లో వున్న నిబంధనలప్రకారము/ గ్రడ్  కోడ్  ప్రకారము  పరిగణింపబడతాయి.

(గ).    పొల్ల్యూషన్ క్లియరెంస్:

విండ్ పవర్ ప్రాజెక్ట్ లు  స్తాపించటానికి  ఆంధ్ర ప్రదేశ్  పొల్ల్యుషన్ కంట్రోల్ బోర్డ్ వద్దనుంచి  పొల్ల్యూషన్   కంట్రొల్  వారి  చట్టముల ప్రకారము ఏ NOC/ అంగీకారము పొందుట మినహాయింపబడుతుంది

(ఘ). నోడల్ ఏజంసీ:

ప్రభుత్వము నిర్నయించిన ప్రకారము ఈ పాలసీ  క్రింద న్యూ అండ్ రెన్యూఅబుల్  ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  లిమిటెడ్ (NREDCAP) నోడల్ ఏజంసీ గా వ్యవహరిస్తుంది.

నోడల్ ఏజంసీ మరియు/లేక నోడల్ ఏజంసీ ద్వారా నిర్దేశించిన ఆఫీసులు ఈక్రింద వివరించిన పనులకు సింగల్ విండో క్లియరె న్స్ లొ ఇబ్బందిలేకుండా  చేయుటకు  బాధ్యులై వుంటారు.

(అ). ప్రాజెక్ట్ ల రిగిస్రేషన్

(ఆ). ప్రాజెక్ట్ ల కెపేసిటీ ఎలాట్మెంట్

(ఇ)–రెవెన్యూ లేక అటవీ  భూమి పొందుటకు ప్రతి పాదలను ప్రాసెస్ చేయుట.

(ఈ). పవర్ ఎవక్యుఏషన్ ప్లాన్  మరియు/ ఓపెన్ ఏక్సెస్ కు ఆమోదము  లకు ఎరేన్జ్  చేయుత.

(ఉ).ఇంకాఅవసరమయిన చట్టబధమైన  క్లియరెంసులను/ ఆమోదములను  ఏ మయినావున్నచొ వాటిని సమకూర్చుట.

నోడల్ఏజంసీ ఒక ఆన్ లైన్ సిస్టం ను  దరకాస్తులు పొందుటకు, వాటి సమాచారము     తెలియచేయుటకు  స్తాపించవలెను. డెవలపర్lలకు లాగ్ ఇన్ సౌలభ్యత  వారి ప్రస్తుత దరకాస్తు సమాచారము వగయిరా తెలుసుకొనుటకు కలిగించవలెను.   అన్ని ఆమోదములు, క్లియరెంసులు  రెజిష్త్రేషన్ అయిన30 రోజులలొ   పూర్తిచేయవలెను.

టైమ్ లిమిట్ ఫర్ ప్రాజెక్ట్  కంప్లీషన్

అర్హులైన డెవలపర్లు  వారి ప్రజెక్ట్లకు కెపాసిటీ ఎలాట్మెంట్ అయిన రెండునెలలో  నిర్ధారించిన ఫీజు తోను , బాంక్ గారంటీ తోను  నోడల్ ఏజంసీ తో  ప్రాజెక్ట్ ఎగ్రిమెంట్ చేసుకొనవలెను.

ప్రభుత్వ రెవెన్యూ భూములలో స్తాపించబడిన విండ్  ప్రాజెక్ట్ లు వారు ఆభూమి పొందిన లేక/మరియు  పవర్ ఎవక్యుయేషన్ క్లియరెంస్విడుదల చేసిన 18 నెలలో వారి ప్రాజెక్ట్ ను మొదలుపెట్టవలెను.

ప్రైవేతుభూములలో స్తాపించబడిన విండ్ ప్రాజెక్ట్ లు వారికి వారికి పవర్ ఎవక్యుయేషన్ క్లియరెన్స్ విడుదల కఃఎసిన 18 నెలలలో వారి ప్రాజెక్త్ మొదలు పెట్ట వలసివుంటుంది.

రెవెన్యూభూమికాని  ప్రైవతు భూములుకాని  వారికి కేతాయించిన మూడు సంవత్సరములలో ఎమీ పురోగతిలేకపోయినచో ఆ భూములను నోడల్ ఏజంసీ  విండ్ పవర్ ప్రాజెక్ట్స్తాపించుటకు ఇంకొక డెవలపర్‌కు ఈయవచ్చు. అటువంటి పరిస్తితులలో నియమితసమయములో కేటాయించిన ప్రదేశములొ  ఏ పురోగతీ లేనిచో  నోడల్  ఏజంసీ వేలము వేయుటకుస్వతత్రులైవుంటారు. అటువంటి పరిస్తితులలో ప్రభుత్వము కేతాయించిన భూములనుతిరిగితీసుకొని లేక ప్రైవేటు భూములయినచొ వాటిని ఆ డెవలపరు ఏధరలలో కొని రిజిష్టర్ చేయించారో అదే ధరలళొ స్వాధ్హెనపరచుకొని వేలముద్వారా  ఇంకొక డెవలపర్ కు విండ్ ప్రాజెక్ట్ స్తాపించటానికి కేతాయించ వచ్చు.

ఆధారం: ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్

2.92929292929
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
సంబంధిత బాషలు
పైకి వెళ్ళుటకు