অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆంధ్ర ప్రదేశ్ సోలార్ పవర్ పాలసీ 2015 క్లుప్తముగా

ఆంధ్ర ప్రదేశ్ సోలార్ పవర్ పాలసీ 2015 క్లుప్తముగా

 1. ఆదేశము
 2. ప్రస్తావన
 3. ఉద్దేశ్యములు
 4. ఆపరేటివ్  పీరియడ్ (అమలు సమయము)
 5. ఎలిజబల్ డెవలపర్స్ (అర్హత  కలిగిన డెవలపర్లు)
 6. సొలార్ పవర్ ప్రాజెక్ట్ లు
  1. ఆంధ్ర ప్రదేశ్  పవర్ డిస్కమ్(లు) కు  పవర్ అమ్ముట
  2. ధర్డ్ పార్టీ సేల్/ సొంత ఉపయొగమునకు
  3. సోలార్ పార్కులు
  4. సోలార్ రూఫ్ టాప్  ప్రాజెక్టులు-  గ్రాస్ / నెట్ మీటరింగ్
  5. సోలార్ పంప్ సెట్లు
 7. రాష్ట్ర  ప్రభుత్వమునుంచి ప్రోత్సహకాలు
  1. పవర్ వీల్ చేయుటకై  ట్రాంస్మిషన్ & డిష్ట్రిబ్యూషన్  చార్జీలు
  2. డిస్ట్రిబ్యూ షన్ లాసెస్
  3. ఎనర్జీ బాంకింగ్
  4. ఓపెన్ ఆక్సిస్
  5. ఎలక్ట్రిసిటీ డ్యూటీ
  6. క్రాస్ సబ్సిడీ చార్జీలు
  7. కాంట్రాక్ట్ డిమాండ్
  8. రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లు
  9. గ్రిడ్ కనెక్టీవిటీ మరియు ఏవక్యుఏషన్  ఫెసిలిటీ
  10. డీమ్డ్ ఇండస్ట్రీ స్టేటస్
  11. డీమ్డ్ పబ్లిక్ ప్రైవేట్  పార్ట్నర్ షిప్ (PPP) స్టేటస్
  12. నాన్ ఎగ్రికల్చర్ స్టేటస్
  13. మస్ట్ రన్ స్టేటస్
  14. లేన్డ్(భూమి)
  15. పొల్ల్యూషన్ క్లియరెంస్
 8. నోడల్ ఏజంసీ
 9. ఎడ్మిని స్ట్రెటివ్  అప్రూవల్
 10. AP సోలార్ పవర్  పాలసీ 2012 కు రిజిస్టర్ అయిన వారు కొత్త పాలసీ లోనికి  మారుట
 11. ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ
 12. సోలార్ మానుఫాక్చరింగ్
 13. మిడ్ టరమ్ రెవ్యూ
 14. పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్

ఆదేశము

సోలార్ పవర్ ప్రాజెక్టులను అభివ్రుద్ధి పరచుటకు ఇదివరలో ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వము ఆంధ్ర ప్రదేశ్  సోలార్ పవర్  పాలసీ 2012 తయారు చేసి విడుదల  చేసినది. పునరుత్పాదక శక్తి ని ప్రోత్సహించ టానికి నియమించిన మంత్రుల బ్రుందము ఈ పాలసీ క్రింద  2000 MW సామర్ధ్యము అదనముగా వస్తుందని తలచినా 84.85 MW సామర్ధ్యము కల సోలార్ పవర్ ప్రాజెక్టులు మాత్రమే 30-6-2014 లోపు స్తాపింప బడినవి., ఈ పాలసీ 2017 వ సంవత్సరము వరకే వర్తిస్తుంది, మరియు ఇందులోని ప్రోత్సహకాలు 30-6-2014 లోపు స్తాపింపబడిన ప్రాజెక్టులకుమాత్రమే వర్తిస్తాయి.రాస్ట్ర విభజన వల్ల  ఒక కొత్త అవగాహనతో కూడిన పాలసీ ని సోలార్ పవర్ అభివ్రుధ్ధికొరకువాతావరణానికి అనుగుణమయిన రీతిలో విద్యుత్ అవసరాలకొరకు తయారు చేయటము అవసరమని తలచినది..

ప్రభుత్వము,  ఆంధ్ర ప్రదేశ్ పవర్ ట్రాంస్మిషన్ కంపెనీలు, ఆంధ్ర ప్రదేశ్   పవర్ వితరణ కంపెనీలు, సోలార్ ఉత్పాదనలుచేసేకంపెనీలు, వగయిరాలతో విస్త్రుత చర్చల అనంతరము  ఆంధ్ర ప్రదేశ్    సోలార్ పవర్ పాలసీ 2015 ను ఈక్రింది రీతి లో విడుదలచేసినది.

ప్రస్తావన

భారతదేశము అపార  సూర్యకాంతి తొ అనుగ్రహింపబడినది , సౌర శక్తి,  దేశ విద్యుత్ అవసరాలను సమకూర్చటములో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది అని ఆసించటమయినది.  కన్వెన్షనల్ పవర్ ప్రాజెక్టులతొపోలిస్తే  ,సోలార్ పవర్ ప్రాజెక్టులు తక్కువసమయములో స్తాపింపబడగలవు . ఈరోజులలో వీటిఖర్చుకూడా మితవ్యముతోకూడినది . సౌర విద్యుత్ శక్తి  విద్యుత్   గ్రిడ్ అనుసంధానముతోను, మరియు గ్రిడ్ లేకుండాగాను (సోలార్ పవర్ తో నడపబడె పంపుసెట్లు  వగయిరాలతో) విద్యుత్ అవసరాలను సమకూర్చటములో సహాయ పడుతుంది.       

ఆంధ్ర ప్రదేశ్  పెట్టు బడులతో పారశ్రామిక అభివ్రుధ్ధి చెందటానికి సమకూరుతున్నదై, విద్యుత్ మంత్ర్రలయముద్వారా ప్రయోగాత్మకముగా అమలుచేయబడిన”( 24x7 – power for all- scheme”) అందరికి 24 x7 పవర్- స్కీంకు ఎన్నుకొనబడినది. రాష్ట్ర ముయొక్క పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమకూ ర్చటములో  సౌర విద్యుత్ ఒక ముఖ్య ఉత్పత్తి  స్తానము అవగలదు.

ఆంధ్ర ప్రదేశ్ లో  మొత్తం రాష్ట్ర విద్యుత్ వాడకములో,  వ్యవసాయ రంగము వాడకము దాదాపుగా 24% అయిఉన్నది. సౌర విద్యుత్ వ్యవసాయ రంగము యొక్క విద్యుత్ భారాన్ని మార్చి, పగటి పూట విద్యుత్ డిమాండ్ అవసరాలను సమకూర్చటములో తోడ్పడుతుంది.  రాష్ట్ర ప్రభుత్వము అపారమయిన సౌరశక్తిని వెలుపలకు తీసి ఈ   స్వచ్చమయినశక్తి స్తానాన్ని, పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు సమకూర్చటానికి ఉత్సుకతో ఉన్నది. ఈక్రిద వివరించిన పరస్తితులు ఆంధ్ర ప్రదేశ్ లో , సోలార్  పవర్ ప్రాజెక్టులు నెలకొల్పటానికిఅనువయిన స్తానముగా చేస్తున్నాయి.

 • 5Kwh /m2/day  సోలార్ ఇంసొలేషన్ కలిగి, సంవత్సరములో 300 ల  సూర్యరస్మికల  రోజులు.
 • భారత దేశములొ ఉన్న అతి మంచి గాపనిచేసే పవర్ వితరణ కంపెనీలలోనివి  APEPDCL,APSPDCL
 • సమర్ధ వంత మయిన, బలమైన,  ఉత్పాదనను వితరణచేయగల పవర్ ఎవెక్యుఎషన్, మౌలిక  సదుపాయములు

ఉద్దేశ్యములు

 1. రాష్ట్రములో పెరుగుతున్న విద్యుత్  డిమాండ్ లకు అనుగుణ్యముగా, వాతావరణము భరించగల రీతిలో కనీసము 5000MW లఅధిక  సోలార్ పవర్ ఉత్పాదనను జోడించే లక్ష్యముతో.
 2. వినియోగమౌలికసదుపాయాలతో సోలార్ పార్క్ (లు) ను అభివ్రుధ్ధి పరచుటకు, తగినరీతిలో అభివ్రుధ్ధి దారులనుసోలార్ పవర్ ప్రాజెక్ట్ ల స్తాపనకు ప్రోత్సాహించుటకు
 3. అప్ స్ట్రీం నెట్ వర్క్ ఖర్చు లేకుండా,వితరణ ఉత్పాదనను ప్రోత్సహిస్తూ  నష్ట నివారణకు దోహద పడే రెతిలో.
 4. సోలార్ పవర్ తో నడిచే వ్యవసాయక పంప్ సెట్లను వుపయోగించి రైతుల పగటి  విద్యుత్ అవసరాలను తీర్చటము.
 5. రాష్ట్రములో ప్రాంతీయముగా తయారీ అవకాశములను పెంపొందించి  ఉద్యోగావకాశములను పెంచుట.

ఆపరేటివ్  పీరియడ్ (అమలు సమయము)

ఈపాలసీ విడుదల చేసిన రోజునుండి అమలులోనికి వచ్చి 5 సంవత్సరముల వరకు అమలు లో వుంటుంది మరియు/లేక కొత్తపాలసీ విడుదల చేసే వరకుఅమలులో వుంటుంది.

సొలార్ పవర్ ప్రొజెక్ట్ లు  ఈ పాలసీ అమలులో ఉన్నకాలములో కమిషన్ అయినవి ఈ పాలసీ లో వివరించిన ప్రోత్సాహకాలు , ప్రాజెక్ట్ కమిషన్ అయిన 10 సంవత్సరముల వరకు పొందుటకు  అర్హతవుంటుంది- ఏ  ప్రోత్సహకానికయినా సమయము ప్రత్యేకముగా పెర్కొన బడ నంత వరకు.

ఎలిజబల్ డెవలపర్స్ (అర్హత  కలిగిన డెవలపర్లు)

అన్ని రెజిస్టర్డ్ కంపెనీలు, ప్రభుత్వ సంస్తలు, భాగస్వామ్య  కంపెనీలు/సంస్తలు, వ్యక్తులు, ఆంధ్ర ప్రదేశ్    డిస్కమ్ ల వినియోగదారులు,  సోలార్ పవర్ ప్రాజెక్ట్ లను రాష్ట్ర పరిధిలొ  స్తాపించి విద్యుత్ ను అమ్మటానికి/లేక సొంత ఉపయోగమునకు వాడుకొనుటకు,  ఎలక్ట్రిసిటీ ఏక్ట్ 2003 సమయాసమయముల సవరణల ప్రకారము అర్హులు.  ఎవరయితే సోలార్ పవర్ ప్రాజెక్ట్ లను స్తాపించ తలచారో ఈపాలసీ 5 వ పేరాలొ పేర్కొన్ననోడల్అధికారికి  తెలియ పరచవలసివుంటుంది.

సొలార్ పవర్ ప్రాజెక్ట్ లు

ఆంధ్ర ప్రదేశ్  పవర్ డిస్కమ్(లు) కు  పవర్ అమ్ముట

ప్రభుత్వము  ఆంధ్ర ప్రదేశ్ పవర్ డిస్కమ్  లకు  పవర్ అమ్మటానికి  స్తాపించే సోలార్ పవర్ ప్రాజెక్ట్ ల స్తాపనకు ప్రో త్సాహిస్తుం ది .డిస్కమ్ లు  వచ్చే  5 సంవత్సరములలో దఫాల వారీగా దాదా పుగా 2000 MW  సోలార్  పవర్ కెపెసిటీని పొందుతారని అంచనా.  డిస్కమ్ లు  ఏ డెవలపర్లు  కాంపిటీటివ్  ప్రొక్యూర్ మెంట్ ప్రాసెస్  ద్వారా సెలక్ట్ అవుతారో వారితో 25 సంవత్సరముల లాంగ్ టరమ్  పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్ లో ప్రవేసిస్తుంది.

ధర్డ్ పార్టీ సేల్/ సొంత ఉపయొగమునకు

ప్రభుత్వము సోలార్ పవర్  ఉత్పత్తి దారులను   రాష్ట్ర ములో  వారి సొంతవుపయోగముకొరకుకానీ, లేక ధర్డ్ పార్టీ  సేల్ రాష్ట్రములో కానీ ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రము బైటకు  కానీ అమ్ముటకు  సోలార్ పవర్ ప్రాజెక్ట్  ల నిర్మాణానికి ప్రోత్సహిస్తుంది.  ఈ ప్రాజెక్ట్ లు కూడా  రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను  పొందటానికి ఆ సమయములో అమలులోవున్న రెగ్యులేషన్లు/మార్గదర్శకముల ప్రకారము అర్హులైవుంటారు.

సోలార్ పార్కులు

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వము ముందువచ్చే 5సంవత్సరములలో  2500 MW కెపేసిటీ ఎడిషన్లతొ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ల అభివ్రుధ్ధి కొరకు సోలార్ పార్కులను  500-1000 హెక్టారుల క్లస్టర్లలో అభివ్రుధ్ధి పరుస్తుంది.రాష్ట్ర  ప్రభుత్వముఈ పాలసీ క్రింద మౌలిక సదుపాయాలు  అనగా పవర్ఎవక్యూషన్,   నీటి అవసరాలు,  లోపల రోడ్లు కట్టడా నికి  కావాలసిన సహాయము సమకూరుస్తుంది.

సోలార్ పార్కులు వివిధజోన్లు కలిగివున్నదై వుంటుంది అనగా సొలార్ పవర్ ప్రాజెక్ట్‌లు, తయారీ జొన్లు, R&D మరియు  ట్రై నింగ్ సెంటర్లు,  రాష్ట్ర ప్రభుత్వము  సోలార్ పార్కులలో వున్న తయారీ దారులకు సెంట్రల్ గవర్నమెంట్ / నేషనల్ సోలార్ మిషన్ అందించే అన్ని సదుపాయములు , ఆర్ధిక ప్రోత్సాహకములు అందింస్తుంది.

స్పెషల్ పర్పస్  వెహికల్ (ల్లు) (SPV )ను మౌలికసదుపాయముల అభివ్రుధ్ధికి  సోలార్ పార్కుల మేనేజ్ మెంట్ కొరకు స్తాపింపబడతాయి. SPV లు   భూ కేటాయింపులకు, డెవలప్మెంట్ ఖర్చులు  సోలార్ పవర్ ఉత్పత్తి దారులు, తయారీదారుల మద్య పంపకానికి, సంబంధ్ధించిన  పాలసీను,తయారు చేస్తుంది.  స్పెషల్ పర్పస్ వెహికల్  గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వము ఎలాట్ చేసిన ఫండ్ తో ముందుగా కావలసిన మౌలిక సదుపాయాలను రూపొందించి, వాటిని తరువాత డెవలప్ మెంట్ చార్జీలద్వారా   సోలార్ పార్కులలొ  స్తాపించబడిన సోలార్ పవర్ ఊత్పత్తి  దారుల వద్ద నుంచి తిరిగి వసూలు చేస్తుంది.

సోలార్ రూఫ్ టాప్  ప్రాజెక్టులు-  గ్రాస్ / నెట్ మీటరింగ్

ప్రభుత్వము  సోలార్ రూఫ్ టాప్  సిస్టములను పబ్లిక్  బిల్డింగుల పైన, ఇళ్ళపైన, వ్యాపార, పారిశ్రామిక సంస్తల పైన  గ్రాస్ లేక మరియునెట్ మీటర్ బేసిస్ మీద   ప్రోత్సాహిస్తుంది.  ఈపాలసీ క్రింద వినియోగదారు (లు)  నెట్ కాని గ్రాస్ మీటర్ ఆప్షన్ ను  ఎన్నుకొనుటకు స్వతంత్రులై వుంటారు. ఈ రెండు విధానాలలో అమలుఅయ్యే టారిఫ్ డిస్కంల సర్వీచార్జీలకుఅయ్యేసగటు చార్జీ లకు సమానమై వుంటుంది.  అది ప్రతిసంవత్సరము APERC  నిర్నయిస్తుంది. ఊదాహరణకు APERC ఆమోదించిన డిస్కం సర్వీ చార్జీలు సగటున 2013-14 సంవత్సరములో యూనిట్‌కు రూ. 5.25 అయి వున్నది. ఈసౌలభ్యము అర్హతకలిగిన  డెవలపర్లు ఎవరయితే రూఫ్ టాప్  ప్రాజెక్టులను ఈ పాలసీ ఆపరేటింగ్  సమయములో  స్తాపిస్తారో వారికి25 సంవత్సరముల వరకు వర్తింపచేస్తారు. ఎవరయితే  సోలార్  ఫొటో వోల్టాలిక్ ప్లాంట్లను వారి స్తలములో స్తాపిస్తారో అట్లాంటి అర్హతకల  డెవలపర్లకందరికి మీటరింగ్ సౌలభ్యము కలగ చేస్తారు. అర్హత కలగిన డెవలపర్లు ఎవరయితేమీటరింగ్ సౌలభ్యము పొందుదామనుకొంటున్నారోవారు ఆన్ లైన్ ద్వారా వారివెబ్ సైట్ నుంచి  కాని , నియమించబడిన మీ సేవా/ కస్ట మర్ సర్వీస్ సెంటరుద్వారా గాని దిస్కం లకు అప్లై చేయవలసి వుంటుంది. అన్నిఅప్రూవల్లు/క్లియరెంసులు అప్ప్లికేషన్ తారీకునుంచి 14 రోజులలొ సంబంధిత డిస్కంలు  పూర్తి చేయవలసివుంటుంది.

1000 KWp కెపాసిటీకల ప్రాజెక్టులను ఒక చోట  అనుమతించబడును.

ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులు/ సొసైటీల కు సోలార్ పవర్ ప్రాజెక్ట్ లు స్తాపించుట కొరకు అనుమతి ఇవ్వ బడుతుంది .అటువంటి వాటిని ఆసొసైటీ లో వున్నఇళ్ళకు, లేక గ్రూప్ మెంబర్లకు  పవర్ ఉత్పత్తి చేసిఇచ్చేవాటిగా గణించటమవుతుంది. డిస్కమ్ లు పై విధముగా వుత్పత్తి చేసిన ఎనర్జీని  వారి సర్వీస్ కనెక్షన్ లో  వుపయోగించిన ఎనర్జీని తగ్గించి, ఎక్కువ/ తక్కువలను  నెట్ మీటరింగ్  విధానములో బిల్లింగ్  చేయుదురు. డిష్ట్రిబ్యూషన్ నష్టములు, చార్జీలు అటువంటి గ్రూప్ లు, సొసైటీలు/ వ్యక్తులనుంచి తీసుకొనబడవు.

అటువంటి అర్హతకల  డెవలపర్లు MNRE నుంచి JNNSM  స్కీమ్ ద్వారాప్రోత్సాహకములు,తగిన సబ్సిడీలు తీసుకొనుటకు సమ్మతించ బడతారు.

రూఫ్ టాప్ పాలసీ ను అమలుపరచుటకు కావలసిన ,మీటరింగ్, బిల్లింగ్, పేమెంటులు, సెటిల్మెంటులు, మరియు టెక్నికల్ అంశములు, మొదలయిన పధ్ధతులను ఈ పాలసీ విడుదల అయిన 30 రోజులలో  APEPDCL జారీ చేస్తుంది. డానిని రాష్ట్ర ములోని  డిస్కమ్ లు అనుసరిస్తాయి.

సోలార్ పంప్ సెట్లు

రాష్ట్ర ప్రభుత్వము  సెం ట్రల్ గవర్నమెంటు, MNE/MOP  మల్టీ లేటరల్ ఏజంసీలతొ కలసి  కన్వెంషనల్  పంప్  సెట్లను  క్రమేపి సోలార్ పంప్ సెట్లతో మార్చ టానికి  సబ్సిడీ సపోర్ట్ ద్వారా  కావలసిన పధ్ధతులను అమలు పరుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్  డిస్కమ్ ల తరఫున నోడల్ ఏజంసీలు ప్రభుత్వ ఏజంసీలతొ సహకరించి సబ్సిడీలు, గ్రాంటులు, ప్రోత్సహకాలు ఉపయొగించుటకొనుటకుసహకరిస్తాయి.  దాదాపుగా  ముందువచ్చే 5 సంవత్సరములలో 50,000 సోలార్  పంప్ సెట్లు రైతుల మీద ఏ ఆర్ధికభారము లేకుండా ఉపయొగములోకివస్తాయి. దీనికి కావలసిన పధ్ధతులను  ఈపాలసీ విదుదల చేసిన 30 రోజులలో స్టేక్ హొల్డర్స్ తో కలసి తయారు చేయ బడుతుంది.

రాష్ట్ర  ప్రభుత్వమునుంచి ప్రోత్సహకాలు

రాష్ట్రములో సోలార్ పవర్ కెపాసిటీని చేర్చుటకై, అర్హులయిన డెవలపర్లు ఎవరైతే వారి ప్రాజెక్తులను పైన ఒకటవ పేరాలో చెప్పబడిన ఈ పాలసీ అమలు సమయములో స్తాపిస్తారో వారికి ఈ క్రింది ప్రోత్సహకాలు అందచేయబడతాయి.

పవర్ వీల్ చేయుటకై  ట్రాంస్మిషన్ & డిష్ట్రిబ్యూషన్  చార్జీలు

సోలార్ పవర్ ప్రాజెక్ట్ లనుంచి ఉత్పత్తి అయినపవర్ రాష్త్రము లో  సొంత ఉప యోగము కొరకు /మూడవ పార్టీ సేల్ కొరకు అయితే ఆపవర్ వీల్ చేయుటకు  ట్రాంస్మిషన్ మరియు డిష్ట్రిబ్యూషన్ చార్జీలు మినహాయింపబడతాయి.

డిస్ట్రిబ్యూ షన్ లాసెస్

సోలార్ పవర్  ప్రాజెక్ట్ లో ఉత్పత్తి అయి, 33KV లేక అంతకన్నా తక్కువ వోల్టే జ్ లెవెల్లొ ఆ డిస్కంలొనే ఇంజెక్ట్  చేస్తున్నవారికి మాత్రమే డిస్ట్రిబ్యూ షన్ లాసెస్ మినహాయింపబడతాయి.

ఎనర్జీ బాంకింగ్

సొంత ఉపయోగముకోసము, మరియు ఓపెన్ ఏక్సిస్/షెడ్యూల్డ్ వినియోగదారుల ను పూర్తి సంవత్సరము లో 12 నెలలు  ఎనర్జీ  బాంకింగ్ కు అనుమతి ఇస్తారు. బాంకింగ్ చార్జీలు @2% వస్తు రూపేణా  డ్రా యల్ పాయింటువద్ద ఎడ్జస్ట్ చేయ బడుతుంది..

బాంక్డ్ ఎనర్జీ నుంచి ప్రతిఆర్ధిక సంవత్సరములో 5 నెలల కాలము 1 ఎప్రిల్ నుంచి 30 జూన్ వరకు,1  ఫిబ్రవరీ నుంచి 31 మార్చ్ వరకుఎనర్జీ ని తీసుకోనివ్వరు. ఇదికాక బాంక్డ్ ఎనర్జీ నుంచి, ,సంబంధిత రీటైల్ టారిఫ్ ఆర్డరు లో నిర్దేసించిన టాయిమ్  ఆఫ్ ధి డే (ToD) పీక్ అవర్స్ సమయములలో కూడా  పూర్తి సంవత్సరములో  ఎనర్జీ ని తీసుకోనివ్వరు. అయినప్పటికీ బాంకింగ్ నుంచి తీసుకోవటాన్ని పరిమితముచేసే ఏర్పాట్లను రాష్ట్రములో పవర్ సప్లై పొజిషన్ ను అనుసరించి సమీక్ష చేయ బడతాయి.

సింక్రోనైజేషన్ అయిన తారీకు నుంచి కమ్మర్షియల్ ఆపరేషన్ అయిన తారీకు వరకు గ్రిడ్ లోకి పంపిన ఎనర్జీని డీమ్డ్ఎనర్జీ బాంకింగ్ కింద పరిగణిస్తారు

ఊపయోగ పడని బాంకెడ్ ఎనర్జీని డిస్కమ్ (లు)   సంబంధిత సంవత్సరములొ APERC నిర్ణయించిన  పూల్డ్ పవర్ కొనుగోలు ధరకు డీమ్డ్  కొనుగొలు గా పరిగణి స్తాయి . నెలవారీగా ఎనర్జీసెటిల్ మెంట్  చేయబడుతుంది.

ఓపెన్ ఆక్సిస్

రాష్ట్రపరిధిలో  ఓపెన్ ఆక్సిస్ క్లియరెంస్ ప్రాజెక్ట్ యొక్క పూర్తికాలము లేదా 25 సంవత్సరములు ఏది తక్కువఅయితే అది APERCరెగ్యులేషన్స్ (సమయాసమయములొ మెరుగుపరచిన) ప్రకారము ఆమోదించ బడతవి.  నోడల్ ఏజంసీ నుంచి ఉత్పత్తి దారునకు21 రోజులలో ఎమీ జవాబు/ సూచనరాని పక్షములో అటువంటిదరఖాస్తు డీమ్ద్ ఓపెన్ ఆక్సిస్గా పరిగణింపబడతాయి.

ఎలక్ట్రిసిటీ డ్యూటీ

రాష్ట్రములొస్తాపింపబడిన సోలార్ పవర్ ప్రాజెక్ట్  నుంచి వచ్చిన  సోలార్ పవర్ సొంత ఉపయోగమునకు కాని, డిస్కం లకు అమ్మటానికి కాని ఎలక్ట్రిసిటీ  డ్యూటీ మినహాయింపు వుంటుంది.

క్రాస్ సబ్సిడీ చార్జీలు

రాష్ట్రములొస్తాపింపబడిన సోలార్ పవర్ ప్రాజెక్ట్  నుంచి వచ్చిన  సోలార్ పవర్ మూడవ పార్టీ సేల్ కొరకు,అయితే సోలార్ పవర్ ప్రాజెక్ట్  స్తాపించిన 5 సంవత్సరముల వరకు క్రాస్ సబ్సిడీ చార్జీలు  మినహాఇంపబడతాయి.

కాంట్రాక్ట్ డిమాండ్

షెడ్యూల్డ్  వినియోగదారులు ప్రాజెక్ట్ కమిషన్ అయిన  5 సంవత్సరములవరకు కాంట్రాక్ట్ డిమాండ్ లో తగ్గింపు ఉపయోగించుకొనవచ్చును. షెడ్యూల్డ్  వినియోగదారులు అర్ధము APERCరెగ్యులేషన్స్ (సమయాసమయములొ మెరుగుపరచిన) బాలెంసింగ్  మరియు సెటిల్ మెంట్ కోడ్ రెగ్యులేషన్ లో నిర్వచించిన ప్రకారము అవుతుంది.  డిమాండ్ క్రెడిట్  సగటు సోలార్ పవర్ వినియోగము అవర్లీ టైము   బ్లాకులలో కంప్యూట్  చేయబడుతుంది.. ఒక ఉదాహరణక్రిందఇవ్వబడినది.

ఒక నెలలోసోలార్ పవర్ వినియోగము (KVAh) 1000
ఒక నెలలో అవర్లీ టైము బ్లాకులు (గంటలు) 720
అనువర్తించె దిమాండ్ క్రెడిట్ = 1000/720 1.38(KW)

రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లు

అన్నిప్రాజెక్టులు పై ప్రోత్సహకాలతో అభివ్రుధ్ధి పరచబడినవి సంబంధిత కమిషన్  రెగ్యులేషన్లు  ఆర్డర్ల ప్రకారము REC బెనిఫిట్లకు  అర్హులవుతారు. ఇన్ హౌస్/ కోలొకేటెడ్  సోలార్ ఉత్పత్తి  గ్రిడ్ లోకి  చేయబడిన డీమ్డ్ఇంజెక్షన్ కూడా  సంబంధిత మార్గదర్శకాల ప్రకారము REC బెనిఫిట్లకు   అర్హత కలిగి వుంటుంది.

గ్రిడ్ కనెక్టీవిటీ మరియు ఏవక్యుఏషన్  ఫెసిలిటీ

సోలార్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేయబడిన పవర్ తగిన వోల్టేజి తొ సబ్ స్టేషన్ కి కాని/ AP ట్రాన్స్ కో  ఇంటర్కనెక్షన్ పాయింట్‌కి కాని ఇంజెక్ట్ చేయవలసి వుంటుంది. అర్హత కలిగిన డెవలపర్లు పవర్ ఎవక్యూషన్ కి కావలసిన  ఫెసిటీలను  వారి ప్రాజెక్ట్ నుంచి  ఇంటర్ కనెక్షన్ పాయింట్  మరియు/ లేదా

AP ట్రాన్స్ కో/ డిస్కం ల సబ్ స్టేషన్ వరకు కట్టడానికి అయ్యే పూర్తి ఖర్చును  వారే భరించవలసివుంటుంది.

అర్హత కలిగిన డెవలపర్లు సోలార్ పవర్ ప్రాజెక్ట్ ల ఆపరేషన్, పవర్ ఎవాక్యుఏషన్, ట్రాంస్మిషన్,వీలింగ్ ఆఫ్ ఎనర్జీ ను గురించి కమిషన్ సమయా సమయాలలో  ఇచ్చిన ఆదేశాలకు, రూల్సులకు,రెగ్యులేషన్లకు, టరంస్ అండ్ కండిషన్లకు అధీనులై ఉండాలి.  సోలార్ పవర్ ప్రాజెక్ట్ లు  AP ట్రాన్స్ కో  /డిస్కం లకు ప్రాజెక్ట్ లోపలి  ఎవాక్యుఏషన్ మౌలికసదుపాయాలకు,ఇంటర్ కనెక్షన్ పాయింట్ వరకుఅయ్యేసూపర్విజన్ చార్జీలు మినహాయింపబడతాయి.

AP ట్రాన్స్ కో  /డిస్కం లు ఎవాక్యుఏషన్ కోసరము టెక్నికల్ ఫీజబిలిటీ   కొరకువచ్చిన ప్రొపోజల్  లను అప్లికేషన్ వచ్చిన 14 రోజులలో  డిస్పొజ్ చేస్తుంది. ఏ దయినా అప్ స్ట్రీం సిస్టమ్‌ను బలపరచివలసి వుంటే  వాట్లను  AP ట్రాన్స్ కో  /డిస్కం లుప్రయారిటీ బేసిస్ లో  భరిస్తాయి .

డీమ్డ్ ఇండస్ట్రీ స్టేటస్

ఇండస్ట్రీ  డిపార్ట్ మెంట్ వారు ఎడ్మినిస్టర్ చేస్తున్న  స్కీం లలో  సోలార్ పవర్ ప్రాజెక్త్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కూదా అర్హత కల ఇండస్ట్రీ గా పరిగణింపబడి, ఇండస్ట్రియల్ యూనిట్లకు దొరికే అన్ని ప్రోత్సహకాలు  ఆస్కీముల ద్వారా సోలార్ పవర్ ప్రొడ్యూసర్లకు కూడా ఉపలబ్ధి అవుతాయి.

డీమ్డ్ పబ్లిక్ ప్రైవేట్  పార్ట్నర్ షిప్ (PPP) స్టేటస్

ఈ పాలసీ పేరా(3) ప్రకారము కాటగరీ (A)  కు చెందిన ప్రాజెక్ట్‌లకు డీమ్డ్ పబ్లిక్ ప్రైవేట్  పార్ట్నర్ షిప్ (PPP)

దర్జా సమకూర్చ బడుతుంది.

నాన్ ఎగ్రికల్చర్ స్టేటస్

నిర్ధారించిన ఫీజు చెల్లించిన పిదప, సోలార్ ప్రాజెక్ట్ స్తాపించినభూమికి  డీండ్ నాన్ అగ్రికల్చర్ దర్జా ను అనుమతించబడుతుంది.

మస్ట్ రన్ స్టేటస్

సోలార్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఇంజక్షన్ ను డీమ్డ్ షెడ్యుల్డ్ గా పరిగణింపబడతాయి.

లేన్డ్(భూమి)

ప్రాజెక్ట్  కు కావలసినభూమిని ప్రాజెక్ట్ డెవలపర్  సమకూర్చుకొనవలసిన బాధ్యత ఐ వున్నది. అయినప్పటకీ రెవెన్యూ డిపార్ట్మెంట్ భూములు ఐతే ఉపయోగములొవున్న గవర్నమెంట్ పాలసీ ప్రకారము  కేటాయించబడుతుంది.

పొల్ల్యూషన్ క్లియరెంస్

సోలార్ PV  పవర్ ప్రాజెక్ట్ లు  స్తాపించటానికి పొల్ల్యుషన్ కంట్రోల్ బోర్డ్ వద్దనుంచి  పొల్ల్యూషన్  చట్టముల ప్రకారము ఏ NOC/ అంగీకారము పొందుట మినహాయింపబడుతుంది.

నోడల్ ఏజంసీ

ప్రభుత్వము నిర్నయించిన ప్రకారము ఈ పాలసీ  క్రింద న్యూ అండ్ రెన్యూఅబుల్  ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  లిమిటెడ్ (NREDCAP) నోడల్ ఏజంసీ గా వ్యవహరిస్తుంది.

నోడల్ ఏజంసీ మరియు/లేక నోడల్ ఏజంసీ ద్వారా నిర్దేశించిన ఆఫీసులు ఈక్రింద వివరించిన పనులకు బాధ్యులై వుంటారు.

 • ఎక్కడ అవసరమయితే అక్కడ -రెవెన్యూ భూమి పొందుటకు సౌలభ్యము కలిగించుట
 • పవర్ ఎవక్యుఏషన్ మరియు/లేక APERC  సమయాసమయములలొ  మెరుగుపర్చివిడుదచేసిన రెగ్యులేషన్ ప్రకారము ఓపెన్ ఏక్సెస్ కు సౌలభ్యముకలిగించుట.
 • సంభంధిత డిపార్ట్మెంట్  లనుండి నీళ్ళ కేటాయింపులకు  సౌలభ్యముకలిగించుట .
 • MNRE మార్గదర్శకముల ప్రకారము రూఫ్ టాప్ సిస్టములకు  సబ్సిడీ పొందుటకు ప్రొపోజల్స్  ను ప్రాసెస్ చేసే సౌలభ్యము కలిగించుట
 • MNRE/SECI/AP ట్రాంస్కో /డిస్కం లతో ను, మరియు ఇతర కేమ్ద్ర / రాష్ట్ర ఏజంసీలతో సంప్రదించి కావలసిన ఆంగీకారములు, సబ్సిడీలు,గ్రాంటులు,పొందుట

నోడల్ఏజంసీ ఒక ఆన్ లైన్ సిస్టం ను  దరకాస్తులు పొందుటకు, వాటి సమాచారము తెలియచేయుటకు  స్తాపించవలెను. డెవలపర్lలకు లాగ్ ఇన్ సౌలభ్యత  వారి ప్రస్తుత దరకాస్తు సమాచారము వగయిరా తెలుసుకొనుటకు కలిగించవలెను.   అన్ని ఆమోదములు, క్లియరెంసులు  రెజిష్త్రేషన్ అయిన30 రోజులలొ   పూర్తిచేయవలెను.

ఎడ్మిని స్ట్రెటివ్  అప్రూవల్

ఎలిజబుల్ డెవలపర్ల వద్ద నుంచివచ్చిన  దరకాస్తులు నిర్ధారితఫార్మెట్  లొ వుండి  ఈ క్రింద వివరించిన రిజిష్ట్రే షన్ ఫీజు తో  సహా వుండాలి.

ఫీజు కెపాసిటీ
రు.1000 5KWp కెపాసిటీ వరకు
రు.5000 5 KWp పై నుండి 100 KW వరకు
రు.10000 100 KWp పై నుండి 1000 KWp వరకు

1000 KWp పైన కెపాసిటీలకు రు.10000/- పర్ మెగావాట్

అదనముగా ఎలిజబుల్  డెవలపర్లు ఎవరయితే పైన పేరాలో చెప్పిన సింగల్ విండో క్లియరెంస్ సపొర్ట్ కోరుకుం టారో వారు రు.25/- పర్ కిలోవాట్ ఫెసిలిటెషన్ ఫీజు కూడా చెల్లించవలసి వుంటుంది.

AP సోలార్ పవర్  పాలసీ 2012 కు రిజిస్టర్ అయిన వారు కొత్త పాలసీ లోనికి  మారుట

అందరు సోలార్ పవర్ ప్రాజెక్ట్  డెవలపర్లకు- ఎవరయితే AP సోలార్ పవర్ పాలసీ 2012  క్రిందరిజిస్టర్ అయి పవర్ పర్చేజ్ అగ్ర్మెంట్లు సైన్ చేశారో, 30-06-2014 లొపు వారి ప్రాజెక్త్ లను కమిషన్ చేయలేదొ వారికి తప్ప మిగతావారికి ఒక అవకాశము AP సోలార్ పవర్ పాలసీ 2012 నుంచి కొత్త పాలసీ లోనికి  మారటానికి ఇవ్వబడుచున్నది. అటు వంటి డెవలపర్లు ఈ కొత్త పాలసీ నొటిఫై అయిన రెండు నెలలలో  నోడల్ ఏజంసీ తొ

రెజిస్టర్ చేయించుకొనవలెను.

ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ

ఈ పాలసీ ని అనుసరించి క్లియర్ అయిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ల పురోగతిని మానిటర్ చేయుటకు ఈ క్రింద వివరించిన సభ్యు లతో  ఒక “హై లెవెల్ కమిటీ” ని నియమించటమైనది..

 1. . సెక్రటరీ , ఎనర్జీ డిపాట్మెంట్
 2. చై ర్మన్ మరియు మేనేజింగ్  దైరెక్టర్ , AP ట్రాంస్కొ
 3. సి ఎమ్ డి AP  డిస్కమ్ (లు)
 4. వి సి & ఎమ్ డి, NREDCAP (మెంబర్ కంవేనర్)
 5. రిప్రజెన్ టెటివె ఆఫ్ FAPCCI/ CII
 6. రిప్రజెన్ టెటివె ఆఫ్ (2) సోలార్ పవర్ డెవలపర్ (లు)

ఈ పాలసీ ని అమలుపరచుటలొ ఏమయినా  కష్టములు/అడ్డం కులు వచ్చినచో ఈ “ హై లెవల్ కమిటీ” కావలసిన స్పస్టతలను, అర్ధములను  ఆ కష్టములు//అడ్డం కులు తొలగించుటకై  వారు చర్చించి నిర్ణయించటకు లేక  ఎవ రయినా తమ కస్టములనువ్యక్త పరిస్తె వారిని విని ఆ అడ్డంకులను తొలగించుటకు కావలసిన స్పస్టత నిచ్చుటకు ఈ కమిటీకి అధికారముఇవ్వబడినది.

సోలార్ మానుఫాక్చరింగ్

ప్రభుత్వము సోలార్  ఉత్పత్తులను ప్రోత్సహించి  రాష్ట్రములో సో లార్  ఈకో సిస్టం ను అభివ్రు ద్దికి,  ఉపాధి అవకాశము లు పెంచుటకు సంకల్పించినది ఈ క్రింద వివరించిన  ప్రోత్సాహకములు కొత్త సోలార్ పరికరములు,వాటికి సంబంధించిన సామన్లు  తయారు చేయువారికి మాత్రమే వర్తించును.

 • సోలార్ పార్కులలోప్రభుత్వ భూములు లాంగ్ టరమ్ లీజ్ కు  కేటాయించుటలొ ప్రాముఖ్యత
 • ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి 10 సంవత్సత్రములు మినహాయింపు.

మిడ్ టరమ్ రెవ్యూ

రాష్ట్ర ప్రభుత్వము ఈ పాలసీ ని 2 సంవత్సరము ల తరువాత కానీ, ఎదైనా సాంకేతిక పరమైన  అవసరము కలిగినా,  గవర్నమెంట్ఆఫ్ ఇండియా పాలసీ లు , రూల్సులు, రెగ్యులేషన్ల లో ను, ఎలక్ట్రిసిటీ ఏక్ట్  2003 తొను, సామరస్యము లేని వాటిని తొలగించుటకు మధ్య కాలములో   సింహావ లోకము చేయవచ్చు ను.

పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్

ఈ పాలసీ ని అమలుపరచుటలొ ఏమయినా  కష్టములు/ వచ్చినచో కావలసిన స్పస్టతలను, నిబంధనలకు వ్యాఖ్యానముతో వివరణలనిచ్చు టకు,ఆ కష్టములు తొలగించుటకై  వారుచర్చించి నిర్ణయించటకు, లేక  ఎవ రయినా  ఏనిబంధనలలో మార్పులను కొరితే  వారిని విని  కావలసిన స్పస్టత నిచ్చుటకు ఎనర్జీ డిపార్టమెన్ట్ కు  అధికారముఇవ్వబడినది.

ఆధారము : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము , ఏనర్జీ , ఇంఫ్రా స్త్రక్చర్ & ఇన్ వెస్ట్ మెంట్ డిపార్టమెంట్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate